లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు
; సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మహదేవపల్లి గ్రామం పంచాయతీ కార్యదర్శి సి.ఉమేష్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కల్హేర్ మండలం మహాదేవ్ పల్లికి చెందిన పంచాయతీ కార్యదర్శి సి.ఉమేష్ వద్దకు మాసన్ పల్లి గ్రామానికి చెందిన బాధితుడు తాను ఫిష్ స్టాల్ పెట్టుకునేందుకు బ్యాంకు లోన్ కోసం నో డ్యూ సర్టిఫికెట్ కావాలని వెళ్లాడు. నో డ్యూ సర్టిఫికెట్ కావాలంటే రూ.15 వేలు లంచం ఇస్తే నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తానని తెలుపగా లంచం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.
లంచం డిమాండ్ విషయాన్ని ఏసీబీ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో శుక్రవారం కల్హేర్ ఎంపీపీ కార్యాలయంలో రూ.15వేలు పంచాయతీ కార్యదర్శి ఉమేష్ కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో సరెండర్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవ్వరైనా ప్రభుత్వ అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు తెలపాలని సూచించారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, లంచం అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home