Thursday, 31 July 2025

వైశ్య రాజకీయ రణభేరి



వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో  ఆగస్టు మూడో తారీఖున జరిగే వైశ్య రాజకీయ రణభేరి  ఆ"మేమెంతో మాకంతే" గోడపత్రిక  ఆవిష్కరణలో పాల్గొన్న  AVOPA  రంగారెడ్డి జిల్లా 2 అధ్యక్షులు బొడ్డు శ్రీధర్.


 వైశ్య వికాస వేదిక  వ్యవస్థాపక అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త  గారి ఆధ్వర్యంలో  ఆగస్టు 3 ఆదివారం 2025 మధ్యాహ్నం మూడు గంటలకు జరగబోయేటువంటి  వైశ్య  రాజకీయ రణభేరి  సభకు సంబంధించినటువంటి  "మేమెంతో మాకంత"  గోడపత్రిక   ఈరోజు ఉదయం 11 గంటలకు బషీర్బాగులో గల  ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించడం జరిగింది.


 ఈ కార్యక్రమానికి AVOPA  బలపరచడం జరిగింది .  ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మలి పెద్ద శంకర్,  హైదరాబాద్ AVOPA  అధ్యక్షులు   నమశ్శివాయ,  రాష్ట్ర నాయకులు  వీర బొమ్మ రమేష్ ,  రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీధర్,  మహిళా అధ్యక్షురాలు స్రవంతి  మరియు వివిధ జిల్లా అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.


 మల్లిపెద్ది శంకర్ గారు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో  ఇన్ని రాజకీయ పార్టీలు  వైశ్యులను  రాజకీయంగా గుర్తించడంలో విఫలమయ్యారు  అని పేర్కొన్నారు. 


 బొడ్డు శ్రీధర్ మాట్లాడుతూ  వైశ్య జాతి అంటేనే  ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటుంది,  అలాంట

రైతుల ధర్నా.. రాస్తారోకో..!*

 


Nalgonda : సాగునీటి కోసం..

*రైతుల ధర్నా.. రాస్తారోకో..!*
*నల్గొండ జిల్లాలో రైతులు సాగు నీటిని విడుదల చేయాలని అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తిప్పర్తి మండల కేంద్రంలో డి 40, డి 39 కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్ చేశారు*

*నాగార్జునసాగర్ నుండి 26 గేట్ల ద్వారా నీళ్లు పోతున్నప్పటికీ, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు కనీసం అవగాహన లేకుండా నల్లగొండ జిల్లాను ఎండ పెడుతున్నారని, ఉదయ సముద్రం 1.5 టిఎంసి పూర్తిస్థాయిలో నింపి ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువుల నింపి, రైతులకు పంటల కోసం నీరు అందించాలని డిమాండ్ చేశారు*.

*అధికారులు వారాబంది పేరుతో ఐటిపాముల కాలువకు వారం రోజులు నీళ్లు,3*

4141

*వదులుతున్నారు. కానీ తిప్పర్తి మండలం లోని D 40, D 39 కాల్వకు వారబంది అమలు చేయడం లేదన్నారు. ఐటిపాముల కాలువ సగం పోతున్నది.. గేట్లు పైకి ఎత్తడం లేదు, అధికారులు, అధికార పార్టీ నాయకులు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప పూర్తిస్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు పోవడానికి కావలసినటువంటి ప్రణాళికలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువ వెంట తిరిగి అన్ని చెరువులను నింపే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు.*

*ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కళ్ళు తెరిచి రాజకీయాలు పక్కన పెట్టి తిప్పర్తి మండలం లోని చెరువుల నింపే విధంగా అధికారుల పైన స్థానిక మంత్రిపైనా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజానీకాన్ని ఆదుకోవాలని కోరారు. ఆదివారం వరకు మాకు పూర్తిస్థాయిలో కాలువలు వదలక పోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం రైతులతో కలిసి ముట్టడిస్తామని అన్నారు*. *రైతుల ధర్నా, రాస్తరోకోకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తిప్పర్తి ఎక్స్ జెడ్పిటిసి డాక్టర్ శ్రీ తండు సైదులు గౌడ్ గారు మద్దతు తెలిపారు వారితో పాటు పార్టీ ముఖ్యులు (PACS), వైస్ చైర్మన్ కందుల రేణుక లక్ష్మయ్య గారు, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జాకటి బాలరాజు గారు,సిపిఎం నాయకులు, మన్యం బిక్షం గారు,రైతులు తదితరులు పాల్గొన్నారు,మద్దతు తెలిపారు.*

