Friday, 28 November 2025

ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన తహసీల్దార్

 ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన తహసీల్దార్


భూ భారతి రికార్డుల్లో పేరును నమోదు చేయడానికి లంచం తీసుకుంటూ తహసీల్దార్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు.


మహబూబాబాద్ : భూ భారతి రికార్డుల్లో పేరును నమోదు చేయడానికి లంచం తీసుకుంటూ తహసీల్దార్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామ శివారులోని పడమటి తండా గ్రామపంచాయతీకి చెందిన భూక్యా బాలు అనే రైతు తన తండ్రి మరణించారు.


భూక్యా స్వామి మృతి చెందడంతో తండ్రిపేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద భూ భారతి రికార్డుల్లో నమోదు చేయించుకోవడానికి తహసీల్దార్‌ వీరగంటి మహేందర్‌ను కలిశాడు. రూ.25వేల లంచంను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం 15 వేల రూపాయలు ఇస్తూ శుక్రవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Monday, 24 November 2025

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించిన : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించి




స్వామివారి కృప, ఆశీర్వాదాలు పొందాను.


దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం అధికారులు చేపడుతున్న చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించి, అవసరమైన సూచనలు అందజేశాను. 

భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Friday, 21 November 2025

కార్పొరేషన్లో ACB తనిఖీలు

 కార్పొరేషన్లో ACB తనిఖీలు



నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.


వినాయక నగర్, నవంబర్ 19 : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 

ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని వివిధ విభాగాలలో తమ పనుల నిమిత్తం జనాలతో హడావిడిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు వచ్చి నేరుగా టౌన్ ప్లానింగ్ కార్యాలయంలోకి వెళ్లారు.

 దీంతో ఏం జరిగిందోనని అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

Tuesday, 18 November 2025

కాచిగూడలోని వాసవి విద్యార్థినీ వసతి గృహం 43వ వార్షిక హాస్టల్ డే వేడుకలు:డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి



 హైదరాబాద్, నవంబర్‌ 18: కాచిగూడలోని వాసవి విద్యార్థినీ వసతి గృహం 43వ వార్షిక హాస్టల్ డే వేడుకల్లో ఘనంగా పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, టిటియూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి గారితో కలిసి విద్యార్థినులను ఆశీర్వదించారు.


ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ, విద్యార్థినులు విద్యాభ్యాసంలో ముందుకు సాగేందుకు ఇలాంటి వసతి గృహాలు ఎంతో మేలుకలిగిస్తాయని తెలిపారు. సురక్షిత వసతి, మంచి అకడమిక్ వాతావరణం, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.


టిటియూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యే సమాజ ప్రగతికి ప్రధాన ఆధారం అని పేర్కొన్నారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు.


వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభాపురస్కారాలు విద్యార్థినుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. నిర్వాహకులు హాస్టల్ డేను విజయం వంతం చేసినందుకు ఉపమేయర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.


అధిబాట్ల మున్సిపాలిటీలో ACB దాడులు


 అధిబాట్ల మున్సిపాలిటీలో ACB దాడులు


"G+4 భవనాన్ని నిర్మించుకోవడానికి కావలసిన అనుమతి కోసం గల ప్రక్రియను ప్రాసెస్ చేసి, అనుమతిని జారీ చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.75,000/- 

#లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన #రంగారెడ్డి జిల్లాలోని #ఇబ్రహీంపట్నం మండలం, #ఆదిబట్ల #పురపాలక సంఘంలోని పట్టణ ప్రణాళిక అధికారి బందెల వరప్రసాద్ మరియు అతని సహాయకుడు వడాల వంశీ కృష్ణ.

Monday, 17 November 2025

ACB. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్


 రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో తన రేషన్ షాపులో స్టాక్ లేనందుకు, పనివేళ్లలో రేషన్ షాపు మూసివేసినందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, రేషన్ షాపు యజమాని వద్ద రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా


డీలర్ల సంఘం అధ్యక్షుడి ద్వారా లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా, గిరిజన సాంకేతిక సహాయకుడు విజయ్ కుమార్ ను హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఇమ్మడి రవికి ముందు నుండే క్రిమినల్ మెంటాలిటీ ఉంది: - సీపీ సజ్జనార్

 ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు


ఇమ్మడి రవికి ముందు నుండే క్రిమినల్ మెంటాలిటీ ఉంది


కరేబియన్, ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాలలో తిరుగుతూ వెబ్‌ okసైట్స్ డిజైన్ చేస్తూ సినిమాలు అప్లోడ్ చేసేవాడు


2019లో ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను తెరిచి 110 డొమైన్లతో ఆపరేట్ చేసేవాడు


ఇమ్మడి రవి వెనకాల ఎవరున్నారు అనేది లోతుగా విచారణ చేస్తాం - సీపీ సజ్జనార్


Friday, 7 November 2025

 https://heyzine.com/flip-book/7979c848bb.html

బస్తీలే టార్గెట్‌‌గా నాయకుల ప్రచారం.. ప్రాంతాల వారీగా..

