ఆర్యవైశ్య మహాసభ చాటు మీటింగా లేక ఆధికారిక మీటింగా?
ఆర్యవైశ్య మహాసభ చాటు మీటింగా
లేక
ఆధికారిక మీటింగా?
హైద్రాబాద్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అత్యవసర కార్యవర్గ సమావేశం కర్మన్ ఘట్ లో లక్ష్మీ కన్వెన్షన్ లో మంగళ వారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కోర్టు ఆర్డర్ ప్రకారంగా పెట్టవద్దని మహాసభ ప్రక్షాళన కమిటీ అంటూ మీటింగ్ ను అడ్డుకుంటామని పిలుపునిచ్చింది. ఈ గదరగోళ పరిస్థితిలో లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యానికి పోలీస్ వారు నోటీస్ ఇస్తూ మీటింగ్ జరిగితే సమస్యలు వస్తాయని అందువల్ల ఏదైనా ఇబ్బంది లేదా అవాంతరాలను నివారించడానికి, మీ ఫంక్షన్ హాల్‌లో సమావేశాన్ని అనుమతించవద్దని లేదా ఈ సమస్యకు సంబంధించిన అటువంటి సమావేశాలను అనుమతించవద్దని ఇందుమూలంగా మిమ్మల్ని ఆదేశిస్తున్నామని, శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులతో సహకరించాలని నోటీస్ లో అభ్యర్థించారు. ఈ నోటీసును పాటించకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ అని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టుకోవాల్సిందే నని అమరవాది వర్గం చాటు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇది మీటింగ్ కాకుండా ఒక విందు సమావేశం లాగఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది.
మహాసభ ప్రక్షాళన కమిటీ ఆధ్వర్యంలో లో మిడిదొడ్డి శ్యాంసుందర్, మొగుళ్ళపల్లి ఉపేందర్, బచ్చు రామకృష్ణ, కాచం సత్యనారాయణ, చకీలం రమణయ్య, బచ్చు శ్రీనివాస్, ప్రేమ్ గాంధీ, ఆగీర్ వెంకటేశం, అగీరు రవీందర్ ఇంకా 30 మంది వచ్చారు. వారు పోలీస్ లకు ఫిర్యాదు చేసి వెళ్ళారు




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home