Saturday, 26 July 2025

నిర్మాణంలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్లను తరచూ తనిఖీ చేయాలి మంత్రి కోమటిరెడ్డి

 తెలంగాణలో కుండపోత వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేయడం జరిగింది.


• ప్రతి ఆర్ అండ్ బి అధికారి ఫీల్డ్ లో ఉండాలి సెలవులు రద్దు!


• నిర్మాణంలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్లను తరచూ తనిఖీ చేయాలి మంత్రి కోమటిరెడ్డి



• పొంగిపొర్లే వాగుల పై ఉన్న బ్రిడ్జిలను క్షుణ్నంగా పరిశీలించాలి


• కోతకు గురైన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి


• విద్యుత్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకోవాలి 


• భారీ వరద ప్రవాహానికి లోనయ్యే ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలి


• అత్యవసరం అయితే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి


ప్రజా రవాణాకు ఎక్కడా ఆటంకం కలగకుండా చర్యలు..

Thursday, 24 July 2025

ఆర్యవైశ్య మహాసభ చాటు మీటింగా లేక ఆధికారిక మీటింగా?

ఆర్యవైశ్య మహాసభ  ాటు మీటింగా 

లేక  

ఆధికారిక మీటింగా?




ైద్రాబాద్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అత్యవసర కార్యవర్గ సమావేశం  కర్మన్ ఘట్ లో లక్ష్మీ కన్వెన్షన్ లో మంగళ వారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కోర్టు ఆర్డర్ ప్రకారంగా పెట్టవద్దని మహాసభ ప్రక్షాళన కమిటీ అంటూ మీటింగ్ ను అడ్డుకుంటామని పిలుపునిచ్చింది. ఈ గదరగోళ పరిస్థితిలో  లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యానికి పోలీస్ వారు నోటీస్ ఇస్తూ మీటింగ్ జరిగితే సమస్యలు వస్తాయని అందువల్ల ఏదైనా ఇబ్బంది లేదా అవాంతరాలను నివారించడానికి, మీ ఫంక్షన్ హాల్‌లో సమావేశాన్ని అనుమతించవద్దని లేదా ఈ సమస్యకు సంబంధించిన అటువంటి సమావేశాలను అనుమతించవద్దని ఇందుమూలంగా మిమ్మల్ని ఆదేశిస్తున్నామని, శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులతో సహకరించాలని నోటీస్ లో  అభ్యర్థించారు. ఈ నోటీసును పాటించకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ అని తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టుకోవాల్సిందే నని అమరవాది వర్గం చాటు మీటింగ్ ఏర్పాటు  చేసుకొని ఇది  మీటింగ్ కాకుండా ఒక విందు సమావేశం లాగఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది.


మహాసభ ప్రక్షాళన కమిటీ ఆధ్వర్యంలో లో మిడిదొడ్డి శ్యాంసుందర్,  మొగుళ్ళపల్లి ఉపేందర్, బచ్చు రామకృష్ణ, కాచం సత్యనారాయణ, చకీలం రమణయ్య, బచ్చు శ్రీనివాస్, ప్రేమ్  గాంధీ, ఆగీర్ వెంకటేశం,  అగీరు రవీందర్ ఇంకా 30 మంది  వచ్చారు. వారు పోలీస్ లకు ఫిర్యాదు చేసి వెళ్ళారు

Tuesday, 22 July 2025

రూ.6,700.12 కోట్ల మహిళల డబ్బులు ఆదా

   రూ.6,700.12 కోట్ల మహిళల డబ్బులు ఆదా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారం


లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓ అరుదైన రికార్డును నెలకొల్పంది. ఓ ల్యాండ్ మార్క్ ను అధిగమించింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు 200 కోట్లకు పైగా జీరో టికెట్లను జారీ చేసింది. 2023 డిసెంబర్ 9వ తేదీన టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనికోసం మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పుడీ పథకం కింద జారీ చేసిన ఉచిత బస్ టికెట్ల సంఖ్య 200 కోట్లను దాటినట్లు టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది. 

