Monday, 30 December 2024

సోమావతీఅమావాస్య

 *🚩_కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైన #సోమావతీఅమావాస్య..!!🚩_*


మీరు తెలుసుకోండి , మన వాళ్ళకు మీకు తెలిసిన వారికి తెలియజేయండి. మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. "


*అమావాస్య ! సోమవారంతోకలసి వచ్చినది!! బహుపుణ్యమహోదయకాలం!!*


*ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం!* 


*సోమావతి అమావాస్య*


సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును *సోమావతి అమావాస్య* అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.


సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి


1. సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం.


2. ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.


3. శని మంత్రాన్ని పఠించి, శ్రీ మన్నారాయణ మూర్తిని అర్చించాలి.


4. గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది.


5. వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం - సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించినవారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. 


సోమావతి అమావాస్య గురించి ఒక కథకూడా ఉంది. దాని ప్రకారం …


పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉండేవారు. ఒకరోజు పెళ్ళికాని ఆ కుమార్తెనును ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడి దీని గురుంచి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరకి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లయిన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా, దానికి వారు చాలా బాధపడి దానికి పరిష్కారమడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెల్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు.

మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి వెళతాడు.వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సివస్తుంది .ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటుంటారు .ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంటతన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. వీరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు సేవ చేయగా, ఈ సోమావతి అమావాస్యరోజున ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరకి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతీ అమావాస్య కథ.


అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజు సోమావతి అమావాస్య . ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు  ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి.


ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ మన్నారాయణుని, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి.

Thursday, 26 December 2024

మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ గారి ఆధ్వర్యంలో 216 వ ఉచిత వివాహం

మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ గారి ఆధ్వర్యంలో 216 వ ఉచిత వివాహం



మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ గారి ఆధ్వర్యంలో 216 వ ఉచిత వివాహం చి. సౌ. ల మమత తో- చి. సురేందర్ గార్లకు (ఇద్దరు దివ్యాంగులు) 26.12.2024 ఉదయం 11,40 ని.. గురువారం రోజు పూర్తి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది హాల్, పందిరి రెండు బంగారం పుస్తెలు,మట్టెలు,స్టీల్ సామాను, పెళ్లి బట్టలు అన్ని వస్తువులతో హిందూ సంప్రదాయం ప్రకారం వారి ఇరువురి ముహూర్తం ప్రకారం స్వాతి నక్షత్రం ఏకాదశి దివ్య ముహూర్తం లో జరిగింది ఈ వివాహానికి ..

శ్రీ కోటగిరి సుధాకర్. ఉదయ లక్ష్మి దంపతులు. కోటగిరి సచిన్ సంధ్య దంపతుల గార్ల సహాయ సహకారం తో జరిగింది నా దాతల సహాయం సహకారం అన్ని కార్యక్రమం లకు లభిస్తుంది నాకు భగవంతుడు కల్పించిన అదృష్టం నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తూ నిరుపేదలకు పెళ్ళి చదువు ఇతరాత్ర కార్యక్రమం లు నిర్వహిస్తున్నాను 

తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్పర్సెన్ శ్రీమతి కల్వ సుజాత గారి అభినందనలతో... ఉపేందర్ మొగుళ్లపల్లి.

విజయవంతమైన ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక

 విజయవంతమైన ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక 




హైదరాబాద్, డిసెంబర్ 25: ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక నిన్న హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో అతి ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పెళ్లీడు ఉన్న ఆర్యవైశ్య అమ్మాయిలు మరియు అబ్బాయిలు సుమారు 110 మంది పాల్గొని పరస్పర పరిచయాలు చేసుకున్నారు. వాతావరణం సంపూర్ణంగా పెళ్లి వేడుకగా మారింది.


ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది హాజరయ్యారు. ఉదయం 9:30 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేదిక రాత్రి 8 గంటల వరకు కొనసాగింది.


ముఖ్య అతిథులుగా రమేష్ గెల్లి గ మరియు తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత హాజరై తమ స్ఫూర్తిదాయకమైన మాటలతో కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించారు.


రమేష్ గెల్లి మాట్లాడుతూ, జీవిత భాగస్వామి ఎంపికలో ఓపిక, సర్దుకుపోయే గుణం ముఖ్యమని హితవు పలికారు. శ్రీమతి కల్వ సుజాత ఈ సందర్భంలో మాట్లాడుతూ, భాగస్వామి ఎంపిక ఈ రోజుల్లో ఎంత కష్టమైనదో వివరించారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆవోపా నిర్వాహకుల శ్రమను ప్రశంసించారు.


సభాధ్యక్షులు నమశివాయ స్వాగత ఉపన్యాసంలో ఈ సంవత్సరంలో కొత్తగా ఒక మధ్యస్థ కమిటీను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీకి ఈ పరిచయ వేదిక సలహాదారులు కౌటికె విఠల్ చైర్మన్‌గా నియమించబడగా, ఐదుగురు సభ్యులు ఈ కమిటీలో ఉండబోతున్నారు. ఈ కమిటీ ద్వారా సంబంధాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం తమ కర్తవ్యమని వివరించారు.


ప్రధాన కార్యదర్శి మడుపల్లి రవి గుప్తా మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్ల అనుభవంతో భవిష్యత్తులో ప్రతి సంవత్సరం 25 డిసెంబర్ రోజున ఇదే కార్యక్రమం నిర్వహించబోతున్నామని చెప్పారు. ఉభయ రాష్ట్రాల వైశ్యులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.


మధ్యస్థ కమిటీ చైర్మన్ కౌటికె విఠల్ తమ సభ్యులను పరిచయం చేస్తూ, వారి సేవల ద్వారా సంబంధాలను సమన్వయం చేసేందుకు అందరి సహకారం కోరారు. ఈ సేవకు అవకాశం కల్పించిన ఆవోపా మేనేజ్మెంట్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమం నిర్వహణకు ఆర్థిక సహకారం అందించిన బి.వి. మోహన్ రావు, విశిష్ట జువెలరీస్ గందె సుధాకర్, ఎర్రం బాలకృష్ణ, బండారు సుబ్బారావు, తాడేపల్లి రాజశేఖర్ (చెన్నై), పబ్బతి వెంకట రవికుమార్ గార్లకు సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.


కోషాధ్యక్షులు మాకం బద్రీనాథ్  వందన సమర్పణ ద్వారా కార్యక్రమానికి ముగింపు పలికారు.


Wednesday, 25 December 2024

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం - శ్రీతేజ్​ li పరామర్శించిన అల్లు అరవింద్, దిల్​ రాజు -

 శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం - 

శ్రీతేజ్​ li  పరామర్శించిన అల్లు అరవింద్, దిల్​ రాజు - 

నేడు సీఎంతో సినీప్రముఖుల భేటీ


హైదరాబాద్​: సంధ్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు పుష్ప-2 చిత్ర బృందం 2 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. అల్లు అర్జున్ కోటి రూపాయలు, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలతోపాటు నిర్మాతలు రూ.50 లక్షల రూపాయలను రేవతి కుటుంబానికి ఇస్తున్నట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత చెక్కులను అల్లు అరవింద్ తెలంగాణ ఫిలిం డెవలప్​ మెంట్​  ఛైర్మన్ దిల్​ రాజుకు అందజేశారు. మరోవైపు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఎఫ్​డీసీ ఆధ్వర్యంలో బుధ వారం  ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమవుతున్నట్లు దిల్ రాజు ప్రకటించారు.

 ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని మరోసారి కలిసిన ఎఫ్​డీసీ ఛైర్మన్ దిల్ ​రాజు, నిర్మాత అల్లు అరవింద్​లు 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అల్లు అర్జున్ తరఫున రూ.కోటి రూపాయలు : శ్రీతేజ్ తండ్రి భాస్కర్​తో మాట్లాడి పుష్ప చిత్ర బృందం తరఫున అందించే ఆర్థిక సాయన్ని గురించి దిల్ రాజు వివరించారు. అనంతరం మీడియా సమక్షంలో పరిహారం వివరాలను వెల్లడించిన అల్లు అరవింద్ రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో అల్లు అర్జున్ తరపున కోటి రూపాయలు, దర్శకుడు సుకుమార్ తరపున రూ.50 లక్షలు, మైత్రీ మూవీస్ నిర్మాతలు రవిశంకర్, నవీన్​ల తరపున రూ.50 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మైత్రీ మూవీస్ నిర్మాతలు మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో 50 లక్షల రూపాయల చెక్​ను శ్రీతేజ్ తండ్రి భాస్కర్​కు అందించారు. మిగతా కోటి 50 లక్షల రూపాయల చెక్కులను తమ న్యాయవాది సలహా మేరకు ఎఫ్​డీసీ ఛైర్మన్ దిల్​ రాజుకు అందిస్తున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.

కోలుకుంటున్న శ్రీతేజ్​

"బాలుడు(శ్రీతేజ్)​ త్వరలోనే కోలుకుని మనందిరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడకు రావడానికి కారణం శ్రీతేజ్​ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు. మా తరఫు నుంచి (అల్లు అర్జున్ తరఫు) కోటి రూపాయలు, నిర్మాతలు రవి, నవీన్​ కలిపి రూ.50 లక్షలు మైత్రీ తరఫున, సుకుమార్​ తరఫున రూ. 50 లక్షలు ఇచ్చారు. ఈ మొత్తం 2 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కును ఎఫ్​డీసీ ఛైర్మన్​ దిల్​ ​రాజుకు ఇచ్చాం. వాటిని బాధిత కుటుంబానికి అందజేయాలని విజ్ఞప్తి చేశాం"- అని అల్లు అరవింద్ తెలిపారు. 

నేడు సీఎంతో భేటీ....

ప్రభుత్వం తరపున అల్లు అరవింద్​ తో బాధిత కుటుంబాన్ని కలిసిన దిల్ రాజు శ్రీతేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని తెలిపారు. పుష్ప-2 చిత్ర బృందం అందించిన మొత్తాన్ని బాధిత కుటుంబంతో మాట్లాడి ఫిక్స్​డ్ డిపాజిట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అలాగే ఎఫ్​డీసీ ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిణామాలు, ఇటీవల సంఘటనలపై రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమవుతున్నట్లు దిల్ రాజు వెల్లడించారు.

సీఎంతో సమావేశంపై పరిశ్రమలోని హీరోలు, దర్శక నిర్మాతలందరితోనూ చర్చిస్తున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకే తనను ఎఫ్​డీసీ ఛైర్మన్​గా నియమించినట్లు దిల్ రాజు పునరుద్ఘాటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శ్రీతేజ్​ను పరామర్శించారు. కొరియోగ్రాఫర్స్ అందరి పక్షాన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని జానీ మాస్టర్ తెలిపారు.

వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్డిఓ ఆఫీస్ లో ఏసీబీ దాడులు .

 


వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్డిఓ ఆఫీస్ లో ఏసీబీ దాడులు 


రూ.  5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు.

Monday, 23 December 2024

వైశ్యులకు ఎక్కడ ఏ ఆపద ఉన్న* *అండగా నేనున్నా అంటూ* *సిల్వెల్ అధినేత* *బండారు సుబ్బారావు

 ఇటీవల సంధ్యా థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి భర్త భాస్కర్ గారిని కలిసి వైశ్య సమాజమంతా మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించి ఉడతా సాయంగా కొంత మొత్తాన్ని ఆర్థికంగా వారికి సహాయం చేయడం జరిగినది సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా *వైశ్యులకు ఎక్కడ ఏ ఆపద ఉన్న* *అండగా నేనున్నా అంటూ* *సిల్వెల్ అధినేత* *బండారు సుబ్బారావు


అన్న గారికి* హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు సహకరించిన వారిలో కాశి గారికి ఇమ్మడి రమేష్ గారికి, రామ సత్యనారాయణ గారికి , ఆలపాటి శ్రీకర్ గారికి ,పబ్బతి రవి గారికి, రవి కొల్లిపర గారికి ,నరేష్ గారికి, డాక్టర్ శ్రీకాంత్ గారికి ,చికోటి దయాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.


ఉచిత వివాహం 215 వది మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ ఆధ్వర్యంలో

 ఉచిత వివాహం 215 వది 

మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ ఆధ్వర్యంలో 

215 వ ఉచిత వివాహం  చి. ల. సౌ.సంగీత చి. అరవింద్ గార్లతో.   22.12.2024 ఉదయం 10.30 ముహూర్తం శ్రీ దాస ఆంజనేయ దేవాలయం కొత్తపేట హైద్రాబాద్ లో జరిగింది 

ఒక బీద వారి వివాహం కోటి జన్మల పుణ్యం ఆ అదృష్టం నా దాతలకు నాకు వారి ద్వారా కల్పించిన అదృష్టం గా భావిస్తూ సదా మీ సేవలో ఉపేందర్ మొగుళ్లపల్లి , బంగారు పుస్తెలు మట్టెలు సర్వ శ్రీ కోటగిరి సుధాకర్ ఉదయ శ్రీ దంపతులు ,ఇంకా ప్రతి పెళ్ళి కి శ్రీ రామిని విజయ్ పెద్ది చెంద్రమౌళి తుమ్మల బాల్ రెడ్డి విజ్ఞాన్ బస్సా శ్రీనివాస్ హైదరాబాద్ బొగ్గారపు వెంకటేష్ అన్న 

నేను నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమములకు సహకారం సహాయం అందించే నా స్నేహితులు బంధువులు నా దాతలు దేవుళ్ళతో సమానం మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు వారికీ కృతజ్ఞతలు. 

m







Thursday, 19 December 2024

*కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే.*

 *కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే.*



రెడ్ లైట్ ఉల్లంఘన 

- మునుపటి జరిమానా: రూ.100

- ప్రస్తుత జరిమానా: రూ.500


అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం

- మునుపటి జరిమానా: రూ.500

- ప్రస్తుత జరిమానా: రూ.2,000


లైసెన్స్ లేకుండా డ్రైవింగ్

- మునుపటి జరిమానా: రూ.500

- ప్రస్తుత జరిమానా: రూ.5,000


అతివేగం

- మునుపటి జరిమానా: రూ.400

- ప్రస్తుత జరిమానా: రూ.1000


ప్రమాదకరమైన డ్రైవింగ్

- మునుపటి జరిమానా: రూ.1000

- ప్రస్తుత జరిమానా: రూ.5,000


డ్రంక్ అండ్ డ్రైవ్..

