ఆర్యవైశ్యులకు గుడ్ న్యూస్ హామీ నిలుపుకున్న మంత్రి - సీనియర్ జర్నలిస్టు కోటగిర దైవ దినం
ఆర్యవైశ్యులకు గుడ్ న్యూస్
హామీ నిలుపుకున్న మంత్రి - సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదీనం
నల్గొండ:- మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల శాసన సభ ఎన్నికల సందర్బంగా వైశ్యులకు ఇచ్చిన హామీలలో ఒక దానిని నిలుపుకున్నారని సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదీనం అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పట్టణంలోని వైష్యుల మనోభిప్రాయాలు దెబ్బతినే విధంగా బీట్ మార్కెట్లో మన కులదైవం వాసవి మాత ఆలయానికి వ్యతిరేకంగా మాంసం మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ముందుకు సాగారు. వైష్యులంతా మూకుమ్మడిగా వెళ్లి మాంసం మార్కెట్ వద్దని రెండు మూడు సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్డ్ అభ్యర్థి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా తాను గెలిచిన వెంటనే నాన్ వెజ్ మార్కెట్ తొలగిస్తానని హామీ ఇచ్చారు.
అందుకు అనుగుణంగా నేడు అనగా బుధవారం నాడు నల్గొండ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మొట్టమొదట నేరుగా మార్కెటును సందర్శించి ఇక్కడ నుండి నాన్ వెజ్ మార్కెటును తొలగించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆ ప్రాంతంలో గల షెడ్లు పూల మార్కెట్ కు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్ చేసిన సూచన మేరకు అక్కడ పూల మార్కెట్ ఏర్పాటు చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. దాంతో ఇక ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కాస్తా వెజిటబుల్ అండ్ ఫ్లవర్ మార్కెట్టుగా మారనుంది.
అంతేగాక మంత్రి మనకు ఇచ్చిన ఇతర హామీలు కూడా త్వరలో నెరవేరుస్తారని గ్యారెంటీ ఏర్పడిందని, ఇందుకుగాను మంత్రి కి కృతజ్ఞతలు చెపుతూ, పట్టణ ఆర్యవైస్యులు కూడా మంత్రికి కృతజ్ఞతలు చెప్పవలసిన భాధ్యత ఉంది అని అన్న కోటగిరి దైవాదీనం.
No comments:
Post a Comment