                ఛార్జీల రూపంలో మహిళల నుంచి వసూలు చేయాల్సిన మొత్తం 6,671.12 కోట్ల రూపాయలను ప్రభుత్వం పొదుపు చేసినట్టయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి.. మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 18 నెలల తమ ప్రజా పాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి, ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతోండటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు అభినందనలను తెలియజేస్తోన్నానని అన్నారు. ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ఇదే పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.                                          ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. ఈ 18 నెలల్లో రికార్డు స్థాయిలో 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఈ పథకం అందుబాటులోకి వచ్చిన సమయంలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఇప్పుడా సంఖ్య రెట్టింపు అయింది. ప్రస్తుతం రోజూ సుమారు 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్‌ లో విద్యార్థినులు, ఉద్యోగినులతోపాటు సాధారణ మహిళలు.. రోజూ సుమారు 8 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం కింద మహిళలు సుమారు 6,700.12 కోట్లు ప్రయాణ ఖర్చులు ఆదా చేసుకున్నట్టయింది.

Monday, 21 July 2025

.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పై.. ఆగ్రహం వ్యక్తం చేసిన కంచర్ల.

 


 విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం  తో ప్రమాదం..


 నల్గొండ మండలం అన్నారెడ్డి గూడెంలో ఘటన.


 చెట్లు కొడుతుండగా బండిపై వెళ్తున్న వారిపై విరిగిపడ్డ కరెంటు స్తంభం.


 రెండు రోజులైనా స్పందించని విద్యుత్ అధికారులు.


 విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పై.. ఆగ్రహం వ్యక్తం చేసిన కంచర్ల.




 నేడు నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.... నిన్న ప్రమాదంలో గాయపడ్డ నల్గొండ మండలం అన్నారెడ్డి గూడెం గ్రామం శాఖ అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు.. కుటుంబాన్ని వారు చికిత్స పొందుతున్న ఐకాన్ హాస్పిటల్ లో పరామర్శించారు. వారు ప్రమాద వివరాలు తెలియచేస్తూ.. తాను తన భార్య మంజుల కుమారుడు హర్షవర్ధన్ తో కలిసి పొలానికి బండిమీద నిన్న ఉదయం 10:30 ప్రాంతంలో.. బయలుదేరి వెళుతుండగా., అన్నారెడ్డి గూడెం గ్రామ శివారులో... విద్యుత్ అధికారులు చెట్లు కొట్టుతున్నారు.. అందులో ఒక చెట్టు విద్యుత్ స్తంభంపై విరిగిపడి.. అదే దారిలో ప్రయాణిస్తున్న తమపై పడిందని.. అదృష్టవశాత్తు తాను తన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డా మని తమ కుమారునికి.. తలకు బలమైన తీవ్ర గాయాలయ్యాయని.. తాము వెంటనే ఐకాన్ ఆస్పత్రికి తరలించామని తెలియచేసారు.

 కానీ ఇంతవరకు విద్యుత్ సంస్థకు చెందిన అధికారులు ఎవరూ తమ పరామర్శించలేదని.. కంచర్లకు తెలియజేశారు.

 దీంతో వెంటనే స్పందించిన కంచర్ల .. విద్యుత్ ఉన్నతాధికారులతో ఫోన్లో సంభాషించి.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య పట్ల తన తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు... కనీస మానవత్వం లేకుండా..తమ నిర్లక్ష్యం వల్ల తీవ్ర గాయాల బాధ తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుని పరామర్శించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ..

