Saturday, 31 January 2026

బంపర్ మెజారిటీ దిశగా చకిలం వసంత*

 *బంపర్ మెజారిటీ దిశగా చకిలం వసంత*



*ఏకమయిన చకిలం అభిమానులు*

    

         పదిరోజుల ముందు నల్గొండలోని 48  వార్డ్ లో కవితా దయాకర్ గెలుపు నల్లేరు పై నడకలా ఉండేది. ఎప్పుడైతే, బీఆర్ఎస్ అభ్యర్థిగా స్వర్గీయ చకిలం శ్రీనివాస రావు కోడలు, చకిలం అనిల్ సతీమణి వసంత  పోటీలోకి దిగిందో, ఏకంగా ఆమెను నల్గొండ మేయర్  అభ్యర్థిగా ప్రకటించడం తో ఒక్కసారిగా ... వార్డ్ రాజకీయాలు శరవేగంగా మారాయి. వారం రోజుల మూడు గెలుపుపై ధీమాగా ఉన్న కవితా దయాకర్  ఒక్కసారిగా నిరాశా నిస్పృహలోకి వెళ్లారు. ఎందుకంటే, కనక దుర్గ స్ట్రీట్ లోనే యామా దయాకర్ కు పూర్తి స్థాయిలో అనుచరగణం ఉండేది. ఇప్పుడు చకిలం వసంత పోటీ చేయడంతో ముందునుండి చకిలం కుటుంబానికి సన్నిహితంగా  ఉన్న కనకదుర్గ  స్ట్రీట్ తోపాటు మొత్తం వార్డులోని మెజారిటీ ఓటర్లు చకిలం వసంత కు మద్దతుగా బహిరంగంగానే బయటికి వచ్చారు. ఇక, యామా దయాకర్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి కోటాలో సీట్ రావడంతో, ఈ స్థానానికి ముందునుండి ఈ వార్డులో సీట్ కై  పోటీలో ఉన్న  పాత కాంగ్రెస్ వాదులు నిరుత్సాహహంతో సైలెంట్ అయ్యారు. వీరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తామని పార్టీ ఉన్నత స్థాయిలో నాయకులు ఫోన్ ద్వారా సంప్ర దింపులు జరుగుతున్నప్పటికీ, కోమటిరెడ్డి వర్గీయలు మాత్రం ససేమిరా అంటున్నారు.

         అయినప్పటికీ, చకిలం అనీల్ ఇప్పటికీ వార్డ్ లోని పెద్ద లందరినీ కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరగా వారందరూ అంగీకరించారు. అయితే, కొన్ని కారణాల వల్లబహిరంగంగా బయటికి చెప్పలేమని, తమతో పాటు తమ బంధువుల ఓట్లన్నీ చకిలం వసంత కె వేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా, ఇదే వార్డ్ లో తమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా చకిలం శ్రీనివాస్ రావు గారిపై ఉన్న అభిమానంతో చకిలం వసంత వైపు మొగ్గుతుండడం తో యమా దయాకర్ వర్గంలో మరింత ఆందోళన ఎక్కువైంది. ఈ వార్డుపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి ద్రుష్టి సాధించాక పోవడం, గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఈ వర్డ్ పై ఏమాత్రం అవగాహన లేకపోవడం కూడా అధికార పార్టీకి ప్రతికూల వాతావరణం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ నాలుగు రోజులు చకిలం వర్గీయులు కష్టపడితే, చకిలం వసంత బంపర్ మెజారిటీ తో గెలుస్తుందనేది కనకదుర్గ వీధిలో ఉన్న టాక్.

Thursday, 29 January 2026

నల్గొండ 45 వ మున్సిపల్ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గా గడాలె విజయ.

 


నల్గొండ 45 వ మున్సిపల్ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గా గడాలె విజయ.

నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ 45 వ డివిజన్ నుండి BRS పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా గడాలె విజయ ను ప్రకటించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా గడాలె విజయ మాట్లాడుతూ

 45 డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేయుచున్నానని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాననీ, ఈ ప్రయాణంలో డివిజన్ అందరి సహాయ సహకారం, మద్దతు నాకు ఎల్లప్పుడూ అవసరం అని, మీ నమ్మకానికి తగ్గట్టుగా, నిరంతరం మన డివిజన్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవలు అందిస్తానని హామీ ఇస్తున్నాననీ తెలిపారు. ఈ అవకాశాన్ని అందించిన మా ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననీ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాననీ తెలిపారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని డివిజన్ ప్రజలను అభ్యర్థించారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు

 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు


           :తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల పై ఆగీర్ వెంకటేశం వేసిన కేసుకు కోర్టు పిటిషనర్ యొక్క ప్రస్తుత పిటిషన్ ను ఈ రోజు కోర్టు అనుమతిస్తు, 24-02-2025న మెమో నెం.6395/Regn.II/2025 ద్వారా తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నికల అధికారి స్థానంలో న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమిస్త ఉత్తర్వులు జారీ చేసినది. ఈ తేదీ నుండి రెండు నెలల వ్యవధిలో ప్రతివాది నెం.1 సొసైటీ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యొక్క బై-లాస్ ప్రకారం ఎన్నికలను నిర్వహించడానికి మరియు ఓట్లను లెక్కించి, తదనుగుణంగా తగిన భద్రతతో ఫలితాలను ప్రకటించి, కోర్టు ముందు సమ్మతి నివేదికను దాఖలు చేయాలని ఆర్డర్ ఇచ్చింది. అడ్వకేట్ కమిషనర్ ఫీజు రూ.10,000/- గా నిర్ణయించబడిందనీ మరియు పిటిషనర్ అడ్వకేట్ కమిషనర్ ఫీజును అడ్వకేట్ కమిషనర్‌కు చెల్లించి, ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుండి (7) రోజులలోపు కోర్టు ముందు మెమోతో పాటు రసీదును దాఖలు చేయాలని ఆ ఆర్డర్ లో తెలిపింది.