బస్తీలే టార్గెట్‌‌గా నాయకుల ప్రచారం.. ప్రాంతాల వారీగా..






జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో నగరంలో ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు..


Jubilee Hills by Elections: బస్తీలే టార్గెట్‌‌గా నాయకుల ప్రచారం.. ప్రాంతాల వారీగా.. 

పార్టీ మారాలంటూ వినతులు



చోటామోటా లీడర్లకు ప్రలోభాలు


పలు ప్రాంతాల్లో జోరుగా చేరికలు


బస్తీలే టార్గెట్‌గా అభ్యర్థుల ఎత్తుగడలు


ABN ఛానల్ ఫాలో అవ్వండి


హైదరాబాద్ సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో నగరంలో ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఓట్లు ఎక్కువగా పోలయ్యే ప్రాంతాల్లో బలమైన లీడర్ల దగ్గర నుంచి చోటా మోటా నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు బేరసారాలకు దిగుతున్నారు.



ప్రాంతాల వారీగా ప్రణాళికలు


గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏయే ప్రాంతాల్లో పోలైన ఓట్లలో తక్కువ వచ్చాయో గుర్తించి ఆ బూత్లలో ఓట్లు పెంచుకోవడానికి అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఓట్లను గంపగుత్తగా వేయించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆ బస్తీల్లో కానీ, వీధిలో కానీ బలమైన వ్యక్తులను, లీడర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పార్టీ మారాలని, ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వ్యక్తిగత, వ్యాపార సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీనిస్తున్నారు. అవసరమైతే పార్టీ మారే వ్యక్తికి ఉన్న ప్రాబల్యం ఆధారంగా రూ.లక్షల్లో చెల్లింపులు. చేస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారు. దాంతో రాత్రికి రాత్రి డివిజన్లు, బస్తీలలో పెద్దఎత్తున పార్టీలు మారుతున్నారు. తనతో పాటు పార్టీ మారే వ్యక్తులకు రూ.500 నుంచి రూ.2వేల వరకు చెల్లిస్తున్నారు.



ప్రధాన పార్టీలకు సవాలే..


జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు ఇతర పార్టీల్లో ప్రాబల్యం కలిగిన వారై అసంతృప్తతో ఉంటే చాలు. రాత్రికి రాత్రి చర్చలు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాన పార్టీ నేత రోడ్డు షోలో ఓ సీనియర్ లీడర్ అసంతృప్తికి గురైనట్లుగా తెలుసుకున్న ప్రత్యర్థి పార్టీ నేతలు సంప్రదింపులు చేసినట్లు తెలిసింది. ఈ సంద ర్భంలో పార్టీ మారేందుకు ఆఫర్లు కూడా ఇవ్వడంతో ఆ నేత మరుసటి రోజు పార్టీ మారాడు. ఈ తరహా సమీకరణాలు ప్రధాన పార్టీలకు సవాలుగా మారాయి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు.

  ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని  రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు.

        శుక్రవారం అయన తిప్పర్తి మండలం కేశరాజు పల్లి లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. 17% తేమతో, తాలు,తరుగు లాంటివి లేకుండా నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే  కొనుగోలు చేయాలని, జాప్యం చేయవద్దని, వర్షం వచ్చినట్లయితే ధాన్యం తడిసిపోయెందుకు అవకాశం ఉంటుందని ,అందువల్ల  ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.


          అనంతరం ఆయన ఇదే మండలం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లు ను తనిఖీ చేసి మిల్లులో ఖరీఫ్ ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ పరిశీలించారు. ఎలాంటి  జాప్యం లేకుండా మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవాలని, ఇందుకుగాను అవసరమైన హమాలీలు, స్థలాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, తరుగు, తాలు పేరిట, తూకం పేరిట రైతులను ఇబ్బంది పెట్టవద్దని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం లో కోత విధించవద్దని చెప్పారు.




