Monday, 31 March 2025

అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*

 *అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*


1) వాసవి మిత్ర మండలి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఆధ్వర్యంలో సాయి బాబా దేవాలయం ECIL X Road లో జరిగిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.


ఈ కార్యక్రమంలో పబ్బ చంద్ర శేఖర్ గుప్త , అధ్యక్షుడు పెద్ది నాగరాజు గుప్త, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి తిరుమలేశ్ గుప్త, కార్యనిర్వహక కార్యదర్శి గంప కృష్ణ గుప్త ఉపాధ్యక్షులు అశోక్ గుప్త, చక్రపాణి గుప్త, శ్రీనివాస్ గుప్త, నవీన్ గుప్త, సంతోష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.


2) IVF నాగారం ఆధ్వర్యంలో నిర్వహించిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


ఈ కార్యక్రమంలో చంద్ర శేఖర్ ప్రెసిడెంట్ రమేశ్ ,ivf state vice president Ashok ,శాంతి తదితరులు పాల్గొన్నారు.


3) ఆర్య వైశ్య సంఘం మేడిపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


ఈ కార్యక్రమంలో శ్రీధర్ ప్రెసిడెంట్ వెంకటయ్య, పొకల ప్రకాష్, రాము బాబు , మణికంఠ తదితరులు పాల్గొన్నారు.


4 ) సరూర్నగర్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ్ దేవస్థానంలో  కొత్తపేట ఎక్స్ రోడ్. సరూర్నగర్ లోని గోల్డెన్ వాకర్స్ టీం ఆర్యవైశ్య గ్రూప్ వారి చేత నిర్వహించిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

శ్రీ లక్ష్మీ కన్వెన్షస్ అధినేత సూరిశెట్టి శ్రీనివాస్ గుప్తా ,Temple trustee member bera balakishan , Aravind kumar , NTar Krishna , Nagesh , Srinivas,తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్న అన్నప్రసాద వితరణ గొప్పది అని ఆయన అన్నారు.


ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన సూచించారు.

Sunday, 30 March 2025

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి


  సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 














       పేదవాడు పండుగనాడు మాత్రమే తెల్ల బువ్వ తినడం కాకుండా ప్రతిరోజు తెల్లబువ్వ తినాలన్న ఉద్దేశంతో  అత్యంత ప్రతిష్టాత్మకమైన సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు.

    ఆదివారం అయన తెలుగు నూతన సంవత్సరం విశ్వావసు నామ ఉగాది  సందర్భంగా సూర్యాపేట జిల్లా ,హుజూర్ నగర్ లో  ప్రతిష్టాత్మక సన్న బియ్యం పథకాన్ని   ప్రారంభించారు.

    శ్రీమంతులు తినే సన్న బియ్యం తండాలు, గుడిసెలు, బలహీన వర్గాల ప్రజలందరూ తినాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించామని పథకం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. ముందుగా ఆయన రాష్ట్ర ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.


     పేదవారు పండుగనాడు మాత్రమే సన్న బియ్యం అన్నం తినే పరిస్థితి రాష్ట్రంలో  ఉందని,అలాంటిది తమ ప్రభుత్వం హాయంలో  కోట్లు విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  1.90 /-పైసలకే సన్న బియ్యం పథకం పెట్టినప్పటికీ అది అమలు కాలేదని, అనంతరం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చారని,కాలక్రమమైన అది కొనసాగుతూ వస్తూ ఇప్పుడు పేదవారికి 6 కిలోల దొడ్డు బియ్యాన్ని ఇవ్వడం జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల మందికి బియ్యం ఇస్తే తిరిగి అదే  బియ్యాన్ని రైస్ మిల్లర్లకే 10 రూపాయల కిలో చొప్పున అమ్మడం వల్ల దొడ్డు బియ్యం దలారుల పాలై  10,000 కోట్ల రూపాయలు వారి చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి రాష్ట్ర మంత్రివర్గంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హుజూర్నగర్, కోదాడలో అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్నాయని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం 21 వేల కోట్ల విలువైన వడ్లను రైస్ మిల్లర్లతో తాకట్టు పెట్టడం జరిగిందని చెప్పారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని గత ప్రభుత్వం చెప్పిందని  అలాంటిది తమ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని నిర్ణయించామని సన్న వడ్లకు ప్రోత్సాహంలో భాగంగా 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని,  బోనస్, రుణమాఫీ ఉమ్మడి నల్గొండ జిల్లాకే ఎక్కువగా వచ్చిందని తెలిపారు .సన్న బియ్యం పథకం ఆషామాసి పథకం కాదని, ఎవరు వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని, ఏసీఎం అయినా మార్చలేరని అన్నారు .తాము  అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన పదేళ్లలో పక్కకు పెట్టిన ఎస్ఎల్బీసీ  టన్నెల్ ను తిరిగి చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వ హయాంలో  పడావు పెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటికీ గత బడ్జెట్లోనే 24 వేల కోట్లు కేటాయించి చేపట్టామన్నారు .లక్ష కోట్లు  పెట్టి కట్టిన కాలేశ్వరం కడితే మూడేళ్లలో కూలిపోయినప్పటికీ తాము వెనకంజ వేయకుండా రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈ సంవత్సరం  కోటి 56 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండించామన్నారు.  మూడు కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం ఇవ్వనున్నామని ,ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేసైనా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు.

