Tuesday, 31 October 2023
నాగార్జునసాగర్ నియోజకవర్గం.*
పెద్దవూర మండలం తంగేళ్ల తాండ గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తల 50 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నాగార్జున సాగర్ నియోజకవర్గం *కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవ శ్రీ జయవీర్ కుందూరు* గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది.
చైతన్యపురి డివిజన్ బీజేపీ బూత్ వర్కర్స్ మీటింగ్ బెంగళూరు సిటీ mla మునిరత్నం నాయుడు,. ::
రాత్రి 9.00 గంటలకు చైతన్యపురి డివిజన్ బీజేపీ బూత్ వర్కర్స్ మీటింగ్ దిల్సుఖ్నగర్ లోని హోటల్ బృందవన్ లో జరిగినది . దీనికి ముఖ్య అతిధిగా కర్ణాటక రాష్ట్ర మాజి మంత్రి , బెంగళూరు సిటీ mla మునిరత్నం నాయుడు
గారు , బీజేపీ LB నగర్ అభ్యర్థి సామా రంగా రెడ్డి గారు , చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా హాజరు అయినారు . ఈ సందర్భంగా మునిరతనం నాయుడు గారు మాట్లాడుతూ LB నగర్ లో బీజేపీ అబ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలూ కృషి చేయాలనీ,బీజేపీ గెలుపు బూత్ వర్కర్స్ తోనే సాధ్యం అని , L .B .Nagar లో బీజేపీ జండా ఎగర వెయడం తథ్యం అని తెలిపినారు
Monday, 30 October 2023
తెలంగాణలో హోరా హోరీ: గెలిచేదెవరు, తేల్చేసిన తాజా సర్వే..!!
:తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా నెల రోజుల్లో ప్రజలు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే పార్టీల ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. హోరా హోరీ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల ఎత్తులకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే ప్రజల నాడి పట్టుకొనేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా -నేనా అనే స్థాయిలో పోటీ ఉందని చెబుతున్నారు. మరి, గెలిచేదెవరు..సర్వేలు ఏం తేల్చాయి. హోరా హోరీ పోరు : తెలంగాణలో అధికారం పైన కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్రం ఆవిర్భావం నుంచి ప్రజల ఆశల మేరకు పాలన సాగిస్తున్న తమకు హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కర్ణాటక తరువాత కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పైన ఆశలు పెట్టుకుంది. ఇక దశలో బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లుగా సాగిన తెలంగాణ రాజకీయం కమలం పార్టీ అంతర్గత వ్యవహారాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మరాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కేంద్రం..!! నేరుగా సోనియా గాంధీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేసే గ్యారంటీ పథకాలను ప్రకటించారు. అవే తమకు అధికారం తెచ్చి పెడతాయనే ధీమాలో పార్టీ నేతలు ఉన్నారు. పార్టీలో మేనిఫెస్టో మొదలు అభ్యర్దుల ఎంపిక వరకు హైకమాండ్ స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఇటు కేసీఆర్ అండ్ టీం..తెలంగాణలో ప్రచారంలో ముందున్నారు. Next Stay బీఆర్ఎస్ కే మెజార్టీ : ఇదే సమయంలో తెలంగాణలో పలు సర్వేలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా శ్రీఆత్మ సాక్షి సంస్థ చేసిన తాజా సర్వే ఆసక్తి కర అంచనాలను వెల్లడించింది. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలో తెలంగాణ పబ్లిక్ మూడ్ ఏంటనేది వెల్లడించే ప్రయత్నం చేసింది. అందులో 42.5 శాతం ఓట్ షేర్ తో బీఆర్ఎస్ 64-70 సీట్లు దక్కించుకుంటుందని అంచనా వేసింది. తరువాతి స్థానంలో కాంగ్రెస్ 36.5 ఓట్ షేర్ తో దాదాపుగా 37-43 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. బీజేపీ 10.75 శాతం ఓట్ షేర్ తో 5-6 సీట్లు, ఎంఐఎం 2.75 శాతం ఓట్ షేర్ తో 6-7 సీట్లు దక్కించుకొనే ఛాన్స్ ఉందని అంచనా వేసారు. అయితే, ఇక్కడ ఆరు స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉంటుందని సర్వే అంచనాకు వచ్చింది. అందులో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 2, బీజేపీ ఒక్క స్థానంలో ఆధిక్యత కనిపిస్తోందని వెల్లడించింది. నవంబర్‌లో శ్రీవారికి విశేష ఉత్సవాలు- `కార్తీక` శోభ మారుతున్న లెక్కలు : పోలింగ్ కు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం పైన అవగాహన..స్థానిక పరిస్థితులు..సమీకరణాల పైన పూర్తి లెక్కలతో కేసీఆర్ తన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రభావితం చేసే అంశాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ లో సీట్లు రాని ముఖ్య నేతల వద్దకు కేటీఆర్, హరీష్ వెళ్లి తమ పార్టీ లోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ లో నేతల్లో జోష్ కనిపిస్తోంది. కానీ, క్షేత్ర స్థాయిలో ఓటర్లను ఏ మర ప్రభావితం చేయగలుగుతారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. బీజేపీ బీసీ అంశంతో ముందుకు వెళ్తోంది. ఇక, సర్వేల్లో బీఆర్ఎస్ కు అనుకూలత కనిపిస్తుంది. హ్యాట్రిక్ విజయం గులాబీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.
*బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించాలి.*
*బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించాలి.*
Saturday, 28 October 2023
దర్భలకి ఏంటి సంబంధం, ఆహార పదార్థాలపై వేయకపోతే ఏమవుతుంది!
గ్రహణాలకి - దర్భలకి ఏంటి సంబంధం, ఆహార పదార్థాలపై వేయకపోతే ఏమవుతుంది!
సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు ఇంట్లో నీళ్లు, ఆహార పదార్థాలపై దర్భలు వేసి ఉంచుతారు. గ్రహణ నియమాల్లో ముఖ్యమైనది ఇదే. ఇంతకీ దర్భలను ఎందుకు వేయాలి...
3: గ్రహణాలకి - దర్భలకి ఏంటి సంబంధం, ఆహార పదార్థాలపై వేయకపోతే ఏమవుతుంది!
: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలను అశుభ చర్యగా పరిగణిస్తారు. గ్రహణం జాతక చక్రంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది, జీవితంలో సమస్యలకు కూడా కారణమవుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులంటే.. గ్రహణం అంటే కేవలం గ్రహాలలో మార్పు మాత్రమే..భూమి సూర్యుడు, చంద్రుని మధ్య జరిగే ఒక చర్య అంటారు శాస్త్రవేత్రలు. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28న ఏర్పడుతోంది. చంద్రగ్రహణం సూతకాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతకాలం ప్రారంభం కాగానే పూజలు ఆగిపోతాయి. ఆలయాల తలుపు మూసేస్తారు. ఆలయాల్లోకి ప్రవేశించరు..ఎలాంటి పూజలు నిర్వహించరు. దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్దరాత్రి సంభవించబోతోంది. పాక్షిక చంద్ర గ్రహణం భారతదేశం సహా అనేక దేశాల్లో కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్ధరాత్రి 01:04 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:23 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. అందుకే సూతకాలం సహా గ్రహణ నియమాలు పాటించాలి. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై దర్భలు వేయడం గమనించే ఉంటారు. ఇంతకీ దర్భలు ఎందుకు వేయాలి, దర్భలకు ఆహార పదార్థాలకు ఏంటి సంబంధం.
ఇవాళే చంద్రగ్రహణం - మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా!
