విద్యార్ధుల్లో ఖాతాల్లో స్కాలర్ షిప్ డబ్బులు జమ, ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
విద్యార్ధుల్లో ఖాతాల్లో స్కాలర్ షిప్ డబ్బులు జమ, ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్ధుల ఖాతాల్లోనే స్కాలర్ షిప్ డబ్బులు జమ చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు బోధన ఫీజును నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోనే జమ చేయాలని దాదాపు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో కాలేజీల పైన వస్తున్న ఫిర్యాదుల వేళ ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది. ఈ మేరకు సంక్షేమ శాఖలు ఈ విధానం అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి. విద్యార్ధుల బోధన ఫీజునే నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్కరణ మేరకు 2024-25 అకడమిక్ఇయర్నుంచి ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లో నేరుగా బోధన ఫీజులను జమ చేస్తోంది. ఇదే విధానాన్ని మిగతా సంక్షేమ విభాగాల్లోనూ అమలుకు సాధ్యాసాధ్యాలను ఆయా సంక్షేమ శాఖలు పరిశీలి స్తున్నాయి. కోర్సు ముగిసినా కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఫీజులు మంజూరు కాలేదని, వాటిని చెల్లించే వరకు సర్టిఫికెట్లు ఇవ్వబోమని చెబుతున్నాయి. ఫిర్యాదులపై పరిశీలించిన సంక్షేమ శాఖలు విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకే నేరుగా జమ చేసే ప్రతిపాదన పై ప్రభుత్వం దృష్టి సారించింది.
రాష్ట్ర వ్యాప్తంగా బోధన రుసుములు, స్కాలర్షిప్ల కోసం ఏటా 12.5 లక్షల మందికి పైగా విద్యార్థు లు దరఖాస్తు చేస్తున్నారు. ఏటా డిమాండ్ రూ.2,400-2,600 కోట్ల వరకు ఉంటోంది. ఎస్సీ విద్యార్థులకు ఏటా బోధన ఫీజులు, స్కాలర్షిప్ కోసం తొలుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ప్రత్యేక ఖాతాలో జమ చేస్తుంది. వెంటనే కేంద్రం 60 శాతం నిధులు చెల్లిస్తుంది. ఈ మొత్తం నుంచి విద్యార్థులకు ఫీజులు మంజూరవుతాయి. ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు భరిస్తోంది. వీరికి విద్యార్థుల అకౌంట్లలో నేరుగా చెల్లించే విధానం అమలు చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. విద్యార్థులు ఉపకార వేతనాల కోసం నెట్ సెంటర్లు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటిని విద్యార్థులకు మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఒకే విధమైన పోర్టల్ తో పాటుగా నేరుగా విద్యార్ధుల ఖాతాల్లోనే నగదు జమ చేసేలా కసరత్తు జరుగుతోంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home