- మునుపటి జరిమానా: రూ.2000

- ప్రస్తుత జరిమానా: రూ.10,000


రేసింగ్, స్పీడింగ్

- మునుపటి జరిమానా: రూ.500

- ప్రస్తుత జరిమానా: రూ.5,000


హెల్మెట్ ధరించకపోవడం

- మునుపటి జరిమానా: రూ.100 

- ప్రస్తుత జరిమానా: రూ.1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు


సీట్‌బెల్ట్ ధరించకపోవడం

- మునుపటి జరిమానా: రూ.100

- ప్రస్తుత జరిమానా: రూ.1000


అత్యవసర వాహనాలను అడ్డుకుంటే..

- మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు

- ప్రస్తుత జరిమానా: రూ.10,000


బైక్‌పై ట్రిపుల్ రైడింగ్

- ప్రస్తుత జరిమానా: రూ.1,200


ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్

- మునుపటి జరిమానా: రూ.100

- ప్రస్తుత జరిమానా: రూ.2,000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.


ఇన్సూరెన్స్‌ లేకుండా డ్రైవింగ్

- మునుపటి జరిమానా: రూ.1,000

- ప్రస్తుత జరిమానా: రూ.2,000


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమలులోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టాల ప్రకారం... ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే.. ఏకంగా రూ.25 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. దాంతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించనున్నారు.

మరి తస్మాత్ జాగ్రత్త.......................... ✍️

Tuesday, 17 December 2024

సిఐడి ఎస్పీ:పోలా విజయకుమార్

 శ్రీ పోలా విజయకుమార్


గుప్తా అన్నగారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐడి ఎస్పీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందిన శుభ  సందర్భంగా శుభాకాంక్షలు,

Saturday, 14 December 2024

ఖమ్మం జిల్లా, జిల్లా ఖజానా కార్యాలయం, సీనియర్ అకౌంటెంట్ ACB నెట్‌లో

  ఖమ్మం జిల్లా, జిల్లా ఖజానా కార్యాలయం, సీనియర్ అకౌంటెంట్ ACB నెట్‌లో  


19-10-2024న, కట్ట నాగేశ్, సీనియర్ అకౌంటెంట్, జిల్లా ఖజానా కార్యాలయం, ఖమ్మం జిల్లా మీద ACB misconduct కేసు నమోదు చేసింది. అధికారిక అనుకూలత చూపించడానికి, అంటే RPS జీతం స్థిరీకరణ, సేవా పెన్షన్, గ్రాచ్యుటీ, పెంచిన కుటుంబ పెన్షన్, సాధారణ కుటుంబ పెన్షన్ బిల్లులు మరియు దాత గడువు మృతుల చెల్లింపులు, మొత్తం రూ. 3,92,960/- సంబంధిత బిల్లుల నుండి రూ. 40,000/- లంచం కోరాడు.బిల్ మొత్తం యొక్క 10% ను కమిషన్‌గా కోరాడు. అందువల్ల, తన విధిని తప్పుగా మరియు అవినీతిపరంగా నిర్వహించి, అన్యాయ ప్రయోజనం పొందాడు. సెక్యూరిటీ కారణాల వల్ల ఫిర్యాదుదారుల వివరాలు వెల్లడించడం లేదు. కట్ట నాగేశ్, సీనియర్ అకౌంటెంట్, జిల్లా ఖజానా కార్యాలయం, ఖమ్మం జిల్లా, అరెస్టు చేయబడ్డాడు. మరియు SPE & ACB కేసుల కోసం గౌరవనీయ III అదనపు సెషన్స్ జడ్జ్ వరంగల్ ముందు ప్రవేశ పెట్టారు., . కేసు విచారణలో ఉంది.  


ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినట్లయితే, ప్రజలు చట్టం ప్రకారం చర్య తీసుకోవడానికి ACB యొక్క టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు కోరారు.  


Friday, 13 December 2024

ప్రభుత్వ ఉద్యోగులకు 2025లో డబుల్‌ జాక్‌పాట్‌.. అర లక్షకు పెరగనున్న జీతం


 ప్రభుత్వ ఉద్యోగులకు 2025లో డబుల్‌ జాక్‌పాట్‌.. అర లక్షకు పెరగనున్న జీతం


                  : కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోనుండగా.. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్ తగలనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2025 సంవత్సరంలో 2 శుభవార్తలు ఉండనున్నాయి. దీంతో పింఛన్‌దారులకు.. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. దీంతో ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఏడాది వెలుగులు నింపబోతున్నది.

కొత్త ఏడాది: కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు రెండు జాక్‌పాట్‌లు లభించనుంది.

అంచనా ఇలా: 8వ పే కమిషన్ నోటిఫికేషన్ పే పెంపును నిర్ధారిస్తుంది. 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

ఎదురుచూపులు: 8వ వేతన సంఘం ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ వేతన సంఘం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది.

భారీ ఆశలు: రానున్న కేంద్ర బడ్జెట్‌లో 8వ వేతన సంఘానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆశిస్తున్నారు.

ప్రతిపాదనలు: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ ఆర్గనైజేషన్స్ (ఎన్‌సీ-జేసీఎం) ఉద్యోగులకు వేతన ఇంక్రిమెంట్‌లను ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఆధారంగా లెక్కించాలని ప్రతిపాదించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఇటీవల నివేదికల ప్రకారం వేతనాలు 2.86 రెట్లు పెరుగుతాయి.

మూల వేతనం: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరుగుతుందని అంచనా. దీంతో జీతం భారీగా పెరగనుంది.

ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌: వేతనాలు, పెన్షన్‌లను లెక్కించడానికి 'ఫిట్‌నెస్ ఫ్యాక్టర్' వినియోగిస్తారు. 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించబడింది. దీంతో మూల వేతనం రూ.7 వేల నుంచి రూ.18,000కు పెరిగింది.

పింఛన్‌ భారీగా: 8వ వేతన కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను మార్చితే.. రిటైర్డ్ ఉద్యోగులపై కూడా 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేస్తే పింఛనుదారుల ప్రాథమిక పెన్షన్ రూ.25,740కు పెరుగుతుంది.

సెంట్రల్ సెన్సర్ బోర్డు మెంబర్ గా :ఉపేందర్ మొగుళ్లపల్లి ని నియమించిన కేంద్ర ప్రభుత్వం

భారత ప్రభుత్వం చే "సెంట్రల్ సెన్సర్ బోర్డు మెంబర్ గా రెండవ సారి రెండు సం కొరకు ఉపేందర్ మొగుళ్లపల్లి ని నియమించిన కేంద్ర ప్రభుత్వం.. 



Wednesday, 11 December 2024

షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ పై స్వీకరించిన దరఖాస్తులన్నింటిని క్రోడీకరించి దానిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని రాష్ట్ర ఎస్ సి ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ తెలిపారు.

   షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ పై స్వీకరించిన దరఖాస్తులన్నింటిని క్రోడీకరించి దానిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని  రాష్ట్ర ఎస్ సి  ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్  అక్తర్ తెలిపారు.




4


4

4

      బుధవారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ పై అధ్యయనం నిమిత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్ సి కులాలు, కుల సంఘాలు, వ్యక్తులతో  బహిరంగ విచారణ  నిర్వహించారు.

