కాచిగూడలోని వాసవి విద్యార్థినీ వసతి గృహం 43వ వార్షిక హాస్టల్ డే వేడుకలు:డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 18: కాచిగూడలోని వాసవి విద్యార్థినీ వసతి గృహం 43వ వార్షిక హాస్టల్ డే వేడుకల్లో ఘనంగా పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, టిటియూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి గారితో కలిసి విద్యార్థినులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ, విద్యార్థినులు విద్యాభ్యాసంలో ముందుకు సాగేందుకు ఇలాంటి వసతి గృహాలు ఎంతో మేలుకలిగిస్తాయని తెలిపారు. సురక్షిత వసతి, మంచి అకడమిక్ వాతావరణం, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
టిటియూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యే సమాజ ప్రగతికి ప్రధాన ఆధారం అని పేర్కొన్నారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు.
వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభాపురస్కారాలు విద్యార్థినుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. నిర్వాహకులు హాస్టల్ డేను విజయం వంతం చేసినందుకు ఉపమేయర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home