Sunday, 29 June 2025

ఆర్యవైశ్య సంఘంపై వచ్చిన వదంతులు నమ్మొద్దు.. మాదారపు రాజేశ్వర్ రావు


 

ఆర్యవైశ్య సంఘంపై వచ్చిన వదంతులు నమ్మొద్దు.. మాదారపు రాజేశ్వర్ రావు

వ్క్తగత కక్షలు, ద్వేషాలతో పట్టణ ఆర్యవైశ్య సంఘంపై వదంతులు చేస్తున్న వారి మాటలు నమ్మవద్దని సంఘ ప్రధాన కార్యదర్శి మాదారపు రాజేశ్వర్‌ రావు అన్నారు. సంఘం అధ్యక్షుడు అనారోగ్య కారణాల కారణంగా అందుబాటులో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని, కొందరు సభ్యులు కార్యవర్గంపైవున్న వ్యక్తిగత కక్షలతో సంఘంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.                                                                   వరంగల్ : వ్యక్తిగత కక్షలు, ద్వేషాలతో పట్టణ ఆర్యవైశ్య సంఘంపై వదంతులు చేస్తున్న వారి మాటలు నమ్మవద్దని సంఘ ప్రధాన కార్యదర్శి మాదారపు రాజేశ్వర్‌ రావు అన్నారు. సంఘం అధ్యక్షుడు అనారోగ్య కారణాల కారణంగా అందుబాటులో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని, కొందరు సభ్యులు కార్యవర్గంపైవున్న వ్యక్తిగత కక్షలతో సంఘంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంఘ కార్యకాలాపాలు నిర్వహిస్తున్న ప్రస్తుత కమిటీ పూర్తి భాధ్యతతో సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపారు.                                                                        వార్షిక ఆదాయం రూ.700గా వున్న సంఘాన్ని అభివృద్ధి చేసి, చందాలు వసూళ్లు చేయకుండా నగరం నడిబొడ్డున సుమారు రూ.2 కోట్ల విలువ చేసే భవనాన్ని నిర్మించి, నెలకు సుమారు రూ.3 లక్షల ఆదాయం సంఘానికి సమకూరేలా చేశామన్నారు. పట్టణ సంఘం ఆధ్వర్యంలో 11 పరపతి సంఘాలు, కార్పొరేషన్లు నిర్వహించడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన సుమారు 1500 మందికి వ్యాపార అవసరాలకు లోన్లు అందించడం, వివాహాలకు, మృతుల కుటుంబాలకు, విద్యా ఆసవరాలకు, విదేశీ విద్య అవసరాలకు ఆర్థికసాయాన్ని అందించడంతో పాటుగా సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

త్వరలోనే అన్ని విభాగాలకు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాల చిట్టాలను సభ్యుల ముందు ఉంచుతామన్నారు. అదే విధంగా త్వరలోనే చట్టాన్ని అనుసరించి నూతన కార్యవర్గ ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు చేపడతామని తెలిపారు. దీనికోసం తొమ్మిది మంది సభ్యులతో అడ్ హక్ కమిటీని సైతం ఏర్పాటు చేశామన్నారు.

Aloo stuffing mirchi bajji

 Aloo stuffing mirchi bajji


ఆలూ స్టఫింగ్ మిర్చీ బజ్జీ

  

 

 

కావలసినవి :
కావలసిన పదార్థాలు:
బజ్జీ పచ్చిమిర్చి - పావుకేజీ
బంగాళాదుంపలు: అర కేజీ
కారం: 1టేబుల్ స్పూన్
గరం మసాలా: 1టేబుల్ స్పూన్
చాట్ మసాలా: 1టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు: 1టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
శెనగపిండి: 250 గ్రాములు
బేకింగ్ సోడా: 1టేబుల్ స్పూన్
కారం: 1టేబుల్ స్పూన్
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి తగినంత

 

తయారీ :
ముందుగా పచ్చిమిర్చిని మంచినీళ్ళలో వేసి బాగా కడిగి ఒక ప్లేట్ లోనికి తీసుకొని, తడి ఆరిన తర్వాత ఒక మద్యకు పొడవుగా కట్ చేసి గింజలను తీసి పక్కన పెట్టుకోవాలి.
 బంగాళాదుంపలకు ఉడికించి తర్వాత పొట్టుతీసి మెత్తగా చేసుకుని ఇందులో  కారం, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు, గరం మసాలా మరియు ఉప్పు వేసి బాగా కపుకోవాలి. మిర్చి ఎన్ని వున్నాయో అన్నీ బాగాలుగా కలిపినా మిశ్రమాన్నీ ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు  కట్ చేసి పెట్టుకొన్న మిర్చీలోనికి బంగాళాదుంప మిశ్రమాన్ని ఒక్కో మిర్చిలోపల పెట్టాలి. ఇలా అన్ని మిర్చీలు నింపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, కారం, ఉప్పు, తగినన్నినీళ్ళుపోసి ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి  నూనె పోసి వేడయ్యాక స్టఫ్డ్ మిర్చినీ శెనగపిండి మిశ్రమంలో ముంచి  నూనెలో వేసి  బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.


Saturday, 28 June 2025

వార ఫలాలు (జూన్ 29 - జూలై 5, 2025)

 Weekly Horoscope


(జూన్ 29 - జూలై 5, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మిథున రాశి నిరుద్యోగులకు తగిన ఆఫర్ అందుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 Mesha Rashi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వీరికి ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల ఏలిన్నాటి శని సమస్యలు తగ్గుతాయి.


2 Vrushaba Rasi

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొద్ది శ్రమతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పదు. స్కంద స్తోత్ర పఠనం వల్ల కుజ దోషం తగ్గుతుంది.


3 Mithuna Rashi

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగతంగా ఒకటి రెండు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు తగిన ఆఫర్ అందుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం మీద దృష్టి పెడతారు. దుర్గాదేవీ స్తోత్ర పఠనం వల్ల కుటుంబ జీవితం మెరుగుపడుతుంది.


4 Karkataka Rashi

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వారమంతా శనితో పాటు శుభ గ్రహాల అనుకూలత కూడా ఉన్నందువల్ల అనేక విధాలైన శుభ వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శన చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థుల మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి పూజ వల్ల వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.


5 Simha Rashi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): గురు, శుక్రుల అనుకూల సంచారం వల్ల ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆదరణ, పోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ముఖ్య మైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరగడంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. తరచూ శివార్చన చేయించడం వల్ల అష్టమ శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.


6 Kanya Rashi

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): శుక్ర, బుధుల అనుకూలత వల్ల వారమంతా ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. విలాసాల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కొందరు సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇంట్లో ఒక శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల మీద శ్రమ పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకాలంలో చక్కబెడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. తరచూ సుందరాకాండ పారాయణం వల్ల ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది.


7 Tula Rashi

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్య, దశమ, లాభ స్థానంలో అనుకూల గ్రహాల సంచారం వల్ల ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు, ఆలోచనలు బాగా ఉపయోగపడతాయి. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. తొందరపడి ఎవరికీ ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది కానీ, ఇంటి ఖర్చులు బాగా పెరిగే సూచనలున్నాయి. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది.


8 Vrushchika Rashi

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వారమంతా మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు బాధ్యతలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఇంటా బయటా ప్రాధాన్యం సంపాదించుకుంటారు. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి.


9 Dhanusu Rashi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ వారమంతా శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక సమస్యల ఒత్తిడి కూడా బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. శివార్చన వల్ల అర్ధాష్టమ శని దోషం తగ్గుతుంది.


10 Makara Rashi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): గ్రహాల అనుకూలత బాగా ఎక్కువగానే ఉన్నందువల్ల వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అధికారుల నుంచి కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు తదితర అదనపు ఆదాయ ప్రయత్నాలు విశేషంగా లాభాలనిస్తాయి. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. గణపతి స్తోత్ర పఠనం వల్ల మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.


11 Kumbha Rashi

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి శని దోషం కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు, అనారోగ్య సమస్యలు, వ్యయప్రయాసలతో ఇబ్బందిపడతారు. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు రాకపోవచ్చు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు పడతారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ప్రతి రోజూ విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల కోరికలు నెరవేరుతాయి.


12 Meena Rasi

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ వారమంతా మీ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి బాగా శ్రమపడాల్సి ఉంటుంది. రావలసిన సొమ్ము పూర్తిగా అందకపోవచ్చు. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభించి, బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులకు బాగుంటుంది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల విజయాలు సాధిస్తారు.

Friday, 27 June 2025

ద్విచక్ర వాహనాలకు కూడా ఫాస్టాగ్ రానుందా..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..

 ద్విచక్ర వాహనాలకు కూడా ఫాస్టాగ్ రానుందా..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..


              హైవేలపై ప్రయాణించే ద్విచక్ర వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇకపై బైక్స్ కూడా ఫాస్టాగ్ అమర్చుకోవాలని కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి. దీంతో బైక్స్ ఉన్న వారు చాలా ఆందోళనకు గురయ్యారు. ఇది నిజమేనా? కాదా? అని సందేహాలతో ఉన్నారు. ఈ వార్తలు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వరకు చేరాయి. దీంతో ఆయన వెంటనే స్పందించారు. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

మంత్రి..

నితిన్ గడ్కరీ ట్వీట్

ద్విచక్ర వాహనాలకు ప్రభుత్వం టోల్ ఫీజు విధించబోతుందనే వార్తలు పూర్తిగా నిరాధారం అని గడ్కరీ తేల్చిచెప్పారు. ఎక్స్ వేదికగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. అసలు ఇలాంటి ఆలోచనేది తమ వద్ద లేదన్నారు. ఇలాంటి వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంటాయని, నిజానిజాలు తెలుసుకోకుండా సంచనాల కోసం ఇలాంచి కథనాలు ప్రచురించడం మంచి జర్నలిజం కాదని వ్యాఖ్యానించారు. టూ వీలర్స్ కు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఎప్పటిలానే కొనసాగుతుందని చెప్పారు. తప్పుడు వార్తలను ఖండించారు.

        హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కూడా ఈ విషయంపై స్పష్టత నిచ్చింది. ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు విధించాలనే ప్రతిపాదనేది పరిశీలనలో లేదని వెల్లడించింది. అలాంటి ప్రణాళికలు లేవని తెలిపింది. దీంతో ద్విచక్ర వాహనదారుల్లో సందిగ్ధం వీడింది.

ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్

కాగా, కేంద్రం ఇటీవలీ ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను ప్రకటించింది. దీని ద్వారా వాహనదారులపై ఆర్థిక భారం తగ్గనుంది. రూ. 3,000 చెల్లించి ఈ పాస్ తీసుకుంటే సంవత్సరం పాటు లేదా 200 ట్రిప్పులు హైవేలపై టోల్ ఫీజు లేకుండా ప్రయాణించవచ్చు. ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దీని ద్వారా వాహనదారులకు రూ. 7 వేలు ఆదా అవుతుందని నితిన్ గడ్కరీ చెప్పారు. సగటున టోల్ ఫీజు రూ. 15 మాత్రమే పడుతుందన్నారు.

