రైతుల ధర్నా.. రాస్తారోకో..!*
Nalgonda : సాగునీటి కోసం..
*రైతుల ధర్నా.. రాస్తారోకో..!*
*నల్గొండ జిల్లాలో రైతులు సాగు నీటిని విడుదల చేయాలని అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తిప్పర్తి మండల కేంద్రంలో డి 40, డి 39 కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్ చేశారు*
*నాగార్జునసాగర్ నుండి 26 గేట్ల ద్వారా నీళ్లు పోతున్నప్పటికీ, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు కనీసం అవగాహన లేకుండా నల్లగొండ జిల్లాను ఎండ పెడుతున్నారని, ఉదయ సముద్రం 1.5 టిఎంసి పూర్తిస్థాయిలో నింపి ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువుల నింపి, రైతులకు పంటల కోసం నీరు అందించాలని డిమాండ్ చేశారు*.
*అధికారులు వారాబంది పేరుతో ఐటిపాముల కాలువకు వారం రోజులు నీళ్లు,3*
4141
*వదులుతున్నారు. కానీ తిప్పర్తి మండలం లోని D 40, D 39 కాల్వకు వారబంది అమలు చేయడం లేదన్నారు. ఐటిపాముల కాలువ సగం పోతున్నది.. గేట్లు పైకి ఎత్తడం లేదు, అధికారులు, అధికార పార్టీ నాయకులు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప పూర్తిస్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు పోవడానికి కావలసినటువంటి ప్రణాళికలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువ వెంట తిరిగి అన్ని చెరువులను నింపే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు.*
*ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కళ్ళు తెరిచి రాజకీయాలు పక్కన పెట్టి తిప్పర్తి మండలం లోని చెరువుల నింపే విధంగా అధికారుల పైన స్థానిక మంత్రిపైనా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజానీకాన్ని ఆదుకోవాలని కోరారు. ఆదివారం వరకు మాకు పూర్తిస్థాయిలో కాలువలు వదలక పోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం రైతులతో కలిసి ముట్టడిస్తామని అన్నారు*. *రైతుల ధర్నా, రాస్తరోకోకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తిప్పర్తి ఎక్స్ జెడ్పిటిసి డాక్టర్ శ్రీ తండు సైదులు గౌడ్ గారు మద్దతు తెలిపారు వారితో పాటు పార్టీ ముఖ్యులు (PACS), వైస్ చైర్మన్ కందుల రేణుక లక్ష్మయ్య గారు, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జాకటి బాలరాజు గారు,సిపిఎం నాయకులు, మన్యం బిక్షం గారు,రైతులు తదితరులు పాల్గొన్నారు,మద్దతు తెలిపారు.*


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home