ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు.
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఆరు వార్డులలో ప్రజా సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బుధవారం జనవరి 4, 2024 రోజున వార్డ్ నెం. 31 వార్డ్ నెం. 32 వార్డ్ నెం.33, వార్డ్ నెం.34, వార్డ్ నెం. 35 వార్డ్ నెం. 36 వార్డులలో వార్డు సభ కార్యక్రమము నిర్వహించడం జరిగింది.
మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు గారు వార్డ్ నెం.31 చిల్డ్రన్స్ పార్క్, శ్రీనగర్ కాలనీ దగ్గర నిర్వహించిన ప్రజాసభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది . అదేవిధంగా వార్డ్ నెం.32, శ్రీనగర్ కాలనీ పార్క్, వార్డ్ నెం.33, కమ్యూనిటీ హాల్, తిరుమల నగర్, వార్డ్ నెం.34, కమ్యూనిటీ హాల్, వి.టి కాలనీ, వార్డ్ నెం. 35 కమ్యూనిటీ హాల్, పద్మానగర్ మరియు వార్డ్ నెం.36 హనుమాన్ నగర్ లలో వార్డు సభ కార్యక్రమంలో కమిషనర్ గారు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వార్డ్ ఆఫీసర్లు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల గూర్చి ప్రభుత్వం వద్ద నుంచి ఎటువంటి ఫార్మేట్ రాలేదని, వాట్స్అప్ లలో వచ్చే ఫార్మేట్ ను ప్రజలు ఎవరు నమ్మొద్దని స్పష్టం చేశారు.
ఎటువంటి జిరాక్స్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు ఫారాలను తీసుకోవద్దని పేర్కొన్నారు.
అందుబాటులో కావలసినన్ని దరఖాస్తులను ఉంచామని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. 6వ తేదీ వరకు ప్రజా పాలన కొనసాగుతుందని ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు సంబంధిత వార్డు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, వార్డ్ ప్రజలు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment