ఈ మహాలయ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది...
ఈ మహాలయ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది...
ఈ మహాలయ పక్షం సమయంలో పూర్వీకులు భూ లోకానికి వస్తారని పెద్దలు చెబుతారు ఆ మరుసటి రోజే అశ్విజ మాసం ప్రారంభ మవుతుంది.
ఈ పవిత్రమైన దుర్గా మాత
భూ లోకానికి వచ్చి భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది చాలా మంది విశ్వాసం.
పూజా విధానం
ఈ పవిత్రమైన రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి పూర్వీకుల పేరిట తర్పణం చేయాలి. పూజ చేసే సమయంలో దక్షిణం వైపు మీ ముఖం పెట్టి కూర్చోవాలి. ఆ తర్వాత రాగిపాత్రలో గంగాజలం తీసుకుని , అందులో నల్ల నువ్వులు , పచ్చి పాలు , కుసాలను కలపాలి. ఈ నీటిని సూర్యదేవునికి సమర్పిస్తూ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ప్రార్థించాలి.
ఈరోజు తయారు చేసే ఆహారాన్ని ఐదు భాగాలు చేసి ముందుగా దేవుడికి , తర్వాత గోమాత , శునకం , చీమ , కాకులకు నైవేద్యంగా సమర్పించాలి.
అనంతరం బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేసి వారికి తెల్లని వస్త్రాలు దానం చేయాలి.
మహాలయఅమావాస్య ప్రాముఖ్యత
మహాలయ అమావాస్య రోజున పితృ పక్షాలు పూర్తవుతాయి. పితృ పక్షాల్లో ఇది చివరి రోజు కాబట్టి ఈరోజున నువ్వులు , కుశ గడ్డి కలిపిన నీటితో పితృ దేవతలకు పిండాలను చేసి తర్పణం , శ్రాద్ధం నిర్వహిస్తారు.
ఈ పిండాలను కాకులు వచ్చి తింటే తమ పూర్వీకుల నుంచి అనుగ్రహం లభించినట్టేనని నమ్ముతారు.
అంతేకాదు మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే.. ఎవరైతే చనిపోయిన వ్యక్తులుంటారో..
వారు ఏ తిథిలో మరణించారో తెలియకపోతే వారు మరణించిన ఏడాదిలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు మహాలయ అమావాస్య రోజున వారికి శ్రాద్ధం నిర్వహిస్తే
వారి నుంచి ఆశీస్సులు పొందుతారని పండితులు చెబుతారు.మహాభారతంలోనూ ఈ అమావాస్య ప్రస్తావన..
మహాభారతంలోనూ మహాలయ అమావాస్య గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రకారం , కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లే సమయంలో దారిలో తనకు దాహం వేస్తుంది.
అప్పుడు తను ఓ నది దగ్గరకు వెళ్తాడు. అక్కడ నీటిని తాగేందుకు ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది.
ఆ తర్వాత కర్ణుడికి ఆకలి వేస్తుంది. అప్పుడు ఒకచోట మామిడి చెట్టు కనిపిస్తుంది. పండ్లను చూసి సంతోషపడ్డ కర్ణుడు వాటిని కోసేందుకు వెళ్లగా అవి కూడా బంగారంగా మారిపోతాయి.
సూర్య దేవుని ప్రార్థన
ఈ విచిత్ర సంఘటనలను చూసి తన తండ్రి అయిన సూర్య భగవానుడిని ప్రార్థిస్తాడు. తన సమస్యకు పరిష్కారం చూపమని కోరతాడు.
అప్పుడు సూర్యుడు కర్ణుడితో ఇలా అంటాడు. ‘నీవు భూలోకంలో ఎన్నో దానాలు చేశావు. అయితే ఏరోజు పితృ దేవతలకు అన్నదానం , శ్రాద్ధ కర్మలు నిర్వహించలేదు.
అందుకే ఇప్పుడీ పరిస్థితులు ఏర్పడ్డాయని’ సూర్యుడు వివరిస్తాడు. అప్పుడు పితృదేవతలకు , శ్రాద్ధ కర్మలు చేసే అవకాశం కల్పించాలని కోరతాడు.