       ఈ సందర్భంగా పలువురు షెడ్యూల్ కులాల సంఘాలు వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ పై దరఖాస్తులను  సమర్పించారు

     అనంతరం చైర్మన్ మాట్లాడుతూ బహిరంగ విచారణలో స్వీకరించిన దరఖాస్తులు, అభిప్రాయాలు అన్నింటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. దరఖాస్తు సమర్పించే వారందరూ ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా సమర్పించాలని  కోరారు. వీటన్నింటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని అన్నారు. ఇదివరకు రంగారెడ్డి, తదితర జిల్లాలలో బహిరంగ విచారణ నిర్వహించడం జరిగిందని, జిల్లాల సందర్శన సందర్భంగా దరఖాస్తు సమర్పించలేకపోయిన వారు హైదరాబాద్ లో నేరుగా కమిషన్ కు  వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చని అన్నారు.

      కాగా షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పై నిర్వహించిన బహిరంగ విచారణలో  245 మంది వ్యక్తిగతంగా,కుల సంఘాల పరంగా దరఖాస్తులు సమర్పించారు.

      అనంతరం చైర్మన్ నల్గొండ మండలం చర్లపల్లి బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను సందర్శించి అక్కడ విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడారు. చదువే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని, ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలలు,  కళాశాలలు, రెసిడెన్షియల్ సంస్థలు, అన్ని విద్యా సంస్థల్లో ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నదని, తాము చదువుకునే రోజుల్లో  ఇలాంటి వసతులు లేవని, అందువల్ల బాగా చదువుకొని ఉన్నత స్థానంలోకి రావాలని ఆయన కోరారు.

      ఈ సందర్భంగా ఆయన విద్యార్తినిల చదువు, సౌకర్యాలు, భోజనం, తదితరు అంశాలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.

      చర్లపల్లి రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు బాగున్నాయని, విద్యార్థినిలు సైతం బాగా చురుకుగా ఉన్నారని అన్నారు.

    కాగా ఎస్ సి వర్గీకరణ పై బహిరంగ విచారణ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఎస్ సి  ఏక సభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్

అక్తర్ కు   ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

      జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద  ఎస్ సి కార్పొరేషన్ ఈడీ, జిఎం కోటేశ్వరరావు, డిఆర్ఓ అమరెందర్, ఆర్డీవో అశోక్ రెడ్డి లు స్వాగతం పలికారు .

   వీరి వెంట రాష్ట్ర ఎస్ సి కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ శ్రీధర్,  డిఎస్పి శివరాం రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్,  రాష్ట్ర కార్యాలయం సుపరింటిండెంట్ సజ్జన్ కుమార్ తదితరులు ఉన్నారు

_____________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Tuesday, 10 December 2024

రేగుపండ్లు.. పోషకాలు మెండు.. తింటూ ఆరోగ్యంగా ఉండు!


 రేగుపండ్లు.. పోషకాలు మెండు.. తింటూ ఆరోగ్యంగా ఉండు!

 

 ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు పండ్లను తినాలి. అందులోనూ సీజనల్ ఫ్రూట్స్ తింటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ చలికాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ మన శరీరానికి కావలసిన చక్కని పోషకాలను అందిస్తాయి. అలా చలికాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ లో రేగుపండ్లు ఒకటి. రేగు పండ్లలో పోషకాలు పుష్కలం రేగుపండ్లలో ఉండే పోషకాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. రేగుపండ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, ఫైబర్, అమైనోయాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. రేగుపండ్లలో ఉండే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బతినకుండా రక్షిస్తాయి. "ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్లు తింటున్నారా?" రేగుపండ్లతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు రేగుపండ్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. అంతే కాదు ఇవి మన రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తుంది. ఇన్ఫెక్షన్లతో మన శరీరం పోరాడడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. రేగుపండ్లలో ఉండే ఐరన్ కారణంగా రక్తహీనత సమస్య తగ్గుతుంది. రేగుపండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి, ఇవి మన ఎముకల దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి. రేగుపండ్లతో ఆర్థరైటిస్ కు చెక్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కీళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వీటిని తినడం ఎంతో మంచిది. రేగుపండ్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు మన చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి. చర్మంపై ముడతలు మచ్చలు పోయేలా చేస్తాయి. మలబద్ధకం ఉన్నవారికి కూడా రేగుపండ్లు ఎంతో బాగా పనిచేస్తాయి.రేగుపండ్లను తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది.

 Powered By బరువు తగ్గాలన్నా, హైబీపీ కంట్రోల్ కావాలన్నా రేగుపండ్లు ఇక బరువు తగ్గాలి అని భావించే వారికి కూడా రేగుపండ్లు మంచి ఆహారం రేగు పండ్లు ఊపిరితిత్తులలో పేర్కొన్న కఫాన్ని బయటకు పంపి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. రేగుపండ్లతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. హైబీపీని కంట్రోల్ చేస్తాయి. క్యాన్సర్ నుంచి కూడా రేగుపండ్లు కాపాడుతాయి. దీర్ఘకాలిక ఆందోళన ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం ఇస్తాయి. ఆల్జీమర్స్ రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా రేగుపండ్లను తినవచ్చు.

తాటి తేగల గురించి ఈ విషయాలు తెలిస్తే తప్పక తింటారు!

 తాటి తేగల గురించి ఈ విషయాలు తెలిస్తే తప్పక తింటారు! 



 తాటి ముంజలు, తాటి పండ్లు అందరికీ తెలుసు. అయితే వీటి నుంచే తాటి తేగలు వస్తాయనే విషయం చాలామందికి తెలియదు. తాటి పండ్లు నేల మీద రాలి సహజంగా మొలకెత్తినప్పుడు తాటి తేగలు వస్తాయి. ఒక్సాకోరి తాటి తేగల కోసం మంచిగా నీళ్లు పారే ప్రాంతంలో రైతులు పాతి పెడతారు అవి మొలకెత్తి పెరుగుతున్న సమయంలో తవ్వి తీసి ఆ కాండాలను ఉడకబెట్టి మంట మీద కాలుస్తారు. తాటి తేగలలో ఫుల్ పోషకాలు వాటినే తాటి తేగలు అంటారు. ఇక వీటిని వాటి పై ఉన్న పొరను తొలగించి తింటారు. తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఈ తాటి తేగలు బోలెడన్ని పోషకాలతో ఉంటాయి. తాటి తేగల్లో పొటాషియం, విటమిన్ బి, వన్ బి టు, బి త్రీ, క్యాల్షియం, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. "చికెన్, మటన్ కలిపి తింటున్నారా? తప్పక తెలుసుకోండి!" తాటి తేగలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పెరిగే ఈ తాటి తేగలు మంచి పోషకాహారంగా మనం చెప్పవచ్చు. ఈ తాటి తేగలను పోషకాహార లోపంతో బాధపడేవారు ప్రతిరోజు ఒకటి తింటే మంచిది. వీటిల్లో ఉండే పీచు పదార్థం మన జీర్ణ క్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. అలాగే మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గటానికి మాత్రమే కాదు ఈ సమస్యలకు మంచిది ఇక బరువు తగ్గాలని భావించే వారికి తాటి తేగలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల మన ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకుంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల రక్త కణాలను పెంచి, మన వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. Powered By గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో సమస్యలకు చెక్ ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి. ఇవి నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత వ్యాధుల నుండి కాపాడతాయి. డయాబెటిస్ తో బాధపడే వారికి వీటిని తింటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తాటి తేగలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా మంచిది.

చలికాలంలో పొద్దున్నే ఇలా చేయకపోతే..గుండెపోటు వచ్చే ఛాన్స్!