 తక్షణమే విద్యుత్ అధికారులు బాధితులను పరామర్శించి వారి చికిత్సకయ్యే ఖర్చులు భరించి వారికి.. విద్యుత్ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

 అదేవిధంగా హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు.

 మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ మాజీ ఎంపీపీ నారబోయిన బిక్షం,

 మాజీ సర్పంచ్ రాము బీరం గోపాల్ రెడ్డి తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

Sunday, 20 July 2025

అయోధ్య వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ను నూతన భవనం

 అయోధ్యలో నూతన భవనంలో తెలుగు సత్రం 

🔹ఏడాదిగా కొనసాగుతున్న నిరంతర సేవలు

🔹త్వరలో కాశీ,అరుణాచలం, తిరుపతికి విస్తరణ 

🔹 సేవల కోసం 9989 249 679 ఫోన్ నెంబర్

🔹 ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె

 

హైదరాబాద్ :  దక్షిణాది రాష్ట్రాల అయోధ్య


యాత్రికులకు మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించడానికి శ్రీ అయోధ్య వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ను నూతన భవనంలోకి మార్చినట్లు  ఆ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె తెలిపారు. శుక్రవారం అయోధ్యలో నూతన భవనంలో సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతోమాట్లాడుతూ, ఏడాదికాలంగా తాము అందిస్తున్న సేవల కారణంగా దక్షిణాది రాష్ట్రాల యాత్రికులతో తమ సంస్థకు మంచి అనుబంధం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. వారికి మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి నూతన భవనంలో తమ సేవలను ప్రారంభించామని ఆయన వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం ప్రారంభించిన సేవలు, తమ ట్రస్ట్ కార్యవర్గ సభ్యుల సహాయ, సహకారాల వల్ల కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలయాత్రికులకుకూడావిస్తరించగలిగామన్నారు. 

    ప్రపంచ దేశాలను సైతం ఆకర్షించిన మహా కుంభమేళా వంటి విపరీతమైన రద్దీ సమయంలో కూడా  యాత్రికులకు విశిష్ట సేవ లందించామని చెప్పారు. ఇక ఇప్పుడు నూతన ప్రాంగణంలో అధునాతన  సౌకర్యాలతో 60 ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

    తమ సంస్థ పురోగతికి పూర్తి అండగా ఉన్న అయోధ్య హనుమాన్ గడి అర్చకులు మహంత్ గదాధర్ దాస్ స్వామీజీ సహకారాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. నూతన భవనంలో తమ సేవలు కొనసాగడానికి అవకాశం ఇచ్చిన స్వామీజీకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

   కాగా అయోధ్యతోపాటు నైమిశారణ్యం, కాశ్, గయా,ప్రయాగ్ రాజ్ , (అలహాబాద్) లను సందర్శించే యాత్రికులు తమ ద్వారా సేవలు పొందవచ్చని ఆయన కోరారు. అందుకోసం ఫోన్ నెంబర్  9989 249 679 ను 24/7 అందుబాటులో ఉంచామన్నారు.

     ఇదిలా ఉండగా అయోధ్యలో నిత్యాన్న సత్రం నిర్వహణకు సహకరించే దాతలు ఫోన్ నెంబర్ 98487 87 611 ఫోన్ నెంబర్ లో సంప్రదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చైర్మన్ హరినాథ్ గుప్త తోపాటు, సంస్థ ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేష్ గుప్త, కోశాధికారి దేమే వీరేశం గుప్త, సంయుక్త కార్యదర్శి పల్లా నాగరాజు గుప్త తదితరులు పాల్గొన్నారు.

Saturday, 19 July 2025

వాసవి మాత జీవిత చరిత్రతో తయారుచేసిన చీరను ఈరోజు పెనుగొండలో అమ్మవారికి సమర్పించడం జరిగింది

 వాసవి మాత జీవిత చరిత్రతో తయారుచేసిన చీరను ఈరోజు పెనుగొండలో అమ్మవారికి



సమర్పించడం జరిగింది           
                       ..                    మన కుల దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి  మాత జీవిత చరిత్రతో తయారుచేసిన చీరను ఈరోజు పెనుగొండలో అమ్మవారికి సమర్పించడం జరిగింది            

మరణం ఎప్పుడో ముందే చెప్పే AI టెక్నాలజీ..!!

 మరణం ఎప్పుడో ముందే చెప్పే AI టెక్నాలజీ..!! 



ఆర్టీఫీషియల్ టెక్నాలజీ. ఇప్పుడు ప్రతీ రంగంలోనూ తన దైన ముద్ర వేస్తోంది. ఆరోగ్యంతో పాటుగా ప్రతీ విభాగంలోనూ కీలకంగా మారుతోంది. ఏఐ నైపుణ్యం ఉన్న వారికి లక్షల రూపాయాల వేతనాలతో జాబ్ ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఏఐకి ప్రభుత్వానలు ప్రదఆన్యత ఇస్తున్నాయి. ఇదే సమయంలో ఏఐ ద్వారా సుసాధ్యం అనుకొన్నవి సైతం సాధ్యంగా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరు ఎప్పుడు మరణిస్తారో చెప్పటం సాధ్య పడే విషయం కాదు. కాగా, ఏఐ తో మాత్రం మరణం ఎప్పుడో ముందే అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ మనిషి పుట్టుక సమాచారం ఉంటుంది. మరణం ఎప్పుడంటే ఎవరూ చెప్పలేరు. అయితే, మారుతున్న సాంకేతికతతో విస్తరిస్తున్న ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మరణం చెప్పటం కూడా సాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు.సైన్స్ భాషలో, ఈ టెక్నాలజీని AI డెత్ కాలిక్యు లేటర్‌గా పిలుస్తున్నారు. లాన్సెట్‌ డిజిటల్ హెల్త్ దీనికి సంబంధించి ఒక అధ్యయనం లో కీలక అంశాలను వెల్లడించింది. ఈ కాలిక్యులేటర్ ట్రయల్‌ యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన రెండు ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు. ఏఐ డెత్ కాలిక్యుటేలర్‌ అస లు పేరు AIRE. అంటే AI-ECG రిస్క్ ఎస్టిమేటర్. ఇది మీ గుండె వైఫల్యాన్ని అంచనా వేస్తుంది.

Friday, 18 July 2025

వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు.

వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు.                  హైదరాబాద్ :ఆగస్టు 3న హైదరాబాద్ లో జరిగే వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు. వైశ్యుల జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం  కల్పించాలని డిమాండ్  చేశారు. వైశ్య రాజకీయ రణభేరికి ఇంటర్నేషనల్  వైశ్య  ఫెడరేషన్ సంపూర్ణ  మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి IVF సభ్యులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త,  నంగునూరి రమేష్, కొదుమూరి దయాకర్, బుక్కా ఈశ్వరయ్య, కొత్త రవి కుమార్,  గజవాడ సత్యనారాయణ, మురళి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


Saturday, 12 July 2025

అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ వసతిగృహాలు స్థల సేకరణ చేస్తే భవన నిర్మాణాలకు నిధులు మంజూరు:. బీసీ సంక్షేమ శాఖల మంత్రి పోన్నం ప్రభాకర్ తెలిపారు.

అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ వసతిగృహాలు స్థల సేకరణ చేస్తే భవన నిర్మాణాలకు నిధులు మంజూరు:.  బీసీ సంక్షేమ శాఖల మంత్రి పోన్నం ప్రభాకర్ తెలిపారు.

          అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ వసతిగృహాలు, మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు స్థల సేకరణ చేస్తే భవన ::నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పోన్నం ప్రభాకర్ తెలిపారు.

       శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని  ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబా పూలే  పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టల్ల భవనాల నిర్మాణానికి జిల్లాల వారీగా సల సేకరణ చేసి ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో 32  బి సి సంక్షేమ  పాఠశాలలు,కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఉండగా సుమారు 30 అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, వీటన్నిటికి పక్కా భవనాలు నిర్మించేందుకు వెంటనే స్థలాలు చూసి ప్రతిపాదనలు పంపించాలన్నారు.