ఇంద్రుని సహాయంతో
అప్పుడు కర్ణుడు ఇంద్రుని సహాయంతో భూలోకానికి వచ్చి పితృ దేవతలందరికీ తర్పణాలు , శ్రాద్ధ కర్మలు , అన్నదానం నిర్వహించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్లాడు.
ఆనాటి నుంచి పురాణాల ప్రకారం ఎవరైనా పితృ రుణాలను తీర్చుకోవాలి. అప్పుడే మీకు రెట్టింపు శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు...
భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య, ఆశ్వయుజ అమావాస్యలు చెప్పుకోదగినవి.
భాద్రపద అమావాస్యను ‘‘మహాలయ అమావాస్య’’ అని, ఆశ్వయుజ అమావాస్యని, దీపావళి అమావాస్య అని పిలుస్తారు. ఈ రెండు అమావాస్యలు పితృదేవతలకు సంబంధించినవి.
‘‘ఆషాఢీ మవధిం కృత్వా పంచమం పక్షమ్మాతాః కాంక్షంతి పితరః క్లిష్టా అన్నమప్యన్వహం జలమ్’’
ఆషాడ పూర్ణిమ మొదలు అయిదవ పక్షమును అనగా ఆషాఢ కృష్ణపక్షం, శ్రావణ రెండు పక్షములు, భాద్రపద శుక్లపక్షం, వెరశి నాలుగు పక్షములు (పక్షం అంటే పదిహేను రోజులు) గడిచిన తరువాత వచ్చేది,అయిదవ పక్షం, అదే భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షము’’లంటారు. చివరగా వచ్చే అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అంటారు.
ఈ పక్షములో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున, మహాలయ పక్షములలో పితృతర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే,
పితృదేవతలంతా సంవత్సర మంతా తృప్తి చెందుతారు, తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని పొందుతారు.
ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు, నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము, కృష్ణపక్షం పితృపదము, అదే మహాలయ పక్షము.
మహాలయమంటే :-
మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట, అని అర్థములు.
అమావాస్య అంతరార్థం:-
‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు.
సూర్యుడు – స్వయం చైతన్యం. చంద్రుడు జీవుడే. మనస్సుకు అధిపతి. అదే చంద్రుని ఉపాధి. మనస్సు పరమ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది.
అదే నిజమైన అమావాస్య. చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు, అమావాస్య తిధి మిట్ట మధ్యాహ్నమవుతుంది.
అందుకే భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.
మత్స్యపురాణగాథ :
పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వారి మానవ పుత్రిక ‘‘అచ్ఛోద’’. పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు.
ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు.
ఆ అచ్ఛోద, సరస్సు తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారు. వరము కోరుకోమన్నారు.
ఆమె వారిలో ‘‘మావసు’’ డను పితరుని కామ పరవశంతో వరునిగా కోరింది. యోగభష్ట్రురాలయింది.
దేవత్వంపోయి, భూమి మీద కొచ్చింది. మావసుడు, అచ్చోదను కామించలేదు. కనుక అచ్ఛోద ‘‘మావస్య’’ అనగా ప్రియురాలు అధీనురాలు కాలేకపోయింది. కనుక. ‘‘మావస్య’’ కాని ఆమె ‘‘అమావస్య’ కానీ ‘‘అమావాస్య’’ అయింది. తన తపస్సుచే పితరులను తృప్తినొందించిన అమావాస్య అనగా అచ్ఛోద, పితరులకు ప్రీతిపాత్రమయింది.
అందువలన, పితృదేవతలకు అమావాస్య (అచ్ఛోద) తిథి యందు పితులకు అర్పించిన తర్పణాది క్రియలు, అనంత ఫలప్రదము,
ముఖ్యంగా సంతానమునకు క్షేమము, అభివృద్ధికరము. తప్పును తెలిసికొన్న అచ్ఛోది మరల తపోదీక్ష వహించింది. జననీ జనకులను ప్రేమానురాగాలను అందించి,
మరణానంతరం కూడా వారికోసం యథావిధిగా నైమిత్తిక కర్మల నాచరించి, పితృతర్పణాదులనిస్తే, వారి ఋణం తీర్చుకున్న వాళ్లవుతారని, పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తోంది మహాలయ అమావాస్య...స్వస్తీ...




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home