అయోధ్య వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ను నూతన భవనం
అయోధ్యలో నూతన భవనంలో తెలుగు సత్రం
🔹ఏడాదిగా కొనసాగుతున్న నిరంతర సేవలు
🔹త్వరలో కాశీ,అరుణాచలం, తిరుపతికి విస్తరణ
🔹 సేవల కోసం 9989 249 679 ఫోన్ నెంబర్
🔹 ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె
హైదరాబాద్ : దక్షిణాది రాష్ట్రాల అయోధ్య
యాత్రికులకు మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించడానికి శ్రీ అయోధ్య వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ను నూతన భవనంలోకి మార్చినట్లు ఆ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె తెలిపారు. శుక్రవారం అయోధ్యలో నూతన భవనంలో సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతోమాట్లాడుతూ, ఏడాదికాలంగా తాము అందిస్తున్న సేవల కారణంగా దక్షిణాది రాష్ట్రాల యాత్రికులతో తమ సంస్థకు మంచి అనుబంధం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. వారికి మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి నూతన భవనంలో తమ సేవలను ప్రారంభించామని ఆయన వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం ప్రారంభించిన సేవలు, తమ ట్రస్ట్ కార్యవర్గ సభ్యుల సహాయ, సహకారాల వల్ల కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలయాత్రికులకుకూడావిస్తరించగలిగామన్నారు.
ప్రపంచ దేశాలను సైతం ఆకర్షించిన మహా కుంభమేళా వంటి విపరీతమైన రద్దీ సమయంలో కూడా యాత్రికులకు విశిష్ట సేవ లందించామని చెప్పారు. ఇక ఇప్పుడు నూతన ప్రాంగణంలో అధునాతన సౌకర్యాలతో 60 ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
తమ సంస్థ పురోగతికి పూర్తి అండగా ఉన్న అయోధ్య హనుమాన్ గడి అర్చకులు మహంత్ గదాధర్ దాస్ స్వామీజీ సహకారాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. నూతన భవనంలో తమ సేవలు కొనసాగడానికి అవకాశం ఇచ్చిన స్వామీజీకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కాగా అయోధ్యతోపాటు నైమిశారణ్యం, కాశ్, గయా,ప్రయాగ్ రాజ్ , (అలహాబాద్) లను సందర్శించే యాత్రికులు తమ ద్వారా సేవలు పొందవచ్చని ఆయన కోరారు. అందుకోసం ఫోన్ నెంబర్ 9989 249 679 ను 24/7 అందుబాటులో ఉంచామన్నారు.
ఇదిలా ఉండగా అయోధ్యలో నిత్యాన్న సత్రం నిర్వహణకు సహకరించే దాతలు ఫోన్ నెంబర్ 98487 87 611 ఫోన్ నెంబర్ లో సంప్రదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చైర్మన్ హరినాథ్ గుప్త తోపాటు, సంస్థ ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేష్ గుప్త, కోశాధికారి దేమే వీరేశం గుప్త, సంయుక్త కార్యదర్శి పల్లా నాగరాజు గుప్త తదితరులు పాల్గొన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home