గ్రహణాలకి దర్భలకి ఏంటి సంబంధం
గ్రహణ సమయంలో సూర్యుడు, లేదా చంద్రుడు నుంచి రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంది. సాధారణంగా గ్రహణాలు ఏర్పడ్డప్పుడు వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పులు మనిషి శరీరంపైన శారీకంగానూ, మానసికంగానూ ప్రభావాన్ని చూపుతాయి. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 'ఆరోగ్యం భాస్కరాదిత్యేత్' అన్నట్లుగానే చంద్రుడిని 'మనః కారకుడు'గా చెబుతుంటారు. అలా సూర్య, చంద్రులిద్దరూ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తారు. గ్రహణ సమయంలో వారి శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే దర్భలను ఉపయోగించాలని చెబుతారు. ముఖ్యంగా తినే పదార్థాలపై దర్భలను ఉంచినట్లయితే ఆ రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని శాస్త్రీయ పరిశోధనల్లో రుజువైంది కూడా.
: శరద్ పూర్ణిమ, చంద్రగ్రహణం , గజకేసరి యోగం - ఈ 4 రాశులవారికి గోల్డెన్ టైమ్!
దర్భలలో మూడు రకాలు
మామూలు దర్భ జాతి - వీటిని అపరకర్మలలో వినియోగిస్తారు
కుశ జాతి - ఈ దర్భలను శుభకార్యాలలో వినియోగిస్తారు
బర్హిస్సు జాతి - ఈ దర్భలను యాగాలలో, వివిధ రకాల క్రతువులలో వినియోగిస్తారు
Also Read: ఈ రోజు ( అక్టోబరు 28) చంద్రగ్రహణం - ఈ రాశివారు చూడకూడదు!
దర్భల ఆవిర్భావం వెనుకున్న పురాణగాథలు
అసలు ఈ దర్భలు ఎలా ఆవిర్భవించాయో చెబుతూ రకరకాల పురాణ గాధలున్నాయి. కూర్మ పురాణం ప్రకారం...కూర్మావతారంలో క్షీరసాగర మథనం జరిగేటప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో మంధర పర్వతాన్ని మోస్తున్నప్పుడు, కూర్మం శరీరం మీద ఉండే వెంట్రుకలు.. సముద్రంలో పడిపోయి, ఒడ్డుకు కొట్టుకుని వచ్చి కుశముగా మారాయనీ, ఆ సమయంలో అమృతం చుక్కలు వాటిమీద పడడం వల్ల వాటికి అంత ప్రాధాన్యత ఏర్పడిందనీ అంటారు. మరో కథ ప్రకారం ఇవి విశ్వామిత్రుడి సృష్టి అని కూడా ఉంది. అంతేకాదు ఈ దర్భలను ఎప్పుడుపడితే అప్పుడు కోయకూడదు . పుష్యమి నక్షత్రం, ఆదివారం రోజున వాటిని కోయడం చాలామంచిది.
సీటుకు నోటుతో అమెరికాలో విల్లాలు.. నమ్మించి గొంతు కోయడంలో రేవంత్‌రెడ్డి దిట్ట: కొత్త మనోహర్‌రెడ్డి
సీటుకు నోటుతో అమెరికాలో విల్లాలు.. నమ్మించి గొంతు కోయడంలో రేవంత్‌రెడ్డి దిట్ట: కొత్త మనోహర్‌రెడ్డి సీటుకు నోటు తీసుకొని రేవంత్‌రెడ్డి అమెరికాలో విల్లాలు తీసుకున్నారని కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లెలగూడ సాయిరాం కాలనీలోని ఆయన నివాసంలో మాట్లాడారు.
సీటుకు నోటుతో అమెరికాలో విల్లాలు.. నమ్మించి గొంతు కోయడంలో రేవంత్‌రెడ్డి దిట్ట: కొత్త మనోహర్‌రెడ్డి
రేవంత్ జైలుకు పోవడం ఖాయం
కొడంగల్‌లో పోటీ చేస్తా:కొత్త మనోహర్‌రెడ్డి
బడంగ్‌పేట, అక్టోబర్ 27: సీటుకు నోటు తీసుకొని రేవంత్‌రెడ్డి అమెరికాలో విల్లాలు తీసుకున్నారని కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లెలగూడ సాయిరాం కాలనీలోని ఆయన నివాసంలో మాట్లాడారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావాహుల నుంచి డబ్బులు, భూములు తీసుకొని నమ్మిన వాళ్లను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాగిరెడ్డి లక్ష్మారెడ్డి, గద్వాల విజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పసుపు, కుంకుమ నీళ్లు పోసుకొని ప్రమాణం చేశారని గుర్తుచేశారు.
రేవంత్ డబ్బులు, భూములు తీసుకోకపోతే భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లి ప్రమాణం ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకరి దగ్గర 5 ఎకరాల భూమి, రూ.10 కోట్లు, మరొకరి దగ్గర రూ.12 కోట్లు, మరొకరి దగ్గర రూ.25 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తున్నదని చెప్పారు. తాను కొడంగల్‌లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. రేవంత్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. సోమశేఖర్‌రెడ్డిని నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు. సమావేశంలో సంతోష్‌కుమార్, నర్సింగ్ యాదవ్, కార్తీక్‌రెడ్డి, పవన్, చిర్ర లింగం, శంకర్, కుసకంటి రవి, గాన్షీరాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు - రాష్ట్రానికి కేంద్రం కీలక ఆదేశాలు, డెడ్ లైన్ విధింపు
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు - రాష్ట్రానికి కేంద్రం కీలక ఆదేశాలు, డెడ్ లైన్ విధింపు
: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తాము అడిగిన సమాచారం ఆదివారం లోగా ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది.
Central government deadline to telangana government on medigadda barrage damage Medigadda Barrage
: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు - రాష్ట్రానికి కేంద్రం కీలక ఆదేశాలు, డెడ్ లైన్ విధింపు
మేడిగడ్డ కుంగుబాటుపై రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో 20వ పిల్లర్ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తాము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ ఆల్టిమేటం ఇచ్చింది. ఆదివారంలోగా వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ ఓ లేఖ రాసింది. ఈ నెల 23 నుంచి 26 వరకూ కేంద్ర కమిటీ వంతెనను సందర్శించింది. ఈ సమయంలో ఆ బృందం నిపుణులు అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం కొంత మేర ఇవ్వగా, కమిటీ తిరిగి వెళ్లే ముందే వారు అడిగిన వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి లేఖ రాసింది. మొత్తం 20 అంశాలతో కూడిన సమాచారం ఇవ్వాలని సూచించింది.
3 అంశాలకు మాత్రమే వివరణ
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గల కారణాలు పరిశీలించేందుకు కేంద్ర కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. ఆ సమయంలో బృంద సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర అధికారులు కొంత సమాచారం ఇచ్చారు. అయితే, మొత్తం 20 అంశాల సమాచారాన్ని కోరగా, ప్రభుత్వం 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మరోసారి పూర్తి సమాచారం కోరుతూ లేఖ రాశారు. ఆదివారంలోగా అడిగిన సమాచారం ఇవ్వాలని ఆల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ, సమాచారం ఇవ్వకుంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లను లేనట్లుగా భావిస్తామని, ఆ మేరకు తదుపరి చర్యలుంటాయని వెల్లడించారు.