        అనంతరం అదనపు కలెక్టర్ ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.


       జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, జిల్లా  పౌర సరఫరాల అధికారి వెంకటేష్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, తదితరులు ఉన్నారు.

Wednesday, 5 November 2025

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన బీజేపీ బైక్ ర్యాలీ





         జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన బీజేపీ బైక్ ర్యాలీ               జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన బీజేపీ బైక్ ర్యాలీ ఒక రాజకీయ శక్తి ప్రదర్శనలా సాగింది. కార్మిక నగర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల గుండా విశాలంగా కొనసాగింది. ర్యాలీలో కేంద్ర మంత్రివర్యులు గౌ / శ్రీ కిషన్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ లంకల దీపక్ రెడ్డి గారు, హిందూ ధర్మ రక్ష ఫౌండర్ మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు డా. చికోటి ప్రవీణ్ గారు పాల్గొనడం ద్వారా ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. భారీగా హాజరైన కార్యకర్తలు, యువకులు, స్థానిక ప్రజలతో ఈ ర్యాలీ ఉత్సాహవంతంగా సాగి, ప్రాంతమంతా బీజేపీ నినాదాలతో మార్మోగిపోయింది.


ర్యాలీలో ముఖ్యపాత్ర పోషించిన డా. చికోటి ప్రవీణ్ గారు, తన ప్రజా నాయకత్వం, ఉత్సాహపూరిత ప్రసంగాలతో కార్యకర్తల్లో నూతన జోష్ నింపారు. ప్రజలకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని వివరించి, ఆయనను గెలిపించడమే అభివృద్ధి దిశగా ముందడుగు అవుతుందని చెప్పారు. కార్మిక నగర్, బోరబండ, ఎర్రగడ్డ వంటి ప్రధాన ప్రాంతాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.


ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, అభివృద్ధి అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్న బీజేపీ మాత్రమే తెలంగాణను నిజమైన అభివృద్ధి మార్గంలో నడిపించగలదని డా. చికోటి ప్రవీణ్ గారు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి విశ్వాసపూర్వక మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుతూ, ప్రజాస్వామ్య శక్తిగా బీజేపీని బలపరచాలని పిలుపునిచ్చారు.

Monday, 3 November 2025

ఆర్య వైశ్యులకు అండగా IVF*




 *ఆర్య వైశ్యులకు అండగా IVF*


- *TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*


ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని. సేవా కార్యక్రమాలు తో ద్వతరగతి ఆర్యవైశ్యులకు భరోసా ఇస్తుందని అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర IVF అధ్యక్షుడిగా శ్రీనివాసరావు, *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మెన్* *గౌరవాధ్యక్షుడు డూండీ రాకేష్ గారికి* *ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహనరావు, కోశాధికారి కూసుమంచి.. సుబ్బరాయులు, యువ మువజన సంఘం అధ్యక్షుడు గాజులపల్లి అభినయ్, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మనాభుని శివ కుమార్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండా నాగ సుప్రజ, చీఫ్ కో ఆర్డినేటర్ గ్రంథి అజయ్ చంద్రాఖ్యకో ఆర్డినేటర్ చక్కా సూర్యప్రకాష్, యువజన విభాగం కోశాధికారి రవి చంద్ర లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ గత దశాబ్దిన్నర నుంచి ఐ ఎఫ్ పలు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల మాలు నిర్వహిస్తూ అందరి గుర్తు చేశారు. పదవులు తీసుకున్న వారు బాధ్యతగా సేవలు అందించాలని, సంఘం

బలోపేతం చేయడంతో పాటు ఆర్యవైశ్యులకు మేమున్నాం అనే భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఐ వి ఎఫ్ అంతర్జాతీయ సలహాదారుడు గంజి రాజమౌళి గుప్త మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సంస్కృతీ, సాంప్రదాయాలకు సేవకు చిరునామా అన్నారు.ఎంతో చరిత్ర ఉన్న ఆర్యవైశ్య జాతిలో జన్మించడం అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమం లో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహనరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం జాతీయ నాయకులు ఉప్పుల శ్రీనివాస్ గుప్త గంజి రాజమౌళి కి సన్మానం చేశారు.


ఈ IVF సలహాదారుడు ముత్యాల సత్తయ్య గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప బ్బా చంద్రశేఖర్ గుప్త గారు,  ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గారు, IVF మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, IVF రాష్ట్ర యువజన కోశాధికారి నరేష్ గుప్త , రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజినీకాంత్ ,IVF నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sunday, 2 November 2025

జూబ్లీహిల్స్ లో గెలిచేది ఆ పార్టీనే..

 జూబ్లీహిల్స్ లో గెలిచేది


ఆ పార్టీనే..

              : తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారంటే.. ఈ ఎన్నికను ఆ పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.

         బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొత్తం ముగిసింది. ఆయా పార్టీలన్నీ ప్రచారబరిలో దిగాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

                  ఈ పరిస్థితుల మధ్య లోక్ పోల్ సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించింది. ఓటర్ల మనోగతాన్ని అడిగి తెలుసుకుంది. 3,100 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది లోక్ పోల్. ఇక్కడ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపర్చుతోంది. ఈ నియోజకవర్గంలో 44 శాతం మంది ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్- 38, బీజేపీ- 15 శాతం ఓటర్ల మద్దతు కనిపించింది. ఇతరులు మూడు శాతం మేర ప్రభావం చూపనున్నారు.

                బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య ఆరు శాతం తేడా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. కాంగ్రెస్ కు ఏఐఎంఐఎం మద్దతు ప్రకటించడం టర్నింగ్ పాయింట్ గా పేర్కొంది. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎంఐఎం మెజారిటీ మద్దతుదారులు, ఆ పార్టీ ఓటుబ్యాంక్.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని లోక్ పోల్ అంచనావేసింది. కాంగ్రెస్ కు ఆధిక్యత ఇచ్చిన ఆరు శాతం ఓటర్లల్లో ఎక్కువమంది ముస్లింలే ఉన్నారని పేర్కొంది.

               బీఆర్ఎస్ లో ప్రారంభంలో ఉన్న దూకుడు ఇక్కడ కనిపించట్లేదని, క్రమంగా వెనుకపడుతోందని లోక్ పోల్ అభిప్రాయపడింది. మాగంటి సునీత గెలుపు కోసం కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ..కిందిస్థాయి క్యాడర్ లో ఆ జోష్ కనిపించట్లేదు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రచారం సానుభూతి కోణం చుట్టూ తిరుగుతోండటం కూడా మైనస్ గా మారింది. హిందూ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును కొంతమేర చీల్చే అవకాశం ఉందని లోక్ పోల్ తెలిపింది.

విద్యార్ధుల్లో ఖాతాల్లో స్కాలర్​ షిప్​ డబ్బులు జమ, ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

 


విద్యార్ధుల్లో ఖాతాల్లో స్కాలర్​ షిప్​ డబ్బులు జమ, ప్రభుత్వం కీలక నిర్ణయం..!!   
  

              తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్ధుల ఖాతాల్లోనే స్కాలర్ షిప్ డబ్బులు జమ చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు బోధన ఫీజును నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోనే జమ చేయాలని దాదాపు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో కాలేజీల పైన వస్తున్న ఫిర్యాదుల వేళ ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది. ఈ మేరకు సంక్షేమ శాఖలు ఈ విధానం అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి. విద్యార్ధుల బోధన ఫీజునే నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్కరణ మేరకు 2024-25 అకడమిక్​ఇయర్​నుంచి ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లో నేరుగా బోధన ఫీజులను జమ చేస్తోంది. ఇదే విధానాన్ని మిగతా సంక్షేమ విభాగాల్లోనూ అమలుకు సాధ్యాసాధ్యాలను ఆయా సంక్షేమ శాఖలు పరిశీలి స్తున్నాయి. కోర్సు ముగిసినా కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఫీజులు మంజూరు కాలేదని, వాటిని చెల్లించే వరకు సర్టిఫికెట్లు ఇవ్వబోమని చెబుతున్నాయి. ఫిర్యాదులపై పరిశీలించిన సంక్షేమ శాఖలు విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకే నేరుగా జమ చేసే ప్రతిపాదన పై ప్రభుత్వం దృష్టి సారించింది. 