ఈరోజు నుండి ఆషాఢమాసం ప్రారంభం , ఆషాఢమాసం విశిష్టత*

 * ఈరోజు నుండి ఆషాఢమాసం ప్రారంభం , ఆషాఢమాసం విశిష్టత* 




ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి , ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ ,  వ్రతం ,  పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు.


దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.


ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే , లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.


తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.


అమ్మలుగన్న అమ్మ , ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు , మహిషాసుర మర్దిని , దుర్గా దేవిని , భైరవ , వరహా , నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.


కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే , 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.


ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా , కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే , చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.


శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు , శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.

ఆషాఢ మాసం ప్రారంభం... అనంత ఫలాలనిచ్చే ఆషాఢం

 ఆషాఢ మాసం ప్రారంభం... 


 అనంత ఫలాలనిచ్చే ఆషాఢం 

        చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం సంవత్సరంలో నాల్గవ మాసం. చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాడ, ఉత్త రాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటంవల్ల ఈమా సానికి ఆషాడం అని పేరు వచ్చింది. ఈ మాసానికే శూన్య మాసమని పేరు. శుభకార్యాలకు యోగ్యమైనది కాదు. ఈ నెలలోనే పీఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్ష వహి స్తారు. ఆధ్యాత్మికపరంగా చూస్తేఆషాఢం అనంత కోటి పుణ్య ఫలితాలు అందించే మాసంగా పేరొందింది. ఈ మాసం అమ్మ ఆరాధనకు శ్రేష్ఠమైనది. గోల్కొండ కోటలోని జగ దాంబ ఆలయంలో గురువారం మొదటి బోనాల వేడుకలు ఆరం భమౌతాయి. ఘటం ఎదు ర్కోళ్లతో సంబరాలకు శ్రీకారం చుడతారు. ఈ మాస శుద్ధ విదియనాడు పూరీ జగన్నాథ రథయాత్ర ఆరంభమవుతుంది. శుద్ధషష్ఠినాడు స్కంధవ్రతం ఆచరించా లని స్మృతి కౌస్తుభం అనే వ్రత గ్రంథం పేర్కొంది. ఆషాఢ శుద్ధ సప్తమిని భాను సప్తమి అంటారు. పురుషార్ధ చింతామ ణిలో ఈనాడు 'వివస్వన్నమో భాస్కరస్సోత్పత్తిః' అని పేర్కొ న్నారు. ఇది సూర్యారాధనకు ఉద్దీష్టమైన దినం. తెలంగాణ ప్రాంతంలో బోనాల జాతరను ఘనంగా జరుపుతారు. దీనినే 'బోనాల పండుగ', 'ఆషాఢ జాతర'గా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినే 'తొలి ఏకాదశి' అనీ, శయనైకాదశి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పు కునే ఈ ఏకాదశినాడు మహావిష్ణువు క్షీరాబ్దిలో శయనిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుని సాక్షాత్కారాన్ని నేరుగా పొందడానికే ఏకాదశీ వ్రతం ఎంతగానో తోడ్పడు తుంది. సతీసక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వ్రతం చేసి భగవం తుని అనుగ్రహం పొందిందని పండరీపురంలో తొలి ఏకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.

చాంద్రభాగ నదీ తీరాన పండరీ పురం (మహారాష్ట్రలో ఉంది) లో కొలువైన విఠలుని ప్రభావం తొలి ఏకాదశినాడే చూడాలి. ఎందుకంటే సతీ సక్కుబాయి ముక్తి పొందింది ఈ ఏకాదశి నాడే. ఏకాదశి అనేది ఎంతటి పుణ్యతిథి అంటే, కృష్ణుడు స్వయంగా తన చెల్లెలు సుభద్రాదేవికి ఈ వ్రత ప్రాశస్త్యం గురించి చెప్పాడట. అంతేగాక ద్వారక నగర వాసులు ఏకాదశ వ్రతాన్ని ఆచరించాలని దండోరా వేయించాడట. ఈ ఆషాఢ శుద్ధ ఏకా దశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశివరకు (నాలుగు నెలలు) మహావిష్ణువు పాల సముద్రంలో శయనిస్తాడు. ఈ కాలంలో నియమ నిష్ఠలలో, ఆహార విహారాది నియమాలలో, నియమ బద్ధ జీవనం గడిపేవారు శ్రీహరికి ప్రీతిపాత్రులవుతారని శాస్త్ర వచనం. తొలి ఏకా దశినానాడు ఈ వ్రతాన్ని కొందరు ఆచరిస్తారు.


ఆర్ష వాఙ్మయ మూలపురుషులు వ్యాసభగవానుని జన్మ దినం ఆషాడ పౌర్ణమి. ఆషాడ బహుళ అష్టమి రౌచ్య మన్వం తరాది. రేచ్చుడు పదమూడవ మనువు. ఆషాఢ బహుళ అమావాస్య దీప పూజకు ప్రత్యేకమైనది కానీ ఆషాఢమాసం అనారోగ్య మాసం. కొత్తనీరు తాగడంవలన వివిధ రకాల జ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే మాసం. స్త్రీలు గర్భం ధరించడానికి అనుకూలమైన కాలం కాదు. అనారోగ్య దినాలలో, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం ఉంది. పైగా ఈ మాసంలో స్త్రీ గర్భం ధరిస్తే ప్రసవ సమయానికి మంచి ఎండాకాలం అవుతుంది. అది తల్లి, పిల్లకు ఎండ తీవ్రత మంచిది కాదు. ఈ నాలుగు నెలల్లో ముఖ్యంగా ఆషాడ మాసంలో మనిషి శరీ రంలోని సప్తధాతువులు పూర్తిగా శరీరానికి సహకరిం చవు. కావున ఆషాఢమాస నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని సూచిం చారు.


ఈ మాసంలో వర్షపు నీళ్లు భూమి లోనికి ఇంకి భూమిలో వున్న ఉష్ణం అలా పైకి రావడం మూలాన, ఆ ఉష్ణంలో పెరిగిన కూర గాయలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి కూరగా యలలు తినకూడదనే నియమం పెట్టారు. అందుకే ఆషా ఢంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని అంటారు. భూమధ్యరేఖకు దక్షిణంగా సూర్యగమనం వుంటుంది. దక్షిణాయన ప్రారంభమాసం ఈ మాసంలోనే.


ఆషాఢమాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలం టారు. ములగ కూర బాగా తినాలని అంటారు. అనపపప్పు వాడాలంటారు. ఈ మాసంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ మార్పువల్ల కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. లేతాకు గోరింటాకు పెట్టుకోవడంవల్ల బయటి వాతవారణానికి అను గుణంగా అది మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి కూడా గోరింటాకుకు ఉంది. గోరిం టాకు రసంలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఆషా ఢమాసంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దేవుడి ఆశీస్సులు అందవని, అందుకే శుభకార్యాలు ఈ మాసంలో చెయ్యరు. పార్వతీదేవి యొక్క అనేక రూపాలకు ఈ మాసంలో వివిధ రూపాల్లో విశేష పూజలు జరుపుతారు.


విజయవాడ కనకదుర్గాదేవికి శాకంబరీ అలంకార ఉత్సవాలు ఈ మాసంలోనే జరుగుతాయి. ఈ మాసంలో మూడవ ఆది వారంనాడు ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బోనాల జాతర వైభవోపేతంగా జరుపుతారు. యావత్ ప్రపంచం ఎంతో ఉత్సుకతతో తిలకించే పూరీ జగన్నాధ రథయాత్ర జరి గేది ఈ మాసంలోనే. దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణంతో ప్రారంభమవుతుంది. దక్షిణాయన పుణ్యకా లంలో పితృదేవతలకు శాస్త్రప్రకారం శ్రాద్ధకర్మలు నిర్వహిం చాలి. దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ. తొలి ఏకాదశి చాతుర్మాస దీక్ష, గురుపూర్ణిమ, దక్షిణాన ప్రవేశం వంటి ఎన్నో విశేషాలకు నెలవు ఆషాఢమాసం. మనం కూడా ఆచారాలు పాటిద్దాం. పూజాఫలం పొందుదాం.

 ఆషాఢంలో ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు 



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెపుతూ ఉంటారు. 


ఎందుకంటే

 

జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి.  అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు , ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ , చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం , గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.

 

ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది.  అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.


ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట , వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు , మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా , గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

 

ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు పూలు , వేళ్లు , బెరడు , విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే !  గోరింట పొడిని మందుగా తీసుకోవడం , గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే ! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ , శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.

 

ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో , కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి. ఎందుకు పెట్టుకుంటారు 


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెపుతూ ఉంటారు. 


ఎందుకంటే

 

జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి.  అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు , ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ , చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం , గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.

 

ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది.  అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.


ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట , వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు , మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా , గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

 

ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు పూలు , వేళ్లు , బెరడు , విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే !  గోరింట పొడిని మందుగా తీసుకోవడం , గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే ! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ , శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.

 

ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో , కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.

Thursday, 26 June 2025

*మొహర్రం* Muharram

 *మొహర్రం*



*మొహర్రం*


హిందు బందువులందరికి మనవి.రానున్న రోజుల్లో వచ్చేది ముస్లిం ప్రజల పీర్ల పండుగ (అసలు అది పండుగ కాదు నిజానికి సంతాప దినాలు)మన హిందు బంధువులు అదేదో మన దేవాను దేవతల పండగ అన్నట్టు తండోప తండాలుగా వెళ్లి మరీ మొక్కుబడులు చెల్లిస్తారు.

అసలు ఈ పీర్ల పండుగ ఎలా వచ్చింది అని ఒక్కసారైనా తెలుసుకునే ప్రయత్నం చేసారా...లేదు. 

మన పెద్దలు ఎదో   అజ్ఞానముతోనో లేదా తెలిసో తెలియకనో అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరు ఏదీ చెపితే అలా చేసారు వాళ్ళ ఇష్టంతో కాదు.

 ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో అన్ని నిమిషాల్లో తెలుసుకునే అవకాశం ఉంది.

కనుక నిజం తెలుసుకొని ఇన్ని రోజులు మనం చేసిన తప్పుని, పాపాన్ని సరిదిద్దుకుందాం మన పిల్లలకు సరైన మార్గం చూపుదాం. 

ధర్మో రక్షతి రక్షితః



 పీర్లు నిలుపుట 

దీనిని ముస్లిం లోని ఒక తెగ వారు మాత్రమే చేసుకునే సంతాప దినాలు.....

 మన దురదృష్టం.... దరిద్రం ....

మన తెలంగాణలో, కర్ణాటక ఆంధ్ర లోని 

కొన్ని ప్రాంతాలలో........

