--మహిళా రక్షణలో షి టీమ్ బృందాలు*
*--మహిళలను వేదిస్తే కఠిన చర్యలు తప్పవు*
-- *నల్లగొండ జిల్లా పరిధిలో 2023 సంవత్సరంలో 275 ఫిర్యాదులకు పరిష్కారం*
*--ఫిర్యాదుల స్వీకరణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం*
*జిల్లా యస్.పి చందనా దీప్తి IPS*
తెలంగాణా రాష్ట్ర ములో షీ టీమ్ పోలీస్ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోటా డేగ కళ్లతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ ఉన్నాయి అని జిల్లా యస్.పి గారు తెలిపారు. నల్లగొండ షీ టీమ్స్ బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాదు మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా, పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూ.ఆర్ కోడ్ స్కానింగ్ పద్దతిలో, వాట్స్ అప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీ టీమ్స్ వారి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయనీ తెలిపారు.నల్లగొండ జిల్లా పరిధిలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు.
*2023 సంవత్సరంలో మొత్తం పిర్యాదుల సంఖ్య.* .
1.మొత్తం పిర్యాదుల పరిష్కారం 275
2 మొత్తం FIR s 33
3 మొత్తం Petty case 200
4 కౌన్సిలింగ్ మరియు వార్నింగ్ ఇచ్చిన పర్సన్స్ 320
5 మేజర్ కౌన్సిలింగ్ పర్సన్స్ 284
6 మైనేర్స్ కౌన్సలింగ్ పర్సన్స్ 36
7 రెడ్ హాండెడ్ గా పట్టుకున్న వారు 54
8 అవేర్నెస్ ప్రోగ్రాం లు చేసినవి 630
9 Hot spots visit 160
*అదేవిధంగా జిల్లా ప్రజలు ఈ క్రింది సమాచారం తెలిస్తే సమాచారం అందిచగలరు* ..
1) చైల్డ్ మారేజి ల గురించి సమాచారము తెలిసిన
2) గర్భస్థ శిశువులను అబార్షన్ చేయించుకోవడము చేస్తున్నారని తెలిసిన
3)చిన్న ఆడపిల్లలను అమ్ముకోవడము తెలిసిన
4) లింగ నిర్ధారణ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారని తెలిసిన
5) మైనర్ బాలికల మీద లైంగికంగా వేదింపులు జరుగుతున్నా
6) మహిళల పైన మీద లైంగిక వేదింపులు జరుగుతున్నా
7) ఎవరైనా గంజాయి మరియు మత్తుపదార్థాలు అలవాటు ఉండి మీ ఇంటిపక్కలలో మీ వీధిలో మీకు ఇబ్బంధులకి గురిచేస్తే లేదా గురిచేస్తారని అనుమానము ఉన్న *ఈ క్రింది ఫోన్ నెంబర్లు కి సమాచారం అందించగలరు* .
జిల్లా ఎస్పీ, 8712670200, షీ టీమ్ నల్లగొండ –87126770235 , షీ టిమ్ మిర్యాలగూడ: 8096004465 నెంబర్లతో పాటు షీ టీమ్ ఇంఛార్జి సిఐ గోపి 8712596748 , మిర్యాలగూడ యస్ ఐ కోటేష్ నెంబర్ 8096004465. మీ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది.
*సామాజిక మద్యమాల పట్ల జాగ్రత్తా* ..
సామాజిక మద్యమాలైన ఫేస్ బుక్, ఇన్స్త్రాగ్రం లాంటి వాటిలో ప్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాటి ద్వారా పరిచయం పెంచుకోవడం, ఫోటోలు తీసుకొని మోసం చేస్తున్న కేసులు, వాట్సప్ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి వాటినే ఆ అమ్మాయికి పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందువల్ల మహిళలు, యువతులు, అమ్మాయిలు చాలా జ్రాగ్రత్తగా ఉండాలని, సామాజిక మాధ్యమాలలో ఫోటోలు షేర్ చేసేటప్పుడు ఆలోచించి పోస్టు చేయాలని అన్నారు. అదే విధంగా పోస్ట్ చేసే ఫోటోలు ప్రైవసీలో ఉండేలా చూసుకోవాలని, సామాజిక మాధ్యమాలలో తెలియని ఫోన్ కాల్స్ వస్తే వాటిని ఎత్తవద్దని పేర్కొన్నారు.
No comments:
Post a Comment