Wednesday, 28 January 2026

-ఫైర్ సేఫ్టీపై హైడ్రా న‌జ‌ర్‌

 -ఫైర్ సేఫ్టీపై హైడ్రా న‌జ‌ర్‌
-త‌నిఖీల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశం
-సంబంధిత శాఖ‌ల‌తో హైడ్రా స‌మావేశం
-నింబంధ‌న‌లు ఉల్లంఘిస్తే సీజ్ చేయ‌డానికి సిద్ధం
-9000113667 నంబ‌రుకు ఫిర్యాదు చేయాలంటూ విన్న‌పం

✳️ ఫైర్ సేఫ్టీపై హైడ్రా దృష్టి పెట్టింది. ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌లు క‌చ్చితంగా అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. వ్యాపార స‌ముదాయాల నుంచి నివాస ప్రాంతాల వ‌ర‌కూ ఫైర్ సేఫ్టీలో ఎక్క‌డా అల‌స‌త్వాన్ని ఉపేక్షంచ‌రాద‌ని హైడ్రా నిర్ణ‌యించింది. ఇటీవ‌ల జ‌రిగిన అగ్ని ప్ర‌మాదాల నేప‌థ్యంలో ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకునేందుకు న‌డుం బిగించింది. జీహెచ్ ఎంసీ, ఫైర్‌, విద్యుత్ విభాగాల అధికారుల‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు బుధ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. ఫైర్ సేఫ్టీ కార్యాచ‌ర‌ణ వివ‌రించారు. వ్యాపార స‌ముదాయాలు, ఫ‌ర్నీచ‌ర్‌, వ‌స్త్ర దుకాణాలు ఇలా అన్ని చోట్లా త‌నిఖీలు ముమ్మ‌రం చేయాల‌న్నారు. ఫైర్ సేఫ్టీ పాటించ‌క‌పోతే.. ఆయా షాపుల‌ను సీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు.  వెనువెంట‌నే విద్యుత్ స‌ర‌ఫ‌రా బంద్ చేయాల‌ని.., ఫైర్ సేఫ్టీ లేని వ్యాపార స‌ముదాయంగా.., షాపుగా పేర్కొంటూ నోటీసులు అతికి పెట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. న‌గ‌ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో త‌నిఖీలు చేయాల‌ని అధికారుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు. 

-9000113667 నంబ‌రుకు స‌మాచార‌మివ్వండి..

✳️ అగ్ని ప్ర‌మాదానికి ఆస్కారం ఉన్న ప‌రిస్థితులుంటే వెంట‌నే హైడ్రా కంట్రోల్ రూం నంబ‌రు 9000113667 కు ఫోను చేసి స‌మాచారమివ్వాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను కోరారు.  ఎక్క‌డ అగ్ని ప్ర‌మాదానికి అవ‌కాశం ఉన్న ప‌రిస్థితులున్నాయో క‌రెంటు లొకేష‌న్‌తో పాటు.. వీడియోలు, ఫొటోలు పంపించాల‌ని సూచించారు. స‌మాచారం ఇచ్చిన‌వారి వివ‌రాలు గోప్యంగా ఉంటాయ‌న్నారు. న‌గ‌రంలోని అంద‌రి ల‌క్ష్యం అగ్ని ప్ర‌మాదాలు త‌గ్గించ‌డ‌మే కావాల‌ని కోరారు. గ‌తేడాది న‌గ‌రంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదాలు 36కు పైగా ఉన్నాయ‌ని.. నెల‌కు 3 చొప్పున ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయ‌ని గుర్తు చేశారు.  

-జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి ..

🔹నాంప‌ల్లిలో జ‌రిగిన ఫ‌ర్నీచ‌ర్ దుకాణం సెల్లార్‌ల‌లో లెక్క‌కు మించిన ఫ‌ర్నీచ‌ర్‌ను నెట్టులుగా పెట్టారు. సెల్లార్లోనే వాచ్‌మ్యాన్‌కు నివాసం క‌ల్పించారు. అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు షాపులో ఉన్న వారు బ‌య‌ట‌పడినా.. సెల్లార్‌లో ఉన్న వారు మంట‌ల్లో చిక్కుకున్నారు. ఇందులో కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు వ్య‌క్తులు కూడా ఉన్నారు. 

🔹వ‌స్త్ర దుకాణ‌దారులు, ఫ‌ర్నీచ‌ర్ షాపులతో పాటు ఇత‌ర వ్యాపారాలు చేసిన‌ వారు.. వారి నిలువ‌ల‌ను మెట్ల మార్గంలో, కారిడార్‌లో, సెల్లార్ల‌లో నిలువ ఉంచ‌రాదు. 

🔹ఇందుకు ప్ర‌త్యేకంగా జ‌న సంచారం లేని ప్రాంతాల్లో గోదాముల్లో నిలువ ఉంచుకోవాలి. 

🔹సెల్లార్ లు వాహ‌నాల పార్కింగ్ కోస‌మే వినియోగించాలి. పేలుడు, మండే స్వ‌భావం ఉన్న వ‌స్తువులు, ప‌దార్థాలు నిల్వ ఉంచ‌రాదు. 

🔹వ్యాపార స‌ముదాయాల్లో నివాసాలు ఏర్పాటు చేయ‌రాదు. అలాగే సెల్లార్ల‌లో వ‌ర్క‌ర్లు, వాచ్ మ్యాన్ కుటుంబాల‌కు గ‌దులు కేటాయించ‌డం చేయ‌రాదు. 

🔹సెల్లార్ నుంచి టెర్రాస్ వ‌ర‌కూ మెట్ల మార్గాలను ఎట్టి పరిస్థితులలో బ్లాక్‌, లాక్ చేయ‌రాదు. 