     కులవృత్తులను కాపాడటంలో భాగంగా ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఈత చెట్లు, 5 లక్షల తాటి చెట్లను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అలాగే కాటమయ్య రక్షణ కిట్లను ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని , ఉమ్మడి నల్గొండ జిల్లాకు మరో 10 వేల రక్షణ కిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదివరకే నల్గొండ దృష్టి పేరుపై మంచి కార్యక్రమాలు నిర్వహించారని,  వీటిని వీటిని కొనసాగిస్తూ, అన్ని పాఠశాలలు ,కళాశాలల్లో రోడ్డు భద్రత క్లబ్బులను ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి విద్యార్థుల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

      రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కింద ఈ 18 నెలల కాలంలో 195 కోట్ల మంది మహిళలు రాను పోను  6500 కోట్ల రూపాయల విలువైన ఉచిత  ప్రయాణం చేశారని తెలిపారు.

 ఆర్టీసీలో 3035 కొత్త ఉద్యోగాలు ఇచ్చామని, హైదరాబాదులో కాలుష్యం తగ్గించేందుకుగాను ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని, త్వరలోనే 2,800 బస్సులు హైదరాబాద్లో తిరిగే ఏర్పాటు చేస్తున్నామని, నల్గొండ జిల్లాకు 77 ఈవి బస్సులను మంజూరు చేయగా, శనివారం సుమారు 40 బస్సులను ప్రారంభించడం జరిగిందని, మంత్రి వెల్లడించారు. నిజాం కాలం నాటి నార్కెట్పల్లి బస్ డిపోను దత్తత తీసుకొని డిపోకు పూర్వ వైభవం తీసుకొస్తామని, వారం, పది రోజుల్లో రూటింగ్ ను  సెట్ చేస్తామని, నార్కెట్పల్లి డిపోలో బస్సులను మూడింతలు పెంచి వారసత్వ సంపాదన కాపాడుతామని హామీ ఇచ్చారు. రానున్న కాలంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎలక్ట్రిక్ వాహనాల పద్ధతిని అమలు చేయనున్నమని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నవారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని చెప్పారు. రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే నిర్ణయం తీసుకొనున్నామని, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ లు చేయనున్నామని చెప్పారు. జిల్లా అటవీశాఖ, డిఆర్డిఓ, బీసీ సంక్షేమ   శాఖలు సంయుక్తంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఈత, తాటివనాలను పెంచాలని తెలిపారు.


        రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ ,మిర్యాలగూడ, నార్కెట్పల్లి బస్సులను పెంచాలని, బీసీ సంక్షేమ హాస్టల్లు, భవనాల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ,నకిరేకల్ బస్ డిపోను పట్టిష్టం చేయాలని కోరారు.


      రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని, ముఖ్యంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు వేగం కన్నా ప్రాణముఖ్యం అనే నినాదాలను ప్రతి వాహనం వెనుక తప్పనిసరిగా రాయించాలని ,డ్రైవింగ్ లైసెన్సులను ఇచ్చే సమయంలో కఠినంగా ఉండాలని ,తప్పనిసరిగా వ్యక్తులు లేకుండా లైసెన్స్ ఇవ్వవద్దని, దండు మల్కాపూర్ లోని ఫిట్నెస్ సెంటర్ ను ఉపయోగంలోకి తీసుకురావాలని, మన ఊరు- మనబడి కింద చేపట్టిన పాఠశాల ,సంక్షేమ వసతి గృహాలను పూర్తిచేసి వినియోగం లోకి తేవాలని, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.


        పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్  రెడ్డి మాట్లాడుతూ బీసీ సంక్షేమ హాస్టల్  భవనాలు, ప్రభుత్వ భవనాలను ఇవ్వాలని, దీనివలన అద్దె బాధ  తప్పుతుందని అన్నారు.