వారంలోగా నివేదిక
అయితే, మేడిగడ్డ బ్యారేజీ ఫిల్లర్ల కుంగుబాటు తర్వాత బ్యారేజీని పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వనుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ బృందం ప్రాథమిక నివేదికలో పూర్తి వివరాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వ వివరణ అనంతరం పూర్తి నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఆ పిల్లర్స్ కు స్వల్పంగా పగుళ్లు
మరోవైపు, బ్యారేజీలో 20వ పిల్లర్ కుంగుబాటు నేపథ్యంలో దానికి సమీపంలోని అయిదారు పిల్లర్స్ కు స్వల్పంగా పగుళ్లు ఏర్పడినట్లు నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. పిల్లర్ కుంగుబాటు అనంతరం పరిస్థితులపై నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదట బ్యారేజీ ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణం, నీటిని తోడిపోయడం, పునాది వరకూ పరిశీలన, బ్యారేజీలో ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్ పరిస్థితిపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం నిపుణులను సంప్రదించి నిర్మాణ సంస్థతో పునరుద్ధరణ పనులు చేయించనున్నారు. ఇప్పటికే దీనిపై ఓ షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది
కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద ఈ నెల 21న కుంగింది. భారీ శబ్దంతో బీ - బ్లాకులోని 18, 19, 20, 21 ఫిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఓ అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే వంతెన కుంగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కి.మీ ఉండగా, సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. బ్యారేజీ అకస్మాత్తుగా కుంగడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా, ఈ ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
Wednesday, 25 October 2023
Brs పై యుద్ధం చేయడానికే కాంగ్రెస్ లో చేరుతున్నకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*
*కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*
తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్ లో అహర్నిశలు కష్టపడ్డా
నాయకత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించి ఆ నాడు పార్టీ వీడాను
సీఎం కేసీఆర్ ని గద్దె దింపడమే నా లక్ష్యం
కేసీఆర్ ని డీ కొట్టే శక్తి బీజేపీ కి వుంది అని ఆ రోజు బీజేపీ లో చేరాను
మునుగోడు ఉప ఎన్నికల్లో కోట్ల రూపాయలు కుమ్మరించి brs అభ్యర్థి గెలిచాడు
ఎమ్మెల్సీ కవిత ని అరెస్ట్ చేయకపోవడం తో బీజేపీ,brs ఒక్కటే అని ప్రజల్లో తేలిపోయింది
కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు అవినీతి చేసింది
కల్వకుంట్ల కుటుంభం అవినీతి ని బీజేపీ బయటికి తీస్తుందని నమ్మి బీజేపీ లో చేరాను
మోదీ, అమిత్ షా అంటే నాకు గౌరవం వుంది
దుర్మార్గ సీఎం కేసీఆర్ ని గద్దె దించాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ వల్లనే సాధ్యం
కేంద్రంలో బీజేపీ అధికారంలో వున్నా.. కేసీఆర్ అవినీతి బయట పెట్టకపోవడం పార్టీకి మంచిది కాదు
నా ప్రాంత ప్రజల కోరిక మేరకు తిరిగి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నా
బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి
పార్టీ మారిన సమయంలో కాంట్రాక్టులు దక్కాయని నా పై కుట్ర పన్ని ప్రచారం చేశారు
నిజంగానే కాంట్రాక్టులు దక్కితే ఈ రోజు బీజేపీ ని ఎందుకు వదులుకుంట?
నా రాజీనామా తో మునుగోడు కొంత అభివృద్ధి జరిగింది
నా శ్రీమతి పోటీలో లేదు
మునుగోడు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే గా పోటీలో ఉంటా
*అధిష్టానం ఆదేశిస్తే..మునుగోడు తో పాటు గజ్వేల్ నుండి కూడా సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తా*
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్త...
తెలంగాణ సమాజం కోసమే బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరుతున్న
బీజేపీ కి అమ్ముడు పోయానని ఆనాడు నాపై దుష్ప్రచారం చేశారు
తప్పుడు ఆరోపణలు చేసిన ఆనాటి నాయకులు నేడు ఏం సమాధానం చెప్తారు
బంగారు తెలంగాణ లో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడింది
ఓడిపోతా అనే భయం కేసీఆర్ లో కనిపిస్తోంది
*ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా*
నా పేరు ప్రకటించవద్దు అని బీజేపీ అధిష్టానానికి కోరిన
ప్రజల కోసం తల వంచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న
Brs పై యుద్ధం చేయడానికే కాంగ్రెస్ లో చేరుతున్న
బీజేపీ,brs ఒక్కటే అని ప్రజల్లో వుంది
హైదరాబాద్ అభివృద్ధి, సీఎం కేసీఆర్‌పై జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ అభివృద్ధి, సీఎం కేసీఆర్‌పై జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు Jaya Prakash Narayana | ఆర్థికాభివృద్ధిని, సంపద సృష్టిని ఆపకూడదని, అదే సమయంలో సంక్షేమం ద్వారా సామాన్యుడిని ఆదుకోకుంటే ప్రజాస్వామ్యం నడవదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధిని, సంపద సృష్టిని ఆపకూడదని, అదే సమయంలో సంక్షేమం ద్వారా సామాన్యుడిని ఆదుకోకుంటే ప్రజాస్వామ్యం నడవదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ సమతూకాన్ని పాటించే ప్రయత్నాలు విజయవంతంగా చేసిందని అభినందించారు.
ఇది గర్వించాల్సిన విషయం..
కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో సామరస్యాన్ని పెంచడంతోపాటు హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా, సమర్థవంతంగా అభివృద్ధి చేసిందని చెప్పారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడంలో సఫలమయ్యారని పేర్కొన్నారు. చాలామంది ఉత్తరాదివారు కూడా హైదరాబాద్‌లో ఆస్తులు కొంటున్నారని, ఇది ఎంతో గర్వించాల్సిన విషయమని చెప్పారు.
ఇంతకాలం వాళ్లను పురుగుల్లా చూశారు
అర్బన్ డెవలప్‌మెంట్ అనేది ఎంతో క్లిష్టమైనదని, మన దేశంలో పెట్టుబడి పెట్టి సంపద సృష్టిస్తే అది పాపం చేశారనే భావన ఎంతో కాలంగా ఉందని అన్నారు. పదిమందికి ఉపాధి కల్పించేవాడు దేవుడని, ఆత్మవిశాసాన్ని, సంపదను పెంచి, ఆదాయాన్ని తెచ్చేవాడు దేవుడని, అటువంటివాళ్లకు ఇప్పుడు గౌరవం లభిస్తున్నదని తెలిపారు. ఇంతకాలం వాళ్లను పురుగుల్లా చూశారని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో రిస్క్ తీసుకొని తాను కొంత సంపాదించి, నలుగురికి ఉపాధి చూపించేవాడు దేశానికి అవసరమని చెప్పారు. దానికోసం మౌలిక సదుపాయాలు, అర్బనైజేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ అవసరమని, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ైక్లెమేట్ ఉండాలని, ఇవి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులవల్ల దేశం బాగుపడుతుందనే భ్రమనుంచి బయటపడాలని సూచించారు. తెలంగాణలో ఒక ప్రోయాక్టిక్ వాతావరణాన్ని ఏర్పాటు చేశారని కితాబిచ్చారు.
వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కే సి గుప్తా వర్థంతి
రోజు వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కే సి గుప్తా వారి వర్థంతి సందర్భంగా స్థానిక వాసవి కేంద్రం లోన కే సి గుప్తా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఇటి కార్యక్రమానికి వాసవి క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు ఉప్పల వర కుమార్ గుప్తా మల్లికార్జున్ రాజశేఖర్ గుప్తా హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్తా ఆగిరి వెంకటేష్ గుప్తా రెడీ సార్ శెట్టి చంద్రశేఖర్ రావు, గ కాశెట్టి పాండు గుప్తా రేపాక వెంకటేశ్వర్లు, అల్లాడి నాగభూషణం, కూర రఘువీర్ గుప్త, శ్రీరామ్ కున వెంకట గోపాల కృష్ణ
గుత్తా ప్రధాన అనుచరుడు పాశం రాంరెడ్డిబిఆర్ఎస్ కి రాజీనామా చేసి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో హైదరాబాదులోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.,,
తెలంగాణపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం*
టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి*
*********************""******************************
తిప్పర్తి జడ్పీటీసీ, గుత్తా ప్రధాన అనుచరుడు పాశం రాంరెడ్డి, తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, రైతుబంధు మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్,వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల బిఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు బిఆర్ఎస్ కి రాజీనామా చేసి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో హైదరాబాదులోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
కోమటిరెడ్డి కామెంట్స్
-నాకు మద్దతు ఇవ్వండి..పార్టీలోకి వచ్చే వారికి మాటిస్తున్న..వచ్చే ఐదేళ్లు మీ సేవలో ఉంటా..
-నల్గొండను ప్రశాంతంగా అభివృద్ధి చేసుకుందాం...
-2018 లో నల్గొండ ఎమ్మెల్యే గా ఓడిపోయినా భువనగిరి ఎంపీ గా గెలిపించారు...
-నల్గొండ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా ..
-మీరే నాయకులుగా ఉండి గెలిపించండి
-నేను నల్గొండలో తిరిగితే..ఎమ్మెల్యే మిమ్మల్ని వేధిస్తాడని ఎక్కువ రాలేక పోయాను ..
-నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఎవరినైనా వేదించామా..?
-ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు...
-రెండు సార్లు కేసీఆర్ కి అవకాశం ఇచ్చారు...
-వేనేపల్లి చందర్ రావు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరారు...
-స్థానిక ఎమ్మెల్యే గెలిచిన రెండు నెలలకే వేనేపల్లి ని అనరాని మాటలు అన్నారు..
-నాయకులు,కార్యకర్తలు కష్టపడితేనే మేము ఎమ్మెల్యేలు అవుతాము....
-గతంలో మిగిలిన పనులు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తా....
-రేపటి నుండి గ్రామ గ్రామాన తిరుగుతా..
-ఒక్క అవకాశం ఇవ్వండి,అండగా ఉంటా...
-ముప్పై రోజులు మీరు కష్టపడండి..ఐదేళ్లు మీకోసం నేను కష్టపడతా...
-రాత్రి వరకు అభ్యర్థుల కసరత్తు పూర్తి అవుతుంది...
-రేపు రెండో జాబితా వస్తోంది..
-10..15 నియోజక వర్గాల్లో తీవ్ర పోటీ ఉంది..
-కాళేశ్వరం కట్టే సమయంలోనే చెప్పినం నాణ్యత లేదని..
-మెడిగడ్డ.. సుందిళ్ల బ్యారేజి ల మీద కూడా మాకు అనుమానం ఉంది..రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి...
-గతంలో మోటార్లు ఖాళీ పోయాయి...
-కాంట్రాక్టర్ రిపేర్ చేయాలి.. కానీ సర్కార్ 150 కోట్లు పెట్టి చేయించింది..
-మేము అధికారంలోకి వచ్చాక అన్నిటిపై విచారణ చేస్తాం...
-అభ్యర్థుల వ్యవహారం మాట్లాడొద్దు అని నిర్ణయం తీసుకున్నాం.
-70 నుండి 80 సీట్లు గెలుస్తున్నాం...
-సీపీఐ.. సీపీఎం పొత్తుల చర్చలు నడుస్తున్నాయి...
-మిర్యాలగూడ మాకు బలమైన సీటు...
-పొత్తులు ఉంటాయా లేవా అనేది సాయంత్రం క్లారిటీ ఉంటుంది...
-నేను 50 వేల మెజారిటీ తో గెలుస్తున్నాను..
-కొన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేసే బాధ్యత నాకు ఇచ్చింది....
-కేటీఆర్..అమెరికాలో చదువుకున్న తెలివి ఇదేనా..?
-కారు కావాలా బెకార్ గాళ్ళు కావాలా అంటున్నావ్...
-మమ్మల్ని తిడితే మీకు పాపం తగులుతుంది....
-తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ ని తిడితే పాపం తగులుతుంది...
-మంథనిలో అడ్వకేట్ కుటుంబాన్ని చంపిన వాళ్లకు బిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది...
-బిఆర్ఎస్ ఎలాంటి వాళ్లకు టికెట్ ఇచ్చిందో ఆలోచించండి...
-సర్పంచు లు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు దేశం లో ఎక్కడైనా చూశామా..?
-రాహుల్ గాంధీ పెరు ఎత్తే అర్హత కేటీఆర్ కి లేదు....
- దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ.. మీరు ఎక్కడ....??
- ప్రధాని పదవి ని కూడా త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం.
-సోనియా గాంధీ దేవత అని కుటుంబమే ఫోటో దిగింది...
-ఇప్పుడు బలి దేవత అని అంటున్నారు..
-మీ ఆస్తుల వివరాలు అఫిడవిట్ లో బయట పెడతాం...
-మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళను తిట్టరు...
ఈ సందర్భంగా పార్టీలో డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి,చిలుక శ్రీనివాస్ రెడ్డి, ఉయ్యాల నాగరాజు,నులపరాజు శ్రీనివాస్,మెరుగు వెంకన్న,md. బాబర్,వంశీ.....
సర్పంచులు
రొట్టెల రమేష్, ప్రవీణ్ కుమార్,వెంకట్రామిరెడ్డి, మర్రి యాదయ్య,హసన్ బీ, సుశీల,శ్రీదేవి,సతీష్,తునేం రవి, ఎంపీటీసీ సిరివెన్నెల, మాజీ సర్పంచ్ లు,బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం జరిగింది....
Tuesday, 24 October 2023
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, కాంగ్రెస్ లో చేరికకు లైన్ క్లియర్
- అంతా అనుకున్నట్లే కోమటిరెడ్డి
- అంతా అనుకున్నట్లే కోమటిరెడ్డి
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, కాంగ్రెస్ లో చేరికకు లైన్ క్లియర్
- రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు.
- రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాKomatireddy Rajgopal reddy News: పార్టీ మార్పుపై ఎట్టకేలకు తేల్చేశారు రాజగోపాల్ రెడ్డి. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు.
Komatireddy Rajgopal reddy News: పార్టీ మార్పుపై ఎట్టకేలకు తేల్చేశారు రాజగోపాల్ రెడ్డి. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు.
ఖిల్లా రామాలయం లో పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మరియు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల
ఖిల్లా రామాలయం లో పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత మరియు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల.
ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత
మరియు గౌ. ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల ఖిల్లా రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో బి. ఆర్. ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో BRS నుంచి కాంగ్రెస్ లో చేరిన దుబ్బ అశోక్ సుందర్ దంపతులు*
*ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో BRS నుంచి కాంగ్రెస్ లో చేరిన దుబ్బ అశోక్ సుందర్ దంపతులు*
నల్లగొండ పట్టణ BRS మహిళ అధ్యక్షురాలు దుబ్బా రూప అశోక్ సుందర్, మన్సిపల్ మాజీ ప్లోర్ లీడర్ దుబ్బా అశోక్ సుందర్ ఈ రోజు హైదరబాద్ లోని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు.నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎంపీ హస్తం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
ఈ కార్యకరంలో మన్సిపాల్ వైస్ ఛైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్,మాజీ ఎంపీటీసీ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Sunday, 22 October 2023
బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు వీటిని మీ డైట్లో చేర్చుకోండి
బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు వీటిని మీ డైట్లో చేర్చుకోండి
బరువును తగ్గాలనుకునే వారు కొన్ని ఆహారాలను రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల ఈజీగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గుతారు.
