Monday, 22 January 2024

అయోధ్యలో గర్భగుడిలో పూజలందుకుంటున్న బాలరాముడు.. తొలి విజువల్స్‌

 గర్భగుడిలో పూజలందుకుంటున్న బాలరాముడు.. తొలి విజువల్స్‌

                 500 ఏండ్ల కల నెరవేరింది. యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు.

 గర్భగుడిలో పూజలందుకుంటున్న బాలరాముడు.. తొలి విజువల్స్‌

             500 ఏండ్ల కల నెరవేరింది. యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో





 నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.




‘అభిజిత్‌ లగ్నం’లో (Abhijit) పెట్టిన 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో బాలరాముడు కొలువుదీరాడు. 12.29 నిమిషాల‌కు ముఖ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 84 సెక‌న్ల పాటు అస‌లు క్రతువును చేపట్టారు. ప్రాణ ప్రతిష్టాపన అనంతరం శ్రీరాముడికి తొలి పూజ నిర్వహించారు. ముందుగా ప్రధాని మోదీ రాముడికి హారతి ఇచ్చారు. స్వర్ణాభరణాలతో బాలరాముడు ధగధగా మెరుస్తూ దర్శనమిచ్చారు. కుడిచేతిలో బాణం, ఎడమచేతిలో విల్లుతో అభయమిచ్చారు.


గర్భగుడిలో జరిగిన ఈ పూజా క్రతువులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడి తొలి విజువల్స్‌ మీకోసం..

No comments:

Post a Comment