వార ఫలాలు (జూన్ 29 - జూలై 5, 2025)
Weekly Horoscope
(జూన్ 29 - జూలై 5, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మిథున రాశి నిరుద్యోగులకు తగిన ఆఫర్ అందుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
1 Mesha Rashi
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వీరికి ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల ఏలిన్నాటి శని సమస్యలు తగ్గుతాయి.
2 Vrushaba Rasi
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొద్ది శ్రమతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పదు. స్కంద స్తోత్ర పఠనం వల్ల కుజ దోషం తగ్గుతుంది.
3 Mithuna Rashi
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగతంగా ఒకటి రెండు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు తగిన ఆఫర్ అందుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం మీద దృష్టి పెడతారు. దుర్గాదేవీ స్తోత్ర పఠనం వల్ల కుటుంబ జీవితం మెరుగుపడుతుంది.
4 Karkataka Rashi
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వారమంతా శనితో పాటు శుభ గ్రహాల అనుకూలత కూడా ఉన్నందువల్ల అనేక విధాలైన శుభ వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శన చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థుల మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి పూజ వల్ల వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
5 Simha Rashi
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): గురు, శుక్రుల అనుకూల సంచారం వల్ల ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆదరణ, పోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ముఖ్య మైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరగడంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. తరచూ శివార్చన చేయించడం వల్ల అష్టమ శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.
6 Kanya Rashi
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): శుక్ర, బుధుల అనుకూలత వల్ల వారమంతా ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. విలాసాల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కొందరు సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇంట్లో ఒక శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల మీద శ్రమ పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకాలంలో చక్కబెడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. తరచూ సుందరాకాండ పారాయణం వల్ల ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది.
7 Tula Rashi
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్య, దశమ, లాభ స్థానంలో అనుకూల గ్రహాల సంచారం వల్ల ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు, ఆలోచనలు బాగా ఉపయోగపడతాయి. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. తొందరపడి ఎవరికీ ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది కానీ, ఇంటి ఖర్చులు బాగా పెరిగే సూచనలున్నాయి. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది.
8 Vrushchika Rashi
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వారమంతా మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు బాధ్యతలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఇంటా బయటా ప్రాధాన్యం సంపాదించుకుంటారు. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి.
9 Dhanusu Rashi
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ వారమంతా శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక సమస్యల ఒత్తిడి కూడా బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. శివార్చన వల్ల అర్ధాష్టమ శని దోషం తగ్గుతుంది.
10 Makara Rashi
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): గ్రహాల అనుకూలత బాగా ఎక్కువగానే ఉన్నందువల్ల వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అధికారుల నుంచి కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు తదితర అదనపు ఆదాయ ప్రయత్నాలు విశేషంగా లాభాలనిస్తాయి. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. గణపతి స్తోత్ర పఠనం వల్ల మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.
11 Kumbha Rashi
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి శని దోషం కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు, అనారోగ్య సమస్యలు, వ్యయప్రయాసలతో ఇబ్బందిపడతారు. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు రాకపోవచ్చు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు పడతారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ప్రతి రోజూ విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల కోరికలు నెరవేరుతాయి.
12 Meena Rasi
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ వారమంతా మీ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి బాగా శ్రమపడాల్సి ఉంటుంది. రావలసిన సొమ్ము పూర్తిగా అందకపోవచ్చు. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభించి, బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులకు బాగుంటుంది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల విజయాలు సాధిస్తారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home