       నాగార్జునసాగర్ శాసనసభ్యులు కొండూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్  డిగ్రీ కళాశాల భవనంమార్చాలని, బీసీ సంక్షేమ హాస్టల్ కు మరమ్మతులు చేయించాలని, తన నియోజకవర్గం లోని కొన్ని రూట్ లకు కొత్త బస్సులను మంజూరు చేయాలని కోరారు.


       మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన  నియోజకవర్గంలో పాత రోడ్లలోని పలు బస్సులను రద్దు చేయడం జరిగిందని ,వాటన్నిటిని పునరుద్ధరించాలని,  మిర్యాలగూడలోని బీసీ సంక్షేమ హాస్టల్ ను మార్చాలని కోరారు.


       నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ నకిర్ కల్ నియోజకవర్గం బస్సులుపెంచాలని, ముంబై బస్సును పునరుద్ధరించాలని, అలాగే చిట్యాల బస్సు పునరుద్ధరించాలని, కేతేపల్లి  మండలం మూసి గురుకుల పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని కోరారు.


         ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రవాణా, బీసీ సంక్షేమ వసతి గృహాల విషయంలో జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు .


        జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో ఆరు రాష్ట్ర రహదారులు, ఒక జాతీయ రహదారి ఉందని, రహదారి భద్రతలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించామని, మారముల ప్రాంతాలకు ప్రత్యేక రూట్లను ఏర్పాటు చేయనున్నామని, ఈ సంవత్సరం ఈత ప్లాంటేషన్ పై  ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నామని, కొన్ని హాస్టళ్లు 80% పూర్తయ్యాయని, నిధులు లేమీవల్ల ఆగిపోయాయని, వాటికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

    యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ బస్సుల నిర్వహణ ,కాటమయ్య రక్షణ కిట్లు ,బీసీ సంక్షేమ వసతి గృహాలు, మహాత్మ జ్యోతిబా పాఠశాలల పై వివరించారు.

      జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ రహదారి భద్రతపై తెలియజేయగా, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఉప కమిషనర్ వాణి తమ శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలను తెలియజేశారు.


     మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్,  తదితరులు పాల్గొన్నారు.

     ఈ సందర్భంగా మంత్రులు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కీట్లను పంపిణీ చేశారు.


     అంతకుముందు మంత్రులు, శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ కార్యాలయావరణంలో వనమహోత్సవం కింద మొక్కలను నాటారు.

________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Sunday, 6 July 2025

మహాసభ ఎన్నికల ప్రక్రియ ను బ్రష్టు పట్టించి బైలా ను తుంగలోకి తొక్కిన అమరవాది - మిడిదొడ్డి శ్యాంసుందర్, మొగుళ్ళపల్లి ఉపేందర్

 మహాసభ ఎన్నికల ప్రక్రియ ను బ్రష్టు పట్టించి బైలా ను తుంగలోకి తొక్కిన అమరవాది  - మిడిదొడ్డి శ్యాంసుందర్, మొగుళ్ళపల్లి ఉపేందర్

 




హైద్రాబాద్: 


 అమరవాది తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియ ను మొత్తం బ్రష్టు పట్టించి బై లా ను తుంగలోకి తొక్కారని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు మిడిదొడ్డి శ్యాంసుందర్, మహాసభ ప్రక్షాళన కన్వీనర్ మొగుళ్ళపల్లి ఉపేందర్ లు విమర్శించారు.


హైద్రాబాద్ లోని NSS ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలపై కోర్టు తీర్పు తో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు.


పది సంవత్సరాల నుండి అప్రజా స్వామికంగా ఎన్నికలు నిర్వహించకుండా అమరావాది ఆక్రమించుకొని సిగ్గు లేకుండా అధికారం చెలాయించాడనీ, తన తొత్తులనే ఎన్నికల అధికారి గా నియమించి అక్రమాలకు తెర లేపారనీ అన్నారు.