 మన ప్రాంతానికి ,మన దేశానికి ,

కులానికి, మతానికి, మనకు ఏమాత్రం సంబంధం లేని

 ఈ** సంతాపదినాలు **

పండుగ రూపంలో తొమ్మిది రోజులు చేసుకోవడం.....

 బానిసత్వ భావాల నుండి

 బయటపడక పోవడమే .


అసలు కథ ఏమిటనగా....

ఇరాక్  లోని కర్బలా మైదానంలో....

 హసన్ హుస్సేన్ మరియు ఆ దేశపు రాజుకు జరిగిన యుద్ధంలో 

హసన్ హుస్సేన్ చనిపోవడం 

వారి శవాలను చెరువులో వేయడము

 వారి అనుయాయులకు హసన్ హుస్సేన్ ల తల లేని మొండాలు దొరికితే 

ఆ మొండాలను సమీప మసీదు లో ఉంచి తొమ్మిది రోజులు సంతాపదినాలు చేసి

 10వ రోజున మళ్లీ చెరువులో వేయడం.......

ఇది సంక్షిప్తంగా మొహర్రం చరిత్ర.


మొహర్రం ముందు శుక్రవారం నాడు హైదరాబాద్ చార్మినార్ నుండి మదీనా వరకు 

ముస్లిం లోని ఒక తెగ కు చెందిన 

కొన్ని వేల మంది మగవారు 

మొహర్రం సంతాప దినానికి సూచనగా

నల్ల దుస్తులు వేసుకుని మౌన ప్రదర్శన చేస్తారు.

 అలాగే మొహరం నాడు అంతకు ముందు రోజు హసన్ హుస్సేన్ బాధలను తలుచుకుని చార్మినార్ ప్రాంతంలో

 బ్లేడ్లతో శరీరాన్ని కోసుకుంటారు

 దీన్ని *మాతం*

 అంటారు.

 వివరాలు కావాలంటే అన్ని దినపత్రికలలో మొహరం గురించి వస్తుంది .

చదవండి .


మరి మహమ్మద్ హసన్ హుస్సేన్ లకు మనకు ఏమైనా సంబంధం ఉందా ? 

ఈ హసన్ హుస్సేన్ లనే 

మనవాళ్లు ఆశన్న ఊశన్నల గా మార్చి....

 ఆ పేర్లను పిల్లలకు పెడుతున్నారు ...


నిజాం పరిపాలనలో కాశీం రజ్వీ అరాచకాలకు సాక్ష్యంగా 

ఆ రోజు మన గ్రామాలలో

 మన *హిందూ ఆడపడుచులను బరిబత్తెల బతుకమ్మ ఆడించింది* ..

 కాశీం రజ్వీ అనుయాయులు 

మన హిందూ మగవాళ్ళని 

తరిమి తరిమి కొట్టి, హింసించి,

 బాధ పెట్టి ,నరికి చంపిన..

 విషయాలు అన్ని............

మరిచిపోయి బానిస చిహ్నంగా మారిన మొహర్రం సంతాపదినాలను 

మనం పండగలా చేసుకోవడం ?

మన అమాయకత్వం ,అజ్ఞానం, మూర్ఖత్వం.....

 ఇప్పటికీ మన గ్రామాలలో పీర్లు నిలిపిన రోజు నుండి చివరి రోజు వరకు

 మన ఆడపడుచులు ,పిల్లలు పీర్ల ముందల నెగడు చుట్టూ ఎగురుతూ, దూకుతూ పాడుతుంటారు. 

ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి ముందల నెగడు మంట పెడతారు .

అదేవిధంగా హసన్ హుస్సేన్ చనిపోయినందుకు ఆ నెగడు.

 అజ్ఞానం అమాయకత్వంతో తో మన ఆడ మగ వాళ్ళు ఎగరటం దూకడం .......

ఎంత అవివేకం


&&&& అసైదుల హారతి కాళ్ల గజ్జల గమ్మతి..

 అనే పాటల ద్వారా కమ్యూనిస్టులు 

మనల్ని పిచ్చివాళ్ళను చేసి పీర్ల  పండుగ మనదే అనే భ్రమను కల్పిస్తున్నారు .

హసన్ ,హుస్సేన్ ,బి బి ఫాతిమా ,

మౌలాలి లాంటి పేర్లు మనవే.....

 మనం చేసుకుంటే తప్పేముంది?.....

 అనే అవాస్తవిక విషయాలను మనకు నూరిపోస్తున్నారు .


కనుక నిజం తెలుసుకోండి .

కళ్లు తెరవండి. ఏ ఒక్క ముస్లిం కూడా హిందూ దేవాలయంలో  ప్రసాదం తీసుకోడు,.

 కనీసం జాతీయ పతాకానికి కూడా గౌరవం చేయనటువంటి........

 ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో .....

ఇంకా ......

మనం 

నిజాం విడిచిపెట్టిన

 బాంచన్ బతుకులకు కొనసాగిద్దామా?అందుకే  మన గ్రామాల్లో ఎక్కడికక్కడ** పీర్ల ..........పండుగ ***కాదు ........ఇది మనకు ఏ మాత్రం సంబంధం లేదు .

మనం హిందువులుగా చేసుకోవడానికి దసరా, దీపావళి ,ఉగాది ,శివరాత్రి, వినాయక చవితి ,బతుకమ్మ పండుగ, మైసమ్మ, పోచమ్మ బోనాలు ,జాతరలు చాలా ఉన్నాయి.

 వాటిని మనం భక్తిశ్రద్ధలతో ప్రకృతిని కాపాడుకుంటూ చేసుకుందామనే విషయాన్ని సహేతుకంగా,

 సవివరంగా .....

సామాన్య జనాలకు తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది......


మనవారిని  పీరీల దట్టీలు సమర్పించడం.....

 మొక్కులు మొక్కుకోవడం , కంద్రలు చేయడం,

 పీరీల కాళ్లకు నీళ్లు పోయడం ,

పీర్ల ముందర నాట్యం చేయడం.........


 అంటే

 మనకు ఏమాత్రం సంబంధం లేని ఎవరో, ఎక్కడో చస్తే......

 మనం పండుగ చేసుకున్నట్టు ఉంటుంది.

......... అని తెలియజేయాలి.

 మనకు ఏమాత్రం సంబంధం లేని 

పీర్ల సంతాపదినాలను

 మనం పండుగ చేసుకోవడం ....

పూర్తి గా ఆపివేయాలని.....

 సామాన్య జనాలు అందరికీ తెలియజేసి.....

 పూర్తిగా ఆపేంతవరకు ........

మన ప్రయత్నం ఆపకూడదు .


ఇది మన కనీస బాధ్యత.


ఈ విషయాన్ని మన హిందువుల అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తారని, చేరవేస్తారని కోరుతూ.....

    జై శ్రీరామ్🙏జై హింద్ 🚩

వందేమాతరం రచయిత : బంకిం చంద్ర ఛటర్జీ*

 *జూన్ 26 - పుట్టినరోజు* 



 *వందేమాతరం రచయిత : బంకిం చంద్ర ఛటర్జీ


భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పశ్చిమం వరకు ప్రజలను కదిలించిన గొప్ప మంత్రం వందేమాతరం. దాని స్వరకర్త బంకిం చంద్ర ఛటర్జీ 1838 జూన్ 26న పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని కంటల్‌పాడ గ్రామంలో జన్మించారు. హుగ్లీలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత, కోల్‌కతా విశ్వవిద్యాలయంలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఉన్నత విద్యను పొందారు. చదువుతో పాటు, విద్యార్థి దశ నుంచే సాహిత్యంపై కూడా ఆసక్తి కలిగి ఉండేవారు.


విద్య పూర్తి చేసిన తర్వాత, ఆయన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాశాడు, దానిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. ఈ సేవలో చేరిన మొదటి భారతీయుడు ఆయన. ఆయన మొదట ఆంగ్లంలో రచన రాయడం చేసేవారు. ఆయన ఆంగ్ల నవల 'రాజ్‌మోహన్స్ వైఫ్'  బాగా ప్రాచుర్యం పొందింది; తరువాత ఆయన తన మాతృభాష బెంగాలీలో కూడా రాయడం ప్రారంభించారు.


ఆయన తొలి బెంగాలీ నవల 'దుర్గేష్ నందిని' 1864లో ప్రచురితమైంది. అది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, బెంగాల్‌లో ప్రజలు తమ పిల్లలకు దాని పాత్రల పేర్లను పెట్టడం ప్రారంభించారు. దీని తర్వాత, 1866లో 'కపాల్ కుండల' మరియు 1869లో 'మృణాళిని' ప్రచురించబడ్డాయి. 1872లో, ఆయన 'బ్యాంగ్ దర్శన్' అనే వార్తాపత్రిక కి సంపాదకుడిగా నియమించబడ్డారు; కానీ 1882లో ప్రచురించబడిన 'ఆనంద్ మఠ్' నవల ఆయనకు అమరత్వాన్ని ఇచ్చింది.


ఆనంద్ మఠ్ అనేది దేశాన్ని తమ మాతృభూమిగా భావించి, దానిని పూజించి, తమ శరీరం, మనస్సు మరియు సంపదను దానికోసం అంకితం చేసిన, తమను తాము 'కుమారులు' అని పిలుచుకున్న యువకుల కథ. ఈ నవలలోనే 'వందే మాతరం' అనే పాట కూడా చేర్చబడింది. దానిని పాడుతున్నప్పుడు, ఆ యువకులు తమ మాతృభూమి కోసం సర్వస్వం ఇవ్వడానికి, అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. ఈ నవల మార్కెట్లోకి వచ్చినప్పుడు, అది కొంతమంది ఇంటి పేరుగా మారింది. ఇది తమ దేశం కోసం ఏదైనా చేయాలనే భావన ప్రజల హృదయాలలో నింపింది. వందే మాతరం అనే పదం అందరి నాలుకపైకి వచ్చింది.


1906లో, బ్రిటిష్ వారు బెంగాల్‌ను హిందువులు మరియు ముస్లింల ఆధారంగా రెండు భాగాలుగా విభజించాలని కుట్ర పన్నారు. ఈ వార్త వ్యాపించగానే, ప్రజలలో కోపం అలలు చెలరేగాయి. 1906 ఆగస్టు 7న, కోల్‌కతా టౌన్ హాల్‌లో ఒక భారీ సమావేశం జరిగింది, దీనిలో ఈ పాటను మొదటిసారిగా పాడారు. ఒక నెల తరువాత, సెప్టెంబర్ 7న, వారణాసి కాంగ్రెస్ సమావేశంలో కూడా దీనిని పాడారు. ఇది దేశవ్యాప్తంగా దాని ప్రతిధ్వనిని వ్యాప్తి చేసింది. అప్పుడు నుండి, ప్రతి సమావేశంలో, సెమినార్‌లో మరియు స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం పాడటం ప్రారంభమైంది.