🔹షాపులు, వ్యాపార స‌ముదాయాల్లో ఉన్న అగ్ని నియంత్రణ పరికరాలు ఎల్లవేళలా పని చేసే విధంగా ఉంచుతూ, సిబ్బందికి అగ్ని పరికరాలపై తగిన అవ‌గాహ‌న క‌ల్పించాలి. 

🔹ఒక వేళ షార్టు స‌ర్క్యూట్‌తో అగ్ని ప్ర‌మాదం జ‌రిగినా దుకాణాల్లో ఉన్న వారు క్ష‌ణాల్లో బ‌య‌ట ప‌డేందుకు వీలుగా దారులు చూపించాలి. 

🔹అగ్ని ప్ర‌మాదం జ‌రిగితే వెంట‌నే మాన‌వ ప్ర‌మేయం లేకుండా మంట‌లను ఆర్పేందుకు ఉద్దేశించిన స్ప్రింక్ల‌ర్లు ప‌నిచేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలి.

Friday, 23 January 2026

విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూం ప్రారంభోత్సవం

 విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూం ప్రారంభోత్సవం

ఆర్యవైశ్య సంఘం కొత్తపేట మన సంఘం మహారాజ పోషకులు సేవా తత్పరులు మృదుస్వభావి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన వ్యాపారాన్ని ఆధ్యాత్మికతతో భక్తి మార్గముతో అనుసంధానం చేస్తూ విశిష్ట గోల్డెన్ డైమండ్ వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేస్తూ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద  ఈరోజు  వశిష్ట గోల్డెన్ డైమండ్  షోరూం మూడవ  బ్రాంచ్  ప్రారంభోత్సవం చేసిన శుభ సందర్భంగా  విశిష్ట గోల్డ్  అండ్ డైమండ్ అధినేత శ్రీ బలభట్ల ఆనంద్ అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుతుంది ఆర్యవైశ్య సంఘం కొత్తపేట మరి వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని సేవా కృషి పట్టుదల ఇంకా కలగాలని   ఇంకా మరిన్ని బ్రాంచ్ లు  ప్రారంభోత్సవాలు చేయాలని ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  పరిపూర్ణమైన ఆశీస్సులు అందజేసిన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షులు మాడూరి వాసు గుప్తా మరియు కార్యవర్గ సభ్యులు జై వాసవి జై జై వాసవి జైశ్రీరామ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి

acb రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ–1)గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నటువంటి కందాడి మధుసూదన్ రెడ్డిపై #అక్రమాస్తుల (డీఏ) కేసు నమోదు చేసిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు.

 రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ–1)గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నటువంటి కందాడి మధుసూదన్ రెడ్డిపై #అక్రమాస్తుల (డీఏ) కేసు నమోదు చేసిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు.


ఈ రోజు #అనిశా అధికారులు వారియొక్క నివాస గృహముతో పాటుగా వారి బంధువులు, స్నేహితులు మరియు ఇతర అనుచరులకు సంబంధించిన మరో ఏడు స్థలాల్లో సోదాలు నిర్వహించి ఈ క్రింది స్థిర, చరాస్తులను గుర్తించినారు.
ఈసీఐఎల్ ప్రాంతంలో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఒక మూడంతస్తుల భవనం; ఇబ్రహీంపట్నం మండలంలో ఒక బహిరంగ ప్లాటు మరియు ఒక ఎకరం వాణిజ్య భూమి; పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి మరియు ఈత కొలను కలిగి ఉన్న ఒక ఫామ్‌హౌస్; 1.2 కిలోల బంగారు ఆభరణాలు; నాలుగు చక్రాల వాహనాలు – 3 (ఫార్చ్యూనర్, వోల్వో, వోక్స్‌వ్యాగన్); నగదు – ₹9,00,000/-. గుర్తించబడిన ఆస్తుల మొత్తం (దస్తావేజు విలువ ప్రకారం) విలువ రూ.7,83,35,302/-.
అదేవిధంగా, వీరికి ‘ఏఆర్‌కే స్పిరిట్స్’ పేరుతో మద్యం వ్యాపారంలో సుమారు ₹80 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు, అలాగే తన భార్య మరియు పిల్లల పేర్లపై రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తించారు.
అదనపు ఆస్తులపై విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసు దర్యాప్తు లో ఉంది.

ఉచితంగా రూ.5 వేలంటూ సైబర్ మోసాలు.. జాగ్రత్త!

 ఉచితంగా రూ.5 వేలంటూ సైబర్ మోసాలు.. జాగ్రత్త!

సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో వస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్‌లో "PhonePe రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్", "సంక్రాంతి కానుక" అంటూ కొన్ని నకిలీ లింకులు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని క్లిక్ చేస్తే రూ. 5,000 ఉచితంగా పొందవచ్చని సైబర్ నేరగాల్లు ఆశపెడుతున్నారు.
"మొదట ఇది నకిలీ అనుకున్నాను, కానీ నిజంగానే నాకు రూ. 5,000 వచ్చింది! మీరు కూడా ప్రయత్నించి చూడండి! అంటూ ఒక లింక్‌ను షేర్ చేస్తున్నారు.
ఇది అమాయకులను బుట్టలో వేయడానికి నేరగాళ్లు వాడే ఒక సైకలాజికల్ ట్రిక్ మాత్రమే. మీకు తెలిసిన వారి నుండి లేదా గ్రూపుల నుండి ఇలాంటి సందేశాలు వస్తే ఒక్క నిమిషం ఆలోచించండి.
ఆ మెసేజ్ చివరన ఉండే లింకులను గమనించండి. అవి http://fdgc.lusvv.xyz లేదా http://iom.qmtyw.xyz వంటి వింత అక్షరాలతో ఉంటాయి. ఇవి అధికారిక PhonePe లింకులు కావని గ్రహించండి.
ఆశపడి ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్‌లోకి ప్రమాదకరమైన మాల్వేర్ ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ పిన్, పాస్‌వర్డ్‌లు తస్కరించి.. క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు.
PhonePe, Google Pay లేదా మరే ఇతర సంస్థ అయినా ఇలా వాట్సాప్ లింకుల ద్వారా డబ్బులు పంచదు. ఏ ఆఫర్ ఉన్నా అది వారి అధికారిక యాప్‌లోనే కనిపిస్తుంది.
ఒకవేళ పొరపాటున ఎవరైనా ఈ లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే, వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
@Cyberdost
@hydcitypolice
@CPHydCity

సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామాన్యుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని కోదాడ శాసనసభ్యురాలు శ్రీ

 


సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామాన్యుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని కోదాడ శాసనసభ్యురాలు శ్రీ

నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అన్నారు. సమాచార హక్కు వికాస సమితి సూర్యపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అండదండగా ఉండాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులు పొందేలా , ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు, ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమద కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సామాన్యుల చేతిలో బ్రహ్మాస్త్రం మని ,
ఈ చట్టంపై ప్రజలందరూ అవగాహన పొందాలని దాని విషయంలో ప్రతి ఒక్కరు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చేకూరి శివ, రాష్ట్ర సహాయ కార్యదర్శి వున్నం సత్యనారాయణ , జిల్లా గౌరవాధ్యక్షులు గుంటకండ్ల ముకుంద రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి, కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు పగిడిపల్లి యేసు పాదం, జిల్లా ఉపాధ్యక్షులు ముసుకుల గోవిందరెడ్డి, షేక్ అహ్మదు, కాసర్ల సురేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కిన్నెర ఉపేందర్రావు, జిల్లా కోశాధికారి పాతకోట్ల రామారావు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, సహాయ కార్యదర్శి SK రషిదు, నోముల బుచ్చయ్య, శ్రీను నెమ్మది పున్నయ్య, అఖిలు,చిన్నారి, రవి కృష్ణ,రవి, వర్మ పాల్గొన్నారు.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ నూతన కమిషనర్ గా బి. శరత్ చంద్ర గారు బాధ్యతలు స్వీకరణ..

 నల్లగొండ జిల్లా..

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ నూతన కమిషనర్ గా

బి. శరత్ చంద్ర గారు బాధ్యతలు స్వీకరణ..

లంచం తీసుకుంటూ హత్నూర్ మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి.

లంచం తీసుకుంటూ హత్నూర్ మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి.


 ఫిర్యాదుధారుని పేరిట 8.35 ఎకరాల భూమిని సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేసి పంపించడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ. 2,00,000/-

#లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన ఆదిలాబాద్ జిల్లా లోని బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి.

Sunday, 18 January 2026

కేస్లాపూర్‌ నాగోబా జాతరకు సర్వం సిద్ధం.. నేటి నుంచే

 కేస్లాపూర్‌ నాగోబా జాతరకు సర్వం సిద్ధం.. నేటి నుంచే 

తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ "నాగోబా జాతర"కు సర్వం సిద్ధమైంది. గిరిజనుల అత్యంత పవిత్రమైన ఈ జాతరను పుష్యమాస అమావాస్య సందర్భంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి 10 గంటలకు జరిగే మహాపూజలతో నాగోబా జాతర అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ పవిత్ర ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే అంకురార్పణ కార్యక్రమం సందర్భంగా.. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. అనంతరం ఏడు రకాల నైవేద్యాలు సమర్పించి జాతర ఆరంభ ఘట్టాన్ని పూర్తిచేస్తారు. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఆదివాసీలు కేస్లాపూర్‌కు తరలివస్తారు. Also Read "తెలంగాణలో 20మంది IPS అధికారుల బదిలీ" జాతరలో భాగంగా ఈ నెల 20న మెస్రం వంశీయులు ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇతరులకు ఆలయంలో ప్రవేశం పూర్తిగా నిషేధం ఉంటుంది. అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్ పూజలు, అలాగే మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొనే భాన్ దేవత పూజలు


జరుగుతాయి. ఇవి గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఈ నెల 22న మంత్రులు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తమ సమస్యలు, అవసరాలు, సంక్షేమ పథకాలపై సూచనలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది నాగోబా జాతరలో అత్యంత ప్రాముఖ్యమైన భాగంగా భావిస్తారు. తదుపరి రోజు 23న భేతల్ పూజలు, మండ గాజిలింగ్ కార్యక్రమాలతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగుస్తాయి. అయితే పూజలు ముగిసినా, నాగోబా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఈ నెల 25 వరకు కొనసాగనుంది.

Friday, 16 January 2026

అమెరికా వెళ్లాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. 75 దేశాల వీసాలు ఫ్రీజ్, పూర్తి వివరాలు ఇవే!

 


అమెరికా వెళ్లాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. 75 దేశాల వీసాలు ఫ్రీజ్, పూర్తి వివరాలు ఇవే!

అమెరికా వెళ్లాలనుకునే వారికి, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ లేదా పర్మినెంట్ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ట్రంప్ ప్రభుత్వం వలసల విషయంలో తన ఉక్కుపాదాన్ని మోపింది. ఏకంగా 75 దేశాలకు చెందిన పౌరులకు 'ఇమ్మిగ్రెంట్ వీసాలను' నిరవధికంగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల ఎవరికి నష్టం? ఇండియా పరిస్థితి ఏంటి? అసలు ఈ 'పబ్లిక్ ఛార్జ్' రూల్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం.


us visa freeze 75 countries list 2026 impact on india and public charge rule details

సంచలన నిర్ణయం: జనవరి 21 నుంచే అమలు!

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 21 నుండి పాకిస్తాన్, రష్యా, థాయ్‌లాండ్, ఇరాన్, బ్రెజిల్ వంటి దాదాపు 75 దేశాల పౌరులకు ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తున్నారు. అమెరికా పౌరసత్వం లేదా శాశ్వత నివాసం (Green Card) కోరుకునే వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ. అమెరికాలోని సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సాయంపై ఆధారపడే అవకాశం ఉన్నవారిని అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

ఎందుకీ వీసాల నిలిపివేత?