 చలికాలంలో పొద్దున్నే ఇలా చేయకపోతే..గుండెపోటు వచ్చే ఛాన్స్!

                : సాధారణంగా చలికాలంలో అంటువ్యాధుల ముప్పు పెరగడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా గుండె సిరల్లో సంకోచం ఉంటుంది. రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది..ఫలితంగా ఇది గుండెపోటుకు కారణమవుతుంది. కాబట్టి శీతాకాలంలో గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఏడాది దేశం అంతటా రికార్డు స్థాయిలో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచానా వేశారు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తలు వహించాలి. వేసవికాలంతో పోలిస్తే శీతాకాలంలో గుండె జబ్బుల కారణంగా మరణించే వారి సంఖ్య 30 శాతం పెరుగుతుందని కొన్ని పరిశోధనలు కూడా తెలిపాయి. అయితే చలికాలంలో ఉదయం నిద్ర లేచిన వెంటనే చేసే కొన్ని తప్పులు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి చలికాలంలో ఉదయం నిద్రలేచిన తర్వాత ఏం చేస్తే గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం. "చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. అయితే ఈ రోగాలు రావడం పక్కా!" చలికాలంలో ఉదయం లేవగానే ఇలా చేయండి -ఉదయాన్నే నిద్రలేచి దుప్పటి తీసేసి బెడ్ పైనుంచి వెళ్లిపోకూడదు. ఉదయాన్నే లేచి కూర్చోవడానికి 20-30 సెకన్ల ముందు మీ పాదాలను మంచం నుండి ఒక నిమిషం పాటు ఉంచండి. ఇది మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. -మందు,సిగరెట్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. కొద్ది సేపు అయినా సరే రెగ్యులర్ వ్యాయామం చేయండి. ఇంట్లోనే తేలికపాటి ఇండోర్ వ్యాయామాలు చేస్తే చాలు. ఇలా చేయడం మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్

కొమురవెల్లి ప్రసాదంలో పురుగులు..!

 


కొమురవెల్లి ప్రసాదంలో పురుగులు..!

లంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి కొమురవెల్లి మల్లన్న ఆలయం. అయితే తాజాగా కొమురవెల్లి మల్లన్న ప్రసాదంలో పురుగులు రావడం భక్తులను విస్మయానికి గురి చేస్తుంది. అయితే ఇన్ని రోజులు తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యికి సంబంధించిన వార్తలు భక్తులు మారవా ముందే ఇప్పుడు ఈ కొమురవెల్లి ప్రసాదంలో పురుగులు రావడం భక్తులకు కోపాన్ని తెప్పిస్తుంది.

                అయితే ఈ రోజు ఓ భక్తునికి ప్రసాదంలో పురుగు రావడంతో ఆశ్చర్య పోయి అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా వారి సరైన సమాధానం ఇవ్వకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని అక్కడి వారు చెబుతున్నారు. అలాగే కొమురవెల్లి మల్లన్న ప్రసాదం అయిన లడ్డు, పులిహోరలో తయారీ లోపాలు ఉన్నాయి ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఇక ఇరుపతి లడ్డు ఘటన మరవక ముందే ఇప్పుడు ఇక్కడ ఇలా జరగడం భక్తుల భావాలను దెబ్బ తీస్తున్నాయి అంటున్నారు. కొమురవెల్లిలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి అని.. అయినా కూడా సిబ్బంది పట్టించుకోవడం లేదు అని భక్తులు తెలుపుతున్నారు.

U-19 Asia Cup: మీరు ఇక మారారా?: రాజస్థాన్ చిచ్చర పిడుగుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

 U-19 Asia Cup: మీరు ఇక మారారా?: రాజస్థాన్ చిచ్చర పిడుగుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు


వైభవ్ సూర్యవంశీ, 13 ఏళ్ల క్రికెట్ సంచలనం, ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ చేత రూ. 1.1 కోట్లకు కొనుగోలు అయిన తర్వాత వయస్సు కు సంబంధించి వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీలంకతో U-19 ఆసియా కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రశంసలు పొందిన వైభవ్‌పై పాక్ క్రికెటర్ జునైద్ ఖాన్ వయస్సు పట్ల సందేహాలు వ్యక్తం చేశాడు. వైభవ్ కుటుంబం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.


U-19 Asia Cup: మీరు ఇక మారారా?: రాజస్థాన్ చిచ్చర పిడుగుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు


భారతదేశపు 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేయబడిన తర్వాత, మరోసారి అతని వయస్సు కు సంబంధించి వివాదం నెలకొంది. శ్రీలంకతో జరిగిన U-19 ఆసియా కప్ మ్యాచ్‌లో వైభవ్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 67 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శన పాక్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ దృష్టిని ఆకర్షించింది, అయితే అతను ఈ యువ క్రికెటర్ వయస్సు నిజంగా 13 ఏళ్లేనా అని ప్రశ్నించాడు.



జునైద్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైభవ్ బ్యాటింగ్ వీడియోను పోస్ట్ చేస్తూ, “13 ఏళ్ల పిల్లవాడు ఇంత పెద్ద సిక్సర్లు కొట్టగలడా?” అని ఆశ్చర్యపోయాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తే, వైభవ్ కుటుంబం ఈ ఆరోపణలను తిరస్కరించేందుకు ముందుకు వచ్చింది.



వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ, బీసీసీఐ నిర్వహించిన బోన్ టెస్టింగ్, వయస్సు నిర్ధారణ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఆయన ప్రకటనలో, “వైభవ్ 8½ ఏళ్ల వయస్సులోనే BCCI బోన్ టెస్టింగ్ ను క్లియర్ చేశాడు. అతను ఇప్పటికే భారత U-19 తరపున ఆడాడు. మేము మళ్లీ ఎప్పుడైనా వయస్సు పరీక్ష చేయించడానికి సిద్ధంగా ఉన్నాం,” అని స్పష్టంగా తెలిపారు.


వైభవ్ ప్రయాణంలో బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్ తివారీ ఆశీస్సులు, మద్దతు కీలకమైనవని ఆయన గర్వంగా చెప్పారు.


ఐపీఎల్ వేలంలో, వైభవ్ బేస్ ధర రూ. 30 లక్షలు ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బిడ్డింగ్ ప్రారంభించింది. అయితే, రాజస్థాన్ రాయల్స్ చివరకు రూ. 1.1 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది. రాయల్స్ అతని ప్రతిభను పరిగణలోకి తీసుకుని నాగ్‌పూర్‌లో ట్రయల్స్‌కు పిలిచింది. ట్రయల్స్‌లో వైభవ్ తన సత్తా చాటుతూ, ఒక ఓవర్‌లో 17 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేశాడు. విక్రమ్ రాథోర్ సమక్షంలో, అతను ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లతో తన ప్రతిభను నిరూపించాడు.


ఈ యువ సంచలనం పై ఉన్న ఆరోపణల పట్ల, క్రికెట్ ప్రపంచం పగడ్బందీగా చూస్తోంది. కానీ వైభవ్ తన ఆటతో అన్ని సందేహాలను పక్కన పెట్టే దిశగా ముందుకు సాగుతున్నాడు.