   గత ప్రభుత్వం  బకాయి పెట్టిన రైతుబంధు  నిధులు 7625 కోట్లు తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే చెల్లించామని, ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.


     హుజూర్ నగర్ కు వ్యవసాయ కళాశాల,  మిర్యాలగూడ, దేవరకొండ లకు 200 కోట్ల చొప్పున యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కోదాడకు ఏటీసీ కేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.


      రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం పథకం అద్భుత పథకమని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల వారు, రైతు కూలీలు, మహిళలు, బీసీలు, దళితులకు ఆహారం పెట్టే మంచి పథకమని, ఇది నిజమైన ఆహార భద్రత పథకం అని అన్నారు. భారతదేశం తెలంగాణ వైపు చూసేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ఉచితంగా అమలు చేయడం లేదని అన్నారు. 90 లక్షల రేషన్ కార్డులలోని రెండు కోట్ల 80 లక్షల  మంది లబ్ధిదారులకు 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న పథకమని చెప్పారు. ఇప్పుడు దొడ్డు బియ్యం పై పిడిఎఫ్ ద్వారా , 10065 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేదని ,ప్రభుత్వం 40 రూపాయల కిలో కొని ఇచ్చినప్పటికీ లబ్ధిదారులు ఆ బియ్యాన్ని తినకుండా కిలో ఐదు, పది రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం చొరవతో ఉగాది నుండే రాష్ట్రవ్యాప్తంగా 80 నుండి 84 శాతం మంది ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వనుందని, తెల్ల కార్డు స్థానంలో బిపిఎల్  వారికి మూడు రంగుల కార్డులు ఇస్తామని ,గులాబీ కార్డు బదులుగా ఆకుపచ్చ కార్డు ఇవ్వనన్నామని తెలిపారు .సన్న బియ్యం పథకం హుజూర్నగర్ లో ప్రారంభించడం చారిత్రక  ఘట్టమని,ఇదొక విప్లవాత్మక మార్పు అని ఆయన కొనియాడారు.


    రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి మాట్లాడుతూ

 దేశంలో  ఎక్కడ లేని పథకం సన్న బియ్యం పతకమని అని అన్నారు. 


        ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సన్న బియ్యం పథకాన్ని పదిమంది లబ్ధిదారులు ధరావత్ బుజ్జి, మాలోతు రంగా, కర్ల రాధా,  షేక్ రెహమాన్, షేక్ కరీమా, కర్పూరపు లక్ష్మి , గురువమ్మ, సుశీల, వెంకట  పుష్ప లకు అందజేశారు .


    అంతేకాక 26 కోట్ల 10 లక్షల రూపాయల విలువచేసే చెక్కును 12712 స్వయం సహాయ మహిళా సంఘాల సభ్యులకు రాయితీ వడ్డీ రుణాల కింద పంపిణీ చేశారు .


    రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా, సుఖేందర్ రెడ్డి ,రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,దుదిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీలు కుందూరు రఘువీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, వేం నరేందర్ రెడ్డి,ఎం పి అద్దంకి దయాకర్, శాసనసభ్యులు నల్లమాడ పద్మావతి, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల ఐలయ్య, మందుల శామ్యూల్, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పర్యటకశాఖ కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, శాసనసభ్యులు బాలు నాయక్, శ్రీహరి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ  సెక్రటరీ డిఎస్ చౌహన్ ,రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్, విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తదితరులు హాజరయ్యారు .

________________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Saturday, 29 March 2025

శ్రీ వాసవి దండకం

                 శ్రీ వాసవి దండకం 

 శ్రీమన్ మహాదేవ దేవేశ్వరి యోగ మాయా హార శక్తి చిద్రూపిని నీదుకారుణ్య దీప్తి ప్రసారంబునన్ జ్యేస్ట శైలంబునన్ వైశ్యా వంశంబూనన్ దివ్య లీలావతారంబు మే దాల్చి


వైశ్యా ప్రజా నాధుడై నట్టి కౌషూంబ శ్రేస్టాత్మాజా మూర్తివై  జ్ఞానసంధాత్రి వై గేయ ఛారిత్రివై సుప్రజా నేత్రివై


ధౌష్ట్యా విధ్వంస కొదగ్ర సత్యా గ్రహాదిత్య కొజ్యన్మహా యజ్ఞ గాయత్రివై శ్రీ వాసవి కన్యకా దేవి నామంభునన్



విశ్వ విఖ్యా తవై లోక కళ్యాణమున్ గూర్చి నావే మహా దేవి నీవే మహాలక్ష్మి నీవే మహావాణి నీవే మహా కాళి గావె పరాశక్తి శ్రీ దుర్గా మామక శారదా చండికా వైష్ణవి కాళికా కృష్ణా ఈశాన కన్యాది దేవ్యా కృతుల్ దాల్చిశక్తిత్రయంబస్ట దుర్గా చయమ్బున్ ఇల కుళ్హుండు చిచక్తి నీవే కదా


విశ్వ సృష్టి స్తితి ధ్వంస కారి జగన్మూల శక్తి మహామాయా నీ స్వరూపంబు నీ దివ్య తత్వంబు లీలా మహత్యంబు వర్నింప నేనెంత వాడెన్ పరాశక్తి దాసానుదాసుండ సత్ భక్తి నిన్ కొలుచు వాడన్


సదా కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బ్రోచు కారుణ్య వారాసి వేయమ్మ  నీ పాద పద్మాల నిత్యార్చనా సేవ సంసార ఘోరాంబు ధిన్ధాన్గటమ్గ నావ ధన్దనావ నే సత్య ధామమ్ము  మా పెన్ని ధానమ్ము మీ నామ గానమ్మధే  సామగానం ఓం హ్రీమ్ సుధీ శక్తి ఐం క్లీమ్ క్రియా శక్తి సౌహ్ వం శుభెక్ష స్వరూపేక్ష శక్తి  సర్వ బీజాత్మికే సర్వ మంత్రత్మికె సర్వ తంత్రత్మికే సర్వ యంత్రాత్మీకె దేవీ హే వాసవాంబా నమో కన్యాకాంబా నమస్తే పరాంబా నమస్తే నమస్తే నమస్తే నమో నమః

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు...... మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

 గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు...... మేయర్ గద్వాల్ విజయలక్ష్మి


హైదరాబాద్, 

 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, నగర ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ, "ఉగాది అంటే కొత్త ఏడాదికి  ఆశాజనకమైన ఆరంభమని, ఇది మన సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించే పర్వదినమన్నారు. ఉగాది పచ్చడి మనిషి జీవితం అనేక రుచుల సమ్మేళనం అనే సందేశాన్ని అందిస్తుందని అన్నారు. ఈ ఉగాది అందరి జీవితంలోనూ ఆనందం, అభివృద్ధి, ఆరోగ్యం, శాంతి, సంపదలు చేకూర్చాలని ఆమె ఆకాంక్షించారు.


 హైదరాబాద్ నగరం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లేందుకు GHMC నిరంతరం కృషి చేస్తోందని, నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల విస్తరణకు  ప్రజల సహకారంతో నగరాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషి కొనసాగిస్తామన్నారు.