       రాష్ట్ర వ్యాప్తంగా బోధన రుసుములు, స్కాలర్​షిప్​ల కోసం ఏటా 12.5 లక్షల మందికి పైగా విద్యార్థు లు దరఖాస్తు చేస్తున్నారు. ఏటా డిమాండ్‌ రూ.2,400-2,600 కోట్ల వరకు ఉంటోంది. ఎస్సీ విద్యార్థులకు ఏటా బోధన ఫీజులు, స్కాలర్​షిప్ కోసం తొలుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ప్రత్యేక ఖాతాలో జమ చేస్తుంది. వెంటనే కేంద్రం 60 శాతం నిధులు చెల్లిస్తుంది. ఈ మొత్తం నుంచి విద్యార్థులకు ఫీజులు మంజూరవుతాయి. ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు భరిస్తోంది. వీరికి విద్యార్థుల అకౌంట్లలో నేరుగా చెల్లించే విధానం అమలు చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. విద్యార్థులు ఉపకార వేతనాల కోసం నెట్ సెంటర్లు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటిని విద్యార్థులకు మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఒకే విధమైన పోర్టల్ తో పాటుగా నేరుగా విద్యార్ధుల ఖాతాల్లోనే నగదు జమ చేసేలా కసరత్తు జరుగుతోంది.

రేవంత్ కేబినెట్ లో అయిదుగురు ఔట్, శాఖల మార్పు..కొత్తగా - ముహూర్తం ఫిక్స్..!?


 రేవంత్ కేబినెట్ లో అయిదుగురు ఔట్, శాఖల మార్పు..కొత్తగా - ముహూర్తం ఫిక్స్..!? 

                 తెలంగాణ మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే మంత్రుల తీరు పైన పార్టీ అధినాయకత్వం పూర్తి సమాచారం సేకరించింది. తాజా విస్తరణలో అజారుద్దీన్ కు మాత్రమే అవకాశం దక్కింది. ఇంకా రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత మంత్రుల్లో దాదాపు అయిదుగురిని తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక.. శాఖల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే ఈ కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని.. ముహూర్తం సైతం దాదాపు ఖరారు అయిందని పార్టీ నేతల సమాచారం. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. పని తీరు.. వివాదాల కు కారణంగా నిలుస్తున్న మంత్రులను తప్పించి.. సామాజిక సమీకరణాలను అమలు చేస్తూ ఈ సారి మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్లు ఇద్దరికి కీలక పదవులు కట్టబెట్టారు. కాగా, జూబ్లీహిల్స్ బై పోల్ తరువాత విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 7వ తేదీకి రేవంత్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ సమయంలోనే భారీ ప్రక్షాళన చేపట్టనుంది. మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కసరత్తులో కొత్తగా నియమితులైన నలుగురు మంత్రులకు మినహాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

                        ప్రస్తుతం కేబినెట్ లో మరో ఇద్దరికి అవకాశం ఉంది. పునర్‌ వ్యవస్థీకరణతో మరి కొందరికి అవ కాశం దక్కనుందని చెబుతున్నారు. సీఎంతోపాటు తొలుత ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రుల పనితీరుపై అధిష్ఠానం ఇప్పటికే సమీక్ష చేసింది. ఆయా శాఖలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులుగా, రాజకీయ నాయకులుగా వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకున్న అధి ష్ఠానం.. ఒక్కో మంత్రికి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది. వారి ప్రోగ్రెస్‌ రిపోర్టును పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అందజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదుగురు మంత్రుల పనితీరుపై హైకమాండ్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పనితీరు మెరుగు పరుచు కోని మంత్రుల స్థానంలో అదే వర్గాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. 

        అదే విధంగా కీలక శాఖలు నిర్వహిస్తున్న కొందరు మంత్రుల నుంచి వాటిని తప్పించి వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత.. ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు సీట్లు సహా మరో నలుగు లేదా అయిదుగురికి కొత్తగా అవకాశం దొరకనుందని పార్టీ నేతల సమాచారం. అలాగే ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఇతర పదవులనూ భర్తీ చేయనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌ రెడ్ వంటి నేతలు మంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు. కాగా, వీరిలో ఇద్దరికి తాజాగా పదవులు ఇచ్చారు. దీంతో, వారిద్దరూ రేసు నుంచి తప్పుకొన్నట్లు స్పష్టమైంది. సీఎం, డిప్యూటీ సీఎంలు స్వయంగా సిఫార్సు చేసిన వారికే మంత్రి పదవులు నిరాకరించడం ద్వారా మిగిలిన వారికీ అధిష్ఠానం స్పష్టమైన సంకేతం ఇచ్చిందని ప్రచారం సాగుతోంది. దీంతో.. మంత్రివర్గ విస్తరణలోనూ హైకమాండ్ నిర్ణయం మేరకే తుది ఎంపిక జరగనుంది.