ఇది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందింది. ఆనంద్ మఠం మరియు వందేమాతరం పాడటాన్ని నిషేధించింది. దీనిని పాడిన వారు బహిరంగంగా కొరడా దెబ్బలు తిన్నారు; కానీ భావోద్వేగాల తరంగాన్ని ఎప్పుడైనా ఆంక్షలు ఆపగలవా? తరువాత దాని ప్రతిధ్వని భారతదేశ సరిహద్దులను దాటి విదేశాలకు చేరుకుంది. విప్లవకారులకు, ఈ నవల భగవద్గీత గా మారింది మరియు వందేమాతరం గొప్ప మంత్రంగా మారింది. స్వాతంత్య్ర యోధులను ఉరితీయబడినప్పుడు ఈ పాటను పాడేవారు. అందువలన ఈ పాట భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో సాటిలేని కృషి చేసింది.


బంకిం రాసిన దాదాపు అన్ని నవలల్లో దేశం మరియు మత రక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆయన వివిధ అంశాలపై వ్యాసాలు, మరియు వ్యంగ్య రచనలు కూడా రాశారు. ఇది బెంగాలీ సాహిత్య శైలిలో సమూల మార్పుకు దారితీసింది. ఆయన 1894 ఏప్రిల్ 8న మరణించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, వందేమాతరం జాతీయ గీతానికి సమానమైనదిగా పరిగణించబడింది మరియు జాతీయ గీతంగా గౌరవ పొందింది.

ACB తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు.

 

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు.      హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు

ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ ఆర్టీఏ ఆఫీసుల్లో అధికారుల పరిశీలన
తిరుమలగిరిలో ఇద్దరు క్లర్కులు, 10 మంది ఏజెంట్ల పట్టివేత
ఉప్పల్‌లో 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ
డీఎస్పీల ఆధ్వర్యంలో కీలక దస్త్రాల తనిఖీ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు పెద్దపల్లి తదితర జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతుండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలైన ఉప్పల్‌, తిరుమలగిరి, మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్‌ల పర్యవేక్షణలో అధికారులు కార్యాలయాల్లోని రికార్డులను, కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇద్దరు క్లర్క్‌లతో పాటు కార్యాలయం వద్ద తిష్టవేసిన 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం తలుపులు మూసివేసి, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిలిపివేసి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా, ఉప్పల్‌ ఆర్టీఏ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి, సుమారు 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.

ACB నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ACB అధికారుల దాడి..

 నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ACB అధికారుల దాడి..



 10 వేలు లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన రెండవ SI రాంచందర్ జీ,


 గుండూరు గ్రామానికి చెందిన నంబి వెంకటయ్య కు చెందిన భూవివాదం కేసు రాజీ కోసం 20 వేలు డిమాండు చేసిన SI... 


 ACB ని ఆశ్రయించిన బాధితుడు, ఈ రోజు 10 వేలు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు...

Tuesday, 24 June 2025

ఏసీబీకి చిక్కిన GHMC అసిస్టెంట్ ఇంజనీర్

ఏసీబీకి చిక్కిన GHMC అసిస్టెంట్ ఇంజనీర్.                   


         ఫిర్యాదుధారునికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేసి సంబంధిత పై అధికారులకు పంపంపించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- (ఇతపూర్వమే రూ.5000/- తీసుకుకున్నది) #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుకుబడిన హైదరాబాద్, అంబర్ పేట, గోల్నాక, నెహ్రూ నగర్, వార్డ్ నంబర్ -2 లోగల హై.మ.న.పా.సం. కార్యాలయం లోని సహాయక ఇంజనీరు - శ్రీమతి టి. మనీషా.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Sunday, 22 June 2025

ACB ఏసీబీకి చిక్కిన తహశీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్

             


ACB ఏసీబీకి చిక్కిన తహశీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్

      "ఫిర్యాదుధారుని బంధువుకు సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తును ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి కొత్త రేషన్ కార్డు జారీ చేయడం కోసం సంబంధిత అధికారులకు పంపంపించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.2,500/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుకుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ - చిట్టెంశెట్టి నవక్రాంత్. ఇతను రేషన్ కార్డు దరఖాస్తుధారుల నుండి లంచం డబ్బులను తరుచుగా డిజిటల్ చెల్లింపుల రూపంలో తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పుణ్యతిథి

డాక్టర్ శ్యామా ప్రసాద్  ముఖర్జీ 


పుణ్యతిథి
(◆ఖండిత భారతపు అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్  ముఖర్జీ. నేడు పుణ్యతిథి ( june 23) సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.

◆ స్వతంత్ర భారత రాజకీయాకాశంలో సిద్ధాంత రహిత రాజకీయాలు, స్వార్థ , పదవీ వ్యామోహం వాదాల కారుమబ్బులు కమ్ముకున్న ఆ తొలిదినాలలో ఒకమెరుపు  మెరిసి మాయమైంది.కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆ మెరుపు వెలుగు క్షణ కాలమే కావచ్చు.కానీ గాఢాంధకార  భవిష్యత్తులో మునిగివున్న భారత ప్రజానీకానికి ఆమాత్రం వెలుగు చాలు.'భారతీయ జన సంఘం' అనే వాస్తవమైన సైద్ధాంతిక రాజకీయ పథాన్ని కనుగొనడానికి స్వతంత్ర  భారత రాజకీయాలకు ఒక నూతన దిశను,నూతన లక్ష్యాన్ని ప్రసాదించిన ఆ మెరుపే స్వర్గీయ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ.

◆శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతమాత కన్న మహా సంతానంలో ఒకరు.వారి జీవితంలో ప్రతిక్షణం,శరీరంలో ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యాయి.

◆1901 జూలై 6వ తేదీన అసుతోష్ ముఖర్జీ ,రాణి జోగ్మయాదేవి పుణ్య దంపతులకు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించారు.తన తండ్రి అసుతోష్ ముఖర్జీ నుంచి అనేక గొప్ప గుణాలు పుణికి పుచ్చుకున్నారు.వాటిలో అతి ప్రముఖ గుణం అసుతోష్ ముఖర్జీ యొక్క ప్రఖరమైన, రాజీలేని జాతీయ భావన, అతడి నిర్భీక మనస్తత్వం.

◆శ్యామాప్రసాద్ కు భగవంతుడు ఇచ్చిన మరో వరం అసామాన్యమైన అతడి మేధాశక్తి. అతడి తెలివితేటలు, గ్రహణశక్తి చూసి పాఠశాలలో ఉపాధ్యాయులు సైతం విస్మయం చెందుతూ ఉండేవారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే శ్యామాప్రసాద్ ఎఫ్.ఏ, బి.ఏ విద్యార్థులకు బోధించే పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేస్తుండేవాడు.

◆అతి చిన్న వయసు నుంచి శ్యామాప్రసాద్ ఆదర్శవాదిగా రూపుదిద్దుకోసాగాడు.

◆ 'నేను గొప్ప వ్యక్తిని కావాలి.నాకు ధనం వద్దు' ఒక పుస్తకంలో శ్యామాప్రసాద్ రాసిన మాట అతడి ఆదర్శవాది ఆలోచనలకు తార్కాణం.ఆ విధంగా   రూపొందిన ఆదర్శవాదం చిట్టచివరి క్షణం వరకు నిలిచింది .ఆ ఆదర్శవాదమే అతడినొక మహనీయ వ్యక్తిగా రూపొందించింది.

◆1919లో ఇంటర్ పూర్తి ,1921లో బి ఏ ఆనర్స్ పట్టా ప్రధమ శ్రేణిలో 1923 లో ఎం ఏ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

◆1924లో హైకోర్టు న్యాయవాదిగా ప్రవేశం

◆1924 మే నెలలో తండ్రి హఠాత్తుగా స్వర్గస్తులైనారు. అసుతోష్ ముఖర్జీ మరణం బెంగాల్ కు తీరనిలోటు అయింది.

◆తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన కలకత్తా విశ్వవిద్యాలయం సిండికేట్ స్థానంలో ముఖర్జీ  నియుక్తులయ్యారు. విశ్వవిద్యాలయాన్ని స్వదేశీ సూత్రాలపై తీర్చిదిద్దేందుకు తండ్రి అసుతోష్ ముఖర్జీ సాగించిన కృషి భారం ఇప్పుడు పూర్తిగా శ్యామా ప్రసాద్ భుజస్కంధాలపై పడింది.అప్పటికి ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే.ఆ తరువాత 15 సంవత్సరాల పాటు విద్యా రంగమే ఆయన సర్వస్వం అయింది.

◆1922 లో శ్యామాప్రసాద్  వివాహం సుభద్రాదేవితో జరిగింది.

◆1933లో కుటుంబంలో తీరని విషాదం సంభవించింది. భార్య సుధారాణి అనారోగ్యంతో మరణించింది.వైవాహిక జీవన ఆనందాన్ని పూర్తిగా అనుభవించకుండానే భార్య వియోగం.

◆1934లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులు కావడం మరో పెద్ద మలుపురాయి. అప్పటికి వారి వయసు 33 సంవత్సరాలు మాత్రమే. దేశంలోనే అతి చిన్న వయసులో వైస్ ఛాన్సలర్ గా నియమితులైనది శ్యామాప్రసాద్ జీ.

◆1936 విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ "భౌతిక సుఖాలే లక్ష్యంగా మనుషులను యంత్రాలుగా మార్చి పని చేయించే విధానాల ద్వారా ఏ జాతి గొప్పదనాన్ని సాధించలేదు.పాశ్చాత్యుల నైపుణ్యం ,విజ్ఞానం  నుండి శక్తిని సంపాదించుకునే విధంగా మన సంస్కృతి ,నాగరికతలతో విద్యావిధానాన్ని అనుసంధానం చేయడమే మన ఆదర్శం కావాలి"అని ఆ సమయంలో ఆయన పిలుపునిచ్చారు.

◆1938లో కలకత్తా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.అదే సంవత్సరంలో బెనారస్ విశ్వవిద్యాలయం కూడా ఆయనకు గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించింది.శ్యామాప్రసాద్ ముఖర్జీ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అయ్యారు.

◆1937లో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు.

◆1940 ఫిబ్రవరి 26వ తేదీన మొదటిసారి గాంధీజీతో పరిచయం ఏర్పడింది.

◆1940లో లాహోర్ లో ఉన్న సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థానిక శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఆ సందర్భంగా మాట్లాడుతూ "నేటి అంధకార బంధురమైన దేశ వాతావరణంలో ఆశాకిరణంగా నాకు సంఘం మాత్రమే కనబడుతుంది" అన్నారాయన.సంఘం పట్ల ఆయనకు గల ఈ ఆదర భావన చివరి వరకు కొనసాగింది.

◆ఒకసారి సంఘ స్థాపకుడైన డా. కేశవరావు బలిరాం హెడ్గేవార్ ని శ్యామాప్రసాద్ కలుసుకోవడం తటస్థించింది. సంఘం రాజకీయాలలో ఎందుకు ప్రవేశించరాదని శ్యామాప్రసాద్ డాక్టర్జీని ప్రశ్నించారు.అప్పుడు డాక్టర్జీ మాట్లాడుతూ దైనందిన రాజకీయాలలో సంఘానికి విశ్వాసం లేదని,దేశవైభవ స్థితికి సంఘం పెంచుకున్న మార్గం వేరని శ్యామా ప్రసాద్ కు వివరించారు.

◆శ్యామాప్రసాద్ మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చే సమయానికి బెంగాల్ రాష్ట్రం తీవ్రమైన క్షామం బారిన పడింది. సుమారు 30 లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.బెంగాల్ ప్రజల ఆకలి కేకలు శ్యామాప్రసాద్ హృదయాన్ని కదిలించి వేశాయి.వెంటనే "బెంగాల్ సహాయ సమితి" అనే సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున సేవ కార్యక్రమాలు చేశారు.

◆తన కళ్ళ ముందే నాయకుల ద్రోహం కారణంగా మాతృభూమి ముక్కలవుతుంటే చూడలేకపోయారయన.తాను చేయగలిగిందేమీలేదని ఆయనకు తెలుసు.అయినా చిట్ట చివరి క్షణం వరకు విభజనను ఆపేందుకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.

◆1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించింది.సహజంగా దేశ నాయకత్వం సర్దార్ పటేల్ కు లభించవలసింది.13 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలలో 11 కమిటీలు పటేల్ పేరునే సూచించాయి.కానీ గాంధీజీ నెహ్రూనే దేశ నాయకత్వం వహించడానికి ఎంపిక చేశారు.

◆నెహ్రూను దేశ ప్రధానమంత్రిగా ఎంపిక  చేస్తూనే గాంధీజీ  ఒక యోగ్యమైన నిర్ణయం కూడా చేశారు.తాత్కాలిక జాతీయ ప్రభుత్వం లో కాంగ్రెసేతరులను కూడా చేర్చుకోవడమే ఆ నిర్ణయం.ఆ నిర్ణయం ఫలితంగా స్వాతంత్ర్యాoనంతరం ఏర్పడిన మొదటి జాతీయ ప్రభుత్వం లో 14 మంది మంత్రులలో ఏడుగురు కాంగ్రెసేతరులు కూడా ఉన్నారు.వారిలో శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్, జాన్ మత్తయ్ , బలదేవ్ సింగ్, భా భా, కె. సి నియోగి, షణ్ముగం శెట్టి ఉన్నారు.

◆నూతన మంత్రివర్గంలో శ్యామాప్రసాద్ కు పరిశ్రమల శాఖ అప్పగించబడింది.నిజానికి విద్యాశాఖ ఆయన హృదయానికి అతి ప్రియమైనది.విద్యారంగం నుంచే ఆయన రాజకీయ ప్రవేశం చేశారు.ఆయన విద్యామంత్రిగా నియమింపబడి ఉంటే ఆ రంగంలో తనకు గల అపార అనుభవంతో విద్యారంగాన్ని అతి యోగ్యంగా ఆయన తీర్చిదిద్దగలిగి ఉండేవారు.

◆రెండున్నర సంవత్సరాలు పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో తన సామర్థ్యాన్ని శ్యామాప్రసాద్ నిరూపించుకున్నారు.చిత్తరంజన్ రైలు ఇంజన్  కర్మాగారం,సింద్రీ ఎరువుల కర్మాగారం,హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే మూడు భారీ పరిశ్రమలు నేతృత్వంలో రూపొందినవే.

◆"ఫ్యాక్టరీలో తయారైన మొట్టమొదటి మూడవ తరగతి రైలు పెట్టె సాధారణ భారతీయ రైలు ప్రయాణికుడికి ఎంత  మేరకు సౌకర్యంగా ఉంటుందన్న విషయం తెలుసుకునేందుకు నేను స్వయంగా ఆ పెట్టెలు ప్రయాణం చేశాను" అని ఆయన అన్న మాటలు అతిశయోక్తి కాదు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తదుపరి మరణించే వరకు ఎక్కువగా ఆయన ఆ మూడవ తరగతి పెట్టెలోనే ప్రయాణించే వారు.

◆ప్రారంభ దినాలలో శ్యామాప్రసాద్ మనసులో రూపుదిద్దుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధానమే ఆ తదుపరి దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మేధావుల చేతుల్లో మెరుగు  దిద్దుకుని భారతీయ జన సంఘానికి,ఆ తరువాత భారతీయ జనతాపార్టీ కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారం అయింది.

◆1950 ఏప్రిల్ 1వ తేదీన తన మంత్రి పదవికి రాజీనామా లేఖను నెహ్రూ కు పంపారు. వెనకా ముందూ చూడకుండా నెహ్రూ ఆ రాజీనామాను ఆమోదించారు.అయితే శ్యామాప్రసాద్ మంత్రివర్గాన్ని వీడి వెళ్ళడం పటేల్ తదితర సహచరులకు ఏ మాత్రం ఇష్టంలేదు.

◆శ్యామాప్రసాద్ రాజీనామా సమర్పించిన వారం రోజులకు ఏప్రిల్ 8, 1950 నాడు నెహ్రూ- లియాఖత్ ఆలీఖాన్ లు ఒప్పందంపై సంతకాలు చేశారు.        

 ◆1950 ఆగస్టు 1 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ విధంగా రాసింది."నెహ్రూ - లియాఖత్ ఒప్పందం కొనసాగుతున్న హిందూ శరణార్థుల వెల్లువను నిరోధించడంలో విఫలమైంది " అని పేర్కొంది.

◆మంత్రివర్గం నుంచి బయటకు వచ్చే సమయానికి ఆయన ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీకి చెందకపోయినప్పటికీ రాజకీయ వర్గాల్లో ఆయన ఖ్యాతి ఉన్నత స్థానంలో ఉంది. నెహ్రూకు ధీటైన ప్రతిపక్ష  నాయకుడు ఆయనే అని దాదాపు అన్ని ప్రతిపక్షాలు భావించే సాగాయి.

◆అయితే శ్యామాప్రసాద్ వీటిన్నింటితో తృప్తిపడలేదు. తాను నమ్మిన ఆశయాలు, ఆదర్శాలకు అనుగుణమైన ఒక జాతీయ రాజకీయ పక్షం ఉండాలని ఆయన తీవ్రంగా ఆలోచించసాగారు.

◆ఆరోజున దేశంలో దాదాపు ఇదే విషయాన్ని గురించి చాలా తీవ్రంగా తర్జనభర్జన పడుతున్న సంస్థ మరొకటి ఉంది.అది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్.హిందూ సమాజంలోని కుల,మత, వర్గ విభేదాలను దూరంచేసి, సంఘటితమైన, శక్తివంతమైన హిందూ సమాజాన్ని  నిర్మించాలని, అటువంటి హిందూ సమాజమే భారతదేశ వైభవానికి, ఉన్నతికి ఆధారమని విశ్వసిస్తున్న సంస్థ అది. 

◆శ్యామాప్రసాద్ నూతన రాజకీయ పక్షాన్ని ద్వేషించే ప్రయత్నంలో ఉన్నారు. రూపొందబోయే ఆ రాజకీయ పక్షం కాంగ్రెస్ సంస్కృతికి పూర్తి దూరంగా ఉండాలని ఆయన భావించారు.

◆ఆయన దృష్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మీదకు మళ్లింది.సంఘ్ తో శ్యామాప్రసాద్ కు శబ్దం ముందు నుండి పరిచయం ఉంది.సంఘ సిద్ధాంతం,దాని దేశభక్తి, స్వదేశ, స్వధర్మ నిష్టలు ఆయనను ఎంతగానో ఆకర్షించాయి."మేఘావృతమైన దేశాకాశంలో మెరుపు తీగలు మీరు" అని లాహోర్లో ఒక ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సంఘాన్ని ప్రశంసించారాయన.

◆సంఘ అధినేత శ్రీ గురూజీ తో శ్యామాప్రసాద్ సమావేశమయ్యారు.నూతన రాజకీయ పక్షానికి సంఘం పరోక్ష సహకారాన్ని అందించడానికి శ్రీ గురూజీ అంగీకరించారు.అయితే సంఘం మాత్రం స్వతంత్ర సంస్థగా జాతీయ పునర్నిర్మాణ కార్యాన్ని యధాతథంగా కొనసాగిస్తుందని శ్రీ గురూజీ సృష్టం చేశారు. 

◆1951 జనవరి నుంచి నూతన రాజకీయ పక్షాన్ని ప్రారంభించేందుకు శ్యామాప్రసాద్ ప్రయత్నాలు ప్రారంభించారు.

◆"1951 అక్టోబర్ 21 భారతీయ జనసంఘ్ పార్టీ ప్రారంభం". నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ఆజాద్ హింద్ పౌజ్ ను కూడా అక్టోబర్ 21 నాడే ప్రారంభించిన విషయాన్ని శ్యాంప్రసాద్ గుర్తు చేశారు.మాతృభూమి సేవలో అజాద్ హింద్ ఫౌజ్ సాగించిన పోరాటాన్ని భారతీయ జనసంఘ్ కొనసాగిస్తుందని ఆయన అన్నారు.

◆"జనసంఘ్ ను నేను కాలరాచి పారేస్తాను"అన్న నెహ్రూ బెదిరింపును ప్రస్తావించి "ఈ కాలరాచే మనస్తత్వాన్ని నేను కాలరాచి తీరుతాను"శ్యామాప్రసాద్ సవాల్ విసిరారు.భావి రాజకీయ సంగ్రామానికి ఈ సవాలు ఒక సంకేతం అయింది.

◆1952 ఎన్నికలు ప్రధానంగా శ్యామాప్రసాద్, నెహ్రూల మధ్యనే జరిగాయి.నెహ్రూ తప్పుడు విధానాలను దుయ్యబట్టడంలో ఏ మాత్రం సంకోచించే వారు కాదు.

◆నెహ్రూ వద్ద భారతీయ జనసంఘాన్నీ, శ్యామాప్రసాద్ ముఖర్జీని నిందించేoదుకు ఉన్న పెద్ద ఆయుధం మతతత్వం.

◆1952 ఎన్నికల్లో మూడు పార్లమెంటు స్థానాలు,33 అసెంబ్లీలు మాత్రమే గెలిపించుకోగలిగింది.

◆ "పార్లమెంటు సింహం" అని శ్యామాప్రసాద్ ప్రఖ్యాతిగాంచారు.పార్లమెంటు సభ్యులు,దేశ ప్రజలు కూడా ఆయనలో ' భావిభారత ప్రధాని' ని దర్శించేవారు. 'సర్దార్ పటేల్ వారసత్వం శ్యామాప్రసాద్ కు సంప్రాప్తించింది' అన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వ్యాఖ్య శ్యామాప్రసాద్ కు నిజమైన గౌరవం.