ఏసీబీ వలలో ట్రెజరీ ఉద్యోగి* *🔶రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం*

 *🔊ఏసీబీ వలలో ట్రెజరీ ఉద్యోగి*


*🔶రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం*


*🍥చనిపోయిన ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్‌ కోసం రూ.40 వేలు లంచం డిమాండ్‌ చేసినందుకు ఖమ్మం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న కట్టా నగేష్‌ను ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం సుబ్లేడ్‌ పీహెచ్‌సీలో మెట్టు మల్లయ్య అటెండర్‌గా విధులు నిర్వహించి ఇటీవల చనిపోయారు. ఉద్యోగి భార్యకు రావాల్సిన చెల్లింపు స్థిరీకరణ, సేవా పింఛను, గ్రాట్యూటీ, సాధారణ కుటుంబ ఫించన్‌ బిల్లులు మొత్తం రూ.3,92,960 రావాల్సి ఉంది. వీటి కోసం అప్లై చేసుకోగా.. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కట్టా నగేష్‌ రూ.40వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దాంతో ఫిర్యాదురాలు ఏసీబీని ఆశ్రయించింది. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్‌.. ఉద్యోగి లంచం తీసుకునేటప్పుడు పట్టుకున్నారు. సుమారు రెండు గంటలపాటు నగేష్‌ను విచారించారు. ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.*

Monday, 9 December 2024

హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల భారీ మోసం: లబోదిబోమంటున్న బాధితులు

 హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల భారీ మోసం: లబోదిబోమంటున్న బాధితులు

                  హైదరాబాద్ నగరంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని ఓ సంస్థ పెద్ద మొత్తంలో డబ్బును కాజేసింది. అధిక వడ్డీకి ఆశపడిన ప్రజల నుంచి ఏకంగా రూ. 700 కోట్లు వసూలు చేసిన డీకేజడ్ టెక్నాలజీస్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో మోసం పోయామంటూ బాధితులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లబోదిబో మంటున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ డీకేజీడ్ టెక్సాలజీస్ సంస్థ ప్రజల నుంచి డబ్బులను సేకరించింది. మాదాపూర్‌లోని ఈ సంస్థ మొత్తం రూ. 700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. "అల్లు అర్జున్‌పై కేసు నమోదు: సంధ్య థియేటర్ క్లోజ్!" ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 18వేల మంది బాధితులు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు. అధిక వడ్డీలు చెల్లిస్తామని డబ్బులు సేకరించిన తమను మోసం చేసిందని బాధితులు వాపోయారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ ఎదుట బాధితులంతా ఆందోళన చేపట్టారు. ఫిర్యాదు చేసి 15 రోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. Powered By కాగా, మొత్తం 3 రాష్ట్రాల్లో 55 వేల మందికిపైగా బాధితులు ఉన్నట్లు తెలిసింది. ఈ సంస్థ ముందు ఇన్వెస్టర్లను నమ్మించేందుకు తొలుత లాభాలు చూపించింది. పెట్టుబడి పెట్టిన తర్వాత కొన్ని నెలలపాటు ఇన్వెస్టర్ల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. చివరకు రూ. 700 కోట్లతో డీకేజడ్ సంస్థ ఉడాయించింది. అయితే, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో ప్రమోషన్లు చేయించి మోసానికి పాల్పడ్డారు. లాభాలు వస్తుండటంతో.. పలువురు అప్పులు చేసి, మరికొందరు బంగారం అమ్మి పెట్టుబడి పెట్టారు. తాము ఉన్నదంతా పోగొట్టుకున్నామని బాధితులు వాపోతున్నారు. నిందితులు మాజీ మంత్రి మహమూద్ అలీ ఫొటోను కూడా వాడుకున్నట్లు సమాచారం.

Sunday, 8 December 2024

రాజన్న కోడెల పై వస్తున్న అభియోగాలను ఖండించిన ఆలయ ఈవో... వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న కోడెల పంపిణీ విషయంలో వస్తున్న అభియోగాలను ఆలయ ఈవో కె.వినోద్ ఖండించారు.


   రాజన్న కోడెల పై వస్తున్న అభియోగాలను ఖండించిన ఆలయ ఈవో...

వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న కోడెల పంపిణీ విషయంలో వస్తున్న అభియోగాలను ఆలయ ఈవో కె.వినోద్ ఖండించారు.                                     వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న కోడెల పంపిణీ విషయంలో వస్తున్న అభియోగాలను ఆలయ ఈవో కె.వినోద్ ఖండించారు. వరంగల్ జిల్లాలోని గీసుకొండ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర గోశాల సొసైటీకి ఎలాంటి కోడెలను అందించలేదని, ఇప్పటి వరకు పంపిణీ చేసిన ప్రతి కోడెను నిబంధన ప్రకారమే దరఖాస్తు చేసుకున్న రైతులకు, ఒక్కో రైతుకు రెండు చొప్పున కేటాయించామే తప్ప నిబంధనలను ఎక్కడ ఉల్లంగించలేదని, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న మంత్రి కొండా సురేఖ పేరుతో ఉన్న లెటర్ తో తమకు ఏమి సంబంధం లేదని, అది అసలు తమ వద్దకే రాలేదని కొట్టి పారేశారు.

ఇప్పటి వరకు కోడెల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, రాబోయే రోజుల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాల పై ఇప్పటికే గీసుకొండ పోలీస్ స్టేషన్ నుండి తమకు సమాచారం అందిందని, దీని పై స్థానిక పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేస్తామని, కోడెల పంపిణీ విషయంలో వస్తున్న ఆరోపణల పై ఖచ్చితంగా విచారణ జరిపి ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగినట్లు నిర్థారణ అయితే బాధ్యుల పై చర్యలు తీసుకుని, భక్తుల మనోభావాలు కాపాడేందుకు కృషి చేస్తామని అన్నారు.


Saturday, 7 December 2024

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Ambedkar Open University) వీసీగా:ప్రొ.ఘంటా చక్రపాణి

 :తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ.ఘంటా చక్రపాణి


(Pro.Ghanta Chakrapani)కి కీలక బాధ్యతలు అప్పగించింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Ambedkar Open University) వీసీ(Vice- Chairman)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సిఫారసుల మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. వచ్చే మూడేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.   కాగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా ఏర్పడ్డ టీజీపీఎస్సీ(TGPSC)కి తొలి ఛైర్మన్ గా ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా జేఎన్టీయూ ఇంచార్జ్ వీసీ(JNTU In-charge VC)గా ప్రొ. వీ బాలకిష్టా రెడ్డి(Pro.V Balakishta Reddy)ని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.  

నల్లగొండ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటన సాగుతోంది. ప్రస్తుతం నల్గొండ మెడికల్ కాలేజీ ప్రారంభం అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింగ హాజరయ్యారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా నార్కట్​పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పైలాన్​ను ​ ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకి పూలు చల్లారు. అనంతరం దామరచర్లలోని యాదాద్రి థర్మల్​ పవర్​ ప్రాజెక్టు రెండో దశ పనులను ప్రారంభించారు. యాదాద్రి థర్మల్​ ప్లాంట్​ యూనిట్​-2 ఫొటో ప్రదర్శననను సీఎం తిలకించారు. యాదాద్రి థర్మల్​ ప్లాంట్​ రెండో యూనిట్​ను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. వైటీపీఎస్​ పనులను సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు పరిశీలించారు. ఆ తరువాత నల్గొండలో నిర్మించిన వైద్య కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 












లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు

                 


సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మహదేవపల్లి గ్రామం పంచాయతీ కార్యదర్శి సి.ఉమేష్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కల్హేర్ మండలం మహాదేవ్ పల్లికి చెందిన పంచాయతీ కార్యదర్శి సి.ఉమేష్ వద్దకు మాసన్ పల్లి గ్రామానికి చెందిన బాధితుడు తాను ఫిష్ స్టాల్ పెట్టుకునేందుకు బ్యాంకు లోన్ కోసం నో డ్యూ సర్టిఫికెట్ కావాలని వెళ్లాడు. నో డ్యూ సర్టిఫికెట్ కావాలంటే రూ.15 వేలు లంచం ఇస్తే నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తానని తెలుపగా లంచం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.