: బరువు తగ్గడానికి వ్యాయామాలతో పాటు.. తీసుకునే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మీరు 30వ పడిలోకి అడుగుపెడుతున్నప్పుడు జీవక్రియ సహజంగా మందగించడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీ డైట్ చార్ట్‌లో కాస్త స్మార్ట్‌గా ఆలోచించి కొన్ని మార్పులు చేస్తే.. మీరు ఈజీగా బరువు తగ్గుతారు. వయసు పెరిగే కొద్ది మనం కొన్నివిషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామనే విషయంపై క్లారిటీ లేకుంటే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
వయసు పెరిగే కొద్ది శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో బరువు తగ్గేందుకు మీరు డైట్ చార్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇది మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేదానిపై క్లారిటీ ఇస్తుంది. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు తగ్గుతారు. ముఖ్యంగా మీ డైట్లో 5 స్మార్ట్ ఛేంజస్ చేస్తే మీ బరువు మీ అదుపులో ఉంటుంది.
బరువు తగ్గేందుకు మీ డైట్ ఛార్ట్‌లో ఫైబర్, కాల్షియం ఉండాలి. ఈ రెండు పోషకాలు మీరు తినే ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇవి బరువు తగ్గాలనే మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దాని అర్థం ఇతర పోషకాలకు దూరంగా ఉండాలని కాదు. వీటితోపాటు ప్రోటీన్, ఐరన్, పోటాషియం, ఒమేగా-3 వంటి పోషకాలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇదే కాకుండా హైడ్రేటెడ్‌గా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి దూరంగా ఉండాలి. బరువు తగ్గడం కోసం డైట్ చార్ట్‌లో చేయాల్సిన మార్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ తీసుకోవడం పెంచండి..
బరువు తగ్గించడంలో ఫైబర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీ వయసు పెరిగే సమయంలో ఇది మరింత కీలకంగా వ్యవహరిస్తుంది. మందగిస్తున్న జీవక్రియపై ఇది ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీ డైట్ చార్ట్‌లో ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు చేర్చుకోండి. ఇది బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. టైప్ 2 డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాటికి దూరంగా ఉండండి..
ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఏ వయసు వారైనా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి మీకు రుచిని అందిస్తాయి కానీ.. ఆరోగ్యానికి మాత్రం హాని చేస్తాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఊబకాయానికి కూడా దారితీస్తాయి. అంతేకాకుండా వీటిని ఎక్కువగా తీసుకునేవారిలో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. కాబట్టి వాటికి దూరంగా ఉంటూ ఇంట్లో వండుకునే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టండి.
ఫ్యాడ్ డైట్ వద్దు
బరువు తగ్గడంలో ఫ్యాడ్ డైట్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ దానివల్ల ఎంత వేగంగా బరువు తగ్గుతారో.. అంతే వేగంగా మళ్లీ బరువు పెరిగిపోతారు. కాబట్టి ఎల్లప్పుడు వేగంగా బరువు తగ్గే డైట్స్ కాకుండా.. సమతుల్యమైన డైట్‌ను ఫాలో అవ్వాలి. శరీరానికి అవసరమైన పోషకాలు ఆ డైట్లో ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గి.. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు.
కాల్షియం పెంచండి..
వయసు పెరిగే కొద్ది కాల్షియం లోపం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే కాల్షియం కేవలం ఎముకల కోసమే కాదు.. బరువు తగ్గడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీలైనంత కాల్షియం మీ డైట్లో చార్ట్‌లో పొందుపరచుకోండి. బరువుతో పాటు.. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మితంగా తీసుకోండి..
మీకు ఆల్కహాల్ అలవాటు ఉంటే.. పూర్తిగా మానలేని స్థితిలో ఉంటే.. కనీసం వాటిని మితం చేయండి. అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది దానిని ఎంత తగ్గిస్తే అంతమంచిది. దీనిలోని అధిక కేలరీలు మీ బరువు తగ్గించే లక్ష్యాలను అడ్డుకోవడమే కాకుండా.. అనేక అనారోగ్య పరిస్థితులకు కారణమవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం లేదంటే మితం చేయడం మీ ఆరోగ్యానికి మంచిది.
వీటిని మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే వయసు పెరుగుతున్నా ఫిట్‌గా, ఆరోగ్యంగా, యవ్వన ఛాయలతో ఉంటారు. పోషకాహారంతో పాటు.. మీ ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి సరైన ఫుడ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. వీలైతే వైద్యుని సంప్రదించి మీ డైట్‌ఛార్ట్ ప్రిపేర్ చేసుకుని ఫాలో అయిపోండి.
పండుగ వేళ అన్ని తినేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఎన్నికల కోడ్ కారణంగా మీ డబ్బు, బంగారం సీజ్ చేశారా? తిరిగి ఎలా పొందాలంటే?
ఎన్నికల కోడ్ కారణంగా మీ డబ్బు, బంగారం సీజ్ చేశారా? తిరిగి ఎలా పొందాలంటే?
: ఎన్నికల కోడ్ కారణంగా ప్రజలు రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు సరైన పత్రాలు లేకుండా తరలిస్తే పోలీసులు సీజ్ చేస్తున్నారు. అయితే సీజ్ చేసిన సొత్తును తిరిగి పొందేందుకు ఈసీ సూచనలు చేసింది.
పోలీసుల వాహన తనిఖీలు
: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో పోలీసులు చేస్తున్న వాహనాల తనిఖీలు సామాన్యులకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఎన్నికల్లో పంపిణీకి రాజకీయ పార్టీలు డబ్బు తరలించే అవకాశాలున్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన నాటి నుంచి రోడ్లపై తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ప్రధానంగా కార్లతో పాటు అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగమే అయినా రూ.50 వేలకు మించిన నగదు, 10 గ్రాముల కంటే ఎక్కువ బంగారం దొరికితే సీజ్ చేయడం వ్యాపారులు, సామాన్యుల నిత్య కార్యకలాపాలకు సంకటంగా మారింది. ఎవరి దగ్గరైనా రూ.50 వేలకు మించి నగదు దొరికితే పోలీసులు సీజ్ చేస్తున్నారు. అలాగే ఆ ఖరీదుకు మించి బంగారం దొరికినా వదలడం లేదు. ఆ నగదు లేక నగలకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే ఓకే.. లేని పక్షంలో సీజ్ చేస్తున్నారు. అయితే అత్యవసర పనులపై డబ్బులు తీసుకెళ్లే వారికి ఇది ఇబ్బందిగా మారింది. వివాహాది శుభకార్యాలు, హాస్పిటల్ చెల్లింపులు, ఫీజులు కట్టేందుకు, గృహోపకరణాల కొనుగోలు వంటి అవసరాలకు డబ్బు తీసుకెళుతున్న సామాన్య ప్రజల వద్ద నుంచి డబ్బులు సీజ్ చేస్తున్న సందర్భాలు లేకపోలేదు.
