Saturday, 27 September 2025

రాష్ట్ర కొత్త పోలీస్ బాస్ గా శివధర్ రెడ్డి గారు...

 రాష్ట్ర కొత్త పోలీస్ బాస్ గా శివధర్ రెడ్డి గారు...

డీజీపీ గా శివధర్ రెడ్డి  నియామకం .. అధికారిక ఉత్తర్వులు విడుదల...ఉమ్మడి నల్లగొండ జిల్లా లో ఎస్పీ గా 21-04-2000 to 15-04-2002 పని చేసిన శివధర్ రెడ్డితెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి గారు....


Thursday, 25 September 2025

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధిపై తేల్చేసిన టీపీసీసీ చీఫ్..!!

 జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధిపై తేల్చేసిన టీపీసీసీ చీఫ్..!!

తెలంగాణలో ఎన్నికల పైన పార్టీలు ఫోకస్ చేసాయి. స్థానిక సంస్థల ఎన్నికలు.. జూబ్లీహిల్స్ బై పోల్ ఇప్పుడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఒకటి రెండు రోజుల్లోనే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల కానుంది. ఇక.. వచ్చే నెల తొలి వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఎన్నికల సంఘం ప్రకటన చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్ధి ని దాదాపు ఖరారు చేసింది. కాగా, కాంగ్రెస్ లో సీటు కోసం పోటీ నెలకున్న వేళ.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అభ్యర్ధి ఎవరో సంకేతాలు ఇచ్చారు. జూబ్లీహిల్స్ బై పోల్ అభ్యర్ధి.. ఫలితం పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమాగా చెప్పుకొచ్చారు. ఇక, పార్టీ అభ్యర్ధి పైనా స్పష్టత ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సర్వేలు చేస్తున్నామని.. సర్వేలో ఎవరూ ముందుంటే వారికే సీటు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలిచే వారికి సీటు ఇస్తామని స్పష్టం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలామంది రేసులో ఉన్నారని.. సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్ , బొంతు రామ్మోహన్‌లతో సహ పలువురు టికెట్ అడుగుతున్నారని గుర్తుచేశారు. స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని తెలిపారు.

         ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వస్తోందని చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని గుర్తుచేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్నిటిపైన సీబీఐ విచారణ జరిపితే బాగుంటుంది. కవితది ఆస్తుల పంచాయితీగా మహేష్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌తో కవితకు ఏలాంటి సంబంధం లేదన్నారు. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉంది ?. దోపిడీ చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు, అందరి వాయిస్‌లు రికార్డు చేశారని ఆరోపించారు. తాను వాడిన జియో సిమ్ కార్డు నెంబర్ జియోసంస్థకు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్, కేటీఆర్ వ్యూహ రచన చేసి గత ఎన్నికల్లో గెలిచారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.

RTO Cyber Scam: కొత్త రకం స్కామ్.. RTO పేరుతో చలాన్లు.. అకౌంట్లలో లక్షల డబ్బు మాయం

 RTO Cyber Scam: కొత్త రకం స్కామ్.. RTO పేరుతో చలాన్లు.. అకౌంట్లలో లక్షల డబ్బు మాయం


           : సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ ఒకే రకమైన స్కామ్ చెయ్యరు. అలా చేస్తే.. మనకు ఆ స్కామ్ గురించి తెలిసిపోతుంది కదా, మనం అలర్ట్ అయిపోతామని వాళ్లకు తెలుసు. అందుకే కొత్త కొత్తవి ప్రయత్నిస్తారు. తాజాగా ఆర్టీఓ చలాన్ల ద్వారా మనీ లాగేస్తున్నారు. ఎలా చేస్తున్నారో తెలుసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం

       మనందరికీ సోషల్ మీడియా బాగా అలవాటైపోయింది. మొబైల్ వాడటం, ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ చెయ్యడం ఇలా ఇవన్నీ మనం రోజూ చేసేవే. ఐతే.. మన లాంటి వాళ్లను టార్గెట్ చేయడానికి సైబర్ నేరగాళ్లు రెడీగా ఉంటారు. ఏదో ఒకటి చేసి.. మన బ్యాంక్ అకౌంట్లలో డబ్బును మాయం చెయ్యడమే వాళ్ల టార్గెట్. ఐతే.. మనం ఎప్పటికప్పుడు వాళ్ల మోసాల్ని తెలుసుకుంటూ ఉంటే.. మనం అందులో చిక్కుకోకుండా తప్పించుకోవచ్చు. తాజాగా సైబర్ నేరగాళ్లు.. RTO చలాన్ పేరుతో కొత్త స్కామ్ మొదలుపెట్టి.. జనం నుంచి డబ్బు లాగేస్తున్నారు.

మీకు తెలుసుగా.. మనం వాడే వాహనాలకు అప్పుడప్పుడూ ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు పడుతూ ఉంటాయి. మనం ట్రాఫిక్‌లో ఎప్పుడైనా పొరపాటున రూల్స్ అతిక్రమిస్తే.. అక్కడి సీసీ కెమెరాలు మన బండిని ఫొటో తీసి.. పోలీసులకు పంపేస్తాయి. పోలీసులు.. RTO ట్రాఫిక్ వెబ్‌సైట్‌లో.. చలాన్ల లిస్టులో పెడతారు. అది చూసి.. మనం చలాన్లు చెల్లిస్తూ ఉంటాం. ఈ వెబ్‌సైట్‌లో మన బండి నంబర్ ఎంటర్ చేస్తే.. మన బండి పేరు మీదు ఉన్న చలాన్ల లిస్ట్ కనిపిస్తుంది. ఇదే సైబర్ నేరగాళ్లకు వరం అయ్యింది.

      వాళ్లు కొన్ని బండి నంబర్లను నోట్ చేసుకొని.. ఆర్టీవో సైట్‌లో ఎంటర్ చేసి.. ఆ బండి నంబర్ పేరు మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో చూస్తున్నారు. ఆ తర్వాత.. వాటిని ఫొటో తీసి.. బండి ఓనర్ మొబైల్ నంబర్‌కి పంపుతున్నారు. మీ పేరు మీద.. ఈ చలాన్లు ఉన్నాయి. వెంటనే డబ్బు చెల్లించకపోతే, మీ బండి లైసెన్స్ రద్దు చేస్తాం అని భయపెడుతున్నారు. చలాన్‌ని ఈ కింది లింక్ ద్వారా చెల్లించండి. అని అంటున్నారు. ప్రజలు అమాయకంగా మనీ చెల్లించేందుకు ఆ లింక్ క్లిక్ చేస్తున్నారు. వెంటనే వారి మొబైల్‌ లోని apk ఫైల్ వచ్చేస్తోంది.

APK ఫైల్ అంటే:

ఇదో రకమైన వైరస్, మాల్వేర్ లాంటిది. ఇది మొబైల్‌లోకి వెళ్లగానే.. ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత మొబైల్‌లో డేటా మొత్తాన్నీ.. సైబర్ నేరగాళ్లకు పంపేస్తుంది. మొబైల్‌లో ఫొటోలు, పాస్‌వర్డ్స్, వీడియోలు ఇలా అన్నీ సైబర్ నేరగాళ్లకు చేరిపోతాయి. అలా చేరిపోయిన వెంటనే.. వాళ్లు.. బాధితుడి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును విత్ డ్రా చేసేసుకుంటున్నారు. ఇలా.. నాలుగు రోజుల్లు ముగ్గురు మోసపోయారు. మొత్తం రూ.4.85 లక్షలు పోగొట్టుకున్నారు.

       హైదరాబాద్‌లో ఇప్పుడు ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి. ముషీరాబాద్‌కి చెందిన 47 ఏళ్ల వ్యక్తి ఇలాగే.. వాహన చలాన్ వచ్చిందనుకొని.. డబ్బు చెల్లించడానికి లింక్ క్లిక్ చెయ్యగా.. అతని అకౌంట్ నుంచి రూ.1.82 లక్షలు మాయమయ్యాయి. అలాగే.. చుడీ బజార్‌‌కి చెందిన 54 ఏళ్ల బాధితుడికి కూడా చలాన్ లింక్ పంపారు. ఆయన నుంచి ఒక లక్ష రూపాయలు కొట్టేశారు. భోలక్‌పూర్ లోని 34 ఏళ్ల మరో వ్యక్తి నుంచి రూ.2.03 లక్షలు కొల్లగొట్టారు.

               ఇలాంటి మోసాల నుంచి మనం ఎప్పటికప్పుడు అలర్ట్ అవ్వాలి. సింపుల్‌గా తప్పించుకోవాలంటే.. ఒక్కటే మార్గం. మనకు తెలియని లింకులను క్లిక్ చెయ్యకూడదు. ముక్యంగా లింక్ చివర్లో .apk అని ఉంటుంది. అది అస్సలు క్లిక్ చెయ్యకూడదు. చేస్తే, వెంటనే మొబైల్‌లో డేటాని క్లియర్ చేసుకోవాలి. ముఖ్యంగా పాస్‌వర్డ్స్ లాంటివి డిలీట్ చేసేయాలి. లేదంటే. అవి నేరగాళ్లకు చేరిపోయి సమస్యల్లో చిక్కుకుంటాం.

Wednesday, 24 September 2025

మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!

 మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!

తెలుగు రాష్ట్రాల్లోని మందుబాబులకు ఇది ఒక చేదువార్త. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో దసరా అంటే ఓ కిక్కు. ఏ పండుగకు లేనంతగా దసరా పండుగకు జోష్ ఉంటుంది. దసరా రోజు చుక్కాముక్కా ఉండాల్సిందే. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతుంది. మందుతో పాటు మాంసం కూడా తప్పనిసరి మరి. కానీ ఈ సారి దసరాకు చుక్కా ముక్కపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చాయి. ఈ క్రమంలోనే మద్యం, మాంసం విక్రయాలపై చర్చ నడుస్తోంది.

                      అయితే సాధారణంగా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలు మూసివేస్తారు. అంటే గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా డ్రై డే పాటించడం ఆనవాయితీ. అయితే దసరా రోజున చాలా మందికి సుక్కా ముక్కా లేకపోతే ముద్ద దిగదు. అందుకోసం అక్టోబర్ 2న మద్యం, మాంసం విక్రయాలపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అక్టోబర్ 2న మద్యం, మాంసం దుకాణాలను మూసివేయాలా లేదా మినహాయింపు ఇవ్వాలా అనే దానిపై అధికారులు చర్చోపచర్చలు జరుపుతున్నారు.

                        ఒకవేళ దసరా పండుగను సుక్కాముక్కాతో జరుపుకోవాలనుకునేవారు, అలాగే సాధారణంగా మద్యం సేవించేవారు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులతో పాటు, బార్‌లు, పబ్‌లు కూడా మూసివేయబడతాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. అందువల్ల, దసరా రోజు మద్యం సేవించాలనుకునేవారు తమ అవసరాలకు తగ్గట్లుగా ముందుగానే కొనుగోలు చేసుకోవడం మంచిది.




గతేడాది దసరాకు కిక్కే కిక్కు..

గతేడాది దసరా పండుగకు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు రూ.1285 కోట్లు వచ్చి చేరాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని గతేడాది అక్టోబర్ 1 నుంచి 14 వరకు .. 11 రోజుల్లో ఎక్సైజ్ శాఖకు డబ్బుల వర్షం కురిసింది. ఏకంగా రూ.1285.16 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలా జరిగితే రాష్ట్ర ఖజానాకు కూడా గండి పడే అవకాశం లేదు.

Tuesday, 23 September 2025

హైదరాబాద్ లో ర్యాగింగ్ కలకలం.. అమాయక విద్యార్థి బలి..తండ్రికి సెల్ఫీ వీడియో..!

 హైదరాబాద్ లో ర్యాగింగ్ కలకలం.. అమాయక విద్యార్థి బలి..తండ్రికి సెల్ఫీ వీడియో..! 



ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ రోజుల్లో కూడా ర్యాగింగ్ నడుస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా నగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ ర్యాగింగ్ బూతానికి ఓ విద్యార్థి బలైన ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. సీనియర్లు వేధిస్తున్నారంటూ తండ్రికి సెల్ఫీ వీడియో పంపిన కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

..ఇంత దారుణంగా ఉందేంటి భయ్యా..! అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నగలకొండకు చెందిన సాయితేజ అనే విద్యార్థి హైదరాబాద్ మేడిపల్లిలోని సిద్ధార్థ్ ఇంజినీరింగ్ కాలేజీలో సెండర్ ఇయర్ చదువుతున్నాడు. అయితే సెప్టెంబర్ 21న తన తండ్రికి వీడియో కాల్ చేసిన సాయితేజ.. కాలేజీలోని సీనియర్లు తనను ర్యాగింగ్ చేస్తున్నారని.. కొడుతున్నారని.. డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చనిపోతున్నట్లు తండ్రికి చెప్పాడు. అయితే ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనైన తండ్రి కుమారుడికి ఫోన్ చేయగా.. ఫోన్ తీయలేదు. హాస్టల్ వార్డెన్ కు ఫోన్ చేయగా.. రూమ్ లోకి వెళ్లి చూశాడు. అప్పటికే సాయి తేజ మృతి చెందాడు. సాయి తేజ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. అయితే సాయితేజ స్నేహితులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇటీవల ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో సాయితేజ, అతని స్నేహితులకు గొడవ జరిగింది. అయితే ఈ విషయాన్ని ఫస్ట్ ఇయర్ విద్యార్థులు.. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చెప్పారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మరో కాలేజ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఫ్రెండ్స్ కలిసి సాయి తేజతోపాటు అతని స్నేహితులను పిలిచారు. ఈ వివాదంలో లోకల్‌ గా ఉండే రౌడీ బ్యాచ్ ప్రమేయం కూడా ఉంది. 

 మాట్లాడదాం అని సాయితేజ, అతని స్నేహితులపై దాడి చేశారు. అంతేకాక ఓ బార్ కు తీసుకెళ్లి రౌడీ బ్యాచ్, ఫైనల్ ఇయర్ విద్యార్థులు మద్యం సేవించారు. రూ. 10వేలు బిల్ అయింది. బిల్లు కట్టాలని సాయితేజను కొట్టారు. తన దగ్గర డబ్బులు లేవని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. అలా తనవద్ద రూ. 1500 మాత్రమే ఉన్నాయని ఫోన్ పే చేశాడు. ఇక అక్కడినుంచి నేరుగా హాస్టల్ వెళ్లిపోయిన సాయి తేజ.. రూమ్‌లో సెల్ఫీ వీడియో తీసి తండ్రికి పంపాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

వెంకన్నకు అమూల్యమైన పసిడి చంద్రవంక కంఠి: తెలంగాణ ఎంపీ భారీ విరాళం

వెంకన్నకు అమూల్యమైన పసిడి చంద్రవంక కంఠి: తెలంగాణ ఎంపీ భారీ విరాళం

             : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 60,681 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 19,510 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.06 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అయిదు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.

             టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 5 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది అల్పాహారం, పాలు పంపిణీ చేశారు. శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు.

             ఈ పరిస్థితుల మధ్య తిరుమల శ్రీవారికి తెలంగాణకు చెందిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అత్యంత ఖరీదైన కానుకను అందించారు. అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి అది. దీనిపై అష్టలక్షులనూ పొదిగారు. దీని విలువ 60 లక్షల రూపాయలు. ఈ చంద్రవంక కంఠి 535 గ్రాముల బరువు ఉంది. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో గల రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరికి దీన్ని అందజేశారు.

          తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు రూ.60 లక్షల విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మంగళవారం సమర్పించారు.

                 అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సమర్పించారు.


బ్రహ్మోత్సవాల సమయంలో ఈ కంఠిని శ్రీవారికి అలంకరించే అవకాశం ఉంది. అంతకుముందు- శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి బహుకరించారు. పేష్కార్ రామకృష్ణ కు స్వామీజీ కానుకలు అందజేశారు.

జూబ్లీహిల్స్ ఆ పార్టీదే.. సంచలన సర్వే రిలీజ్..!

      జూబ్లీహిల్స్ ఆ పార్టీదే.. సంచలన సర్వే రిలీజ్..!

తెలంగాణ‌ రాజ‌కీయాల్లో హీట్ పుట్టిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర‌వేయ‌డం ఖాయ‌మ‌ని అంతర్గత స‌ర్వేలో వెల్ల‌డైంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమలు చేస్తున్న ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల ప‌ట్ల మ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబాలు, మ‌హిళ‌లు, యువ‌త సంతృప్తిగా ఉన్న‌ట్టు అంతర్గత సర్వే నివేదిక తెలిపింది.

           జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి 48.32 శాతం ప్ర‌జామోదం ల‌భించింది. బీఆర్‌ఎస్‌ 34.17 శాతానికి ప‌రిమిత‌మైంది. ఇక బీజేపీ వైపు కేవ‌లం 16.04శాతం మంది ఓట‌ర్లు అనుకూలంగా స్పందించారు. స్వతంత్ర అభ్యర్థులు 1.47శాతం ఓట్లు పొందుతారని అంతర్గత స‌ర్వే అంచ‌నా వేసింది.

    ఉపఎన్నిక స‌మీపిస్తుండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలోని క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌పై ఓ ప్రైవేటు సంస్థ ఇటీవ‌ల అంతర్గత స‌ర్వే నిర్వ‌హించింది. షేక్‌పేట్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండలోని 19 కాలనీల్లో 2,000 మంది ఓటర్ల అభిప్రాయాల‌ను సేక‌రించింది.

సంక్షేమ మంత్రమే కాంగ్రెస్ బ‌లం..!

       కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల‌ ఉచిత విద్యుత్, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల జారీ, ఉపాధి క‌ల్ప‌న వంటి అంశాలు మహిళలు, యువ ఓటర్లపై బలంగా ప్రభావం చూపుతున్నాయని సర్వేలో తేలింది. సంక్షేమ‌ పథకాలు తమ కుటుంబాల అవసరాలను తీర్చడమే కాకుండా, నెలవారీ ఖర్చులను కూడా తగ్గించాయని ప్రజలు అభిప్రాయపడ్డారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం సన్న బియ్యం ఉచితంగా పొందడం ద్వారా నెలకు దాదాపు రూ. 1,500 ఆదా చేసుకోగలుగుతోందని మెజారిటీ మ‌హిళ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

           అలాగే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వల్ల ప్ర‌తి కుటుంబానికి నెలకు దాదాపు రూ. 1,100, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మరో రూ. 800 రవాణా ఖర్చులలో ఆదా అవుతున్నాయని వెల్ల‌డించారు. ఇవన్నీ కలిపి ఒక కుటుంబానికి ఏటా దాదాపు రూ. 45,000 ఆదా అవుతున్నాయ‌ని వెల్ల‌డించారు. ఈ పొదుపును ఇతర ఖర్చులకు కేటాయించుకుంటూ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటున్నామని సర్వేలో పాల్గొన్న మహిళలు తెలిపారు. సంక్షేమ‌ పథకాల వల్ల లబ్ధి జ‌రుగుతోంద‌ని, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇవి ప్రోత్సాహం ఇచ్చాయని కార్డు లేని వారు త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

          తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగ‌ణ‌న‌పై, బీసీ రిజర్వేషన్ల పట్ల వెనుకబడిన తరగతుల ప్రజలు సానుకూలంగా స్పందించారు. పాలన విషయానికి వస్తే నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో డ్రైనేజీ, రోడ్లు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల ప‌ట్ల‌ ఎక్కువమంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఫించ‌న్ల ఆల‌స్యం, ప‌వ‌ర్ క‌ట్ అంశాల‌పై కొంత మేర‌కు స‌మ‌స్య‌లున్నా ఐదు-పాయింట్ల సంతృప్తి స్కేల్‌లో 60 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు న‌గ‌ర‌ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ కృషిపై సంతృప్తి లేదా అత్యంత సంతృప్తిని వ్య‌క్తం చేశారు.

              దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ పట్ల ఉన్న సానుభూతిపై బీఆర్‌ఎస్ ఆధారపడి ఉన్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మాగంటి సునీత‌, వ‌జ్ర‌నాథ్ వ‌ర్గాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డం, పార్టీ అభ్య‌ర్థిత్వంపై రావుల శ్రీధ‌ర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నార‌నే ప్ర‌చారం, బీజేపీతో ర‌హ‌స్య ఒప్పందం ఉంద‌నే ప్ర‌చారం వ‌ల్ల బీఆర్ఎస్ క్యాడ‌ర్‌ ఆయోమ‌యంలో ప‌డింద‌ని స‌ర్వేలో తేలింది. ఈ స‌మీక‌ర‌ణాలు అన్నీ కూడా క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలాంశాలుగా మారాయ‌ని వెల్ల‌డించింది. మజ్లిస్ పార్టీ ఎన్నిక‌ల బ‌రిలో లేకపోవడం, బీఆర్‌ఎస్ పార్టీకి మైనారిటీల మద్దతు తగ్గడం కాంగ్రెస్ పార్టీకి మ‌రింత‌ లాభిస్తుంద‌ని పేర్కొంది.

                అంతర్గత సర్వే ప్రకారం, బీజేపీకి 16 శాతం ఓట్ల వాటా లభించినప్పటికీ, నియోజకవర్గంలో ఆ పార్టీకి బలమైన బూత్ స్థాయి కార్యకర్తలు లేరని, అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం బలమైన ప్రత్యామ్నాయంగా ఉంటుందని సర్వే పేర్కొంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ కంటే 14.15 శాతం ఆధిక్యం ఉన్నప్పటికీ, ఉపఎన్నిక అంచనాలకు అందకుండా ఉంటుందని సర్వే పేర్కొంది. స్థానిక అంశాలు, ఓటింగ్ శాతం ఉపఎన్నికల ఫ‌లితాల‌పై ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని అంతర్గత స‌ర్వే అంచ‌నా వేసింది.

Sunday, 21 September 2025

ఈ మహాలయ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది...




 ఈ మహాలయ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది...


ఈ మహాలయ పక్షం సమయంలో పూర్వీకులు భూ లోకానికి వస్తారని పెద్దలు చెబుతారు ఆ మరుసటి రోజే అశ్విజ మాసం ప్రారంభ మవుతుంది. 


ఈ పవిత్రమైన దుర్గా మాత 

భూ లోకానికి వచ్చి భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది చాలా మంది విశ్వాసం. 


పూజా విధానం


ఈ పవిత్రమైన రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి పూర్వీకుల పేరిట తర్పణం చేయాలి. పూజ చేసే సమయంలో దక్షిణం వైపు మీ ముఖం పెట్టి కూర్చోవాలి. ఆ తర్వాత రాగిపాత్రలో గంగాజలం తీసుకుని , అందులో నల్ల నువ్వులు , పచ్చి పాలు , కుసాలను కలపాలి. ఈ నీటిని సూర్యదేవునికి సమర్పిస్తూ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ప్రార్థించాలి. 


ఈరోజు తయారు చేసే ఆహారాన్ని ఐదు భాగాలు చేసి ముందుగా దేవుడికి , తర్వాత గోమాత , శునకం , చీమ , కాకులకు నైవేద్యంగా సమర్పించాలి.

అనంతరం బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేసి వారికి తెల్లని వస్త్రాలు దానం చేయాలి.


మహాలయఅమావాస్య ప్రాముఖ్యత


మహాలయ అమావాస్య రోజున పితృ పక్షాలు పూర్తవుతాయి. పితృ పక్షాల్లో ఇది చివరి రోజు కాబట్టి ఈరోజున నువ్వులు , కుశ గడ్డి కలిపిన నీటితో పితృ దేవతలకు పిండాలను చేసి తర్పణం , శ్రాద్ధం నిర్వహిస్తారు.


ఈ పిండాలను కాకులు వచ్చి తింటే తమ పూర్వీకుల నుంచి అనుగ్రహం లభించినట్టేనని నమ్ముతారు.


అంతేకాదు మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే.. ఎవరైతే చనిపోయిన వ్యక్తులుంటారో.. 


వారు ఏ తిథిలో మరణించారో తెలియకపోతే వారు మరణించిన ఏడాదిలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు మహాలయ అమావాస్య రోజున వారికి శ్రాద్ధం నిర్వహిస్తే 


వారి నుంచి ఆశీస్సులు పొందుతారని పండితులు చెబుతారు.​మహాభారతంలోనూ ఈ అమావాస్య ప్రస్తావన..


మహాభారతంలోనూ మహాలయ అమావాస్య గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రకారం , కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లే సమయంలో దారిలో తనకు దాహం వేస్తుంది.


అప్పుడు తను ఓ నది దగ్గరకు వెళ్తాడు. అక్కడ నీటిని తాగేందుకు ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది. 


ఆ తర్వాత కర్ణుడికి ఆకలి వేస్తుంది. అప్పుడు ఒకచోట మామిడి చెట్టు కనిపిస్తుంది. పండ్లను చూసి సంతోషపడ్డ కర్ణుడు వాటిని కోసేందుకు వెళ్లగా అవి కూడా బంగారంగా మారిపోతాయి.


సూర్య దేవుని ప్రార్థన


ఈ విచిత్ర సంఘటనలను చూసి తన తండ్రి అయిన సూర్య భగవానుడిని ప్రార్థిస్తాడు. తన సమస్యకు పరిష్కారం చూపమని కోరతాడు.


అప్పుడు సూర్యుడు కర్ణుడితో ఇలా అంటాడు. ‘నీవు భూలోకంలో ఎన్నో దానాలు చేశావు. అయితే ఏరోజు పితృ దేవతలకు అన్నదానం , శ్రాద్ధ కర్మలు నిర్వహించలేదు. 


అందుకే ఇప్పుడీ పరిస్థితులు ఏర్పడ్డాయని’ సూర్యుడు వివరిస్తాడు. అప్పుడు పితృదేవతలకు , శ్రాద్ధ కర్మలు చేసే అవకాశం కల్పించాలని కోరతాడు.


