Saturday, 19 July 2025

మరణం ఎప్పుడో ముందే చెప్పే AI టెక్నాలజీ..!!

 మరణం ఎప్పుడో ముందే చెప్పే AI టెక్నాలజీ..!! 



ఆర్టీఫీషియల్ టెక్నాలజీ. ఇప్పుడు ప్రతీ రంగంలోనూ తన దైన ముద్ర వేస్తోంది. ఆరోగ్యంతో పాటుగా ప్రతీ విభాగంలోనూ కీలకంగా మారుతోంది. ఏఐ నైపుణ్యం ఉన్న వారికి లక్షల రూపాయాల వేతనాలతో జాబ్ ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఏఐకి ప్రభుత్వానలు ప్రదఆన్యత ఇస్తున్నాయి. ఇదే సమయంలో ఏఐ ద్వారా సుసాధ్యం అనుకొన్నవి సైతం సాధ్యంగా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరు ఎప్పుడు మరణిస్తారో చెప్పటం సాధ్య పడే విషయం కాదు. కాగా, ఏఐ తో మాత్రం మరణం ఎప్పుడో ముందే అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ మనిషి పుట్టుక సమాచారం ఉంటుంది. మరణం ఎప్పుడంటే ఎవరూ చెప్పలేరు. అయితే, మారుతున్న సాంకేతికతతో విస్తరిస్తున్న ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మరణం చెప్పటం కూడా సాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు.సైన్స్ భాషలో, ఈ టెక్నాలజీని AI డెత్ కాలిక్యు లేటర్‌గా పిలుస్తున్నారు. లాన్సెట్‌ డిజిటల్ హెల్త్ దీనికి సంబంధించి ఒక అధ్యయనం లో కీలక అంశాలను వెల్లడించింది. ఈ కాలిక్యులేటర్ ట్రయల్‌ యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన రెండు ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు. ఏఐ డెత్ కాలిక్యుటేలర్‌ అస లు పేరు AIRE. అంటే AI-ECG రిస్క్ ఎస్టిమేటర్. ఇది మీ గుండె వైఫల్యాన్ని అంచనా వేస్తుంది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home