తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్ ల బదిలీలు..

తెలంగాణ పోలీసు శాఖలో పాలనా పరంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం నాలుగు కమిషనరేట్ల పరిధిలో నూతనంగా ఏర్పాటైన జోన్ లకు పలువురు డీసీపీలను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈమేరకు తాజాగా మరో 20 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు
వీరిలో హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు కమిషనర్ గా తస్వీర్ ఇక్బాల్ నియామకం అయ్యారు. అలాగే హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ గా శ్వేత నియమితులయ్యారు. ఫ్యూచర్ సిటీ మహేశ్వరం జోన్ డీసీపీగా నారాయణ్ రెడ్డి, సికింద్రాబాద్ జోన్ డీసీపీగా రక్షిత మూర్తి, ఉప్పల్ జోన్ డీసీపీగా సురేష్కుమార్, చార్మినార్ జోన్ డీసీపీగా కారే కిరణ్, ఎల్బీనగర్ డీసీపీగా అనురాధ, కూకట్పల్లి డీసీపీగా రితిరాజ్, సిద్దిపేట సీపీగా రేష్మి పెరుమాళ్.. తదితరులు బదిలీ అయ్యారు.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home