ఈ సందర్భంగా నగర ప్రజలంతా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, శుభ్రమైన, ఆరోగ్యకరమైన హైదరాబాద్ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ, మరోసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

140 కోట్ల ప్రజలే నా బలం:మోడీ


                                    140 కోట్ల ప్రజలే నా బలం:మోడీ

 న్యూ ఢిల్లీ – చిన్నతనంలో పేదరికంలో పెరిగినప్పటికీ, తాను దాని బరువును ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు ప్రధాని మోడీ. . కష్టాల మధ్య కూడా, తాను ఎప్పుడూ లేమిని అనుభవించలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశం గౌతమబుద్ధుడు, మహాత్మాగాంధీ పుట్టిన నేల అని, ఆ కారణంగానే భారతదేశ శాంతి సందేశం ప్రపంచదేశాల్లో ప్రతిధ్వనిస్తోందని అన్నారు

ఆమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్ ప్రధాని తో 3 గంటల పాటు ఐకానిక్‌ ఇంటర్వ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మోడీ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.ముఖ్యంగా తన జీవితంలోని బాల్య అనుభవాలు, పేదరికం, ప్రజా జీవితంలో తన ప్రయాణం, రాజకీయ జీవితం గురించి మాట్లాడారు. తాను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉన్న రోజుల గురించి, హిందూ మతం గొప్పతనం గురించి కూడా వివరించారు.

నాటి విషయాలను ఆయన గుర్తుచేసుకుంటూ.. చిన్న తనంలో తన మామ తనకు తెల్లటి కాన్వాస్ బూట్లు ఎలా బహుమతిగా ఇచ్చాడో, వాటిని స్కూల్లో అరిగిపోయిన చాక్‌పీస్‌తో ఎలా పాలిష్ చేశాడో వంటి విషయాలను పంచుకున్నారు. జీవితంలోని ప్రతి దశను కృతజ్ఞతతో స్వీకరించానని అన్నారు. అలాగే పేదరికాన్ని ఎప్పుడూ పోరాటంగా, బరువుగా చూడలేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.. భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోందని చెప్పారు.

140 కోట్ల ప్రజలే నా బలం”

నా బలం నా పేరులో లేదు. 140 కోట్ల మంది ప్రజలు, కాలానికి నిలిచిన దేశ సంస్కృతి, వారసత్వం నా వెనుక ఉండటమే నా బలం” అని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ దేశాధినేతలతో కరచాలనం చేస్తున్నానంటే ఆ కరచాలనం ఘనత మోదీది కాదని, 140 కోట్ల భారతీయులకే ఆ ఘనత చెందుతుందని అన్నారు.సైద్ధాంతిక పునాదులురాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (RSS)తో తన అనుబంధం, అక్కడ నేర్చుకున్న విలువలే తన సైద్ధాంతిక పునాదులని మోడీ స్పష్టం చేశారు.

దేశం కన్నా మిన్న ఏదీ లేదని, సమాజ సేవే దైవ సేవ అని ఆర్ఎస్ఎస్ నుంచి తాను నేర్చుకున్నానని, ఆర్ఎస్ఎస్ తమ సభ్యులందరికీ దేశం పట్ల, ప్రజల పట్ల అలాంటి బలమైన భావాలను పాదుకొల్పుతుందని చెప్పారు. దేశ సేవలో ఆర్ఎస్ఎస్ కంట్రిబ్యూషన్ ఎంతో ఉందని,

విద్యాపరంగా “విద్యాభారతి” పేరుతో దేశవ్యాప్తంగా 70,000 పాఠశాలలు నడుపుతోందని, 30 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తోందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కంటే అతిపెద్ద స్వయంసేవక్ సంఘ్ ప్రపంచంలోనే లేదని ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ జర్నీ 100 ఏళ్లకు చేరుకుందని చెప్పారు

.పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై..

ఉగ్రవాదం అనేది ఇండియా సమస్య మాత్రమే కాదని, యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తు్న్న సమస్య అని ప్రధాని మోదీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రధాన ఉగ్రవాద దాడుల్లో పాక్ ప్రమేయం కూడా తరచు ముడిపడి కనిపిస్తుందని ఒసామాబిన్ లాడెన్‌ను పాక్‌లో మట్టుబెట్టిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అన్నారు.

టెర్రరిజంతో ఎవ్వరికీ ప్రయోజనం ఉండదని ఇండియా తరచు హెచ్చరిస్తూనే ఉందని, కానీ పాకిస్థాన్ మద్దతు పలుకుతూనే ఉందని అన్నారు. స్టేట్-స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది ఇతర దేశాలకు హాని చేయడంతో పాటు సొంత ప్రజానీకం, దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి స్వదేశంలో ఆశ్రయం ఇవ్వడం, ప్రోత్సహించడం పాక్ మానుకోవాలని హితవు పలికారు. భారత్‌తో పాక్ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోందని, టెర్రరిజాన్ని ఇండియాకు ఎగుమతి చేస్తోందని తప్పుపట్టారు మోడీ

.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని ఇంటర్వ్యూ చేయబోతున్నందుకు గౌరవసూచకంగా తాను ఏకంగా 45 గంటలపాటు ఉపవాసం ఉన్నట్లు లెక్స్ ఫ్రిడ్‌మాన్ వెల్లడించాడు. ఆయన కేవలం నీళ్లు మాత్రమే తాగినట్లు తెలిపాడు.

తన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఉపవాసంపై తన దృక్పథాన్ని కూడా పంచుకున్నారు. ఇంద్రియాలను పదును పెట్టడంలో, మానసిక స్పష్టతను పెంచడంలో, క్రమశిక్షణను పెంపొందించడంలో ఉపవాసం పాత్రను నొక్కి చెప్పారు. ఉపవాసం అనేది కేవలం భోజనం మానేయడం మాత్రమేకాదని, ఇదొక శాస్త్రీయ ప్రక్రియ అని మోడీ అన్నారు. ఉపవాసం సాంప్రదాయ, ఆయుర్వేద పద్ధతులతో లోతుగా అనుసంధానించబడిందని ఆయన వివరించారు. శరీర నిర్విషీకరణకు సహాయపడటానికి ఉపవాసం ముందు తాను బాగా హైడ్రేట్ అవుతానని తెలిపారు. ఉపవాసం తనను మరింత శక్తివంతం చేస్తుందని, బద్దకం వీడి మరింత కష్టపడి పనిచేయడానికి ఉపయోగపడుతుందని మోడీ వెల్లడించారు.

Friday, 28 March 2025

One lakh Bribe | ఏసీబీకి చిక్కిన‌ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్

 

One lakh Bribe | ఏసీబీకి చిక్కిన‌ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్

కాకినాడ: రూ. లక్ష లంచం తీసుకుంటూ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్పష్టమైన సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించి.. నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ కిశోర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. తునికి చెందిన ఆర్.రమేశ్ బాబు తన భార్య పేరిట ఉన్న సమత గ్యాస్ ఏజెన్సీని కొన్ని కారణాల వల్ల తన పేరు మీదకు మార్చాలని జిల్లా రిజిస్ట్రార్ ను ఆశ్రయించారు. అందుకు ఆయన రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆనందరావు నుంచి రూ. లక్ష, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి నుంచి రూ.25వేలు, అనధికారికంగా ఉన్న మరో రూ.80వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ వెలుగుల జగదీశ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.



రిటైర్డ్‌ ఉద్యోగులు ఊస్ట్‌


 

రిటైర్డ్‌ ఉద్యోగులు ఊస్ట్‌

 

రిటైర్డ్‌ అయినా ఇంకా విధుల్లో కొనసాగుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం వేటువేసింది. వారందరినీ తొలగించాలని ఆదేశించింది. సచివాలయంతోపాటు అన్ని శాఖ లు, ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు, ఏజెన్సీలలో ఎక్స్‌టెన్షన్‌, రీఅపాయింట్‌మెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సిబ్బందిని ఈ నెల 31లోగా తొలగించాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు.                              హైదరాబాద్‌ : రిటైర్డ్‌ అయినా ఇంకా విధుల్లో కొనసాగుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం వేటువేసింది. వారందరినీ తొలగించాలని ఆదేశించింది. సచివాలయంతోపాటు అన్ని శాఖ లు, ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు, ఏజెన్సీలలో ఎక్స్‌టెన్షన్‌, రీఅపాయింట్‌మెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సిబ్బందిని ఈ నెల 31లోగా తొలగించాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధిశాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 177 మందిని తొలగించాలని ప్రభుత్వ అదనపు కార్యదర్శి సైదా గురువారం ఉత్తర్వులు జారీచేశారు

మండే ఎండలో ఈ షర్బత్ తాగితే చిటికెలో బాడీ కూల్ అయిపోతుంది, రంజాన్ స్పెషల్ కూడా.. ఎలా చేసుకోవాలంటే


 మండే ఎండలో ఈ షర్బత్ తాగితే చిటికెలో బాడీ కూల్ అయిపోతుంది, రంజాన్ స్పెషల్ కూడా.. ఎలా చేసుకోవాలంటే 


రంజాన్ మాసం చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ రంజాన్ మాసం ముగిసిపోతుంది. మార్చి 31వ తేదీన రంజాన్ పండగ తరువాత ఈ మాసం గుడ్ బాయ్ చెప్పనుంది. అయితే ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఎండ వేడిమి తాళలేక రకరకాల పానీయాలు తయారు చేసుకోవడం, బయట తాగడం వంటివి చేస్తున్నారు. అయితే ఇప్పటికీ రంజాన్ పండగ కొనసాగుతున్న నేపథ్యంలో సమ్మర్​ ప్రత్యేకమైన చల్లని, రిఫ్రెషింగ్ షర్బత్ తాగితే ఆ రుచి, ఆ చల్లదనం అద్భుతంగా ఉంటుంది. అలాగే సమ్మర్‌లో తాగడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అంట కూడా. ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే మీ ఇంటి సభ్యులు సమ్మర్ మజా అనుభవించవచ్చు. అయితే, దీనిని తయారుచేయడానికి అవసరమైన పదార్థాలు మరియు తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం. షర్బత్ తయారీకి కావలసిన పదార్థాలు: పంచదార - 1 కప్పు నీళ్లు - పావు కప్పు పాలు - 4 కప్పులు కస్టర్డ్ పొడి - 1 టేబుల్ స్పూన్ పాలు (కస్టర్డ్ కోసం) - 2 టేబుల్ స్పూన్లు కుంకుమ పువ్వు - అర టీస్పూన్ యాలకుల పొడి - 1 టీస్పూన్ చియా సీడ్స్ - 1 టేబుల్ స్పూన్ బాదం, పిస్తా పలుకులు - 2 టేబుల్ స్పూన్లు రంజాన్ షర్బత్ తయారీ విధానం: రంజాన్ షర్బత్ తయారు చేసుకోవడానికి మొదటగా స్టవ్‌పై పాన్ పెట్టి అందులో పంచదారను వేసి, సిమ్ మంట మీద కరిగేలా బాగా కలపాలి. పంచదార కరిగి అందులో పొంగుల ద్వారా రంగు మారినప్పుడు, దానిలో పావు కప్పు నీళ్లు జోడించాలి. నీళ్లు వేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉంచాలి. అలానే కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్‌లో ఉంచి, పంచదార కరిగిపోయే వరకు.. ఒక గిన్నెలో కుంకుమ పువ్వును నానబెట్టుకోవాలి. ఆ తరువాత, పాలు కూడా ఈ మిశ్రమంలో జోడించి బాగా కలపాలి. పాలు మరియు పంచదార చక్కగా కలిసిపోయేలా 4-5 నిమిషాలు ఉడికించాలి. ఈ సమయంలో, ఒక చిన్న గిన్నెలో కస్టర్డ్ పౌడర్ తీసుకుని, 2 టేబుల్ స్పూన్ల పాలు వేసి కరిగించాలి. ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని స్టవ్‌పై ఉడికే మిశ్రమంలో జోడించి, గట్టిగా కలుపుతుండాలి. ఈ మిశ్రమం తయారు చేస్తున్న సమయంలో ఎటువంటి గడ్డలు రాకుండా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కుంకుమ పువ్వును మరియు యాలకుల పొడిని కూడా ఈ మిశ్రమంలో జోడించి, ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలో తీసుకొని, రూమ్ టెంపరేచర్‌కి రానివ్వాలి. ఆ తరువాత 2 గంటలు ఫ్రిడ్జ్‌లో వుంచాలి. ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత, చియా సీడ్స్ లేదా బేసిల్ సీడ్స్‌ని నీటిలో నానబెట్టుకుని, షర్బత్‌లో జోడించి బాగా కలపాలి. చివరగా, బాదం మరియు పిస్తా పలుకులతో గార్నిష్ చేసి, ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ చల్లని, టేస్టీ దూద్ షర్బత్‌ను రంజాన్ పండుగ సమయంలో కానీ, సమ్మర్‌ లోనూ చాలా సులభంగా, తక్కువ సమయంలోనే రెడీ చేసుకొని ఆస్వాదించొచ్చు