అధికారుల చుట్టూ తిరుగుతున్న వ్యాపారులు
వ్యాపారులు తమ బిజినెస్ ముగించుకుని డబ్బును ఇంటికి తీసుకెళుతున్న సందర్భాల్లోనూ పోలీసులు సీజ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి డబ్బుల్లో ప్రతి రూపాయికి లెక్క ఎలా చూపించగలమని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా సీజ్ చేసిన సొమ్మును ఎలా విడిపించుకోవాలో అర్ధం కాని పరిస్థితిలో బాధితులు పోలీస్ స్టేషన్, తహసీల్దార్ ఆఫీస్, ఎన్నికల అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా డబ్బు సీజ్ చేసిన తర్వాత లెక్కలు చూపినప్పటికీ ఆ డబ్బును తిరిగి అప్పగించే విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలు లేవని అధికారులు చేతులెత్తేస్తున్న తీరుతో కొందరు జిల్లా కలెక్టర్ ను సైతం కలిసి మొర పెట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికి రూ.2.40 కోట్లను అధికారులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 3.10 కోట్లను సీజ్ చేశారు. ఈ మొత్తంలో 70 శాతం సొమ్ము సాధారణ ప్రజానీకం వద్ద సీజ్ చేసిందేనని అధికారులే అనధికారికంగా ఒప్పుకోవడం గమనార్హం.
తిరిగి పొందడం ఎలా?
అయితే సీజ్ చేసిన నగదు, బంగారం తిరిగి పొందడానికి ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. రికవరీ చేసిన సామాన్యుల సొమ్మును తిరిగి ఇచ్చేందుకు ప్రతి జిల్లాలో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలీసుల వాహన తనిఖీల్లో సీజ్ చేసిన నగదు, బంగారం... గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లోనే వాటిని తిరిగిచ్చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే సీజ్ చేసిన సొత్తు విలువ రూ.10 లక్షలలోపు మాత్రమే ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. అంతకు మించి విలువైన నగదు, బంగారం ఉంటే ఐటీ అధికారులకు వివరాలు అందించాలని సూచించింది.
నిర్మాణ లోపమా? మరేదైనా కారణమా?- మేడిగడ్డ ప్రమాదంపై నిపుణుల ఆరా?
నిర్మాణ లోపమా? మరేదైనా కారణమా?- మేడిగడ్డ ప్రమాదంపై నిపుణుల ఆరా?
:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టుల్లో ఒకటైన మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంలో పడింది. బ్యారేజీ మూడో బ్లాక్ లోని పిల్లర్లు కుంగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మానవ తప్పిదాలు, టెక్నికల్ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ
: తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ ప్రమాదంలో పడింది. బ్యారేజీ మూడో బ్లాక్‌లోని పిల్లర్లు శనివారం రాత్రి కుంగిపోయాయి. దాదాపు 85 గేట్లు, 16 టీఎంసీల కెపాసిటీతో ఈ బ్యారేజీని నిర్మించగా.. 19, 20, 21 నెంబర్ పిల్లర్లు కుంగిపోయి గేట్ల నుంచి భారీ శబ్దం వచ్చింది. దీంతో అక్కడి సిబ్బంది అలర్ట్అయి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బ్యారేజీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపేశారు. శనివారం రాత్రి వరకు బ్యారేజీలో దాదాపు 10 టీఎంసీల నీళ్లు ఉండగా.. ఇరిగేషన్ ఆఫీసర్లు అక్కడకు చేరుకుని గేట్లను ఎత్తి నీటికి ఖాళీ చేయడం ప్రారంభించారు. కాగా ఆదివారం ఉదయం ఇంజినీరింగ్ ఆఫీసర్లు కుంగుతున్న బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. నిర్మాణ లోపమా.. మరేదైనా కారణమా? అని విశ్లేషించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను వివరిస్తూ హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు.
80వేల పుస్తకాలు చదివి కేసీఆర్ ఇంజనీర్ అయ్యారు - మేడిగడ్డ కుంగడంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర సంపదకు నష్టం కలిగించిందని కిషన్ రెడ్డి ఆరోపించార
80వేల పుస్తకాలు చదివి కేసీఆర్ ఇంజనీర్ అయ్యారు - మేడిగడ్డ కుంగడంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోవడంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. బ్యారేజీ కుంగిపోవడం విషయం తెలుసుకుని పరిశీలించేందుకు వెళ్లిన ఇంజినీర్లను అడ్డుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించేందుకు వెళ్తారని కిషన్ రెడ్డి తెలిపారు. వేలకోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్రాజెక్టుపై ఇరిగేషన్ ఇంజినీర్లు మొదట్నుంచీ వ్యక్తం చేసిన అనుమానాలు ఇప్పుడు వాస్తవంగా తేలాయన్నారు. సూపర్ ఇంజనీర్లు, డ్రీమ్ ప్రాజెక్టు అంటూ కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇంజినీర్ గా మారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ సెటైర్లు వేశారు. నిపుణులు, ఇంజనీర్ల మాటల్ని పట్టించుకోకుండా నిర్మించిన ప్రాజెక్టు సమస్యలమయంగా మారిందన్నారు.
తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర సంపదకు నష్టం కలిగించిందన్నారు. గతంలో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో పంపులు మునిగిపోయి భారీగా నష్టం వాటిల్లిందన్నారు. యాంటీ గ్రావిటీ ప్రాజెక్టు అని గొప్పలుపోయారు కానీ గ్రాఫిక్స్ నిర్మాణాలతో ప్రభుత్వం బొక్కబోర్లా పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఏడాది 400 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. 2019 జూన్ లో ప్రాజెక్టు ప్రారంభిస్తే.. ఏడాది చొప్పున ఈ నాలుగేళ్లలో కేవలం 100కి పైగా టీఎంసీల నీళ్లు మాత్రమే ఎత్తిపోశారని.. ఇది విచిత్రమైన ప్రాజెక్టు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం చిన్న విషయం కాదన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసం బీఆర్ఎస్ చేపట్టిన ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. రాను రాను ఈ ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ డ్యామ్ సేఫ్టీ మీద అథారిటీ ఏర్పాటు చేసి రిపోర్ట్ తయారుచేయాలని కోరారు. పూర్తి స్థాయిలో నష్టపోకుండా ముందుగానే సాధ్యమైనంత త్వరగా డ్యామ్ సేఫ్టీ అధికారులను ఏర్పాటు చేయాలన్నారు.
రాత్రి ఒక్కసారిగా కుంగిన లక్మీ బ్యారేజీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మి) గ్యారేజీ వంతెన ఒక్కసారిగా కుంగింది. మహాదేవపూర్ మండలం అంబటిపల్లి శివారులోని బీ బ్లాకులో 18, 19, 20, 21 పిల్లల మధ్య ఉన్న వంతెన శనివారం రాత్రి భారీ శబ్దంతో ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే పైన వంతెన దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అధికారులు అప్రమత్తం
బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో భారీ శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్య నిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోను మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
అందరితో శబాష్ అని అనిపించుకుంటున్న తెలుగు అమ్మాయి జ్యోతి ఏంటో మీరే చూడండి
అందరితో శబాష్ అని అనిపించుకుంటున్న తెలుగు అమ్మాయి జ్యోతి ఏంటో మీరే చూడండి
కొండను కదలించాలి అనే ఆలోచన ఉంటే సరిపోదు ముందు చుట్టూ ఉన్న రాళ్లను కూడా పైకి ఎత్త కలగాలి. ఆ ప్రయత్నమే లేకుంటే ఆచరణ అంత సులువు కాదు అని ఒక మహిళా నిరూపించింది.
ఫ్యాబ్రిక్ మాండ్
కుటుంబంలో ఎవరు వ్యపోపరం చేసే వారు లేరు కానీ ఆమెకి మాత్రం వ్యాపారవేత్త కావాలి అని ఆశ దాని నెరవేర్చుకోవడానికి 100 శాతం కష్టపడింది. ఇప్పుడు తన లక్ష్యాన్ని చేరుకోగలిగింది. ఫ్యాబ్రిక్ మాండ్ అనే పేరుతో ఒక కంపెనీ స్థాపించింది. ఈ కంపెనీ ద్వారా సుమారు 83 ప్రముఖ బ్రాండ్లకు వస్త్రాలు సరఫరా చేయగలుగుతోంది.