పది వేలు ఉన్న నామినేషన్ ఫీజు ను లక్షకు పెంచి, Ivf అండ్ వామ్ సభ్యులను పోటీ కి అనర్హులుగా పట్టించి ప్రజాస్వామాన్ని తుంగలో తొక్కి, బై లా ను మరియు ఎన్నికల ప్రక్రియ ను మొత్తం బ్రష్టు పట్టించారు. నామినేషన్లకు అక్రమంగా తొలగించి తాత్కాలికంగా ఆనంద పడ్డారనీ, చివరకు ప్రజాస్వామ్యం గెలిచినదనీ. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చే ఎన్నికలు పెట్టాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందనీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారికి కోర్టు తీర్పు కాపీ అందించామని, త్వరలో ఎన్నికలు బై లా ప్రకారంగా పెట్టాలని కోరామని చెప్పారు.


ఇప్పుడున్న అమరావాదికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చినప్పటికీ సిగ్గు లేకుండా తానే అధ్యక్షుడు అని చెప్తూ సన్మానాలు సత్కారాలు చేసుకుంటూన్నారని విమర్శించారు.


రెండు సంవత్సరాల పదవి కి 11 ఏండ్లు ఉన్నారని అమరవాది కి పోటీ చేసే అర్హత లేదని ఆర్డర్ వచ్చిందినీ తెలిపారు ఇప్పటికైనా అమరవాది బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు సహకరింకాకుంటే చరిత్రలో ఆయన చేసిన అక్రమాలు నిలిచిపోతాయనీ అన్నారు.


ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చే పంచుకున్న డబ్బులు కోటి 75 లక్షలు తో పాటు తెలంగాణ మహాసభ పేరుతో 70 వేల సభ్యత్వం చేసినట్టు సమాచారం మని , దీని డబ్బు దాదాపు 3.5 కోట్లు మొత్తం 5 కోట్ల పైచిలుకు ఉండాలనీ, దీనితోపాటు ఇవన్నీ కూడా బ్యాంకులో డిపాజిట్ చేసినందున దాదాపు 5 కోట్లు వడ్డీ వస్తుంది మొత్తం 10 కోట్ల పైచిలుకు డబ్బులు ఉండాలనీ, కానీ బయట మాట్లాడుతున్న ప్రకారంగా మూడు నుండి నాలుకోట్లే ఉన్నాయని తెలుస్తుందినీ, ఈ ఆర్థిక వ్యవహారాలపై కూడా పూర్తిగా విచారణ జరగాల్సిన అవసరం ఉందినీ పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చినందున ఇప్పటికైనా అమరవాది ఆర్థిక కార్యకలాపాలు ఆపి అన్ని లెక్కలు ప్రకటించవలసిన అవసరం ఉందిన్నారు.


ఈ ప్రెస్ మీట్ లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు మిడిదొడ్డి శ్యాంసుందర్, మహాసభ ప్రక్షాళన కన్వీనర్ మొగుళ్ళపల్లి ఉపేందర్, కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు యాదా నాగేశ్వర్ రావు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, ఎన్నికల పైన కోర్టులో విజయం సాధించిన వైశ్య నాయకులు అగీర్ వెంకటేశం, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్ వి కుమార్, జగిత్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు పుల్లూరి సత్యనారాయణ, పీసీసీ మెంబర్ కొండ చంద్రశేఖర్, మునుగోటి రమేష్, కోరుట్ల మార్కెట్ డైరెక్టర్ మరియు విశిష్ట గౌరవ అధ్యక్షులు అల్లాడి శ్రీనివాస్, వెళ్డండ మండల అధ్యక్షుడు ఉప్పు ఆంజనేయులు, వంగూర్ మండల అధ్యక్షుడు, మేడీశెట్టి సురేష్, రంగారెడ్డి జిల్లా నాయకులు పోలా విష్ణు లు పాల్గొన్నారు.


Saturday, 5 July 2025

బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం

 బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం









Friday, 4 July 2025

రోశయ్య గారి విగ్రహావిష్కరణ



 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే గతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లో రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది