జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధిపై తేల్చేసిన టీపీసీసీ చీఫ్..!!
తెలంగాణలో ఎన్నికల పైన పార్టీలు ఫోకస్ చేసాయి. స్థానిక సంస్థల ఎన్నికలు.. జూబ్లీహిల్స్ బై పోల్ ఇప్పుడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఒకటి రెండు రోజుల్లోనే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల కానుంది. ఇక.. వచ్చే నెల తొలి వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఎన్నికల సంఘం ప్రకటన చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్ధి ని దాదాపు ఖరారు చేసింది. కాగా, కాంగ్రెస్ లో సీటు కోసం పోటీ నెలకున్న వేళ.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అభ్యర్ధి ఎవరో సంకేతాలు ఇచ్చారు. జూబ్లీహిల్స్ బై పోల్ అభ్యర్ధి.. ఫలితం పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమాగా చెప్పుకొచ్చారు. ఇక, పార్టీ అభ్యర్ధి పైనా స్పష్టత ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సర్వేలు చేస్తున్నామని.. సర్వేలో ఎవరూ ముందుంటే వారికే సీటు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలిచే వారికి సీటు ఇస్తామని స్పష్టం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలామంది రేసులో ఉన్నారని.. సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్ , బొంతు రామ్మోహన్‌లతో సహ పలువురు టికెట్ అడుగుతున్నారని గుర్తుచేశారు. స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని తెలిపారు.
ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వస్తోందని చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని గుర్తుచేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్నిటిపైన సీబీఐ విచారణ జరిపితే బాగుంటుంది. కవితది ఆస్తుల పంచాయితీగా మహేష్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌తో కవితకు ఏలాంటి సంబంధం లేదన్నారు. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉంది ?. దోపిడీ చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు, అందరి వాయిస్‌లు రికార్డు చేశారని ఆరోపించారు. తాను వాడిన జియో సిమ్ కార్డు నెంబర్ జియోసంస్థకు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్, కేటీఆర్ వ్యూహ రచన చేసి గత ఎన్నికల్లో గెలిచారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home