గుంటూరు జిల్లా
తనది గుంటూరు జిల్లా నంబూరు గ్రామం తన తండ్రి ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో తన చదువు సాగింది. ఇక వైజాగ్ గీతం యూనివర్సిటీలో తన చదవు పూర్తి చేసింది ఇక బెంగళూరులో టిసిఎస్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఇలా ఉద్యోగం చేస్తున మనస్సు కి సంతృప్తి ఇవ్వలేదు కారణం అప్పుడప్పుడే ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ వంటి కంపెనీలు స్టార్ట్ అప్ గా మొదలుఅయ్యాయి.
వ్యాపారం చేయడానికి
దాంతో ఏదన్నా చేయాలి అనిపించేది అంటా తనకి వ్యాపారవేత్తగా ఎదగాలి అని బలంగా కోరుకొని ఉద్యోగం చేస్తూనే విద్యార్ధులకి వివిధ రంగాలలో ఎక్సప్లోసర్ ఇచ్చే స్టార్ట్ అప్ కంపెనీ మొదలు పెట్టింది. వివిధ కాలేజీలకు వెళ్లి తన ఉపన్యాసాలు ఇచ్చేది అలాగే ఇండస్ట్రీ టూర్ కే తీసుకువెళ్లి వారికీ చూపించేది. అప్పుడే తాను వ్యాపారం చేయడానికి తనకు ఉన్న నెట్ వర్క్ చాలా చిన్నది అని తెలుసుకొంది .
టెక్స్టైల్ రంగంలో
అప్పుడే MBA చేసింది తాను MBA పూర్తి చేసిన తర్వాత తనకు మేనేజర్ స్థాయిలో ఉద్యోగం వచ్చింది. వచ్చిన ఉద్యోగం చేరడానికి ఇంకా 3 నెలలు ఉంది ఆ సమయంలో వ్యవసాయం, టూరిజం మరియు టెక్స్టైల్స్ రంగాలలో ఇంటర్న్షిప్ చేసింది.అప్పుడే టెక్స్టైల్ రంగంలో ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకొంది. ఉద్యోగం చేరే సమయం రావడంతో చేరిపోయింది.
బెంగుళూరు ఐఐయం
వారాంతంలో ఎక్సిబిషన్ నిర్వహించేది అలాగే చీరలను టాప్పర్ వేర్ మోడల్ అమ్మడానికి ప్రయోగం చేసింది. అక్కడ విజయం సాధించలేకపోయింది. అప్పుడే తనకు ఇంకో ఆలోచన వచ్చింది. అదే చేనేత వస్త్రాలను బ్రాండెడ్ కంపెనీలకు అమ్మాలి అని నిర్ణయించుకొంది అన్నిటికి అప్లై చేసిన తర్వాత బెంగుళూరు ఐఐయం ఆసక్తి చూపించింది. తన ప్రసంగం విన్నాక ఆమెకి అక్కడ స్థానం కల్పించింది. అలాగే మెంటార్ షిప్ కూడా ఇచ్చింది ఇక కొన్ని మార్పులు సూచించింద
జూనియర్ హేమలత
ఇక ఆమె దేశం అంత తిరిగి చేనేత దుస్తుల ప్రాముఖ్యత తెలుసుకొంది మంగళగిరి, కర్ణాటకలోని హెక్ కోడు ఇలా అనేక ప్రాంతాలు తిరిగి వారితో కలిసి మాట్లాడి ఇక పూర్తి స్థాయిలో ద్రుష్టి దీనిపై పెట్టాలి అని ఉద్యోగం మానేసింది. అప్పటి వరకు సంపాధించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి తన వ్యాపారం మొదలు పెట్టింది. దింతో పటు బెంగుళూరు ఐ ఐ యం వారు రూ.15 లక్షలు ఫండింగ్ గా ఇచ్చారు. ఇక తన జూనియర్ హేమలత కూడా కలిసింది. ఇద్దరు వ్యాపార భాగస్వాములుగా మరి మరో ముగ్గురు విద్యార్థులని పనిలో పెట్టుకున్నారు.
ర్కెటింగ్
ఇక మన చేనేత వస్త్రాలను పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలకు వెళ్లారు నిజానికి పెద్ద బ్రాండ్ల దగ్గరకు వెళ్లి అడగడం అంత సులువు కాదు అందుకే ఇప్పుడు ఉన్న ట్రేండింగ్ స్టైల్ కి అనుగుణంగా చేనేత వస్త్రాలకు న్యాచురల్ కలర్ వేసి మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టారు.
ఫ్లైయింగ్ మెషిన్
మొదట వీరికి అవకాశం ఇచ్చింది AZIO సంస్థ ఇక ఆపై అరవింద్, యూ.ఎస్. పోలో , ఫ్లైయింగ్ మెషిన్ , ఫ్యాబ్ ఇండియా ఇలా సుమారు 83 బ్రాండ్లకు వేరు సరఫరా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 150 చేనేత యూనిట్ల నుండి వీరు ఉత్పత్తులు సేకరిస్తున్నారు. దీనికోసం,ప్రధానంగా డేటా కూడా నిర్వహిస్తున్నారు. వారితో నిత్యం చర్చలు జరిపేందుకు ఆరుగురితో కలిసి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఏకలవ్య ఫౌండేషన్
ఇక వ్యాపారం పెరిగే కొద్దీ డబ్బులతో అవసరం ఉంటుంది కనుక ఐఐయం కలకత్తా నిర్వహించిన స్టార్ట్ అప్ స్మార్ట్ 50 లో రూ.4 లక్షలు గెలుచుకున్నారు. అలాగే అహమ్మదాబాద్ కి చెందిన ఒక ప్రొఫెసర్ ఒకరు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షలు ఇప్పించారు. ఒక్కప్పుడు వ్యాపారం గురించి ఏమి తెలియదు దానికోసం ఉద్యోగం మానేస్తున్నావా అన్నవారు ఇప్పుడు శబాష్ అంటుంటే చాలా సంతోషంగా ఉంది అంటోంది మన తెలుగు అమ్మాయి జ్యోతిర్మయి ఢక్కామల.
అనుకొన్నది
నెలకి రూ.2 లక్షల జీతం వదులుకొని వ్యాపారమే మేలు అనుకొంది చివరికి అనుకొన్నది సాధించింది చూసారుగా కృషితో నాస్తి దుర్భిక్షం.
రాజా సింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ
రాజా సింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ
రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది బీజేపీ. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత
తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం…. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తుండగా…. గోషామహల్ నుంచి మళ్లీ రాజాసింగ్ కే చోటు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజాసింగ్ ఈజ్ బ్యాక్...? గోషామహల్ సీటు మళ్లీ ఆయనకేనా?
గతేడాది ఓ వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానూ తీవ్ర దుమారానికి దారితీశాయి. అయితే అప్పటి పరిస్థితులతో బీజేపీ జాతీయ నాయకత్వం… ఆయనపై సస్పెన్షన్ విధించింది. నాటి నుంచి ఇవాళ్టి వరకు సస్పెన్షన్ ఆదేశాలు అమల్లో ఉండటంతో…. పార్టీకి సంబంధం లేకుండానే పని చేసుకుంటూ వెళ్తున్నారు రాజాసింగ్.
