ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు.
శుక్రవారం అయన తిప్పర్తి మండలం కేశరాజు పల్లి లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. 17% తేమతో, తాలు,తరుగు లాంటివి లేకుండా నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, జాప్యం చేయవద్దని, వర్షం వచ్చినట్లయితే ధాన్యం తడిసిపోయెందుకు అవకాశం ఉంటుందని ,అందువల్ల ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఆయన ఇదే మండలం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లు ను తనిఖీ చేసి మిల్లులో ఖరీఫ్ ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ పరిశీలించారు. ఎలాంటి జాప్యం లేకుండా మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవాలని, ఇందుకుగాను అవసరమైన హమాలీలు, స్థలాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, తరుగు, తాలు పేరిట, తూకం పేరిట రైతులను ఇబ్బంది పెట్టవద్దని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం లో కోత విధించవద్దని చెప్పారు.
అనంతరం అదనపు కలెక్టర్ ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, తదితరులు ఉన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home