లంచం డిమాండ్ విషయాన్ని ఏసీబీ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో శుక్రవారం కల్హేర్ ఎంపీపీ కార్యాలయంలో రూ.15వేలు పంచాయతీ కార్యదర్శి ఉమేష్ కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో సరెండర్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవ్వరైనా ప్రభుత్వ అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు తెలపాలని సూచించారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, లంచం అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Friday, 6 December 2024

క్యాప్సికం తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే న‌మ్మ‌లేరు..!

 


 క్యాప్సికం తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే న‌మ్మ‌లేరు..!
 

                    మార్కెట్ లో మ‌న‌కు మూడు ర‌కాల‌కు చెందిన క్యాప్సికం ల‌భిస్తాయి. ఆకుప‌చ్చ‌, ప‌సుపు రంగు, ఎరుపు రంగులో ఉండే క్యాప్సిక‌మ్ మ‌న‌కు ల‌భిస్తుంది. అయితే ప‌సుపు, ఎరుగు రంగు క్యాప్సికం ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంది. 

               మార్కెట్ లో మ‌న‌కు మూడు ర‌కాల‌కు చెందిన క్యాప్సికం ల‌భిస్తాయి. ఆకుప‌చ్చ‌, ప‌సుపు రంగు, ఎరుపు రంగులో ఉండే క్యాప్సిక‌మ్ మ‌న‌కు ల‌భిస్తుంది. అయితే ప‌సుపు, ఎరుగు రంగు క్యాప్సికం ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక చాలా మంది కేవ‌లం ఆకుప‌చ్చ రంగు క్యాప్సిక‌మ్‌ను మాత్ర‌మే తింటుంటారు. అయితే క్యాప్సికంను చాలా మంది కేవ‌లం బిర్యానీ వంట‌కాలు లేదా మ‌సాలా వంట‌కాల్లో మాత్ర‌మే వేస్తుంటారు. కానీ దీన్ని రోజూ తిన‌వ‌చ్చు. క్యాప్సిక‌మ్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావల్సిన అనేక పోష‌కాలు క్యాప్సిక‌మ్‌లో ఉంటాయి. క్యాప్సికంను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

బ‌రువు త‌గ్గేందుకు..

100 గ్రాముల ఆకుప‌చ్చ క్యాప్సికం ద్వారా మ‌న‌కు సుమారుగా 20 క్యాల‌రీ శ‌క్తి మాత్ర‌మే ల‌భిస్తుంది. క‌నుక అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి క్యాప్సికం మంచి ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. దీన్ని తిన‌డం వ‌ల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. క‌డుపు నిండిన భావ‌న‌తో ఉంటారు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఫ‌లితంగా క్యాల‌రీలు ఎక్కువ‌గా చేర‌వు. ఇది బ‌రువు తగ్గేందుకు ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. క్యాప్సికంను తింటే మ‌న‌కు ప్రోటీన్లు 0.86 గ్రాములు, కొవ్వులు 0.17 గ్రాములు, ఫైబ‌ర్ 1.7 గ్రాములు ల‌భిస్తాయి. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల క్యాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం, విట‌మిన్లు సి, ఎ, ఇ ల‌భిస్తాయి. ఇలా ఎన్నో ర‌కాల పోష‌కాల‌కు ఇవి నెల‌వు క‌నుక క్యాప్సికంను తింటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.


విట‌మిన్ సి..

క్యాప్సికంలో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల క్యాప్సికంను తింటే సుమారుగా 80.4 మిల్లీగ్రాముల మేర విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. దీంతో ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే చ‌ర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చ‌లికాలంలో చ‌ర్మం ప‌గిలే స‌మ‌స్య ఉన్న‌వారు క్యాప్సిక‌మ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వ‌ల్ల చ‌ర్మం పొడిబార‌దు. తేమ‌గా ఉంటుంది. మృదువుగా మారుతుంది. కాంతివంతంగా క‌నిపిస్తుంది.


విట‌మిన్ ఎ..

ఆకుప‌చ్చ క్యాప్సికంను తిన‌డం వ‌ల్ల విట‌మిన్ ఎ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. క‌ళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. రేచీక‌టి స‌మ‌స్య ఉన్న‌వారు క్యాప్సిక‌మ్‌ను త‌ర‌చూ తింటుంటే ఫ‌లితం ఉంటుంది. ఇక వీటిలో ఉండే విట‌మిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. ఇది ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తుంది. ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తుంది. క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. ఇలా క్యాప్సికంను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీన్ని రోజూ నేరుగా తిన‌వ‌చ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.


రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన, పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల,పారసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.

 రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన, పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల,పారసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.



      ఈనెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం అయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నాల ప్రభాకర్ తో కలిసి నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లేముల బాలెన్సింగ్ రిజర్వాయర్ ను సందర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆవిష్కరించనున్న బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు పైలాన్ ను, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

     ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలల ప్రాజెక్టు అని ,ముఖ్యంగా కరువు ప్రాంతమైన బ్రాహ్మణ వెళ్లెములకు  ఉదయ సముద్రం ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే బ్రాహ్మణవెళ్లెముల ప్రాజెక్టు గొప్ప విషయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం బ్రాహ్మణవెళ్లెముల ప్రాజెక్టుకు  ఉదయ సముద్రం నుండి బ్రాహ్మణ వెల్దములకు 0.3 టిఎంసి నీటిని విడుదల చేయనున్నారని తెలిపారు. బ్రాహ్మణ వెల్లేములకు సంబంధించి నిధులు, అనుమతులు, టెక్నికల్ శాంక్షన్ అన్నింటిని యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేస్తామని, వారం రోజుల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకుగాను మిగిలిపోయిన 730 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాగునీరు ఇస్తామని ,ఈ ప్రాంతంలో మొదటి విడుతన 50000 ఎకరాలకు సాగునీరు రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. తాము ఆధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టుల పూర్తికి కంకణం కట్టుకున్నామని, ప్రత్యేకించి నల్గొండ జిల్లా ను సస్యశ్యామలం చేసే ఎస్ఎల్ బిసీ టన్నెల్ పనులు  వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ టర్మ్ లోనే ఎస్ఎల్ బిసీ టన్నెల్ పూర్తి చేస్తామని ,ఎస్ఎల్ బిసీ ద్వారా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుండి కూడా నీరు తీసుకోవచ్చని,ఎస్ ఎల్ బి సి ద్వారా 3 లక్షల ఎకరాలకు పైగా ఎకరాలకు  సాగునీరు అందించవచ్చని, ఇటీవల ఎస్ ఎల్ బి సి టన్నెల్లు మిషన్ కు బేరింగ్ ను అమెరికా నుండి తెప్పిస్తున్నామని, ఎస్ ఎల్ బి సి టన్నేల్ పనులు రెండువైపులా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్ ఎల్ బి సి టన్నేల్ నిర్మాణం పూర్తయితే ఉదయ సముద్రానికి గ్రావిటీ ద్వారా సాగునీరు అందుతుందని ఆయన చెప్పారు. తమ హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు.


       రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజెక్టు గత ప్రభుత్వ కాలంలో అసలు పట్టించుకోలేదని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత  ప్రాజక్ట్ పూర్తి కావడం సంతోషంగా ఉందని ,పూర్తి ఎడారి ప్రాంతమైన బ్రాహ్మణ వెళ్లెముల చుట్టుపక్కల 1500 ఫీట్లలో బోర్లు వేసిన  చుక్క నీరు పడలేదని, అలాంటిది ఇప్పుడు ప్రాజెక్టులోకి నీరు వస్తే చుట్టుపక్కల బోర్లు రీఛార్జ్ అయ్యి 2  పంటలు పండడానికి అవకాశం ఉందని, అలాంటి ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ప్రాజెక్టులోకి నీరు రావడం వల్ల చుట్టుపక్కల భూముల ధరలు  పెరుగుతాయని ఆయన అన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం సైతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నామని, దీంతో నల్గొండ జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యేందుకు ఆస్కారం ఉందని అన్నారు.

     రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,అదనపు కలెక్టర్  జె.శ్రీనివాస్ ,జిల్లా ప్రాజెక్టుల సీఈ అజయ్ కుమార్, సిఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు 

ప్రజా పాలన విజయోత్సవాల వేళ.. తెలంగాణలో మరో కీలక నియామకం: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. !!


 ప్రజా పాలన విజయోత్సవాల వేళ.. తెలంగాణలో మరో కీలక నియామకం: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. !! 

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను ఉత్సాహభరితంగా జరుపుకొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ వేడుకలు సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కానున్న సందర్భంగా ఈ వేడుకలనూ నిర్వహిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 7,8,9 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఉత్సవాలను జరుపుకోనుంది. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. "We want Justice: రాత్రంతా గుంటూరు నాగార్జున వర్శిటీ విద్యార్థినుల మెరుపు ఆందోళన..!!" సచివాలయంలో నిర్మితమౌతోన్న తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని 9వ తేదీన ఆవిష్కరించనున్నారు రేవంత్ రెడ్డి. అదే రోజున కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సోనియా గాంధీ జన్మదినం కూడా కలిసి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిస్థితుల మధ్య విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌ను నియమించింది. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతిగా అపాయింట్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ జీవోను విడుదల చేశారు. గవర్నర్, ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ ఆదేశాల మేరకు ఘంటా చక్రపాణిని బీఆర్ఏఓయూ వైస్ ఛాన్సలర్‌గా నియమించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చక్రపాణి ఇదే యూనివర్శిటీలో సోషియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు. "NEET UG 2024: నీట్ రీఎగ్జామ్ లో మరో ట్విస్ట్ -ఏకంగా సగం మంది గైర్హాజరు.. !" Powered By ఘంటా చక్రపాణి స్వస్థలం కరీంనగర్. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బయోలాజికల్ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి సోషియాలజీ ఆఫ్ రిలిజియన్‌లో పీహెచ్‌డీ చేశారు. సోషియాలజీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. విద్య, ఉద్యోగ రంగానికి సంబంధించినంత వరకు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న మరో కీలక నియామకం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల కిందటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చైర్మన్‌ను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇటీవలే ఆయన బాధ్యతలను కూడా స్వీకరించారు.

Thursday, 5 December 2024

ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన "రాజీవ్ ప్రాంగణం" లో లక్ష మందితో రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభ:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి



  ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 తో సంవత్సరం నిండుతున్న  సందర్బంగా నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన "రాజీవ్ ప్రాంగణం" లో లక్ష మందితో రాష్ట్ర ముఖ్యమంత్రి  బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు   రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

     ఈనెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల  నిమిత్తం వస్తున్న దృష్ట్యా గురువారం అయన ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను పరిశీలించారు.

   అనంతరం నూతన వైద్య కళాశాల వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందుగా సుమారు 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ చానల్స్ ప్రారంభిస్తారని తెలిపారు. 2008 లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో  ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద బ్రాహ్మణ వెల్లేముల రిజర్వాయర్ మంజూరు కాగా, 80% పనులు పూర్తయ్యాయని, అయితే గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేయలేదని ,తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం పనులను పూర్తిచేశామని తెలిపారు.బ్రాహ్మణ వెల్లేముల ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ,దీని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని, నార్కెట్ పల్లి వంటి ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న మండలానికి బ్రాహ్మణ వెల్లేముల ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

     పెండింగ్ లో ఉన్న ఎస్ ఎల్ బి సి కి సైతం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి 4540 కోట్ల రూపాయలు పెంచి మంజూరి ఇవ్వడం జరిగిందని, అమెరికా నుండి బోర్ మిషన్ కు సంబంధించి బేరింగ్ మంజూరు చేయించడం జరిగిందని, 4000 నుండి 6000 క్యూసెక్కుల నీటితో నాలుగు లక్షల ఎకరాలకు ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు వస్తుందని తెలిపారు. నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం కానున్నదని, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ద్వారా సాగునీటిని తీసుకోవచ్చని తెలిపారు. 


     అనంతరం ముఖ్యమంత్రి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో యూనిట్ -2 ఎనర్జైజేషన్ ప్రారంభం తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ ఎల్ బి సి గంధం వారి గూడెం వద్ద  275 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల ను ప్రారంభిస్తారని ,అంతేగాక అక్కడే 40 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అంతే కాక నల్గొండ జిల్లా కేంద్రంలో సెట్విన్ ద్వారా మహిళలకుద్దేశించిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్నీ ప్రారంభిస్తారని, లైబ్రరీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, కంగల్, తిప్పర్తి మండలాలకు  జూనియర్ కళాశాలు మంజూరయ్యాయని, వాటికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే నార్కెట్పల్లి, దామరచర్ల మండలాలకు డిసెంబర్ 9 తర్వాత జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తూ జీఓ రానుందని మంత్రి వెల్లడించారు.


     పదికోట్ల రూపాయలతో ఎల్లారెడ్డిగూడెం వద్ద టూరిజం ద్వారా హరిత హోటల్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 500 రూపాయలకే ఎల్పీజీ  సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ,మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కింద  3600 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, రుణమాఫీ కింద 25 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశామని, సంక్రాంతి తర్వాత రైతు భరోసాను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని, వచ్చే నెలలో మూసి ప్రక్షాళన కోసం 25 వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి దశలవారీగా మూసి ప్రక్షాళనచేపట్టనున్నామని తెలిపారు.

     నల్గొండలో ఎస్ ఎల్ బి సి  గంధం వారిగూడెం మెడికల్ కళాశాల పక్కన " రాజీవ్ ప్రాంగణంలో" నిర్వహిస్తున్న బహిరంగ సభకు లక్ష  మంది ప్రజలు హాజరుకానున్నారని, ప్రజలందరూ స్వచ్చందంగా పెద్ద ఎత్తున  వచ్చి ప్రజా పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ ,అధికారులను ఆదేశించారు.


      జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ,మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,  మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రాములు నాయ క్,  వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్,ఆర్డీవో అశోక్ రెడ్డి,డి ఎస్ పి శివారాం రెడ్డి, తదితరులు ఉన్నారు