సర్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
సర్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
గురువారం ఆయన నార్కెట్‌పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో జరుగుతున్న సర్ ఓటరు నమోదు, మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా రేగటి సత్తయ్య కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి, ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? వారి వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.
ప్రతి కుటుంబానికి రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, ఒక ఫారాన్ని పూర్తిగా నింపి బూత్ లెవల్ అధికారికి (బీఎల్‌ఓ) తప్పనిసరిగా అందజేయాలని . కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.
బీఎల్‌ఓలకు కలెక్టర్ సూచనలు చేస్తూ, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి వివరాలను నమోదు చేయాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో నమోదు కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
అదేవిధంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా సర్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు పూర్తి సహకారం అందించి, ఓటరు వివరాల నమోదును విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి కలెక్టర్ వెంట ఉన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home