ఇంద్రుని సహాయంతో


అప్పుడు కర్ణుడు ఇంద్రుని సహాయంతో భూలోకానికి వచ్చి పితృ దేవతలందరికీ తర్పణాలు , శ్రాద్ధ కర్మలు , అన్నదానం నిర్వహించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్లాడు.


ఆనాటి నుంచి పురాణాల ప్రకారం ఎవరైనా పితృ రుణాలను తీర్చుకోవాలి. అప్పుడే మీకు రెట్టింపు శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు...

భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య, ఆశ్వయుజ అమావాస్యలు చెప్పుకోదగినవి.


భాద్రపద అమావాస్యను ‘‘మహాలయ అమావాస్య’’ అని, ఆశ్వయుజ అమావాస్యని, దీపావళి అమావాస్య అని పిలుస్తారు. ఈ రెండు అమావాస్యలు పితృదేవతలకు సంబంధించినవి.


‘‘ఆషాఢీ మవధిం కృత్వా పంచమం పక్షమ్మాతాః కాంక్షంతి పితరః క్లిష్టా అన్నమప్యన్వహం జలమ్’’


ఆషాడ పూర్ణిమ మొదలు అయిదవ పక్షమును అనగా ఆషాఢ కృష్ణపక్షం, శ్రావణ రెండు పక్షములు, భాద్రపద శుక్లపక్షం, వెరశి నాలుగు పక్షములు (పక్షం అంటే పదిహేను రోజులు) గడిచిన తరువాత వచ్చేది,అయిదవ పక్షం, అదే భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షము’’లంటారు. చివరగా వచ్చే అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అంటారు. 


ఈ పక్షములో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున, మహాలయ పక్షములలో పితృతర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే,


పితృదేవతలంతా సంవత్సర మంతా తృప్తి చెందుతారు, తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని పొందుతారు. 


ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు, నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము, కృష్ణపక్షం పితృపదము, అదే మహాలయ పక్షము.


మహాలయమంటే :-


మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట, అని అర్థములు.


అమావాస్య అంతరార్థం:-


‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు.


సూర్యుడు – స్వయం చైతన్యం. చంద్రుడు జీవుడే. మనస్సుకు అధిపతి. అదే చంద్రుని ఉపాధి. మనస్సు పరమ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది. 


అదే నిజమైన అమావాస్య. చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు, అమావాస్య తిధి మిట్ట మధ్యాహ్నమవుతుంది.


అందుకే భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.


మత్స్యపురాణగాథ :


పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వారి మానవ పుత్రిక ‘‘అచ్ఛోద’’. పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు.


ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు. 

ఆ అచ్ఛోద, సరస్సు తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారు. వరము కోరుకోమన్నారు. 


ఆమె వారిలో  ‘‘మావసు’’ డను పితరుని కామ పరవశంతో వరునిగా కోరింది. యోగభష్ట్రురాలయింది.


దేవత్వంపోయి, భూమి మీద కొచ్చింది.  మావసుడు,  అచ్చోదను కామించలేదు. కనుక అచ్ఛోద ‘‘మావస్య’’  అనగా ప్రియురాలు అధీనురాలు కాలేకపోయింది. కనుక. ‘‘మావస్య’’  కాని ఆమె  ‘‘అమావస్య’ కానీ ‘‘అమావాస్య’’ అయింది. తన తపస్సుచే పితరులను తృప్తినొందించిన అమావాస్య అనగా అచ్ఛోద, పితరులకు ప్రీతిపాత్రమయింది. 

అందువలన, పితృదేవతలకు అమావాస్య (అచ్ఛోద) తిథి యందు పితులకు అర్పించిన తర్పణాది క్రియలు, అనంత ఫలప్రదము,


ముఖ్యంగా సంతానమునకు క్షేమము, అభివృద్ధికరము. తప్పును తెలిసికొన్న అచ్ఛోది మరల తపోదీక్ష వహించింది.  జననీ జనకులను ప్రేమానురాగాలను అందించి,


మరణానంతరం కూడా వారికోసం యథావిధిగా నైమిత్తిక కర్మల నాచరించి, పితృతర్పణాదులనిస్తే, వారి ఋణం తీర్చుకున్న వాళ్లవుతారని, పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తోంది మహాలయ అమావాస్య...స్వస్తీ...

ఈ వారం రాశి ఫలాలు..

                   ఈ వారం రాశి ఫలాలు.. 

 పాతబాకీలు వసూలు అవుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూ వ్యవహారాలు లాభిస్తాయి. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. శివాలయాన్ని సందర్శించండి. 

మేషం

ఆస్తుల పంపకాలు పరిష్కారం అవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూ వ్యవహారాలు లాభిస్తాయి. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. శివాలయాన్ని సందర్శించండి.

వృషభం

పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రామరక్షాస్తోత్రం పఠించండి.

మిథునం

అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అదృష్టం కలిసివస్తుంది. చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం

స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలను పొందుతారు. బంధుమిత్రుల వల్ల కార్యసిద్ధి ఉంది. ఖర్చులు పెరగవచ్చు. నలుగురికీ సాయం అందిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వారం. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

సింహం

కొత్త వ్యాపారం మొదలుపెట్టడంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాయం అందిస్తారు. దీర్ఘకాలిక పనుల విషయంలో ఆటంకాలు రావచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. విహారయాత్రలకు వెళ్తారు. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య

ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. భూ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడవచ్చు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సద్వినియోగం చేసుకుంటే ఈ వారం అన్ని విధాలుగా లాభాన్ని పొందుతారు. పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.

తుల

దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణ బాధలు పెరగవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఓపికతో పనులను పూర్తిచేసుకోవడం మంచిది. స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. లక్ష్మీధ్యానం మేలు చేస్తుంది.

వృశ్చికం

భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఆర్థికపరమైన చికాకులు ఎదురుకావచ్చు. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

వివాదాలకు దూరంగా ఉంటారు. న్యాయ సమస్యలు తీరుతాయి. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. అలసట లేకుండా పనులు చేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అప్పగించిన బాధ్యతలను సంయమనంతో నిర్వర్తిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృథా ఖర్చులు ఉంటాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ కాలం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివారాధన మేలు చేస్తుంది.

మకరం

ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. రోజువారీ వ్యాపారం కలిసివస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. భూ వ్యవహారంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఓపిక అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ప్రయాణాల విషయంలో ఏమరుపాటు తగదు. పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందివచ్చిన అవకాశాలు చేజారకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. సహోద్యోగులను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేయండి. వారం ద్వితీయార్ధంలో పరిస్థితిలో మార్పు వస్తుంది. బంధుమిత్రుల సహాయంతో కార్యసాఫల్యం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రామాలయాన్ని సందర్శించండి.

మీనం

బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సొంత ఆలోచనతో వ్యాపారం చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సాహిత్య సభలకు హాజరవుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వృథా ఖర్చులు ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. హనుమాన్‌ చాలీసా పఠించండి.

Friday, 19 September 2025

విద్యార్థులకు SBI వరాలు.. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.20 లక్షలు.. మళ్లీ కట్టక్కర్లే.. అప్లై చేసుకోండి

 విద్యార్థులకు SBI వరాలు.. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.20 లక్షలు.. మళ్లీ కట్టక్కర్లే.. అప్లై చేసుకోండి

SBI Foundation: పేద విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరాలు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్ షిప్ ఇస్తామని తెలిపింది. ఈ 2025కి సంబంధించిన స్కాలర్‌షిప్ ప్రకటన చేసింది. ఇందుకోసం రూ.90 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఎస్‌బీఐ ఫౌండేషన్ ద్వారా ఈ ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

                 : పేద విద్యార్థులకు ఎస్‌బీఐ ఫౌండేషన్ అదిరే శుభవార్త చెప్పింది. చదువుల్లో విశేష ప్రతిభ కనబరిచే పేద విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ (Platinum Jubilee Asha Scholarship 2025) ప్రకటించింది. ఈ ఏడాది 2025కి సంబంధించిన స్కాలర్‌షిప్ పై ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 23,230 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తామని తెలిపింది. ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు అందించనుంది. విద్యార్థుల విద్యార్హతను బట్టి ఈ స్కాలర్‌షిప్ రేంజ్ ఉంటుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 23,230 ప్రతిభావంతులైన స్టూడెంట్స్‌ను ఎంపిక చేసి ఈ స్కాలర్‌షిప్ అందించనున్నారు. విద్యార్థుల చదువులకు బాసటగా నిలవడం ద్వారా భావి భారత నిర్మాతలను తీర్చిదిద్దనున్నట్లు ఎస్‌బీఐ ఫౌండేషన్ పేర్కొంది. పేద విద్యార్థులకు అండగా నిలిచే ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో స్కాలర్ షిప్ కోసం రూ. 90 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. గొప్ప ఆశయంతో ఈ ఆశా స్కాలర్‌షిప్‌ను 2022లో ప్రారంభించినట్లు ఎస్‌బీఐ ఫౌండేషన్ తెలిపింది. ఈ కార్యక్రమంపై ఎస్‌బీఐ ఛైర్మన్ సీ. శ్రీనివాసులు శెట్టి మాట్లాడారు. 'ఈ సంవత్సరం ఎస్‌బీఐ ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు జరుపుకోనుంది. ఈ క్రమంలో అదే పేరుతోనే స్కాలర్ షిప్ ప్రారంభించడం గర్వకారణం. 23,230 మంది పేద విద్యార్థులకు మేలు కలగనుంది. ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆకాంక్ష నెరవేరనుంది.' అని అన్నారు.

          9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పేద విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ఇస్తారు. ఎంపిక చేసుకున్న కోర్స్ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.15 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. అర్హులైన విద్యార్థులు నవంబర్ 15వ తేదీ లోపు www.sbiashascholarship.co.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, మెడికల్ విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్స్ సహా ఓవర్సీస్ విద్యార్థులూ అప్లై చేసుకోవచ్చు.




కోర్సు, వారి అధ్యయన స్థాయి ప్రకారం రూ.15 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఇస్తారు. ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. అయితే కనీస అర్హత సాధించాల్సి ఉంటుంది. స్కాలర్ షిప్ రావాలంటే గత ఏడాదిలో 75 శాతం మార్కులు లేదా 7 సీజీపీఏ సాధించాలి. కుటుంబ ఏడాది ఆదాయం స్కూల్ విద్యార్థులకు రూ.3 లక్షలు, ఇతర కేటగిరీలకు రూ.6 లక్షలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10 శాతం సడలింపు ఉంటుంది.

Thursday, 18 September 2025

భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ గారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

 యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ అంతర్జాతీయ స్కాలర్‌షిప్ విషయంలో కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తికి బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ గారు సూత్రప్రాయంగా ఆంగీకరించారు. 


❇️ భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ గారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.


వారితో పాటు డిప్యూటీ హైకమిషనర్ (హైదరాబాద్) గారెత్ విన్ ఓవెన్ గారు, పొలిటికల్ ఎకానమీ సలహాదారు నళిని రఘురామన్ గారు కూడా ఉన్నారు.


❇️ యూకే ప్రభుత్వం అంతర్జాతీయ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా అందిస్తున్న చెవెనింగ్ స్కాలర్‌షిప్ లను కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణకు చెందిన మెరిట్ విద్యార్థులకు అందించడానికి ఈ సందర్భంగా అంగీకరించారు. విద్య, సాంకేతిక సంబంధిత రంగాల్లో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి గారికి వివరించారు.


❇️ యూకేలోని యూనివర్సిటీల్లో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం అక్కడి వర్సిటీలు అడ్మిషన్లు, ఇతరత్రా కార్యక్రమాలను హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి గారు కోరారు. తెలంగాణలో కొత్తగా తీసుకురానున్న ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా గురించి ముఖ్యమంత్రి గారు బ్రిటిష్ హైకమిషనర్ గారికి వివరించారు.  


❇️ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ అందించడానికి లిండీ కామెరాన్ గారు సుముఖత వ్యక్తం చేశారు.  


❇️ అలాగే, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలని, ప్రధానంగా జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ సెంటర్లు, వివిధ అకాడమీలకు సంబంధిత రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి పట్ల బ్రిటిషన్ హైకమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tuesday, 16 September 2025

రెవెన్యూ, అట‌వీ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి:రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

 తిరుమ‌ల‌గిరి మండ‌లంలో కొత్త‌గా 4వేల మందికి భూప‌ట్టాలుస‌ర్వేలో 3వేల మంది  అన‌ర్హులు గుర్తింపు మాన‌వీయ కోణంలో  భూ స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం చూపాలి రెవెన్యూ, అట‌వీ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి


రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్ :-  పేద ప్రజలు ద‌శాబ్దాల కాలంగా  సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో  మానవీయ కోణంలో ఆలోచన చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌కు సూచించారు.డాక్ట‌ర్ బి. ఆర్‌, అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారంనాడు  న‌ల్గొండ జిల్లా  నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ స‌మ‌స్య‌ల‌పై  అట‌వీ శాఖ మంత్రివ‌ర్యులు శ్రీ‌మ‌తి కొండా సురేఖతో క‌లిసి మంత్రిగారు స‌మావేశం నిర్వ‌హించారు.

ACB Raids | మణికొండలో విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేద్కర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు..

 ACB Raids | మణికొండలో విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేద్కర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు..

                ఇంట్లో రూ.2 కోట్ల నగదు.. ఇవన్నీ ఎలా వచ్చాయో ఏంటో

..?

       Telangana ACB trap case: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చర్యలు వేగం అందుకున్నాయి. లంచం తీసుకున్నా, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినా వెంటనే ఏసీబీ ప్రత్యక్షం అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్‌పై సోదాల్లో బంధువుల ఇళ్లలో కోట్ల రూపాయల నగదు, ఖరీదైన భవనాలు, ప్లాట్లు వెలుగుచూశాయి. ఈ పరిణామం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన రేపింది. ఎప్పుడైనా ఏసీబీ తలుపు తడతుందేమో అన్న భయం వారిని వెంటాడుతోంది.

ACB Telangana

తెలంగాణలో ఏసీబీ దూకుడు(ఫోటోలు- Samayam Telugu)

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ACB) ఇటీవల ముమ్మర దాడులు చేస్తోంది. ఎక్కడ లంచం డిమాండ్ లేదా అక్రమ ఆస్తుల సమాచారం వచ్చినా.. ఒక ఫోన్ కాల్ చేస్తే.. అక్కడే అధికారులు ప్రత్యక్షమవుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగంలో భయభ్రాంతులు నెలకున్నాయి. తాజాగా విద్యుత్‌ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేడ్కర్ కూడా ఈ కేసులో భాగం అయ్యారు. అంబేడ్కర్‌పై ఆరోపణలు చిన్నవి కావు. ఆయన నివాసం, కుటుంబ సభ్యుల ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు మంగళవారం తెల్లవారుజామునే సోదాలు ప్రారంభించాయి.


హైదారబాద్ లోని ఇబ్రహీంబాగ్‌లో పనిచేస్తున్న ఈ అధికారి దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉండటమే కాకుండా.. ఆయన బంధువుల ఇంట్లో రూ.2 కోట్లు నగదు గుర్తించారు అధికారులు. అంతేకాక, మూడు ప్లాట్లు.. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం కూడా ఏసీబీ దృష్టికి వచ్చాయి. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించిన వివరాలు చూస్తే.. ఆయన అవినీతి చిట్టా ఎంత విస్తృతమైందో అర్థమవుతుంది.

ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే ఏసీబీ 179 కేసులు నమోదు చేసింది. వీటిలో 167 మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ అవినీతి ఆరోపణలతో చిక్కుకున్నారు. ట్రాప్ కేసులు, క్రిమినల్ మిస్‌కండక్ట్, రహస్య దర్యాప్తులు ఇలా విభిన్న రకాలుగా ఈ కేసులు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు ఆగస్టు నెలలోనే 31 కేసులు వెలుగుచూశాయి. అందులో 22 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు.

లంచం రూపంలో పట్టుబడిన మొత్తం రూ.2.82 లక్షలు కాగా.. ఇతర కేసుల్లో రూ.5.13 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. జనవరి నుంచి జూన్ 2025 వరకు 126 కేసులు నమోదు కాగా.. అందులో 125 ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అయ్యారు. కొందరి వద్ద కోట్ల రూపాయల ఆస్తులు బయటపడటం, ఈ వ్యవస్థ ఎంత లోతుగా కూరుకుపోయిందో చెప్పవచ్చు.

          ఈ చర్యలు అవినీతి చేసే అధికారులకు ఒక్క హెచ్చరిక మాత్రమే కాదు.. ఒక సంకేతం కూడా. లంచం తీసుకున్నప్పుడు “చాలా చిన్న విషయం” అని భావించే వారు ఇప్పుడు “ఎప్పుడైనా ఏసీబీ తలుపు తడుతుంది” అనే భయంతో వణికిపోతున్నారు. ఒకసారి దొరికిన తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

Friday, 12 September 2025

తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది...

 తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది...


పోలీసులు ఇకపైన కొరడా జులిపించడానికి ఎటువంటి ఆస్కారం లేదని చెప్పి కింద మార్గదర్శకాలను జారీ చేసింది.


పోలీస్ అధికారులు పాటించవలసిన మార్గదర్శకాలు..


సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ ప్రసంగాలు, లేదా వ్యక్తిగత పరువు నష్టం (Defamation) వంటి అంశాలపై FIR నమోదు చేయుటకు సంబంధించి క్రింది మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించవలెను:


1. లొకస్ స్టాండీ పరిశీలన

పరువు నష్టం వంటి ఫిర్యాదుల విషయంలో FIR నమోదు చేయకముందు, ఫిర్యాదు చేసిన వ్యక్తి “అగ్రీవ్డ్ పర్సన్” (నేరుగా నష్టం పొందిన వ్యక్తి) అవుతాడో లేదో పోలీసులు నిర్ధారించాలి. సంబంధం లేని మూడో వ్యక్తుల ఫిర్యాదులు నిలబెట్టుకోలేవు. కానీ, కాగ్నిజబుల్ నేరం (గుర్తింపు పొందిన నేరం) అయితే మాత్రం మినహాయింపు ఉంటుంది.


2. ప్రాథమిక విచారణ

ఫిర్యాదు కాగ్నిజబుల్ నేరాన్ని సూచిస్తే, వెంటనే FIR నమోదు చేయకుండా ముందుగా ఒక ప్రాథమిక విచారణ చేసి, ఆ నేరానికి సంబంధించిన చట్టపరమైన అవసరమైన అంశాలు (ingredients) ఉన్నాయో లేదో నిర్ధారించాలి.


3. ప్రసంగం/మీడియా పోస్టులపై కఠిన ప్రమాణం

శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, ఉద్దేశపూర్వక అవమానం, ప్రజా శాంతిభంగం, లేదా తిరుగుబాటు (sedition) ఆరోపణలపై FIR నమోదు చేయాలంటే, హింసకు ప్రేరేపించే లేదా ద్వేషం, శాంతిభంగాన్ని కలిగించే పదార్థం ఉన్నదనే ప్రాథమిక ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. (Kedar Nath Singh v. State of Bihar, 1962 మరియు Shreya Singhal v. Union of India, 2015 తీర్పులను అనుసరించాలి).


4. రాజకీయ ప్రసంగ రక్షణ కఠినమైనా, విమర్శాత్మకమైనా, లేదా అవమానకరమైనా రాజకీయ ప్రసంగం మాత్రమే ఉంటే FIR నమోదు చేయరాదు. హింసకు ప్రేరేపిస్తే లేదా ప్రజా శాంతికి తక్షణ ముప్పు కలిగిస్తే తప్ప క్రిమినల్ చట్టం వర్తించదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) క్రింద ఉన్న స్వేచ్ఛా భావ ప్రకటన హక్కు కాపాడబడాలి.


5. పరువు నష్టం నాన్-కాగ్నిజబుల్ నేరం

Defamation (పరువు నష్టం) నేరం నాన్-కాగ్నిజబుల్ కిందకి వస్తుంది. కాబట్టి పోలీసులు నేరుగా FIR నమోదు చేయరాదు. ఫిర్యాదుదారు సంబంధిత మేజిస్ట్రేట్‌ వద్ద ఫిర్యాదు చేయాలి. మేజిస్ట్రేట్‌ సెక్షన్ 174(2), BNSS ప్రకారం ఆదేశం ఇచ్చిన తర్వాతే పోలీసులు చర్యలు చేపట్టాలి.


6. అరెస్ట్ మార్గదర్శకాలు

అన్ని కేసుల్లోనూ పోలీసులు Arnesh Kumar v. State of Bihar (2014) తీర్పులో పేర్కొన్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. యాంత్రికంగా అరెస్టులు చేయరాదు. క్రిమినల్ ప్రక్రియలో సామాన్య ప్రమాణం (proportionality) పాటించాలి.


7. సున్నితమైన కేసుల్లో లీగల్ అభిప్రాయం

రాజకీయ ప్రసంగం/సోషల్ మీడియా పోస్టుల వంటి సున్నితమైన కేసుల్లో FIR నమోదు చేయకముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి.


8. అసత్య/ప్రేరేపిత ఫిర్యాదులు ఫిర్యాదు అసత్యమైనది, దురుద్దేశపూర్వకమైనది, లేదా రాజకీయ ప్రేరేపితమైనది అని తేలితే, పోలీసులు BNSS సెక్షన్ 176(1) ప్రకారం “తగిన ఆధారాలు లేవు” అని పేర్కొని మూసివేయాలి.

Wednesday, 10 September 2025

హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణ, రోడ్డు భద్రతా చర్యలు అభినందనీయం– జిహెచ్ఎంసీకి సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్ ప్రశంస

 హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణ, రోడ్డు భద్రతా చర్యలు అభినందనీయం– జిహెచ్ఎంసీకి సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్ ప్రశంస



హైదరాబాద్‌,




:  హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణ, రోడ్డు భద్రతా చర్యలు అభినందనీయమని  జిహెచ్ఎంసీని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ (SCCoRS) ఛైర్మన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ప్రశంసించారు.


రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా చర్యల అమలులో కార్పొరేషన్ చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.


బుధవారం నగరంలోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్‌లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ (SCCoRS) ఛైర్మన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే  అధ్యక్షతన జరిగింది.


ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ డా. జితేందర్,  పురపాలక కార్యదర్శి ఇలంబరితి, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌.వి. కర్ణన్‌తో పాటు పోలీసు, రెవెన్యూ, హెచ్‌ఎండి‌ఏ, రవాణా శాఖ, ఆర్‌అండ్‌బీ, ట్రాఫిక్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.


“ఇతరుల ప్రాణాలను మనం కాపాడితే, భగవంతుడు మన ప్రాణాలను కాపాడతాడు”  అనే  భగవద్గీత లోని ఓ వాక్యాన్ని సమావేశంలో చైర్మన్ ప్రస్తావించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ఎవ్వరూ చనిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.



సమావేశంలో పలు శాఖలు రోడ్డు భద్రతా చర్యలపై తమ శాఖ తీసుకున్న చర్యలను వివరించారు.


గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చేపట్టిన రోడ్డు భద్రతా కార్యక్రమాలను జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌.వి.కర్ణన్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చైర్మన్ కు  వివరించారు.



రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు, ప్రయాణికులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు నగరంలో 1,687.76 కి.మీ రోడ్లపై లేన్ మార్కింగ్, 3,949 జీబ్రా క్రాసింగ్స్, 3,453  ప్రదేశాల్లో అడ్డ బార్ గుర్తులు, 3,335 సైన్‌బోర్డులు ఏర్పాటు చేశామనీ కమిషనర్ తెలిపారు. ప్రధాన రోడ్లలో ప్రతి సంవత్సరానికి ఒకసారి లేని మార్కింగ్ చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.




పాదచారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. నగరంలో 212.71 కి.మీ మేర కొత్తగా ఫుట్‌పాత్‌లు వేయడం, మరమ్మత్తులు చేపట్టామన్నారు. 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 15 పూర్తి చేశామన్నారు. 50 కూడళ్ల అభివృద్ధి పనులు ఇప్పటి వరకూ  పూర్తి చేశామన్నారు.


నగరవ్యాప్తంగా 92 బ్లాక్ స్పాట్లను గుర్తించి ఇప్పటికే  75 బ్లాక్ స్పాట్ లలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టమన్నారు.


రోడ్డు భద్రతా డ్రైవ్ లో భాగంగా జూలై 2025 నుంచి ఇప్పటివరకు 1,442 గుంతలు పూడ్చివేసి, 574 క్యాచ్‌పిట్ మరమ్మతులు, 328 క్యాచ్‌పిట్ కవర్లు మార్చడం, 12 సెంట్రల్ మీడియన్ పనులు పూర్తిచేశామన్నారు.


గత, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరాల్లో రోడ్డు నెట్వర్క్  బలోపేతం పై దృష్టి పెట్టామని కమిషనర్ చెప్పారు అబిడ్స్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, టోలిచౌకీ ఫ్లైఓవర్, సనత్‌నగర్, మాధాపూర్, సికింద్రాబాద్, సైదాబాద్ ప్రాంతాల్లో తారు , సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని కమిషనర్ ఆర్ వి కర్ణన్ చైర్మన్ కు నివేదించారు.


కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం  ఛైర్మన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, జిహెచ్ఎంసీ రోడ్డు భద్రతా చర్యలను అభినందిస్తూ, ప్రమాదాల నివారణలో అన్ని శాఖలూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై మంత్రి పొంగులేటి స‌మీక్ష‌..*

 

*జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై మంత్రి పొంగులేటి స‌మీక్ష‌..*


నిజ‌మైన జ‌ర్న‌లిస్టుల‌కు మేలు జ‌రిగేలా నిర్ణ‌యాలు ఉండాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌కు సూచించారు. బుధ‌వారం నాడు డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్ కె.శ్రీ‌నివాస‌రెడ్డి, ఐ&పిఆర్ స్పెషల్ క‌మీష‌న‌ర్ సిహెచ్‌. ప్రియాంక‌, సీపీఆర్‌వో జి. మ‌ల్సూర్‌తో క‌లిసి సమీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా అక్రిడిటేష‌న్ పాల‌సీ, జ‌ర్న‌లిస్ట్‌ల హెల్త్ పాల‌సీ, జ‌ర్న‌లిస్టుల అవార్డులు, జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌కు సంబంధించి హైప‌వ‌ర్ క‌మిటీ త‌దిత‌ర అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.  ఈ అంశాల‌పై కార్మిక‌, ఆరోగ్య‌, హోం, ఆర్ధిక‌శాఖ అధికారుల‌తో త్వ‌ర‌లో మ‌రోసారి స‌మావేశం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

Tuesday, 9 September 2025

ACB ఏసీబీ దాడులు: టౌన్ ప్లానింగ్ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 నార్సింగి మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు: టౌన్ ప్లానింగ్ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


నార్సింగి మున్సిపల్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడి చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది.

హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ACB) నర్సింగి మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం, ముంచిరేవుల నివాసి వినోద్ తన ప్లాట్ యొక్క LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) క్లియర్ చేయడానికి ఆమె ₹10 లక్షలు లంచం డిమాండ్ చేసింది.


ఈరోజు లంచం యొక్క మొదటి విడతగా మణిహారిక ₹4 లక్షలు స్వీకరించిందని, ఆ సమయంలో ACB బృందం వేగంగా చర్య తీసుకుని ఆమెను అరెస్టు చేసిందని వర్గాలు తెలిపాయి.


Monday, 8 September 2025

దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..

    

 దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు దసరా సెలవులను ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అదే విధంగా జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది.

            కాగా, తెలంగాణలో దసరా పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. దేవీ నవరాత్రుల కోసం హైదరాబాద్ నగరంలోని పలు వీధుల్లో అమ్మవారి విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తారు. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. బతుకమ్మ ఆట,పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక, ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. ప్రాంతాలను బట్టి పండుగ జరుపుకునే తేదీలో తేడా ఉంటుంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాను విడుదల



              రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాను





,  మండల ప్రజా పరిషత్తు కార్యాలయాలు, జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయాలలో ప్రచురించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

        ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా,  ఓటరు  జాబితాలను ఈనెల 6న ప్రచురించిన నేపథ్యంలో సోమవారం అయన తన చాంబర్ లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.


         ముసాయిదా  జాబితా ప్రకారం నల్గొండ జిల్లాలో మొత్తం 33 మండలాలకు 33 జెడ్పిటిసిలు,33 ఎంపీపీలు ఉన్నాయని, 353 ఎంపీటీసీలు ఉన్నాయని, మొత్తం 1956 పోలింగ్ కేంద్రాలు ఉండగా, పది లక్షల 73,506 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాల పై ఈ నెల 6 నుండి 8 వరకు  అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, ఈ నెల 9 న అభ్యంతరాల పరిష్కారం , 10 న తుది ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాల జాబితాను మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ లలో  ప్రచురించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కోరారు. ఓటరు జాబితాలో మార్పు చేర్పులు చేసే అధికారం తమకు లేదని ,సంబంధిత ఆర్డీవోలు ఈఆర్వోల ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు.


          సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ 353 ఎంపీటీసీలకు సంబంధించి పూర్తి వివరాలను ముందుగానే తమకు ఇవ్వాలని, ఏ బూతు ఏ గ్రామంలోకి వస్తుందో జాబితా ఇవ్వాలని,  ముసాయిదా ఓటరు జాబితా సైతం రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరారు.


              కాగా ఈ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి గుమ్మల మోహన్ రెడ్డి, బిజెపి నుండి లింగస్వామి ,పి మోహన్ రెడ్డి, ఎం వెంకటేశం, బిఆర్ఎస్ నుండి పిచ్చయ్య ,ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎస్ కే ఆర్ అన్సారి ,ఏ. రవీందర్, బీఎస్పీ నుండి భీమ్ ప్రసాద్, కిరణ్, టిడిపి నుండి మల్లికార్జున్, రఫీ, సిపిఐ నుండి శ్రవణ్ కుమార్, సిపిఐఎం నుండి పీ. నర్సిరెడ్డి,డి ఎస్ పి నుండి డి.వంశీ,రాంబాబు, తదితరులు ,ఉన్నారు .

_______________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Sunday, 7 September 2025

దక్షిణాఫ్రికాకు నీరందిస్తున్న నల్గొండ గ్రామం..ఇంట్రెస్టింగ్!

 దక్షిణాఫ్రికాకు నీరందిస్తున్న నల్గొండ గ్రామం..ఇంట్రెస్టింగ్!


తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామం దక్షిణాఫ్రికాకు నీరు అందిస్తుంది అంటే ఈ విషయం విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతారు. అయితే ఇది నిజంగానే నిజం.. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చుండూరు మండలం ఇటికూడ దక్షిణాఫ్రికా రాష్ట్రంలో ప్రజలకు నీరు అందిస్తుంది. అదెలా అంటే..


దక్షిణాఫ్రికాలో నల్గొండ బోర్ వెల్స్

దక్షిణాఫ్రికా దేశంలో బోర్ వెల్ మిషన్స్ ఉండవు. దక్షిణాఫ్రికా రాష్ట్రంలో బోర్ వెల్ మిషన్స్ అన్ని మన దేశానికి చెందినవే ఉంటాయి. దక్షిణాఫ్రికా దేశంలో నల్గొండకు చెందిన చాలా బోర్ వెల్ వెహికల్స్ నడుస్తున్నాయి. ఈ బోర్వెల్స్ అక్కడ బోర్లు వేయడానికి, ప్రజలకు నీరు అందించడానికి పనిచేస్తున్నాయి. ఈ వెహికల్స్ కు 365 రోజులు పని ఉంటుంది.

ఇటికూడా గ్రామ స్పెషాలిటీ ఇదే

ఇక నల్గొండ జిల్లాలోని ఇటికూడా గ్రామానికి వెళితే ఇక్కడ వీధికో ఒక బోర్ వెల్ వెహికల్ కచ్చితంగా కనిపిస్తుంది. ఈ గ్రామంలో 40 వీధులు లేవు కానీ గ్రామస్తులకు మాత్రం 40 బోర్ వేసే వెహికల్స్ ఉన్నాయి. అవి తెలుగు రాష్ట్రాలతో పాటు, పక్కనే ఉన్న రాష్ట్రాలలో కూడా బోర్లు వేస్తాయి. ఈ ప్రాంతం నుండే దక్షిణాఫ్రికా రాష్ట్రానికి కూడా చాలా బోర్ వెల్ వెహికల్స్ ని పంపించి అక్కడ బోర్లు వేస్తున్నారు.

ప్రతీ ఇంట్లోన బోర్ వెల్ ఆపరేటర్లు, డ్రైవర్లు

ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఈ వాహనాల ఆపరేటర్లుగా, డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఈ గ్రామంలో మొత్తం 300కు పైగా ఇళ్ళు ఉంటే ఎక్కువమంది ఈ బోర్ వెల్స్ పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.ఈ గ్రామస్తులకు చెందిన మరో ఎనిమిది వాహనాలు దక్షిణాఫ్రికాలో బోర్లు వేసే పనిలో ఉన్నాయి. వాటి యజమానులు పనిచేసే వర్కర్లు కూడా నల్గొండ నుంచి అక్కడకు వెళ్లిన వారే.

దక్షిణాఫ్రికాకు నీటి అవసరాలు తీరుస్తున్న మనోళ్ళు

మొత్తం 15 మంది డ్రైవర్లు, ఆపరేటర్లు అక్కడే ఉండి పనిచేస్తున్నారు. అక్కడి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి, కాపర్ మైనింగ్ లోను బోర్లు ఎక్కువగా వేస్తుంటారు. డీజిల్ ధరలు, లేబర్ ఖర్చు అక్కడ తక్కువగా ఉండటం వల్ల నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ మంది అక్కడకు బోర్ వెహికల్స్ తీసుకుని వెళ్లి ఉపాధిని పొందుతున్నారు. ఈ విధంగా వీరు దక్షిణాఫ్రికాకు నీటిని అందిస్తున్నారు. వాళ్ల నీళ్ల అవసరాలు తీరుస్తున్నారు.

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ కీలక భేటీ..

 రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ కీలక భేటీ..

 రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్, చైనా పర్యటనల అనంతరం జరుగుతున్న భేటీ కావడంతో విదేశీ పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలు, భారత్ పై సుంకాలు విధింపు.. తదితర అంశాలనూ ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా వరదలు.. ముఖ్యంగా పంజాబ్ లో ఆకస్మిక వరదలపైనా ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ చర్చించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. సెప్టెంబర్ 6 సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో జపాన్, చైనా పర్యటన తర్వాత రాష్ట్రపతి, ప్రధాని మోదీ మధ్య జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీ ప్రత్యేకతను సంతరించుకుంది. చైనాలోని తియాంజిన్ వేదికగా జరిగిన SCO సమావేశంలో ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ లతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇరు దేశాలతో పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ చర్చించారు.

           అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. అనంతరం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అధ్యక్షుడు మాక్రాన్‌ ‌తో వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో పురోగతిపై సమీక్ష జరిపామని తెలిపారు. ఉక్రెయిన్‌ లో వివాదాన్ని త్వరగా ముగించే ప్రయత్నాలు సహా అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నామని వివరించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో భారత్- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందని ప్రధాని మోదీ 

Saturday, 6 September 2025

మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు



*మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు


*


*నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా* 


*బిజెపి-బీఆర్ఎస్ నాయకులవి దిగజారుడు రాజకీయాలు*


*గన్ మెన్ల కోసం వారి తాపత్రయం*


*చిల్లర రాజకీయాలు మానుకోవాలి*


*తప్పుడు ఆరోపణలు, విమర్శనలు చేస్తే చూస్తూ ఊరుకోం*


 *పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి* 


**************************************************


 *నల్లగొండ*: నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలేక బిజెపి-బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి విమర్శించారు.

 శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నల్లగొండ పట్టణంలోని 1 నెంబర్ వినాయక విగ్రహం వద్ద గణేష్ నిమజ్జనం రోజు బిజెపి జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 వారిద్దరి దిగజారుడు రాజకీయాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

 మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉత్సవ కమిటీ ఆహ్వానంతో నిమజ్జనం రోజు ఒకటో నెంబర్ విగ్రహం వద్దకు రావడం జరిగిందని అన్నారు.

 మంత్రి మాట్లాడుతుండగా 

 తనను పైకి పిలవలేదని అక్కసుతో బిజెపి జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఘర్షణ వాతావరణం సృష్టించాడని ఆరోపించారు.

 మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.150 కోట్లతో లతీఫ్ షాప్ గుట్ట, బ్రహ్మంగారి ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పడం జరిగిందని తెలిపారు.

 ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పాడు తప్ప కాంగ్రెస్ చేస్తుందని చెప్పి రాజకీయాలు చేయలేదన్నారు.

 బిజెపి జిల్లా అధ్యక్షుడికి కనీస రాజకీయ అవగాహన లేదని ధ్వజమెత్తారు.

 ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుంటే బిజెపి జిల్లా అధ్యక్షుడు ఇది జీర్ణించుకోలేక పోయాడని అన్నారు.

 ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నించగా పోలీసులు అతన్ని అక్కడి నుంచి తరలించారని అన్నారు.

 అనంతరం అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించాడని విమర్శించారు.


 బిజెపి జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎమ్మెల్యే గన్మెన్ల కోసం పాకులాడుతున్నారని అన్నారు.

 కాంగ్రెస్ నాయకులతో దాడులు చేయించుకుని గన్ మెన్ లు పెట్టుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

 గన్ మెన్ల కోసం

  ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్న వీరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.


 మేము దేవుని దగ్గర ఎన్నడూ రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు.

 మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 25 సంవత్సరాలుగా అభివృద్దే ధ్యేయంగా, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడని అన్నారు.

 వ్యక్తిగతంగా, పరోక్షంగా 10 వేల మందికి సహాయం అందించాడని అన్నారు.


 నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నోటి దురుసు వలన గత ఎన్నికల్లో ప్రజలు 54 వేల ఓట్లతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించడం జరిగిందని అన్నారు.

 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి, ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిందని తెలిపారు.

 రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.


 రెండు మూడు పార్టీలు మారిన వ్యక్తి కూడా యూరియాపై చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, స్థాయిని మించి మంత్రిపై విమర్శనాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.


 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ నియోజక వర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నాడని అన్నారు.

 బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు.

*నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా అని స్పష్టం చేశారు*

 మాజీ ఎమ్మెల్యేను ప్రజలు గత ఎన్నికలలోనే చీకొట్టారని, అతనిని ఎప్పుడో మరిచిపోయారని అన్నారు.


 చిల్లర రాజకీయాల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 మేము సహనం కోల్పోతే గణేష్ నిమజ్జనం రోజే వారిద్దరికీ గన్ మెన్లు వచ్చేవారని అన్నారు.


 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన సాగుతుందని పేర్కొన్నారు.

 అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు.

 రాజకీయ లబ్ధి కోసం బిజెపి, బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తుంటారని విమర్శించారు.

*ఎక్కడ లేని విధంగా నల్లగొండలో బిజెపి,బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉందని ధ్వజమెత్తారు*

  గణేష్ నిమజ్జనం రోజు నల్లగొండలో జరిగిన సంఘటనే నిదర్శనం అని తెలిపారు.

 

 *ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కమిటీ సభ్యుడు కుసుకుంట్ల రాజిరెడ్డి,మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూపా అశోక్ సుందర్, నాయకులు బొజ్జ శంకర్, సురిగి వెంకన్న గౌడ్,యూత్ కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, ఇటికాల శ్రీనివాస్, పిల్లి యాదగిరి యాదవ్, పెండెం పాండు,ఎగ్గడి సుజాత, బొబ్బలి స్వరూప రెడ్డి, పిల్లి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు*

Friday, 5 September 2025

శ్రీ వేలూరు లింగయ్య గుప్తా గారి నూట ఒకటవ జయంతి వేడుకలు

శ్రీ వేలూరు లింగయ్య గుప్తా గారి నూట ఒకటవ జయంతి వేడుకలు



 * ఖైరతాబాద్ లోని వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో, తేదీ: 5 -9 -2025, శుక్రవారం,  స్వర్గీయ పూర్వ అధ్యక్షుడు కీర్తిశేషులు శ్రీ వేలూరు లింగయ్య గుప్తా గారి నూట ఒకటవ జయంతి వేడుకలు ఈరోజు ఉదయం ఖైరతాబాద్ లోని వాసవి సేవా కేంద్రంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా కేంద్రం పూర్వాధ్యక్షుడు, ప్రస్తుత సలహాదారు శ్రీ కాసనగొట్టు రాజశేఖర్ గుప్తా గారు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ తెలంగాణ శాఖ ఉపాధ్యక్షుడు (అడ్మినిస్ట్రేటర్) వాసవి సేవా కేంద్రం లైబ్రరీ కమిటీ చైర్మన్ డాక్టర్ నీలా శ్రీధర్ గారు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర గుప్తా గారు మాట్లాడుతూ, ఆయన చాలా అందమైన వ్యక్తిని, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని, అనుకున్నది ఏదైనా ఎంత కష్టమైనా సాధించేవరకు విశ్రమించని  వ్యక్తిని, సంఘంలో మంచి గౌరవం ఉన్న వ్యక్తిని, భవిష్య సంఘటనలను ఊహించే సామర్థ్యం ఉన్న వ్యక్తిని, ఎవ్వరికీ హాని తలపెట్టని వ్యక్తిని, స్వేచ్ఛను కోరుకునే వ్యక్తిని,మనస్సాక్షినే అనుసరించే వ్యక్తిని, సూచిగా, శుభ్రంగా కనిపించే వ్యక్తిని, పాదరసం లాంటి మనసున్న  మహోన్నత వ్యక్తిని, ఈ సందర్భంగా రాజశేఖర్ గుప్తా గారు ఈ సందర్భంగా అన్నారు. మరియు సేవా కార్యక్రమంలో భాగంగా పెన్షన్లను రాజశేఖర్ గుప్తా గారు డాక్టర్ నీలా శ్రీధర్ గారు అందజేస్తున్న దృశ్యం. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీ నాచం ప్రభాకర్ గారు, కోశాధికారి శ్రీ ఇల్లూరి నరేంద్ర కుమార్ గారు, అడ్వైజర్ శ్రీ కొండ్లే మల్లికార్జున గారు, శ్రీ ఆలంపల్లి రవికుమార్ గారు, కార్యక్రమం చైర్మన్ శ్రీ గుగ్గిళ్ళ అశోక్ కుమార్ గారు, సర్వీస్ ఆక్టివిటీస్ సబ్ కమిటీ చైర్మన్ శ్రీ కూర జయరాములు గుప్తా గారు, వేలూరు లింగయ్య గుప్తా గారి పుత్రులు శ్రీ వేలూరు రవీంద్రనాథ్ గారు, శ్రీ వేలూరు శిలేంద్ర నాథ్ గుప్తా గారు,  శ్రీ వేలూరు వీరేంద్ర గుప్తా గారు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది

జాతీయ ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు...

 జాతీయ ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు...



గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః

గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః


ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే.. గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అన్నారు.


మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్‌ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో..!


యుగపురుషుడు.. జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి

యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు హోవెల్‌. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు సోవియట్‌ అధినేత స్టాలిన్‌. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయ్యింది.


తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్‌. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.


గురువు గొప్పదనం

ఇది గురువు గొప్పదనం..!

మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.


చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.


సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుంటూ.. నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా.. రాబోవు తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ.. గురువులందరికీ వందనం.. అభివందనం.

జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. ఏకంగా 11 లక్షల మందికి..

 జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. ఏకంగా 11 లక్షల మందికి..



గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దసరా, బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. మూడు రోజులు పాటు కార్నివాల్ తరహాలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా నగరంలోని 11 లక్షల మందికి బతుకమ్మ కానుక ఇవ్వనుంది. ఆ వివరాలు..

హైలైట్:

జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు

11 లక్షల మంది మహిళలకు బతుకమ్మ కానుక

           గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కరు, ఇద్దరు కాదు ఏకంగా 11 లక్షల మందికి దసరా పండుగ కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఆడపడుచులకు దసరా పండుగ కానుకతో పాటుగా.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స‌ృష్టించేలా కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఇంతకు జీహెచ్ఎంసీ ఏం చేయబోతుంది అంటే.. ఈ సంవత్సరం నిర్వహించబోయే బతుకమ్మ ఉత్సవాలను గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ వివరాలు..

            ఈ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ఏకంగా 11 లక్షల మందితో బతుకమ్మ సంబురాలు నిర్వహించబోతుంది. అలానే వీరందరికి బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయనున్నారు. ఈక్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 11 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు పంపిణీ చేయడం కోసం సర్కార్ 11 లక్షల బతుకమ్మ చీరలను కేటాయించనుంది.

               బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కోసం సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు కేరళలో నిర్వహించే ఓనం పండుగ మాత్రమే ఇలాంటి రికార్డు క్రియేట్ చేయగా.. ఈసారి బతుకమ్మ ఉత్సవాలతో ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు, నవరాత్రులు మొదలవుతున్న సంగతి తెలిసిందే.

                ఈక్రమంలో సెప్టెంబర్ 27న సాయంత్రం ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్నివాల్ ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఆ మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమం నిర్వహిస్తారు. 11 లక్షల మంది ఈ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 29న పీపుల్స్ ప్లాజా వద్ద ఉత్తమ బతుకమ్మ పోటీలు నిర్వహించబోతున్నారు. అలానే సెప్టెంబర్ 30వ తేదీన ట్యాంక్‌బండ్‌ వద్ద అంగరంగ వైభవంగా పూల పండుగ నిర్వహించనున్నారు.

               బతుకమ్మ వేడుకల నేపథ్యంలో నగరంలోని సుమారు 30 సర్కిళ్ల నుంచి మహిళలను శిల్పకళా వేదిక వద్దకు తరలించేందుకు గాను.. 150 బస్సులను వినియోగించబోతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా అప్పర్ ట్యాంక్ బండ్ పై స్పెషల్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలానే రాష్ట్రంలోని పలు చేతివృత్తుల వారు తయారు చేసిన కళాఖండాలు, ఇతర ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడమే కాక విక్రయించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు నెక్లెస్ రోడ్డులో మూడు రోజుల పాటు.. తెలంగాణ వంటకాలతో స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

నగరవాసులకు అలర్ట్.. వేల రూపాయలు ఖర్చు అయ్యే వైద్య పరీక్షలన్ని అక్కడ ఫ్రీగా చేస్తారు

 నగరవాసులకు అలర్ట్.. వేల రూపాయలు ఖర్చు అయ్యే వైద్య పరీక్షలన్ని అక్కడ ఫ్రీగా చేస్తారు


        నేటి కాలంలో వైద్యం ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రుల మీద నమ్మకం లేక ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించి.. వేల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ నగరంలోని పలు కేంద్రాల్లో దాదాపు 40 వరకు టెస్టులన్ని ఉచితంగా చేస్తారు. ఈ విషయం తెలియక చాలా మంది డబ్బులు ఖర్చు చేసి జేబుకు చిల్లు పెట్టుకుంటారు. మరి ఇంతకు ఈ ఉచిత టెస్టులు ఎక్కడ చేస్తారంటే..

ఇక్కడ మెడికల్ టెస్టులన్ని ఉచితం

      నేటి కాలంలో మనుషులు భయపడేది రోగాలు, వాటికి అయ్యే వైద్య ఖర్చుల గురించే. ఎంత చిన్న అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లినా సరే.. రకరకాల టెస్టులు రాసి.. వేల రూపాయలు లాగుతాయి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు. అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగా పట్టించుకోరు అనే అపోహలో ఉండి పోతారు. అయితే చాలా మంది ప్రభుత్వ.. అందునా నగరంలో ఉండే గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఉండే అనేక సౌలభ్యాలు గురించి తెలిసి ఉండదు. వీటిల్లో ముఖ్యమైంది మెడికల్ టెస్టులు. బయట వేలు, వందల రూపాయలు ఖర్చు చేసి చేయించుకునే చాలా వరకు పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తారు. అయితే జనాలకు ఇది తెలియక బయట ల్యాబ్స్, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి భారీగా ఖర్చు చేస్తుంటారు. దాదాపు 40 రకాల పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తారు. ఆ వివరాలు..

      చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు, పరీక్షలు వంటి వాటికి ప్రైవేటు, పెద్దపెద్ద డయోగ్నోస్టిక్‌ కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వీటన్నింటిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే చేస్తారు. మీకు సమీపంలో ఉన్న ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు వెళ్లి.. ఒకసారి అక్కడ వైద్యులను కలిస్తే చాలు. మీకు వైద్యులు సూచించిన పలురకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఇక్కడ ఫ్రీగా చేస్తారు. ఇక్కడ దాపు 40 రకాలపైనే పరీక్షల్ని ఫ్రీగా చేస్తున్నారు.

ఈ కేంద్రాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం వరకు శాంపిళ్లు కలెక్ట్ చేసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత వాటిని నారాయణగూడలోని ప్రభుత్వ డయోగ్నోస్టిక్‌ సెంటర్‌కి పంపిస్తారు. ఆ తర్వాత శాంపిళ్ల మీద పేర్కొన్న టెస్టులను చేస్తారు. రిపోర్టుల్ని మీ ఫోన్‌ నంబరుకు పంపిస్తారు. అయితే కొన్ని టెస్టుల ఫలితాలు రావాలంటే.. 16-24 గంటల సమయం పడితే.. యూరిన్‌ ఇతర టెస్టుల ఫలితాలకు 2 రోజుల వరకు సమయం తీసుకుంటారు. అలానే ఇక్కడ డాక్టర్ల కన్సెల్టెంట్‌ సేవలు, మందులూ కూడా ఉచితంగానే ఇస్తారు. వీటితో పాటుగా ఇన్‌పేషంట్లకు ఫ్రీగా సెలైన్‌ పెడతారు. వీరికి రోజువారీ వైద్యుల పర్యవేక్షణ ఉచితం. నగరంలోని పలు బస్తీ దవాఖా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా నడిపిస్తోంది.

ఉచితంగా చేసే పరీక్షలు ఇవే

బీపీ, డయబెటిక్, సీబీపీ, రియాక్టివ్‌ ప్రొటీన్‌ (పీఆర్‌పీ), డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా, కంప్లీట్ యూరిన్ కల్చర్ టెస్ట్, లిఫిడ్ ప్రొఫైల్(కొలెస్ట్రాల్), లివర్‌ ఫంక్షన్‌ టెస్టు (ఎల్‌ఎఫ్‌టీ), టైఫాయిడ్, థైరాయిడ్ ప్రొఫైల్, రీనల్‌ ఫంక్షన్‌ టెస్టు (ఆర్‌ఎఫ్‌టీ) వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఇక్కడ చెప్పిన టెస్టులు ప్రైవేటులో చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాస్త ఓపిక చేసకుని ముందుగా వెళ్తే.. బస్తీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా టెస్టులు చేయించుకోవచ్చు.

శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి వివాహం అయినదా,,? కాలేదు కదా!

 శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి వివాహం అయినదా,,?  కాలేదు కదా!


అయితే మనం తమిళనాడులో కానీ.. కర్ణాటకలో కానీ..

 ఆంధ్రదేశంలో

కానీ... అనేక వాసవి దేవాలయాలు చూస్తే 


కొన్ని కొన్ని చోట్ల

వాసవీమాత మెడలో మంగళ సూత్రాలు కనిపించటం చూస్తుంటాం...! 


వీరముష్టులు,మైలార్లు , గంగకావిళ్ళ వారూ... అక్కడక్కడా

పీఠాలను తీసుకు వచ్చే పీఠాలవారూ..

వాసవి దేవికి ఒడిబాలు బియ్యం

పోయిస్తూ వుండటాన్ని మనం చిన్న తనం నుంచి చూస్తున్నాం కదా..!

అంతే కాకుండా అనేక కన్యకా పరమేశ్వరి దేవాలయాలలో

వాసవికి ప్రక్కనే నగరేశ్వర స్వామిని వుంచి పూజించడం కూడామనకు కనిపిస్తూనే వున్నది....


యధార్ధాన్ని తెలుసుకునే ముందుగా  ఇదంతా పూర్తి వరకు చదవాలని  ఆర్యవైశ్య సోదర సోదరీమణులను కోరుకుంటున్నాం.....


  ప్రస్తుతం కన్యకాపరమేశ్వరి అమ్మవారి గురించి 350కి .పైగా

 అనేక మంది కవులద్వారా తెలుగులో గ్రంథాలు రచించబడి వున్నాయి.  వాటిలో కొన్ని

గ్రంథాలలో వాసవికి వివాహం అయినట్లుగానే మనకు  తెలుస్తుంది....


పిఠాపురం శ్రీపాద వల్లభ చరితామృతం లో  వ్రాసిన

శ్రీ గురు చరిత్ర పారాయణ గ్రంథంలో కూడా వాసవిదేవిని నగరేశ్వర స్వామికిచ్చి వివాహం చేసినట్లుగా వున్నది కదా..! 


1978  కన్నడంలో తీసిన 

 శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం  

 బ్లాక్ అండ్ వైట్

సినిమాలో కూడా వాసవి దేవిఅగ్నిగుండ ప్రవేశ సమయంలో

నగరేశ్వరునకిచ్చి వాసవికి వివాహం చేసినట్లుగానే చూపించారు...


మొన్న ఈ మధ్య కాలంలో

ఆర్యవైశ్య కులగురువునని చెప్పుకునే ముక్కామల స్వామిజీ కూడా,

వాసవీ నగరేశ్వరుల కళ్యాణం చేస్తున్నానని చెప్పి అనేక విమర్శలకు

లోనయిన విషయం మనందరికీ తెలిసిందే కదా..!


ఈనాటికీ పెనుగొండలోని 

7 అంతస్థుల గాలి గోపురంలో

కనిపించే వాసవి చరిత్ర చిత్రాలలో కూడా...

 వాసవి దేవిని నగరేశ్వరస్వామి తన వామాంకముపైన కూర్చుండ బెట్టుకొని కైలాసానికి తీసుకుని వెళ్తునట్లుగా చిత్రీకరించివున్నది... 


1958 లో  శ్రీనగశ్వర

కన్యకాపరమేశ్వరి దేవస్థానం పెనుగొండక్షేత్రం వారు రచించిన

 వాసవీ చరిత్ర బృహత్ గ్రంధంలో వాసవి దేవికి వివాహం అయినట్లుగానే  రచించారు.. 

వీటన్నిటి ఆధారాలను గమనిస్తే వాసవి దేవికి వివాహం

అయినదా! కాలేదా?

 అనే సంశయాలతో వున్న ఆర్యవైశ్య ప్రస్తుత

కాలానికి ఒక యదార్థమైన  సందేశాన్ని ఆర్యవైశ్య సంస్థల వారు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా వుందని భావిస్తున్నాం...


పూర్వం రచించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ జీవిత చరిత్ర  గ్రంధంలో వున్న  

శ్రీ వాసవి నగరేశ్వర కళ్యాణం కథను మీకిప్పుడు యథాతధంగా వివరిస్తున్నాము, 


ఆ రోజు మాఘ శుద్ధ విదియ 103 గుండములలో 

 అగ్నిజ్వాలలు   జాజ్వల్యమానంగా  ఆకాశమునకు జ్వలించుచున్నవి. 


 మరి  కొన్ని నిమిషాలలో ..

102 గోత్ర వైశ్యులు అగ్ని ప్రవేశము చేయుటకు సిద్ధంగా

వున్నారు .  

ఆ సమయములో 102 గోత్ర  ఆర్యవైశ్యులందరూ వాసవితో..  

"అమ్మా వాసవి ఇక్కడ 

అగ్నిగుండ ప్రవేశం చేసే మేమంతా దంపతీసమేతంగా సిద్ధమైనాము,  నీవు మాత్రమే ఒంటరిగా ఎలాదూకుతావు?" 

 అని ప్రశ్నించారు.

 అప్పుడు వాసవి దేవీ

 "ఓ బంధువులారా! 

నేను పార్వతీ స్వరూపిణిని  

నా అగ్ని ప్రవేశ నిర్ణయము 

 నా నాధుడైన

 ఈశ్వరుని సంకల్పంతో

ఏనాడో జరిగిపోయింది... 

 వాసవినైన నన్ను 

ఆ పరమేశ్వరుడే 

వివాహం చేసుకోగలడు, 

నేను కూడా మీతో పాటే 

పతీపత్ని సమేతముగా  అగ్నిప్రవేశం చేయగలము" అన్నది. 


అదే సమయంలో భాస్కరాచార్యులవారు అక్కడికి వచ్చి, 

"అమ్మా వాసవి అగ్నిగుండ  ప్రవేశానికి సమయం సిద్ధమయింది. 

రామ్మా వాసవీ .!"  అన్నారు,

అప్పుడు వాసవీదేవి 

 "గురువర్యా! ముందుగా అగ్నిలో ఎవరు ప్రవేశించాలి?"  అని ప్రశ్నించింది...అప్పుడు భాస్కరాచార్యుల వారు 

"ఓవాసవి! ముందుగా నీవు అగ్ని ప్రవేశం చేస్తే,

 ఆ తరువాతనే ఇక్కడ వున్న 102 గోత్ర  వైశ్యులందరూ

 అగ్నిప్రవేశం చేయాలిగదమ్మా..!" అన్నారు.

అప్పుడు వాసవి దేవి 

 "ఓ గురువర్యా! 

ముందుగా నేను అగ్నిప్రవేశం

చేయాలంటే 'కన్య'నైన నాకు

 అగ్ని ప్రవేశ అర్హత లేదు కదా ?" అన్నది ..! 

అప్పుడు భాస్కరాచార్యులవారు 

 "అదేమిటమ్మా వాసవి!, 

ఇన్ని రోజుల నుండి నీవు,

  'నేను అగ్ని  ప్రవేశం చేస్తాను',

'నేను అగ్ని ప్రవేశం చేస్తాను'.

 అని నీవంటేనే గదా!

ఈ 103 అగ్ని గుండాలను  నిర్మించాము.

 తీరా అగ్ని ప్రవేశానికిరమ్మంటే, అర్హత లేదంటావేమిటి.? 

నీ మనసులోని ఆంతర్యం వివరించు వాసవి" అన్నారు!.

 అప్పుడు వాసవి దేవి

 "గురువర్యా!

మన హిందూ ధర్మంప్రకారం

 వివాహమైన స్త్రీ మరణిస్తే 

ఆ కళేబరాన్ని

 దహనసంస్కారం చేస్తారు.


అదే వివాహం కాని కన్య  విధివశాత్తు గా మరణిస్తే..

  ఆ కన్య కళేబరాన్ని 'భూస్థాపన' చేస్తారు కదా! 

కనుక 

'వాసవీ కన్య' అనబడే నాకు 

అగ్నిప్రవేశం అర్హత లేదు కదా!

 వివాహం కాని నేను అగ్నిలో ఎలా ప్రవేశించగలను?" 

 అన్నది. 

అప్పుడు భాస్కరాచార్యులవారు 

"అలా అయితే వాసవి, 

నీవు అగ్నిప్రవేశం చేయాలంటే.. నీకు వివాహమేకావాలంటావా?

 వివాహమే కావాలంటే 

నీ మేనత్త కుమారులైనబావగార్లు 

అనేక మంది ఉన్నారు కదా!

 వారిలో యోగ్యుడైన వారిని నీవు వివాహం చేసుకుంటావా? 

 చెప్పమ్మా వాసవి" అన్నారు.


అప్పుడు వాసవి దేవి 

"ఓ గురువర్యా నేను ఆదిశక్తి స్వరూపంతో పార్వతి అంశతో వాసవి రూపంగాఅవతరించాను.

 నన్ను వివాహమాడే అర్హత

 ఆ దేవదేవుడైన 

ఈశ్వరునికే ఉన్నది" అన్నది. 

అప్పుడు భాస్కరాచార్యుల వారు 

 "ఓ వాసవీ  ఆ శివుడు లింగరూపంలో ఉన్నాడు కదా!

 ఆయన రావటం ఎట్లా ?  

నీ మెడలో మాంగల్యధారణ చేయడం ఎట్లా ?  

నీవు అగ్నిప్రవేశం చేయడం ఎట్లా?" అన్నారు.


"ఓ గురువర్యా  

ఈ సుముహూర్తంలో వాసవినైన నేను 

నాశక్తి స్వరూపంతో 

ఈశ్వరుని పిలిచిన వెంటనే

 స్వామి ప్రత్యక్షమై రాగలడు.

 నా మెడలో మంగళ సూత్ర ధారణ చేయగలడు. 

మీరంతా చూడగలరు , 

నేను అగ్నిప్రవేశం చేయగలను."  అని 

వాసవిదేవి ఈశ్వరుని లింగం వద్దకు వెళ్లి 

గంభీరమైన స్వరంతో బిగ్గరగా...

 'ఓ పార్వతీ వల్లభ! 

'ఓ జగన్నాయకా !

 'ఓ  దీన  బంధూ! 

'హృదయ నివాసా!" అని

 ప్రార్థించగానే  

"తళుక్.. తళుక్" మనే

 మెరుపులతో . 

'త్రినేత్రుడు , త్రిశూలధారుడు' అయిన ఆ పరమేశ్వరుడు 

ఆ  గర్భాలయంలోని 

లింగం నుండి ప్రత్యక్షమై వాసవి పక్కకు వచ్చి నిలుచున్నాడు.

అప్పుడు భక్తులందరూ జయజయ ధ్వనాలతో 

శివుని కీర్తించారు. 


అప్పుడు కొంతమంది ఆర్యవైశ్య బంధువులు భాస్కరాచార్యులవారితో

  "ఓ గురువర్యా! పెళ్లి అంటేనే బంధువులతో ఆనందంగా

 హడావిడిగా సంతోషంగా

 జరుగుతుందికదా!.  

ఇక్కడ నిలిచి ఉన్న

 102 గోత్రాల జంటలుఅందరూ   పెళ్లికూతురు తరుపు వారేఉన్నారు.


 మరి పెళ్లి కొడుకు తరపు బంధువులు ఎవరు?

 ఇప్పుడు ఈశ్వరుడు ఒక్కరే ప్రత్యక్షమైనారు కదా!

 మనము ఇచ్చే కన్యాదానము స్వీకరించాలి అంటే?

 పెళ్ళికొడుకు తరపువారి బంధువులు కానీ,

 తల్లిదండ్రులు కానీ,

 కులము గోత్రము, వివరాలుగాని  

సంకల్పంలో చెప్పాలికదా!."


"శ్రీసీతారాములకళ్యాణం లో కూడా..

 వధూవరుల వంశం,  సంకల్పం చెప్పి వివాహం జరిపిస్తారు కదా!"  అన్నారు.. అప్పుడు

 భాస్కరాచార్యులవారు 

 "ఆది విష్ణువుకూ, 

ఆది శివునకూ, 

కులగోత్రాలు కానీ,

 తల్లిదండ్రులు కానీ, 

ఉండరు!" అన్నారు. 


అప్పుడు ఈ 102 గోత్ర బంధువులలో చివరి గోత్రం వారైనా 'లాభాల' గోత్రీకులైన 'ధనలక్ష్మి ధనదగుప్త' దంపతులు ముందుకు వచ్చి..  "మా దంపతులకు సంతానం లేదు, మేము ఆ పరమేశ్వరుణ్ణి  మా కుమారునిగా 'దత్తు' తీసుకుంటున్నాము...

 మేము వాసవికి మేనత్త గోత్రం వారము కనుక, 

వాసవి పరమేశ్వరుని పెళ్లి చేసుకుంటే మేనరిక వివాహం చేసుకున్నట్లు అవుతుంది" 

అని అనగానే అక్కడున్న ఆర్యవైశ్యకుల బంధువులందరూ

 సంతోషంతో అంగీకరించారు.

అప్పుడు భాస్కరాచార్యులవారు ఆవుపాలతో శివుని చేతులను  తడిపి లాభాలగోత్ర దంపతుల చేతులలో  శివుని చేతులు ఉంచి, 

'దత్తత స్వీకరణ' మంత్రాన్ని చదివారు.

 ఈ క్షణం నుంచి మీకు శివుడే పుత్రుడు అయినాడు 

 నీ వంశం వారందరూ

 సద్గతినిపొంది తరించారు"అని

 భాస్కరాచార్యులవారన్నారు.


అలా వారికి  

సాక్షాత్తు పరమేశ్వరుడే కుమారుడుకాగా..

 అక్కడ ఉన్న పెనుగొండ నగర ప్రజలు అందరూ సంతోషించి

 పరమేశ్వరుని 

స్తోత్రాలతో స్తుతించారు.