◆కాశ్మీర్ సమస్య గురించి పార్లమెంట్ లో మాట్లాడుతూ " కాశ్మీరీ ప్రజలు మొదట భారతీయులు,తరువాత కాశ్మీరీలా ? లేక మొదట కాశ్మీరీలు తర్వాత భారతీయులా ? లేక మొదటిగా చివరిగా కూడా కాశ్మీరీలే తప్ప భారతీయులు కాదా! నిర్ణయించవలసిన అతి ముఖ్యమైన విషయం అది" అని సమస్య తీవ్రతను సభ్యుల ముందు పెట్టారు.

◆పార్లమెంటులో శ్యామాప్రసాద్ చేసే ప్రసంగాలు అద్భుతంగా,ఎంతో ఆసక్తిదాయకంగా,ఆలోచనాత్మకంగా, ప్రేరణప్రదంగా ఉండేవి.సభ్యులు పూర్తి నిశ్శబ్దంతో, శ్రద్ధతో ఆయన ప్రసంగాలను వినేవారు. 

◆ఆయన ప్రసంగాలు గురించి ప్రశంసిస్తూ అప్పటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులలో ఒకరు,జనసత్తా హిందీ దినపత్రిక సంపాదకులు అయిన ప్రొఫెసర్ ఇంద్ర విద్య వాచస్పతి ఒకసారి తన సహజమైన హాస్య ధోరణిలో తన పత్రికలో ఇలా రాశారు.పార్లమెంట్ భవనంలోని రెస్టారెంట్లు, కాఫీ షాపుల యజమానులందరూ తీవ్రంగా ద్వేషించే ఒకే ఒక వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ అని, ఎందుకంటే, ఆయన మాట్లాడుతున్నంత సేపు సభ్యులందరూ సభలోనే కూర్చుంటారు తప్ప,కాఫీ షాపులకేసి,రెస్టారెంట్లకేసి రారని  ఆయన రాసిన మాటలు శ్యామాప్రసాద్ పార్లమెంటరీ సామర్థ్యానికి ప్రశంసలు మాత్రమే.

◆భారతదేశ చరిత్రలో కాశ్మీర్ రాష్ట్రానిదొక విషాదగాథ.ఆ విషాద గాధ లోని అనేక అధ్యాయాలలో భారతీయ జనసంఘ్,శ్యామాప్రసాద్ ముఖర్జీలది కూడా ఒక  

అధ్యాయం.మామూలు అధ్యాయం కాదు.అత్యంత ప్రముఖమైన అధ్యాయం.

◆భారతీయ జనసంఘ్ దేశ సమైక్యత కోసం నిలిచిన పార్టీ.కాశ్మీర్ విషయంలో భారతీయ జనసంఘ్ ఆవిర్భవించిన రోజు నుంచి ఈరోజు వరకు ( ప్రస్తుతం భారతీయ జనసంఘ్ లేదు.అయితే అదే ప్రేరణతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ జనసంఘ్ కు మరో రూపం మాత్రమే).

◆దేశ విభజన సమయంలో కాశ్మీర్ పాకిస్తాన్ లో విలీనం కావాలని జిన్నా ఆశించాడు.అయితే కాశ్మీర్ సంస్థానానికి అధిపతి అయిన మహారాజా హరిసింగ్ తరతరాల కాశ్మీర్ వారసత్వాన్ని,చరిత్రను దృష్టిలో పెట్టుకొని అది భారతదేశంలో భాగంగా ఉండటమే ఉచితమని భావించాడు.

◆1947 అక్టోబర్ లో ఆ సంస్థానాన్ని భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేస్తూ విలీన పత్రాలపై సంతకాలు చేశాడు.

◆1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ సైన్యాలు కాశ్మీర్ సరిహద్దులోని గిరిజనులను తీసుకొని కాశ్మీర్ రాష్ట్రంపై దురాక్రమణ ప్రారంభించాయి.

◆ఈ పరిస్థితులలో సర్దార్ పటేల్,శ్యామాప్రసాద్ తదితరులు ఒత్తిడి మేరకు భారత సైన్యాన్ని కాశ్మీర్ కు పంపించడానికి నెహ్రూ అంగీకరించారు.దాదాపు సంవత్సరానికి పైగా ప్రయత్నం తర్వాత చాలావరకు పాక్ సేనలను కాశ్మీర్ నుంచి భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. 

◆అయితే 1949 జనవరి ఒకటినాడు హఠాత్తుగా ప్రధాని నెహ్రూ భారత సైన్యానికి కాల్పుల విరమణకు ఆదేశం ఇవ్వడంతో 1/ 3 వంతు కాశ్మీర్ భూభాగం పాకిస్తాన్ చేతుల్లో ఉండిపోయింది.భారతదేశం దానిని 'ఆక్రమిత కాశ్మీర్' అని పిలువసాగింది. పాకిస్తాన్ మాత్రం అది 'ఆజాద్ కాశ్మీర్' అని ప్రకటించింది.

◆ఒకపక్క కాశ్మీర్లో భారత వ్యతిరేక,జమ్మూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ షేక్ అబ్దుల్లా మరోప్రక్క నెహ్రూతో సన్నిహితంగా వ్యవహరిస్తూ,కేంద్ర ప్రభుత్వం తనకుకూలంగా వ్యవహరించేటట్టు ప్రయత్నాలు చేయసాగాడు.ఆ ప్రయత్నాలలో నుంచి పుట్టుకొచ్చినదే కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ మన రాజ్యాంగంలో చొప్పించబడ్డ 370 వ అధికరణ.

◆కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించమని షేక్ అబ్దుల్లా రాజ్యాంగ సంఘానికి అధ్యక్షుడైనా డా.బి.ఆర్.అంబేద్కర్ కోరినప్పుడు అంబేద్కర్ ఆ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారు.

◆చివరికి నెహ్రూ ఒత్తిడి కారణంగా రాజ్యాంగంలో కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ 370 వ అధికరణ చేర్చబడింది.

◆షేక్ అబ్దుల్లాకు 370 వ అధికరణం అతడి భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఒక లైసెన్స్ అయుంది.

◆ఇక శ్యామాప్రసాద్ ముందు తెరిచి ఉన్న ఏకైక మార్గం భారతీయ జనసంఘ్ ద్వారా ఉద్యమించడమే.1952 జూన్ 14 న జరిగిన కార్యవర్గ సమావేశాలలో జనసంఘ్ కాశ్మీర్ పరిస్థితిపై తీర్మానం ఆమోదించింది.

◆1952 జూన్ 26 వ తేదీన పార్లమెంటులో శ్యామాప్రసాద్ కాశ్మీర్ సమస్యపై ప్రసంగించారు.ప్రత్యేక జెండా,ప్రత్యేక ప్రధానమంత్రి,370వ అధికరణ ,ప్రత్యేక రాజ్యాంగం వగైరా అంశాలపై ఆయన ఆ ప్రసంగంలో ఉల్లేఖించారు. 

◆1952 జూన్ 29 తేదీ నాడు దేశవ్యాప్తంగా కాశ్మీర్ దినాన్ని జరుపవలసిందిగా జనసంఘ్ పిలుపునిచ్చింది.

◆పార్లమెంటులో శ్యామాప్రసాద్ చేసిన గొప్ప ప్రసంగాలలో 1952 ఆగస్టు 2 నాడు ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టం పైన చేసిన ప్రసంగం అధ్బుతం.

◆రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి  ఆలోచిస్తాడు.రాజనీతిజ్ఞుడు రాబోయే తరానికి గురించి ఆలోచిస్తాడు అంటారు పెద్దలు.శ్యామాప్రసాద్ భావితరాల గురించి ఆలోచించారు.ఆయన ప్రతి విషయంలోనూ జాతీయ దృష్టి కోణమే.

◆1952 మే 21వ తేదీన తొలిసారిగా తొలి పార్లమెంటులో చేసిన ప్రసంగంలోనే ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో సంభవించిన తీవ్రక్షామం గురించి ప్రస్తావించారు.

◆1953 ఫిబ్రవరి 14 నాడు పార్లమెంటు లో ప్రసంగిస్తూ కాశ్మీర్ సమస్యను గురుంచి నిర్మల హృదయంతో ఆలోచించమని ప్రభుత్వ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

◆జమ్మూలో ప్రజల పై పెరుగుతున్న ఘోరమైన అణచివేత చర్యలకు వ్యతిరేకంగాను,సమావేశం,భావ ప్రకటన వగైరా తమ ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకునేందుకు దేశవ్యాప్తంగా 1953 మార్చి 5న 'జమ్మూ- కాశ్మీర్ దినం 'నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

◆జమ్మూలో పోలీసుల కాల్పులలో మరణించిన దేశభక్తుల చితాభస్మాన్ని మరునాడు ఊరేగింపుగా తీసుకుని వెళ్లి నిమగ్నం చేయడం జరుగుతుందని సభలో ప్రకటించబడింది. అయితే మరునాడు హఠాత్తుగా ప్రభుత్వం తిరిగి నిషేధం విధించింది.

◆స్వయంగా జమ్మూ కి వెళ్లి సత్యాగ్రహంలో పాల్గొనాలని శ్యామాప్రసాద్ నిర్ణయించుకున్నారు.పర్మిట్ కు సంబంధించిన వివరణలు కోరుతూ రక్షణ మంత్రికి లేఖ రాశారు.మంత్రి నుండి సమాధానం ఏమి రాలేదు.

◆జమ్మూ బయలుదేరేముందు ఎందుకో తన వయోవృద్ధ మాతృమూర్తిని దర్శించి రావాలని ఆయనకు కోరిక కలిగింది.బహుశా అది భగవత్ సంకల్పం ఆయు ఉండవచ్చు.

◆1953 మే 8 వ తేదీన ఉదయం 6.30 నిమిషాలకు శ్యామాప్రసాద్ జమ్మూ యాత్ర ప్రారంభమైంది.

◆బయలుదేరేముందు తాను ప్రభుత్వం నుంచి పర్మిట్ తీసుకోకపోవడానికి కారణం వివరిస్తూ శ్యామాప్రసాద్ " భారతదేశంలో జమ్మూ - కాశ్మీర్ విలీనం నూటికి నూరు శాతం సంపూర్ణమని నెహ్రూ పదే పదే ప్రకటిస్తున్నారు. అయినా భారత ప్రభుత్వం నుంచి పర్మిట్ పొందితే గాని ఎవరూ ఆ రాష్ట్రంలోకి ప్రవేశించరాదనడం ఆశ్చర్యకరం"  అని వ్యాఖ్యానించారు.

◆1953 మే 11వ తేదీన శ్యామాప్రసాద్ అరెస్టు.

◆శ్యామాప్రసాద్ అరెస్టు వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఢిల్లీలోనూ ఇతర చోట్ల ర్యాలీలు,ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి."జమ్మూ చలో" నినాదంతో సత్యాగ్రహులు పెద్ద సంఖ్యలో పర్మిట్లు లేకుండా జమ్మూ వైపు బయలుదేరారు.