దీని వెనుక పబ్లిక్ చార్జ్ (Public Charge)అనే కీలకమైన నిబంధన ఉంది. అంటే ఎవరైనా విదేశీయుడు అమెరికాకు వచ్చి అక్కడి ప్రభుత్వ ధనం (Welfare benefits) మీద ఆధారపడి బతుకుతారని అనిపిస్తే.. వారికి వీసా నిరాకరించే అధికారం కన్సులర్ అధికారులకు ఉంటుంది.

  • వయస్సు, ఆరోగ్యం: వృద్ధులు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వీసా రావడం కష్టమే.
  • ఆర్థిక స్థితి: అప్లై చేసే వ్యక్తి ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాడో గమనిస్తారు.
  • భాషా నైపుణ్యం: ఇంగ్లీష్ రాకపోయినా, సరైన చదువు లేకపోయినా వీసా తిరస్కరించే అవకాశం ఉంది.
  • గత రికార్డు: గతంలో ఎప్పుడైనా ప్రభుత్వ నగదు సాయం పొంది ఉన్నా ఈ నిబంధన వర్తిస్తుంది.

ప్రభావితమయ్యే దేశాలు ఇవే..

ఈ జాబితాలో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఇవే కాకుండా రష్యా, బ్రెజిల్, ఈజిప్ట్, నైజీరియా, థాయ్‌లాండ్ వంటి 75 దేశాల వారిపై ఈ ప్రభావం పడనుంది. సోమాలియా వంటి దేశాల్లో జరిగిన ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కారణంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారతీయులకు ఊరట.. కానీ అప్రమత్తత అవసరం!

ప్రస్తుతానికి ఈ 75 దేశాల జాబితాలో భారత్ (India) పేరు లేదు. అంటే భారతీయ విద్యార్థులకు (F1 Visas) లేదా ఉద్యోగులకు (H-1B Visas) నేరుగా ఇబ్బంది లేదు. అయితే భారతీయ విద్యార్థులకు అమెరికా ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ చదువుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఊరుకోమని స్పష్టం చేసింది. అంటే రూల్స్ అతిక్రమికస్తే కెరీర్, వీసా గోవిందా! అంతేకాకుండా మీ భార్య లేదా భర్త ఈ 75 దేశాల్లో ఏదో ఒక దేశానికి చెందిన వారైతే, వారి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఏది ఏమైనా అమెరికా మాత్రం ఇమ్మిగ్రేషన్ పై కఠింగా వ్యవహిరిస్తుంది అని అర్థమవుతోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతీయులపై కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం 'ఇమ్మిగ్రెంట్' (శాశ్వత నివాసం) వీసాలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి టూరిస్ట్ వీసాలు (B1/B2), స్టూడెంట్ వీసాలు, హెచ్-1బి వంటి తాత్కాలిక వీసాలపై వెళ్లే వాళ్లు పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు: స్పీకర్ కు సుప్రీంకోర్టు షాక్!

 ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు: స్పీకర్ కు సుప్రీంకోర్టు షాక్!

                               బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం పైన కీలక పరిణామం చోటు చేసుకుంది. ధర్మాసనం ఈ వ్యవహారం పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సమయం ఇచ్చిన సుప్రీం ధర్మాసనం తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న సుప్రీం ఈరోజు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం పైన విచారణ చేపట్టిన ధర్మాసనం ఇప్పటివరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సీరియస్ అయింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ఇది చివరి అవకాశం అని అల్టిమేటం జారీ చేసింది. ఇకపైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోకపోతే తీవ్రంగా వ్యవహరించాల్సి వస్తుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే వింటర్ వెకేషన్ తర్వాత తొలిసారిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జి ధర్మాసనం ఈ కేసును విచారించింది ఇదిలా ఉంటే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారిపైన దాఖలు చేసిన అనర్హత పిటీషన్లు కొట్టివేశారు. గత ఏడాది నవంబర్ లోనే సుప్రీం కీలక ఆదేశం తాజాగా జనవరి 15వ తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య ఫిరాయింపులపైన ఇచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. వారిపైన పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవని ఆ ఇద్దరు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కేసును గత ఏడాది నవంబర్ నెలలో విచారణ మొదలు పెట్టిన సుప్రీం ధర్మాసనం స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల గడువును ఇచ్చింది.

                          స్పీకర్ పై సుప్రీం ఆగ్రహం అర్హత పిటిషన్ల పైన ఈలోపే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. ఇక నవంబర్ వాయిదా తర్వాత మళ్లీ ఇప్పుడు విచారణ జరిపిన క్రమంలో సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం, మరో ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. 

               సంక్రాంతి వేళ  పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్. అందరికీ రూ.5వేలు..నిజమేనా! చివరి అవకాశం అంటూ స్పీకర్ కు అల్టిమేటం స్పీకర్ కు చివరి అవకాశం ఇస్తున్నామని, ఈ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందంటూ హెచ్చరికను జారీ చేసింది. మరి ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది.

Tuesday, 13 January 2026

50 వేల లంచం తో ఏసీబికి చిక్కిన అవినీతి అధికారులు


 50 వేల లంచం తో ఏసీబికి చిక్కిన అవినీతి అధికారులు

ఫిర్యాదుధారునికి వనపర్తి జిల్లాలో గల రైస్ మిల్లుకు ప్రభుత్వ సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించడం కోసం" ఫిర్యాదుధారుని నుండి 50 వేల రూపాయలు
#లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ కార్యాలయంలోని
అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) &
వనపర్తి జిల్లా ఇన్‌ఛార్జ్ మేనేజర్‌ - కుంభ జగన్ మోహన్ మరియు ప్రైవేట్ డ్రైవర్ - లావుడ్యా లక్ష్మణ్ నాయక్‌.

