Friday, 6 December 2024

ప్రజా పాలన విజయోత్సవాల వేళ.. తెలంగాణలో మరో కీలక నియామకం: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. !!


 ప్రజా పాలన విజయోత్సవాల వేళ.. తెలంగాణలో మరో కీలక నియామకం: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. !! 

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను ఉత్సాహభరితంగా జరుపుకొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ వేడుకలు సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కానున్న సందర్భంగా ఈ వేడుకలనూ నిర్వహిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 7,8,9 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఉత్సవాలను జరుపుకోనుంది. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. "We want Justice: రాత్రంతా గుంటూరు నాగార్జున వర్శిటీ విద్యార్థినుల మెరుపు ఆందోళన..!!" సచివాలయంలో నిర్మితమౌతోన్న తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని 9వ తేదీన ఆవిష్కరించనున్నారు రేవంత్ రెడ్డి. అదే రోజున కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సోనియా గాంధీ జన్మదినం కూడా కలిసి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిస్థితుల మధ్య విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌ను నియమించింది. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతిగా అపాయింట్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ జీవోను విడుదల చేశారు. గవర్నర్, ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ ఆదేశాల మేరకు ఘంటా చక్రపాణిని బీఆర్ఏఓయూ వైస్ ఛాన్సలర్‌గా నియమించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చక్రపాణి ఇదే యూనివర్శిటీలో సోషియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు. "NEET UG 2024: నీట్ రీఎగ్జామ్ లో మరో ట్విస్ట్ -ఏకంగా సగం మంది గైర్హాజరు.. !" Powered By ఘంటా చక్రపాణి స్వస్థలం కరీంనగర్. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బయోలాజికల్ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి సోషియాలజీ ఆఫ్ రిలిజియన్‌లో పీహెచ్‌డీ చేశారు. సోషియాలజీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. విద్య, ఉద్యోగ రంగానికి సంబంధించినంత వరకు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న మరో కీలక నియామకం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల కిందటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చైర్మన్‌ను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇటీవలే ఆయన బాధ్యతలను కూడా స్వీకరించారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home