 అప్పుడు శివుడు

 "ఓ మహా భక్తులారా! 

ఈ క్షణం నుంచినాకు 'లాభ' దంపతులు  తల్లిదండ్రులు అయినారు కనుక..

 నేను కూడా మీకు ఒక వరం ఇస్తున్నాను..

“ ఐశ్వర్యం  ఈశ్వరాధిచ్చేత్ ” అన్నట్లుగా 

ఈరోజు నుంచి ఎవరైతే వ్యాపార ప్రారంభంలో ప్రప్రథమంగా

 ఈశ్వరుడినైన నా 'లాభాల' గోత్రాన్ని 

“ లాభం” అని

 వ్యాపారంలో  స్మరిస్తారో 

వారికి నేను అనంతానంత ఐశ్వర్యం అనుగ్రహిస్తాను!" 

 అని వరం ఇచ్చారు. 


అప్పుడు నగర ప్రజలందరూ  "ఓ  పరమేశ్వరా! 

ఇంతటి మహత్తర వరమును మాకు అందించి,

మా నగరవాసులను ఆనందింప చేశారు, 

కనుక ఈరోజు నుంచి మిమ్మల్ని 

మా  'నగర- ఈశ్వరుడి' గా 

శ్రీ నగరేశ్వర స్వామి  అనే పేరుతో పూజలు అందుకుంటారు" అని

 నమస్కరించారు.


ఆ విధంగా 

ఈ ధనలక్ష్మి ,దనదగుప్తా దంపతుల వివాహసమయంలో

 'కన్య' ను కోడలిగా .. స్వీకరణనుచేసుకున్నారు . 


అలా వాసవి కూడా

 తన అగ్నిగుండ ప్రవేశం సమయంలో

 తన నాధుడైన నగరేశ్వర చిహ్నంగా..

 లింగమును చేతధరించి అగ్నిప్రవేశం చేయడానికి కారణమైనది....


అప్పుడు కుసుమశ్రేష్టి  కుసుమాంబ దంపతులూ.. విరూపాక్షుడూ...

శివునకు అనేక నమస్కారాలు ఆచరించి, 

గంగాజలకలశం తెచ్చి పరమేశ్వరుని పాదాలు కడిగి ఆ జలాన్ని వారి శిరస్సులపై చల్లుకొని పునీతులయ్యారు. 

అప్పుడు భాస్కరాచార్యులవారు

 మంగళసూత్రం సిద్ధం చేసి పరమేశ్వరుని చేతికి అందించారు...

ఈశ్వరుడు మంగళసూత్రాన్ని వాసవి మెడలో

 ధారణ చేస్తూ ఉండగా..

 అప్పుడు భాస్కరాచార్యులవారు

 " ఓం మాంగల్యం తంతునానేనా  లోక రక్షణ హేతునా   కంఠే భధ్నామి సుభగే సంజీవ శరణాంశతం" 

 అనే పెళ్లి మంత్రం చదువుతుండగా..

ఆ సమయంలో 

బాజా భజంత్రీలు, మంగళవాయిద్యాలు 

 మారుమ్రోగుతుండ గా..

 ఆకాశం నుంచి దేవతలు దేవదుందుభులు మోగిస్తుండగా, 

కిన్నెర కింపురుషులు ఆనందభైరవి ఆలపిస్తుండగా..

 నారదాది మహామునులు దివ్య మంత్రాలతో ఆశీర్వదిస్తూ ఉండగా..,

 ముప్పది మూడు కోట్ల దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపిస్తుండగా..

 102 గోత్రాలవైశ్యులు

 నూతన దంపతులపై ఆశీర్వాదాక్షతలు సమర్పిస్తుండగా....

వాసవి మెడలో మంగళసూత్ర ధారణ గావించాడు  పరమేశ్వరుడు...


 తదుపరి వాసవీ ఈశ్వరులు 

 ఆ అగ్నిగుండానికి మూడుసార్లు ప్రదక్షిణచేసి ఏడడుగులు నడిచారు, 


అలా వాసవి వివాహానంతరం

 ఆర్యవైశ్య బంధువులందరూ  వచ్చి

 "అమ్మ వాసవి ఇప్పుడు మీకు వివాహం అయ్యింది కదా! 

మరి నిన్ను వాసవి 'కన్యక' అని

 పిలవాలా! ఎలా పిలవాలి?" 

 అని ప్రశ్నించారు.

అప్పుడు వాసవి దేవి  

"ఓ బంధువులారా!

 నేను అగ్ని ప్రవేశార్హత కోసం నా నాధుడైన నగరేశ్వరునితో నేను మంగళసూత్రధారణ జరిపించుకున్నానేగానీ , 

నాకు భర్తతో  సంగమం జరుగలేదు. 

నేను ఆజన్మ బ్రహ్మచారిని, కనుక 

నేను 'కన్య' ను కాను 'కన్యక'ను  అన్నది వాసవి దేవి.


అనగా ఏ స్త్రీ  అయినా పుష్పవతి అయి

 వివాహం కాక పూర్వము 'కన్య' అనీ..

 మంగళ సూత్రధారణ  జరిగినా.. భర్తతో సంగమం జరగని మధ్య కాలంలో  'కన్యక' అనీ..,

 తదుపరి భర్తతో కాపురానికి వెళ్లిన తరువాత 'శ్రీమతి' అనీ.. అంటారు.


కనుక నేను అగ్ని ప్రవేశ అర్హత కోసం, నేను నా నాధుడైన నగరేశ్వరునితో   మంగళసూత్రధారణ జరిపించుకున్ననే కానీ,

 నాకు భర్తతో సంగమం జరగలేదు, 

నేను 'ఆజన్మ బ్రహ్మచారిణి' ని   నేను 'కన్య' ను కాదు 

'కన్యక' ను , అని అన్నది వాసవిదేవి .


ఉదాహరణకు:-  తమిళనాడులో 'కన్యాకుమారి' అని ఒక అమ్మవారు ఉన్నది,  ఆమెకు  మంగళ సూత్రధారణే జరుగలేదు కనుక  ఆమెను మనం 'కన్యాకుమారి' అని పిలుస్తాం కానీ

 కన్య 'కా' కుమారి అని పిలవరు కదా!

 అలాగునే మన కన్యకాపరమేశ్వరికి 

మంగళసూత్రధారణ జరిగినా.., 

భర్త తో సంగమం లేని

 ఆజన్మ బ్రహ్మచారిణి , కనుక

 ఆమెను మనం 'కన్యకా' పరమేశ్వరి అని పిలుస్తాం కానీ,

 'కన్యా' పరమేశ్వరి అని పిలువముకదా!


 మరో ఉదాహరణ:-

 ఒక 20 సంవత్సరాల కన్య  వివాహం జరిగి ఆమె వెంటనే  భర్తతో కాపురానికి వెళ్ళిపోతే ఆమె 'శ్రీమతి' అని పిలువబడుతుంది. 

అలా కాక ఆ కన్యకు మంగళసూత్రధారణ జరిగిన తర్వాత కొన్ని కారణాల వలన

 ఆమె  కాపురానికి వెళ్లకుండా.. పుట్టింటిలోనే కొంత కాలం ఉండిపోతే, 

అప్పుడు ఆమె మంగళసూత్రధారణ 

జరగక ముందు 'కన్య'..

 మంగళసూత్రధారణ జరిగినా, పుట్టింట్లోనే ఉన్నంతకాలం 'కన్యక' 

 ఎప్పుడు భర్తతో కాపురానికి వెళ్ళితే అప్పుడు 'శ్రీమతి' అని పిలుస్తారు.


 అందుకే అమ్మవారు అంటున్నది.. 

"నేను అగ్ని ప్రవేశార్హత కోసమే, నా నాధుడైన నగరేశ్వరునితో మంగళసూత్రధారణ జరిపించుకున్ననే కానీ, 

నాకు భర్తతో సంగమం జరగలేదు.

 నేను ఆజన్మ 'బ్రహ్మచారిణి' ని నేను 'కన్య' ను కాను 'కన్యక'ను, 

ఈ రోజు నుంచి మీరు నన్ను 'కన్యకా పరమేశ్వరి' అని పిలవాలి అన్నది.


 అందుకే ఈ క్షణం నుంచే ఈమెకు కన్యకా పరమేశ్వరి అనే పేరు వచ్చిందని విజ్ఞులంతా గమనించాలి.


 నిజానికి ఈ క్షణం నుంచే.. అనగా!

 అమ్మవారి అగ్నిప్రవేశం సమయము నుండే,

 'కన్యకా పరమేశ్వరి' అనే పేరు వచ్చిందని విజ్ఞులంతా గమనించాలి, 


'పరమేశ్వరుడు' అనగా శివుడు..!

 'పరమేశ్వరి'అనగా..

 పార్వతి అని అర్థం..!

 ఇంతకుముందు వరకు అమ్మవారికి,

 వాసవీ.. 

వాసవికన్య.. 

వాసవాంబ..,

వాసవిబాల.. 

కన్యకాంబ.. 

అనే  పేర్లుమాత్రమే ఉండేవి.


 కానీ ఇప్పుటి నుంచే 

కన్యకాపరమేశ్వరి అనే పేరు వచ్చిందని విజ్ఞులంతా గమనించాలి. 


అందుకే వాసవికి వివాహం అయినది కనుక ఈనాటికీ ప్రపంచంలోని అనేక వాసవి దేవాలయాలలో ఆమెకు మెడలో మంగళ సూత్రాలు కనిపించడానికి కారణం.


  వాసవిదేవికి మనం 'ఒడిబాలు'

 పోయడానికి కారణం . 


వాసవిదేవికి మెడలో నల్లపూసలు కనిపించడానికి కారణం.


 దంపతులకు మాత్రమే చేసే 'వసంతోత్సవం' సేవలు

 శ్రీవాసవినగరేశ్వరలకు చేయటానికి కారణం. 


వాసవి ప్రక్కనే నగరేశ్వర స్వామి ఉండడానికి కారణం.


 ఇవన్నీచేస్తూనే 

మనం 'వాసవి' ని  

'కన్యకాపరమేశ్వరి' అని, పిలవడానికి గల కారణం.


 వాసవిని నగరేశ్వరుడు వివాహం చేసుకున్నాడు కనుకనే, పెనుగొండలోని నగరేశ్వర ఆలయంలో నగరేశ్వర స్వామికి ఎదురుగా రెండు పెద్ద పెద్ద నందులు ఉంటాయి.

 అందులో ఒకటి ద్వాపరయుగం పురాతన నంది రెండవది కలియుగ నూతన నంది. 

ఈశ్వరుడూ, నగరేశ్వరుడు, అనే రెండు పేర్లతో ఒకే లింగం లో శివుడు ఉన్నాడు కనుకనే పెనుగొండ లోని నగరేశ్వర ఆలయంలో ఈరోజు కి మనం దర్శించవచ్చు.


 వాసవికి  వివాహమైన 

ఈ సన్నివేశం

 ఇదే దేవాలయంలోని  ఏడంతస్తుల గాలిగోపురం పైకి మనం మెట్లు ఎక్కుతూ ఉండగా...

 కొంత భాగం పైకి వెళ్ళగానే వాసవిని నగరేశ్వరుడు వివాహం చేసుకున్న చిత్రాలనూ...

శివుడు వాసవి ని తన తొడపైన కూర్చుండ బెట్టుకుని కైలాసం తీసుకువెళ్ళిన విశేషాలనూ... మనం దర్శించవచ్చును.  

 పెనుగొండ క్షేత్రం వారు 

1958 లో  రచించిన వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర పురాతన ఆది గ్రంథంలో కూడా, వాసవికి వివాహమైన చరిత్ర శ్లోకాలు తో సహా  ఉండటాన్ని మనం చదవొచ్చు.

శ్లో.అగ్నిజ్వాలాత్సముత్కృష్యస్వాంక మారోప్యవైవిరాట్.92

 భ్రాజయంశ్చదిశోదీప్త్యా గగనస్థో2భవత్తదా తాంతదా శంకరస్యార్ధవిగ్రహే విశదాకృతిమ్.93 

భ్రాజమానాం శ్రియం దేవీం వాసవీం జాతవిస్మయా: పులకోద్గమరోమాణో దదృశుర్జాతసంభ్రమా: | 94

 కాంక్షామో పరమం స్థానం దేవదేవ భక్తాన్న: పాహిదేవేశ శరణాగతవత్సల॥ 95

 ఇత్యుక్తస్స తధేత్యుక్త్వా తత్రైవాంతర ధీయత 95:

5-12

 ఇప్పుడు మీరు తెలుసుకున్న ఈ వాసవి కళ్యాణం చరిత్ర ను  మనం విశ్వసించాలా? , వద్దా.!

 అనే విషయాలను మన ఆర్యవైశ్య సంస్థల వారు పండితులతో  ఆలోచించి, ఏకీభావం తో..

 ఒక ప్రామాణికమైన విషయాన్ని ప్రస్తుత ఆర్యవైశ్య లోకానికి తెలియచేయాలన్నది మా సంకల్పమే తప్ప, 

ఈ వాసవి కళ్యాణ 

కథా విషయం 

మా అభిప్రాయం 

కాదని మనవి.