ఇక గత కొంతకాలంగా తనపై విధించిన సస్పెన్షన్ విషయంలోనూ రాజాసింగ్ పలుమార్లు పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కూడా కోరారు. అయితే రాష్ట్ర నాయకత్వం సుముఖంగానే స్పందించినప్పటికీ… జాతీయ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈనేపథ్యంలో… రాజాసింగ్ పార్టీ మారుతారనే చర్చ జరిగింది. వీటిన్ని తీవ్రంగా ఖండించారు రాజాసింగ్. అవసరమైతే రాజకీయాల నుంచి వైదొలుగుతా కానీ… వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో…. ఇదే టికెట్ నుంచి పోటీ చేయాలని పార్టీకి చెందిన విక్రమ్ గౌడ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈసారి రాజాసింగ్ బరిలో ఉండకపోవచ్చనే చర్చ నడిచింది. కానీ వీటన్నింటికి చెక్ పెట్టేసింది జాతీయ నాయకత్వం. రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. దీంతో మరోసారి గోషామహల్ టికెట్ ఆయనకే ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది.
రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం చూస్తే…. గతంలో టీడీపీ అభ్యర్థిగా మంగళహాట్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన... 2014, 2018లో మంగళ్‌హాట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో శాసనసభా పక్ష నాయకుడిగానూ ఎన్నికయ్యారు. ప్రస్తుతం మరోసారి బీజేపీ తరపునే పోటీ చేసే అవకాశం ఉంది.
Thursday, 19 October 2023
కేరళ నుంచి తెలంగాణకు లారీలో రూ.750 కోట్ల డబ్బు..గద్వాల్ దగ్గర పట్టివేత.*
👉 *కేరళ నుంచి తెలంగాణకు లారీలో రూ.750 కోట్ల డబ్బు..గద్వాల్ దగ్గర పట్టివేత.*
👉 తెలంగాణలో ఎన్నికలు.. గల్లీ గల్లీలో తనిఖీలు.. ఇప్పటికే వందల కోట్లు పట్టివేత.. 50 వేల రూపాయలకు ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా పట్టుకెళుతున్నారు పోలీసులు.. సామాన్యులు సైతం ఆందోళన పడుతున్నారు...
👉 ఇలాంటి టైంలో కేరళ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 750 కోట్ల రూపాయల డబ్బు.. ₹500 నోట్ల కట్టలు.. ఓ లారీలో రావటం సంచలనంగా మారింది.. గద్వాల్ దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకు లారీలో 750 కోట్ల రూపాయల నోట్ల కట్టలు.. అన్నీ 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించటంతో పోలీసులు షాక్ అయ్యారు... వెంటనే ₹750 కోట్ల రూపాయలను, నోట్ల కట్టలను తరలిస్తున్న లారీని సీజ్ చేసి డ్రైవర్ అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
Wednesday, 18 October 2023
Tuesday, 17 October 2023
జర్నలిస్టుల మెడకు బిగిస్తున్న ఉచ్చు
భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
--జిల్లా కలెక్టర్,జెసిలకు కలసిన జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో సమస్త జర్నలిస్టుల తరఫున సంప్రదింపులు జరిపి భారీ ఎత్తున జరిగిన భూఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించాలని నల్లగొండ హౌసింగ్ సొసైటీ సభ్యులు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పించారు. అక్రమంగా ప్రభుత్వ భూమి ని జీవో నెంబర్ 59 ద్వారా పట్టాలు చేసుకున్న వారందరూ ఎంతటి వారైనా సత్వర విచారణ పూర్తిచేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మొదట ఇచ్చిన సమచారం తో కూడిన వినతి పత్రం తర్వాత పూర్తిస్థాయి సమాచారంతో మరొకమారు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ని కలిసి వినతిపత్రం అందజేసి పూర్తి ఆధారాలను సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్ తగు విచారణ జరిపి జర్నలిస్టులకు
అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా సొసైటీ నాయకులు గార్లపాటి కృష్ణారెడ్డి, గుండగోని జయశంకర్ గౌడ్ లు మాట్లాడుతూ పట్టణంలోని పానగల్లు రెవిన్యూ పరిధిలోని 148, 149 సర్వే నెంబర్లలో గొల్లగూడ రెవెన్యూ శివారులోని 370, 371 లలో ఉద్దేశ్యపూర్వకంగానే భూ ఆక్రమన జరిగిందని, రెవెన్యూ మున్సిపల్ అధికారులు గత 13 సంవత్సరాలుగా నివాసముంటున్నట్లు ప్రభుత్వ జీవో నెంబర్ 59 ప్రకారం రెగ్యులర్ చేయాలని దరఖాస్తు చేసుకోవడంతో రెవెన్యూ అధికారులు ఎలాంటి విచారణ జరుపకుండానే తప్పుడు ఇంటి నెంబర్లను కేటాయించారని ఆరోపించారు. నల్లగొండ తాహశీల్దార్ ఇరిగేషన్ శాఖ పరిధిలోని సర్వేనెంబర్ 148, 149లలో పానగల్లు లోని ఎస్ఎల్బీసీ క్వార్టర్స్ ను భూమిని ఇంటి స్థలాలుగా రిజిస్ట్రేషన్ చేశారన్నారు.ఈ విషయంపై గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని వెంటనే విచారణ జరిపి సంబంధిత అధికారులపై , ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కొంతమంది జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో నల్గొండ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ నాయకులు మామిడి దుర్గాప్రసాద్, గాదె రమేష్, దండంపల్లి రవికుమార్, ఉబ్బని సైదులు, జిల్లా యాదయ్య, జిల్లా రాజశేఖర్, గోలి సైదులు, అశోక్, కత్తుల హరి, సత్యం, సభ్యులు ఉన్నారు.
సీఎం అయ్యే అవకాశం రావొచ్చు, మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి
తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ గెలుపు తథ్యమన్న రాజ్‌నాథ్ సింగ్
హుజురాబాద్ జనగర్జన సభలో రాజ్‌నాథ్ సింగ్
హుజురాబాద్ జనగర్జన సభలో రాజ్‌నాథ్ సింగ్
: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బీజేపీ జనగర్జన సభలో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ బిఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ధ రణి పోర్టల్ పేరుతో లక్షల ఎకరాల భూమిని కొల్లగొట్టారన్నారు.
: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం లేకుండా ఉండలేరని, తెలంగాణా ప్రభుత్వం అంటే లీకేజీల ప్రభుత్వమని కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిథిలోని జమ్మికుంటలో భారతీయ జనతా పార్టీ జనగర్జన పేరిట భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ 2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం రెండు పర్యాయాలు కేసీఆర్ కు ప్రజలు అవకాశం ఇచ్చినా ఏమాత్రం అభివృద్ది చేయలేదన్నారు.
బీజేపీ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఎందుకు వెనుకబడిందో ప్రజలు ఆలోచించాలన్నారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని,ప్రజలు కేసీఆర్ పాలనలో సంతృప్తిగా లేరన్నారు.
ధరణి పోర్టల్ తీసుకువచ్చి రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములను మాయం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.కల్వకుంట్ల కుటుంబ అవినీతి ఢిల్లీవరకు చేరిందని,తెలంగాణా రాష్ట్రసాధన కోసం కేసీఆర్ ఒక్కడే ఉద్యమించలేదని,యావత్ తెలంగాణా ప్రజలు చేసిన ఉద్యమానికి బీజేపీ కూడా అండగా నిలిచిందని గుర్తు చేసారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు...బేకార్ అవుతుందని, బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు హ్యండ్ ఇవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ ఫలాలకు రూపాయి కేటాయిస్తే ప్రజలకు ఇరవై పైసలే వచ్చాయని, కాంగ్రెస్ నాయకుల దోపిడిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.రాబోయే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ గెలుపు తథ్యమని,కమలం పువ్వు పై లక్ష్మీదేవి కూర్చుని ప్రజలను ఆశీర్వదిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటు పలువులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు..