చలికాలంలో పొద్దున్నే ఇలా చేయకపోతే..గుండెపోటు వచ్చే ఛాన్స్!
చలికాలంలో పొద్దున్నే ఇలా చేయకపోతే..గుండెపోటు వచ్చే ఛాన్స్!
: సాధారణంగా చలికాలంలో అంటువ్యాధుల ముప్పు పెరగడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా గుండె సిరల్లో సంకోచం ఉంటుంది. రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది..ఫలితంగా ఇది గుండెపోటుకు కారణమవుతుంది. కాబట్టి శీతాకాలంలో గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఏడాది దేశం అంతటా రికార్డు స్థాయిలో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచానా వేశారు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తలు వహించాలి. వేసవికాలంతో పోలిస్తే శీతాకాలంలో గుండె జబ్బుల కారణంగా మరణించే వారి సంఖ్య 30 శాతం పెరుగుతుందని కొన్ని పరిశోధనలు కూడా తెలిపాయి. అయితే చలికాలంలో ఉదయం నిద్ర లేచిన వెంటనే చేసే కొన్ని తప్పులు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి చలికాలంలో ఉదయం నిద్రలేచిన తర్వాత ఏం చేస్తే గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం. "చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. అయితే ఈ రోగాలు రావడం పక్కా!" చలికాలంలో ఉదయం లేవగానే ఇలా చేయండి -ఉదయాన్నే నిద్రలేచి దుప్పటి తీసేసి బెడ్ పైనుంచి వెళ్లిపోకూడదు. ఉదయాన్నే లేచి కూర్చోవడానికి 20-30 సెకన్ల ముందు మీ పాదాలను మంచం నుండి ఒక నిమిషం పాటు ఉంచండి. ఇది మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. -మందు,సిగరెట్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. కొద్ది సేపు అయినా సరే రెగ్యులర్ వ్యాయామం చేయండి. ఇంట్లోనే తేలికపాటి ఇండోర్ వ్యాయామాలు చేస్తే చాలు. ఇలా చేయడం మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home