భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ గారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ అంతర్జాతీయ స్కాలర్‌షిప్ విషయంలో కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తికి బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ గారు సూత్రప్రాయంగా ఆంగీకరించారు.
❇️ భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ గారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
వారితో పాటు డిప్యూటీ హైకమిషనర్ (హైదరాబాద్) గారెత్ విన్ ఓవెన్ గారు, పొలిటికల్ ఎకానమీ సలహాదారు నళిని రఘురామన్ గారు కూడా ఉన్నారు.
❇️ యూకే ప్రభుత్వం అంతర్జాతీయ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా అందిస్తున్న చెవెనింగ్ స్కాలర్‌షిప్ లను కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణకు చెందిన మెరిట్ విద్యార్థులకు అందించడానికి ఈ సందర్భంగా అంగీకరించారు. విద్య, సాంకేతిక సంబంధిత రంగాల్లో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి గారికి వివరించారు.
❇️ యూకేలోని యూనివర్సిటీల్లో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం అక్కడి వర్సిటీలు అడ్మిషన్లు, ఇతరత్రా కార్యక్రమాలను హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి గారు కోరారు. తెలంగాణలో కొత్తగా తీసుకురానున్న ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా గురించి ముఖ్యమంత్రి గారు బ్రిటిష్ హైకమిషనర్ గారికి వివరించారు.
❇️ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ అందించడానికి లిండీ కామెరాన్ గారు సుముఖత వ్యక్తం చేశారు.
❇️ అలాగే, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలని, ప్రధానంగా జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ సెంటర్లు, వివిధ అకాడమీలకు సంబంధిత రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి పట్ల బ్రిటిషన్ హైకమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home