◆1953 మే 12న శ్రీనగర్ జైలుకు చేర్చి, అక్కడి నుండి దాల్ సరస్సు సమీపంలోని కొండవాలులో ఉన్న ఒక అతిథి గృహానికి శ్యామాప్రసాద్ ను తరలించిన నాటి నుంచి జూన్ 23న ఆయన అంతిమ శ్వాస విడిచే వరకూ గడిచిన భారత రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైనవిగా చెప్పక తప్పదు. 

◆శ్యామాప్రసాద్ హఠాన్మరణం అనేక అనుమానాలకు దారితీసింది.కాశ్మీర్ భూభాగంపై తన అరెస్టును గురించి వ్యాఖ్యానిస్తూ 'ఇది కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పన్నిన కుట్ర' అన్న శ్యామాప్రసాద్ వ్యాఖ్య దగ్గరనుంచి మొదలుపెట్టి ప్రభుత్వ విచారణకు నెహ్రూ తిరస్కరించడం వరకు అనేక అంశాలు శ్యామాప్రసాద్ మరణం సహజమైనది కాదని,ఆయనను వైద్యపరంగా చంపబడ్డారని(Medical Murder) అనుమానాన్ని దృఢ పరిచాయి.

◆శ్యామాప్రసాద్ మరణం జాతికి ఆశనిపాతం అయుంది. ఆ వార్త విని జాతీయ యావత్తు క్షణం నిర్ఘాంతపోయింది. మరుక్షణం తల్లడిల్లిపోయింది.దేశమంతా శోకసముద్రంలో  మునిగిపోయింది.దేశమంతటా సంతాప ప్రకటన ప్రారంభమైంది.

◆ "మాతృభూమి సేవలో నిజమైన యోధుడిగా శ్యామాప్రసాద్ కాశ్మీర్ విలీనం కోసం సాగిన పోరాటంలో అగ్రభాగాన నిలిచి బలిదానం చేశారు".

◆శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమే అయితే బలిదానం అయ్యారో దానిని భారతీయ జనతా పార్టీ , నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం  370 వ అధికరణను తొలగించి,వారికి ఘనమైన నివాళి అర్పించింది. 

                   * భారత్ మాతా కీ జయ్ *

#ShyamaPrasadMukherjee

ఇకపై అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్.. కొత్త నెంబర్ ఇదే !


 ఇకపై అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్.. కొత్త నెంబర్ ఇదే ! 


దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ సేవల కోసం ఒకే టోల్‌ఫ్రీ నంబర్ - 112ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు పోలీస్ సహాయం (100), అంబులెన్స్ (108), మహిళల భద్రత (181).. బాలల హక్కుల పరిరక్షణ (1098), ప్రకృతి విపత్తుల (1077) వంటి విభిన్న సేవల కోసం వేర్వేరు నంబర్లను ప్రజలు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో ఒక్కటే నంబర్ - 112 కొనసాగనుంది. ఈ మార్పుతో అన్ని అత్యవసర సేవలకు వేగంగా.. సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి రాష్ట్రంలో 112 నంబర్‌ను యాక్టివ్ మోడ్‌లో అమలు చేస్తున్నామని తెలిపారు. 112 నంబర్‌కు ఫోన్ చేయగానే, కాల్ కేంద్రం లొకేషన్‌ను జీపీఎస్ ఆధారంగా ట్రాక్ చేసి.. సంబంధిత పోలీస్ స్టేషన్, అం

                  అత్యవసర పరిస్థితుల్లో రిస్పాన్స్ టైమ్‌ను గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన మౌలిక వసతులు, టెక్నాలజీ టూల్స్‌తో వ్యవస్థను అప్‌గ్రేడ్ చేశారు. కాల్‌కు స్పందించడానికి ప్రత్యేకంగా ట్రెయిన్డ్ సిబ్బంది 24/7 విధులలో నియమితులయ్యారు. ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్‌ఫోన్లలో ప్యానిక్ బటన్ని నొక్కినట్లయితే వెంటనే 112కు కాల్ అవుతుందని స్పష్టం చేశారు. అలాగే 112 India Appను డౌన్‌లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకున్నట్లయితే... ఒకే టచ్‌తో పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. 

              మహిళల కోసం ప్రత్యేకంగా SOS ఫీచర్లు, ఫేక్ కాల్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీలు, కమ్యూనిటీ హాల్స్ లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా, పత్రికలు, టీవీ చానళ్లలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ అవగాహన వాహనాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు.

మోదీ యొక్క రెండవ ఆఘాతం రాబోతోంది,

 మోదీ యొక్క రెండవ ఆఘాతం రాబోతోంది,

ఆర్టికల్ 30 (ధారా 30) రద్దు అయ్యే అవకాశం ఉంది!"


హిందువులపై నెహ్రూ చేసిన ద్రోహాన్ని సరిచేయడానికి మోదీ పూర్తిగా సిద్ధమయ్యారు.

మీరు ఎప్పుడైనా "ధారా 30" గురించి విన్నారా?

ఈ ధారా అంటే ఏమిటో మీకు తెలుసా?


'ధారా 30' అనేది హిందువులకు వ్యతిరేకమైన చట్టం, ఇది నెహ్రూ రాజ్యంలో అన్యాయంగా భారత రాజ్యాంగంలో చేర్చబడింది.

ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీని బలంగా వ్యతిరేకించారు.

అప్పుడు పటేల్ గారు అన్న మాట:

"ఈ చట్టం హిందువులపై ఒక ఘోరమైన ద్రోహం. ఇది రాజ్యాంగంలో వస్తే, నేను నా మంత్రి పదవికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను!"


ఈ నిరసన కారణంగా, తాత్కాలికంగా నెహ్రూ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

అయితే దురదృష్టవశాత్తు, కొద్ది రోజుల్లోనే సర్దార్ పటేల్ అనుకోని విధంగా మరణించారు.

వారి మరణం తర్వాత వెంటనే నెహ్రూ ఆ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చేశారు.


ఇప్పుడు తెలుసుకోండి — ధారా 30 ప్రత్యేకతలు:


ఈ చట్టం ప్రకారం,

హిందువులు తమ 'సనాతన ధర్మం' ఆధారంగా విద్యను స్కూళ్లలో నేర్పుకోలేరు, నేర్పించలేరు!

కానీ,

ముస్లింలు మరియు క్రిస్టియన్లు మాత్రం తమ మత విద్య (మదర్సాలు, కాన్వెంట్ స్కూళ్లు) నిర్వహించవచ్చు.

హిందువులు మాత్రం గురుకులాలు లేదా వైదిక విద్యాలయాలు నిర్వహించలేరు.

అలా చేస్తే చట్టపరంగా శిక్షకు గురవుతారు.


ఇకవేళ,

మసీదులు మరియు చర్చి లలో వచ్చిన విరాళాలు, బంగారం వగైరా అన్నీ వారి సమాజం కోసమే ఉంటాయి.

వారు ఆ డబ్బుతో తమ మతాన్ని విస్తరించేందుకు మరియు హిందువులను మతం మారుస్తూ లవ్ జిహాద్ వంటివాటికి ఉపయోగిస్తున్నారు.

కానీ,

హిందూ దేవాలయాలలో వచ్చిన విరాళాలు, బంగారం ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి.


ఈ పరిస్థితి నెహ్రూ మరియు కూటిల గాంధీ కలిసి సృష్టించిన అన్యాయం!


ఇప్పుడు మనందరం తెలుసుకోవాల్సిన విషయం —


ఇస్లామిక్ పిల్లలకు ఖురాన్ తప్పనిసరి, క్రిస్టియన్ పిల్లలకు బైబిల్ తప్పనిసరి.

కానీ మన హిందూ పిల్లలకు భగవద్గీత చదివే అవకాశమే లేదు!

ఈ ఆర్టికల్ కారణంగా మనం మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు తెలియజేయలేకపోతున్నాం!


మనము ఏం చేయాలి?

సనాతన ధర్మాన్ని రక్షించాలి.

ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి.

ఈ సమాచారం మీకు అవగాహన కలిగించిందని అనుకుంటే, దయచేసి దీనిని కనీసం ఐదుగురికి షేర్ చేయండి.

మన ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇది ఒక చిన్న, శక్తివంతమైన మెట్టు అవుతుంది!


ధన్యవాదాలు!

Saturday, 21 June 2025

మోదీ యొక్క రెండవ ఆఘాతం రాబోతోంది,

 "మోదీ యొక్క రెండవ ఆఘాతం రాబోతోంది,

ఆర్టికల్ 30 (ధారా 30) రద్దు అయ్యే అవకాశం ఉంది!"



హిందువులపై నెహ్రూ చేసిన ద్రోహాన్ని సరిచేయడానికి మోదీ పూర్తిగా సిద్ధమయ్యారు.

మీరు ఎప్పుడైనా "ధారా 30" గురించి విన్నారా?

ఈ ధారా అంటే ఏమిటో మీకు తెలుసా?


'ధారా 30' అనేది హిందువులకు వ్యతిరేకమైన చట్టం, ఇది నెహ్రూ రాజ్యంలో అన్యాయంగా భారత రాజ్యాంగంలో చేర్చబడింది.

ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీని బలంగా వ్యతిరేకించారు.

అప్పుడు పటేల్ గారు అన్న మాట:

"ఈ చట్టం హిందువులపై ఒక ఘోరమైన ద్రోహం. ఇది రాజ్యాంగంలో వస్తే, నేను నా మంత్రి పదవికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను!"


ఈ నిరసన కారణంగా, తాత్కాలికంగా నెహ్రూ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

అయితే దురదృష్టవశాత్తు, కొద్ది రోజుల్లోనే సర్దార్ పటేల్ అనుకోని విధంగా మరణించారు.

వారి మరణం తర్వాత వెంటనే నెహ్రూ ఆ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చేశారు.


ఇప్పుడు తెలుసుకోండి — ధారా 30 ప్రత్యేకతలు:


ఈ చట్టం ప్రకారం,

హిందువులు తమ 'సనాతన ధర్మం' ఆధారంగా విద్యను స్కూళ్లలో నేర్పుకోలేరు, నేర్పించలేరు!

కానీ,

ముస్లింలు మరియు క్రిస్టియన్లు మాత్రం తమ మత విద్య (మదర్సాలు, కాన్వెంట్ స్కూళ్లు) నిర్వహించవచ్చు.

హిందువులు మాత్రం గురుకులాలు లేదా వైదిక విద్యాలయాలు నిర్వహించలేరు.

అలా చేస్తే చట్టపరంగా శిక్షకు గురవుతారు.


ఇకవేళ,

మసీదులు మరియు చర్చి లలో వచ్చిన విరాళాలు, బంగారం వగైరా అన్నీ వారి సమాజం కోసమే ఉంటాయి.

వారు ఆ డబ్బుతో తమ మతాన్ని విస్తరించేందుకు మరియు హిందువులను మతం మారుస్తూ లవ్ జిహాద్ వంటివాటికి ఉపయోగిస్తున్నారు.