Thursday, 8 January 2026

జర్నలిస్టు వద్ద లంచం తీసుకొని ఏసీబీ కి చిక్కిన పంచాయతీ అధికారులు

జర్నలిస్టు వద్ద లంచం తీసుకొని  ఏసీబీ కి చిక్కిన పంచాయతీ అధికారులు




 ఈదులపల్లి వద్ద నిర్మాణం పనులకు లంచం 2.50 లక్షల లక్ష్యం, లక్షన్నర చెల్లించినా అందని అనుమతులు, ఏసీబీని ఆశ్రయించిన జర్నలిస్ట్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న జిల్లా ఏసీబీ శాఖ డిఎస్పి ఆనంద్. 

 *షాద్ నగర్ లో సంచలనం* 

సింహం పడుకుంది కదా అని దాని తలను దువ్వెనతో దువ్వాలని చూడకూడదు.. తొక్కుతున్నది తోకే కదా అని పాము జోలికి వెళ్ళకూడదు.. అలాంటిది షాద్ నగర్ లో ఒక దిన పత్రికకు పాత్రికేయుడుగా పనిచేస్తున్న వ్యక్తిని నిర్భయంగా లంచం అడిగి, కాగితాలు ఇవ్వకుండా వేధించి చివరికి ఏసీబీ అధికారులకు బుక్ అయ్యారు.. షాద్ నగర్ నియోజకవర్గంలో నందిగామలో సంచలనం ఇది. జర్నలిస్ట్ దెబ్బకు రంగంలోకి దిగిన ఎసిపి శాఖ డిఎస్పి ఆనంద్ లంచం ఆశించిన నందిగామ ఎంపీడీవో సుమతి, ఎంపీఓ ధీర్ సింగ్, వీఆర్వో చెన్నయ్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి లంచావతారాలకు తెరదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 *జరిగిన కథ..* 

షాద్ నగర్ పరిధిలో ఓ ప్రముఖ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న జర్నలిస్టు నందిగామ మండలం ఈదులపల్లి పరిధిలో రిసార్ట్స్ నడిపిస్తున్నాడు. అందులో కొన్ని గెస్ట్ హౌస్ ల నిర్మాణాల నిమిత్తం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, వీఆర్వో చెన్నయ్యలు ఈ అనుమతుల కోసం ఐదు లక్షలు లంచం ఇవ్వాలని పట్టుబట్టారు. తాను అంత ఇచ్చుకోలేనని బతిమాలగా 2.50 లక్షలకు బేరం కుదిరింది. ఇందులో లక్షన్నర బాధితుడు చెల్లించాడు. కానీ మిగతా లక్ష రూపాయలు ఇచ్చేదాకా అనుమతి పత్రాలు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. ఇంత బహిరంగంగా జరుగుతున్న అవినీతిని చూసి సహించలేకపోయిన జర్నలిస్టు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది..

 *రంగంలోకి అధికారులు..* 

ఏసీబీ అధికారుల వ్యూహం ప్రకారం బుధవారం మిగతా డబ్బులు ఇచ్చేందుకు జర్నలిస్టు సమ్మతం తెలిపి వారు చెప్పిన ప్రకారమే అధికారులను కలిసి డబ్బులు చెల్లించాడు. అప్పటికే పంచుకున్న ప్రభుత్వ అధికారి సిబ్బందినీ ఏసీబీ అధికారులు డిఎస్పి ఆనంద్ తో సహా ఇతర పోలీసులు రంగంలోకి దిగి ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, వీఆర్వో చెన్నయ్య లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి లంచం రూపంలో తీసుకున్న లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై డిఎస్పి ఆనంద్ మాట్లాడుతూ ఫిర్యాదు మేరకు ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరు పరచనున్నట్లు వెల్లడించారు. అనుమతుల కోసం లంచం అడిగిన వివరాలు వాస్తవమేనని ధ్రువీకరించారు.

 *మరి ఇంత బరితెగింపా..* 

ఎక్కడైనా అవినీతి జరిగినా, ఎవరైనా లంచాలు అడిగినా దానిని వెలుగులోకి తెచ్చి ఆ అన్యాయానికి అక్షర రూపం ఇచ్చి బాధితులకు న్యాయం చేసేది జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులని బహిరంగంగా లంచం అడిగారంటే అధికారులు ఏ స్థాయికి తెగించి తమ విధులు నిర్వహిస్తున్నారో ఇక్కడ స్పష్టమవుతుంది. ఎవరైతే నాకేంటి.. లంచం ఇవ్వాల్సిందే.. అన్నట్లుగా నిస్సిగ్గుగా వ్యవహరించడం వల్లనే అధికారులు వరుసగా ఏసీబీకి బుక్ అవుతున్నారు. ఇంతకుముందు కూడా నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఒక జర్నలిస్టును గెలికితే ఎలా ఉంటుందో.. అధికారులకు ఇప్పుడు అర్థం అయి ఉంటుంది. నిజాయితీగా వ్యాపార దృక్పథంతో సొంత డబ్బులతో భవనం నిర్మించుకుంటే దాని అనుమతులు కూడా లంచం అడిగారంటే ఈ అధికారులను ఏమనాలి.

ఏసీబీ వలకు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్

ఏసీబీ వలకు   ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ 

 

             ఎండోమెంట్ శాఖ కమిషనర్ బొగ్గులకుంట హైదరాబాద్‌లోని 2వ అంతస్తులో ఉన్న ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్, హైదరాబాద్ తెలంగాణ కార్యాలయం వద్ద నిందితుడైన అధికారి ఆకవరం కిరణ్ కుమార్, ఇన్‌స్పెక్టర్. ఎండోమెంట్ తన కార్యాలయ ప్రాంగణం పక్కన సిటీ రేంజ్-1లోని ఏసీబీ  సిబ్బందికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు, అంటే RC నంబర్ E/944/2021 ప్రకారం, బాగ్ అంబర్‌పేట్‌లోని భూమికి సంబంధించి ఫిర్యాదుదారునికి సర్వే నివేదికను జారీ చేయడానికి, ఫిర్యాదుదారుని నుండి రూ. 1.50,000/- లంచం మొత్తాన్ని చెల్లించమని డిమాండ్ చేసి, లంచం మొత్తాన్ని రూ. 50,000/- చెల్లించమని అతను డిమాండ్ చేశాడు.



ఏవో వద్ద నుండి తీసుకున్న కళంకిత లంచం మొత్తం రూ. 50,000/- అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. 

Wednesday, 7 January 2026

తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు

 

తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్‌ ల బదిలీలు..

   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే భారీ స్థాయిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్‌ ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు మొత్తం నాలుగు కమిషనరేట్ల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జోన్ లకు డీసీపీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
Massive IPS Shake-Up in Telangana Over 20 Officers Transferred in Major Reshuffle

తెలంగాణ పోలీసు శాఖలో పాలనా పరంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం నాలుగు కమిషనరేట్ల పరిధిలో నూతనంగా ఏర్పాటైన జోన్ లకు పలువురు డీసీపీలను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈమేరకు తాజాగా మరో 20 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌ లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు    

ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు


 ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు 

          తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2018 సెప్టెంబర్ 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్‌ను, అతని భార్య అమృత ఎదుటే నడిరోడ్డుపై దారుణంగా నిరికి చంపారు. ఈ ఘటనలో అమృత తండ్రే ప్రధాన ముద్దాయి కాగా.. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణయ్ ను కులాంతర వివాహం చేసుకున్నందుకు అమృత తండ్రి మారుతిరావు శ్రవణ్ కుమార్‌ సుఫారీ కిల్లర్ ద్వారా నడిరోడ్డపై హతం చేయించాడు. 2018 నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం నల్లగొండ జిల్లా కోర్టు గతేడాది కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రవణ్ కుమార్ తో పాటు ఇతర నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు వెలువడినప్పుడు బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందన్న భావన సమాజంలో వ్యక్తమైంది. 

        జీవిత ఖైదు శిక్షపై అప్పీల్ జిల్లా కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై విధించిన జీవిత ఖైదు శిక్షపై అప్పీల్ దాఖలు చేసిన అతడు, అప్పీల్‌పై తుది విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తు వేశాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఎందుకు బెయిల్ ఇచ్చింది? Recommended For You " తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక - కీలక హామీ అమలు..!!" నిందితుడు ఇప్పటికే గణనీయమైన కాలం జైలులో ఉండటం, అతని వయస్సు, అప్పీల్ విచారణకు పట్టే సమయం వంటి అంశాలను కోర్టు గమనించింది. అప్పీల్ కేసుల తుది విచారణకు ఆలస్యం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, తాత్కాలికంగా బెయిల్ ఇవ్వాలని ధర్మాసనం నిర్ణయించింది. అయితే ఇది పూర్తి విముక్తి కాదని, కేవలం అప్పీల్ పరిష్కారం వచ్చే వరకు మాత్రమే వర్తించే బెయిల్ అని కోర్టు స్పష్టంగా పేర్కొంది. Powered By కఠిన షరతులు విధించిన హైకోర్టు శ్రవణ్ కుమార్ రూ.25 వేల విలువైన వ్యక్తిగత బాండ్ సమర్పించాలి. అదేవిధంగా మరో రూ.25 వేల మొత్తానికి ఇద్దరు పూచీకత్తుదారులను చూపించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు విధించిన షరతులను కచ్చితంగా పాటించాలని, ఏదైనా ఉల్లంఘన జరిగితే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. 

        కొత్త దశలోకి కేసు హైకోర్టు బెయిల్ మంజూరుతో ప్రణయ్ హత్య కేసు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. అప్పీల్ విచారణలో జిల్లా కోర్టు తీర్పు నిలబడుతుందా? లేక నిందితులకు ఉపశమనం లభిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ తీర్పుపై అమృత ఇంకా రియాక్ట్ అవ్వలేదు. మరోవైపు నిందితుడి న్యాయవాదులు మాత్రం హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అప్పీల్ విచారణలో బలమైన వాదనలు వినిపిస్తామని చెబుతున్నారు. ప్రణయ్ హత్య కేసు ఇప్పటికీ సమాజాన్ని కదిలిస్తున్న నేపథ్యంలో, హైకోర్టు తుది తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Sunday, 4 January 2026

మోదీపై విమర్శలకు తిప్పికొట్టిన డా. చికోటి ప్రవీణ్ –



*మోదీపై విమర్శలకు తిప్పికొట్టిన డా. చికోటి ప్రవీణ్ – కూనంనేని వ్యాఖ్యలపై స్పష్టమైన హెచ్చరిక*



*• నోరు అదుపులో పెట్టుకోండి – ఇప్పటికే మీ బతుకులు రోడ్డు మీదే, పార్టీ వెంటిలేషన్‌పై ఉంది: కూనంనేనికి ఘాటు హెచ్చరిక*


*• ప్రజాస్వామ్య విలువలు మరిచిన విమర్శలు – కూనంనేని వ్యాఖ్యల్లో రాజకీయ దివాళాకోరుతనం బయటపడింది*


*•దేశ గౌరవాన్ని పెంచుతున్న నాయకుడిపై దూషణలు దురదృష్టకరం – రాజకీయ హుందాతనంపై డా. చికోటి ప్రవీణ్ హెచ్చరిక*


*•ప్రధానిపై వ్యక్తిగత దూషణలు రాజకీయ పతనానికి నిదర్శనం – కూనంనేనిపై డా. చికోటి ప్రవీణ్ తీవ్ర విమర్శలు*


*•అంతర్జాతీయంగా భారత్‌కు ఖ్యాతి తెచ్చిన నాయకుడిపై ఆరోపణలా? – మోదీకి మద్దతుగా డా. చికోటి ప్రవీణ్ ఫైర్*


*•హుందాతనం లేకపోతే దివాళాకోరుతనమే – కూనంనేని వ్యాఖ్యలపై డా. చికోటి ప్రవీణ్ ఫైర్*


*•హుందాతనం–పరిణతి కావాలి, విషపూరిత వ్యాఖ్యలు కాదు – మోదీపై విమర్శలకు డా. చికోటి ప్రవీణ్ ఘాటు కౌంటర్*

ఆర్యవైశ్య ప్రముఖులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్న డా. చికోటి ప్రవీణ్ – సామాజిక ఐక్యతకు పిలుపు*

 *ఆర్యవైశ్య ప్రముఖులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్న డా. చికోటి ప్రవీణ్ – సామాజిక ఐక్యతకు పిలుపు*




తెలుగు ప్రజల ఆత్మగౌరవం, స్వయంప్రభుత్వ ఆకాంక్షలకు చిరస్మరణీయ ప్రతీకగా నిలిచిన, తెలుగు రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగస్ఫూర్తిని భావితరాలకు సజీవంగా అందించాలనే మహత్తర సంకల్పంతో అమరావతిలో ఒక చారిత్రక ప్రయత్నం కొనసాగుతోంది. ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం మరియు స్మృతి వనం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా, ఈ తరం మాత్రమే కాదు రాబోయే తరాలకూ త్యాగం, సేవ, ప్రజాస్వామ్య విలువల పాఠాన్ని అందించాలనే దృఢ సంకల్పం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం తెలుగు సమాజానికి శాశ్వత గర్వకారణంగా నిలిచి, రాష్ట్ర రాజకీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మార్గదర్శకంగా నిలవనుంది.


*ఈ లక్ష్య సాధనలో భాగంగా ట్రస్ట్ విధి–విధానాలపై విస్తృత చర్చలు జరిపి, సమాజంలోని వివిధ వర్గాల అభిప్రాయాలు, ముఖ్యంగా ఆర్యవైశ్య ప్రముఖుల అమూల్యమైన సలహాలు, సూచనలు, సహాయసహకారాలను సమీకరించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని ది సఫైర్, తాజ్ కృష్ణ, బంజారా హిల్స్ వేదికగా ఇష్టాగోష్టిని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా స్మారక నిర్మాణం మాత్రమే కాకుండా, సమాజ ఐక్యత, సాంస్కృతిక పరిరక్షణ, ప్రజాసేవలో భాగస్వామ్యాన్ని పెంపొందించే స్పష్టమైన దిశానిర్దేశం వెలువడింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, హిందూ ధర్మ రక్ష ఫౌండర్ గౌరవ డా. చికోటి ప్రవీణ్ గారు హాజరై, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ మహత్తర యత్నానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజా చైతన్యం, ధర్మ పరిరక్షణ, జాతీయ ఐక్యతకు ఇలాంటి ప్రయత్నాలు ఆదర్శంగా నిలవాలని, ఈ స్మారక ప్రాజెక్టు విజయవంతమై తెలుగు సమాజ గౌరవాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.*

సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త, టోల్‌గేట్ల వద్ద నో బ్రేక్ - బిగ్ డెసిషన్..!!

సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త, టోల్‌గేట్ల వద్ద నో బ్రేక్ - బిగ్ డెసిషన్..

సంక్రాంతి ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. ప్రతీ ఏటా సంక్రాంతి సమయంలో రెండు రాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలో ప్రయాణాలు జరుగుతాయి. టోల్ గేట్ల వద్ద వేల సంఖ్యలో రాకపోకలు చోటు చేసుకుంటాయి. దీంతో.. టోల్ గేట్ల వద్ద రద్దీ ఏర్పడి.. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో, ఈ సారి ముందుగానే అధికారులు అలర్ట్ అయ్యారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫాస్టాగ్ యూజర్లు ఈ సారి టోల్ గేట్ల వద్ద బ్రేకులు వేయకుండానే.. దూసుకెళ్లే విధంగా అవకాశం కల్పించారు. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ - విజయవాడ మధ్య వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయి. ప్రతీ ఏటా టోల్ గేట్ల వద్ద భారీ వాహనాల రద్దీ.. నిరీక్షణ ప్రయాణీకుల సహనానికి పరీక్షగా మారుతోంది. దీంతో.. ఈ సారి అధికార యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తం అయింది. కీలక నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బూస్టర్ లైన్ల విధానం అమలు చేయాలని డిసైడ్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ భారీగా ఏర్పడనుంది. దీనిని నివారించేందుకు టోల్‌ప్లాజాల వద్ద బూస్టర్ లైన్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం శంషాబాద్, బొంగలూరు, పెద్ద అంబర్‌పేట టోల్‌ప్లాజాల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.

                              ఈ బూస్టర్ బారియర్ల వద్ద ఫాస్టాగ్ వాహనాలు ఇక టోల్‌ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే నేరుగా వెళ్లిపోయేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇందుకోసం టోల్‌గేట్ల వద్ద రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా వాహనాలు ఆగకుండా త్వరగా వెళ్లవచ్చు. ప్రస్తుతం ఇక్కడ 12 నుంచి 15 టోల్ బూత్‌లు ఉండగా.. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సరిపోవడం లేదు. దీంతో ఈ బూస్టర్ బారియర్స్‌ను పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా.. సంక్రాంతి సమయంలో వాహనదారుల దగ్గర టోల్‌ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా అనుమతించాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఇక మంత్రి నారా లోకేష్ కూడా టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా అనుమతించాలని కోరారు. దీంతో కేంద్రం కూడా టోల్ ఫీజు మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.