ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు: స్పీకర్ కు సుప్రీంకోర్టు షాక్!
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు: స్పీకర్ కు సుప్రీంకోర్టు షాక్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం పైన కీలక పరిణామం చోటు చేసుకుంది. ధర్మాసనం ఈ వ్యవహారం పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సమయం ఇచ్చిన సుప్రీం ధర్మాసనం తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న సుప్రీం ఈరోజు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం పైన విచారణ చేపట్టిన ధర్మాసనం ఇప్పటివరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సీరియస్ అయింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ఇది చివరి అవకాశం అని అల్టిమేటం జారీ చేసింది. ఇకపైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోకపోతే తీవ్రంగా వ్యవహరించాల్సి వస్తుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే వింటర్ వెకేషన్ తర్వాత తొలిసారిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జి ధర్మాసనం ఈ కేసును విచారించింది ఇదిలా ఉంటే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారిపైన దాఖలు చేసిన అనర్హత పిటీషన్లు కొట్టివేశారు. గత ఏడాది నవంబర్ లోనే సుప్రీం కీలక ఆదేశం తాజాగా జనవరి 15వ తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య ఫిరాయింపులపైన ఇచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. వారిపైన పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవని ఆ ఇద్దరు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కేసును గత ఏడాది నవంబర్ నెలలో విచారణ మొదలు పెట్టిన సుప్రీం ధర్మాసనం స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల గడువును ఇచ్చింది.
స్పీకర్ పై సుప్రీం ఆగ్రహం అర్హత పిటిషన్ల పైన ఈలోపే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. ఇక నవంబర్ వాయిదా తర్వాత మళ్లీ ఇప్పుడు విచారణ జరిపిన క్రమంలో సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం, మరో ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం.
సంక్రాంతి వేళ పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్. అందరికీ రూ.5వేలు..నిజమేనా! చివరి అవకాశం అంటూ స్పీకర్ కు అల్టిమేటం స్పీకర్ కు చివరి అవకాశం ఇస్తున్నామని, ఈ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందంటూ హెచ్చరికను జారీ చేసింది. మరి ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home