కానీ,

హిందూ దేవాలయాలలో వచ్చిన విరాళాలు, బంగారం ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి.


ఈ పరిస్థితి నెహ్రూ మరియు కూటిల గాంధీ కలిసి సృష్టించిన అన్యాయం!


ఇప్పుడు మనందరం తెలుసుకోవాల్సిన విషయం —


ఇస్లామిక్ పిల్లలకు ఖురాన్ తప్పనిసరి, క్రిస్టియన్ పిల్లలకు బైబిల్ తప్పనిసరి.

కానీ మన హిందూ పిల్లలకు భగవద్గీత చదివే అవకాశమే లేదు!

ఈ ఆర్టికల్ కారణంగా మనం మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు తెలియజేయలేకపోతున్నాం!


మనము ఏం చేయాలి?

సనాతన ధర్మాన్ని రక్షించాలి.

ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి.

ఈ సమాచారం మీకు అవగాహన కలిగించిందని అనుకుంటే, దయచేసి దీనిని కనీసం ఐదుగురికి షేర్ చేయండి.

మన ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇది ఒక చిన్న, శక్తివంతమైన మెట్టు అవుతుంది!


ధన్యవాదాలు!


Support 30 artical 

WE ARE WITH MODI

అంతర్జాతీయ యోగ దినోత్సవం :

 అంతర్జాతీయ యోగ దినోత్సవం :


యోగమార్గాన్ని ఒక విజ్ఞానశాస్త్రంగా భారతీయులు అభివృద్ధి చేశారు. దీనికి పునాదులు అయిదువేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి వేశాడు. అంతకుముందున్న హఠ, క్రియా, రాజయోగాది పద్ధతుల నుంచి సేకరించిన ముఖ్యాంశాలను సూత్రరూపంలోకి పతంజలి మహర్షి సమన్వయం చేశాడు. ఆ యోగసూత్రాలను అభ్యాసపూర్వకంగా అనుభూతిలోకి తెచ్చుకోవాలి. నేటి యాంత్రిక యుగంలో శాంతి కరువవుతోంది. పిన్నలనుండి పెద్దల వరకు అందరూ ఏదో రకంగా మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. మానసిక ఆందోళనల నుండి బయటపడాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సంతోషకర వాతావరణంలో ప్రశాంతంగా గడపడమే కదా ఎవరైనా కోరుకునేది. శాంతస్థితిని సాధించాలంటే ధ్యానమే మంచి సాధనం. నిరంతరం సాధనతో విషయగ్రహణ శక్తి పెరుగుతుంది. తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. మీలో గ్రహణ శక్తి లేకపోతే మిమ్మల్ని ఎవరూ చేరుకోలేరు. మీరు నిజగురువును చేరలేరు. జీవితం కూడా మిమ్మల్ని చేరుకోలేదు. మీరు ప్రతిదానినీ వదులుకోవాల్సి వస్తుంది. కొత్త విషయాలను గ్రహించాలంటే మీరు శారీరకంగా, మానసికంగా సుముఖంగా ఉండాలి. మీలోని శక్తియుక్తులన్నీ సంసిద్ధమై ఎరుకతో ఉండాలి. ఆ ఎరుక కలిగినప్పుడు దైవం కూడా మిమ్మల్ని చేరుకోవలసిందే.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి


హైదరాబాద్:


డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.



పార్టీని నమ్ముకున్న సామాన్య కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్న ఉదాహరణ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

NSUI నుండి మొదలైన అడ్లూరి ప్రస్థానంలో మంచి అవకాశం లభించిందని ప్రజా సేవలో మరింత బాధ్యతగా పనిచేస్తూ ఆదర్శంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రిగా కూడా ఉన్నందున ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిలో సమన్వయ పాత్ర పోషించాలని కోరారు.


మంత్రి వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తో పాటు రంగారెడ్డి,నల్గొండ జిల్లాల పాల ఉత్పత్తి సహకార సంఘం చైర్మన్ జి.మధు సూదన్ రెడ్డి పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి


  నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  హాజరుకానున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా  త్రిపాఠి అధికారులను ఆదేశించారు. 


     మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నకరికల్ పర్యటనపై శనివారం ఆమె నకరేకల్ మినీ స్టేడియంలో ఏర్పాట్ల పై స్థానిక శాసన సభ్యులు వేముల వీరేశం తో కలిసి పర్యవేక్షించారు. 

సుమారు 3000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్న దృష్ట్యా  ఈ కార్యక్రమానికి అవసరమైన వేదిక, టెంట్లు, షామియానా, తాగునీరు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, పార్కింగ్ తదితర  సౌకర్యాలను కల్పించాలన్నారు. 

   

      మంత్రి పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ  మంత్రి ఆదివారం ఉదయం 11 గంటల 45 నిమిషాలకు నకిరేకల్ చేరుకొని మినీ స్టేడియం లో నిర్వహించే ఇందిరమ్మ ఇండ్ల  మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరు అవుతారని, అనంతరం 2 గంటలకు నకిరేకల్ నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారని ఆమె తెలిపారు. 


       రెవెన్యూ శాఖ మంత్రి నకిరేకల్ పర్యటన దృష్ట్యా నియోజకవర్గంలోని ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపిడివోలు, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్, ఇతర సంబంధిత అధికారులందరూ వారి వారి విధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తించి  మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు .


     ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని,  కార్యక్రమ విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.


       రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, 

నకిరేకల్ తహసిల్దార్ ,మున్సిపల్ కమిషనర్, తదితరులు ఉన్నారు.

____________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి


 రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి



హైదరాబాద్, జూన్ 21:  అగ్ని ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబ సభ్యులకు రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును శనివారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అందజేశారు. 16 ఏప్రిల్ 2023 న కుషాయిగూడ కట్టెల మండి లో అగ్నిప్రమాదం జరిగి సాయి నగర్ కాలనీలో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పక్కనే నివాసం ఉంటున్న రేట్నేని నరేష్ తన భార్య రేట్నేని సుమ, కుమారుడు రేట్నేని జోషిత్ మరణించిన విషయం విదితమే.


బాధిత కుటుంబానికి 6 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరైన నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన పుట్టిన రోజు సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యుడు రేట్నేని చెన్నయ్యకు రూ. 6 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. 

తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. ఈ నెల 28 నుంచి ప్రారంభం..!

 తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. ఈ నెల 28 నుంచి ప్రారంభం..! 

                 తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ద్వారా చాలా మందికి ముఖ్యంగా వాహనదారులకు ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. ఇంతకీ ఏంటా కార్యక్రమం అంటే హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొచ్చింది. హైదరాబాద్ నగరం మెట్రో పాలిటన్ సిటీ కావడంతో నిత్యం వేల మంది ప్రజలతో రోడ్లు నిండిపోయి ఉంటాయి. అలాగే ట్రాఫిక్ సమస్యతో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించినా రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభా, వాహనాల రద్దీ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారత్ లోనే ఐటీ రంగంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలో గచ్చిబౌలి- కొండాపూర్ మధ్య నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం అయింది. ఈ ఫ్లై ఓవర్ ను జూన్ 28న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ఫ్లై ఓవర్ కు దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్ధన్ రెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. 

            ఇక ఈ ఫ్లై ఓవర్ విశేషాలకు వస్తే.. 1.2 కిలోమీటర్ల పొడవుతో , 6 లేన్లతో విస్తరించి ఉంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి దాదాపు రూ. 178 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఈ ఫ్లై ఓవర్ శిల్ప లేఅవుట్ ఫేజ్-1 నుంచి గచ్చిబౌలి జంక్షన్ ఫ్లై ఓవర్ లకు అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో ఐటీ ఉద్యోగులు ఊపిరి పీల్చుకోనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఏర్పడే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Friday, 20 June 2025

ఐఅండ్ పిఆర్ స్పెషల్ కమీషనర్ గా సిహెచ్ ప్రియాంక

 ఐఅండ్ పిఆర్ స్పెషల్    కమీషనర్ గా సిహెచ్ ప్రియాంక


        

హైదరాబాద్ :


సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ గా సి.హెచ్. ప్రియాంకా నేడు భాద్యతలు స్వీకరించారు. శాఖ స్పెషల్ కమీషనర్ గా ఉన్న డా. హరీష్ ను తెలంగాణ జెన్కో ఎండి గా బదిలీచేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న సిహెచ్. ప్రియాంకను సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నేడు ఉదయం సచివాలయంలో డా.హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ తో పాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా భాద్యతలను స్వీకరించారు. 

         స్పెషల్ కమీషనర్ గా భద్యతలు స్వీకరించిన ప్రియాంక కు సమాచార శాఖ, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జెన్కో ఎండిగా వెళ్లిన డా. హరీష్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కిషోర్ బాబు, అడిషనల్ డైరెక్టర్ 

జగన్, జాయింట్ డైరెక్టర్


శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

TTD స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీటీడీ- కేసు నమోదు..!!

 స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీటీడీ- కేసు నమోదు..!! 

.స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీటీడీ- కేసు నమోదు..!! 

 ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 70,226 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,960 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.30 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. 

                       రద్దీని దృష్టిని ఉంచుకుని శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నకిలీ దర్శన టికెట్ల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ సీవీఎస్వో కేవీ మురళీ కృష్ణ హెచ్చరించారు. మార్చిలో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని డీ సంగమిత్రకు శ్రీవారి సుప్రభాత సేవ, ప్రోటోకాల్ దర్శనం, వసతి టికెట్లు ఇప్పిస్తామని మదనదీపు బాబు అలియాస్ సందీప్, పవన్ కుమార్ లు రూ.2.60 లక్షలు వసూలు చేశారని, బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుమల 2 టౌన్ లో సదరు నిందితులపై కేసు నమోదు చేశామని అన్నారు. కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండడంతో దళారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీవారి దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దని ఆయన కోరారు.

             శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు పొందిన టికెట్లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరీక్షిస్తారని, అవి నకిలీగా తేలితే అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని అన్నారు. శ్రీవారి భక్తులకు మోసపూరిత మాటలు చెప్పి నకిలీ దర్శన టికెట్లు, వసతి కల్పిస్తామని దళారులు ఎవరైనా చెప్పినా నమ్మవద్దని మురళీ కృష్ణ సూచించారు.

                            దళారులు ఎవరైనా భక్తులను ప్రలోభాలకు గురి చేసి శ్రీవారి దర్శనం, వసతి ఇప్పిస్తామని, డబ్బులు పంపాలని ఎవరైనా ఫోన్ లు చేసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని, నంబర్ కు 0877- 2263828 ఫోన్ చేసి అనుమానాలను భక్తులు నివృత్తి చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, దళారులు శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో దందా చేస్తే వెంటనే సదరు మోసపూరిత వ్యక్తులు, దళారుల వివరాలను ఫోన్ చేసి టిటిడి విజిలెన్స్ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. శ్రీవారి దర్శనార్థం భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్