ఉక్కు మనిషి’కి ప్రతిరూపమే అమిత్‌ షా


 ఉక్కు మనిషి’కి ప్రతిరూపమే అమిత్‌ షా


హోంశాఖ మంత్రి అమిత్‌ షాను భారత ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రతిరూపంగా చూస్తున్నామంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్‌ అభివర్ణించారు. అలాగే.. తమిళనాడు ఉక్కు మనిషి ఎడప్పాడి పళనిస్వామి కలుసుకున్న వ్యవహారంలో పలు వార్తలు వెలువడుతున్నాయనన్నారు.

చెన్నై: భారత ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రతిరూపమే హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Sha)ను చూస్తున్నారని అన్నాడీఎంకే మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్‌(RB Uday Kumar) అభివర్ణించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సుమారు 2 గంటలకు పైగా సమావేశమయ్యారు.

బీజేపీతో కూటమి ఏర్పాటుపై చర్యల సాగినట్లు వచ్చిన వార్తలను పళనిస్వామి ఖండించారు. ఈ నేపథ్యంలో, అమిత్‌షాతో పళనిస్వామి సమావేశం కావడంతో ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ ఆర్బీ ఉదయకుమార్‌ వీడియో విడుదల చేశారు. అందులో... భారత ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రతిరూపమైన హోంశాఖ మంత్రి అమిత్‌ షాను,

తమిళనాడు ఉక్కు మనిషి ఎడప్పాడి పళనిస్వామి కలుసుకున్న వ్యవహారంలో పలు వార్తలు వెలువడుతున్నాయని, రాష్ట్ర ప్రజల సమస్యలు తెలిపేందుకు పళనిస్వామి ఢిల్లీ వెళ్లారని తెలిపారు. పళనిస్వామి-అమిత్‌ షా(Palaniswami-Amit Sha) సమావేశంలో ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా అన్నాడీఎంకే కార్యకర్తలు విస్తృత ప్రచారం చేపట్టాలని ఉదయకుమార్‌ పిలుపునిచ్చారు.


Thursday, 27 March 2025

బట్టబయలైన_రహస్యం..* *క్యాన్సర్_ఒక_వ్యాధి_కాదు....*. *ఒక_విటమిన్_లోపం......*

 *బట్టబయలైన_రహస్యం..*

*క్యాన్సర్_ఒక_వ్యాధి_కాదు....*.

*ఒక_విటమిన్_లోపం......*



*కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందితా డిసౌజా చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్ అనే పదమే ఒక_పెద్ద_అబద్ధం*. క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎలా బయపెడుతున్నారో అందరికి తెలిసిందే. ఈ భూతం వెనుక దాగున్న నిజాన్ని బట్టబయలు చేయడమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం..


మిమ్మల్ని అభ్యర్దించే ఒక విషయం ఏమిటంటే.... ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి. ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు. కాని ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి 

*ఓ_నలుగురినైనా_కాపాడితే_అంతే_చాలు...*.


క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెబుతారు. కానీ అది శుద్ధ అబద్ధం. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు... ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలా మంది అంటుంటారు.

   ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వస్తుందని.... అందరిని భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి


*అర్ధం_కావాలనే_ఈ_పోస్ట్ ఉద్దేశ్యం....*


*వరల్డ్_వితౌట్_క్యాన్సర్- World without CANCER అనే ఒక బుక్ ఉందని, దాన్ని అన్ని భాషలలో తర్జుమా చెయ్యకుండా ఎందుకు, ఎవరు అడ్డు పడుతున్నారో చూద్దాం.*

*క్యాన్సర్ అనేది B17 లోపమే గాని జబ్బు కాదు.*

👌👍ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు.


మీకు గుర్తుందా? గతంలో అనే అంతుపట్టని వ్యాధితో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి స్కర్వీ (scurvy) అని పేరు పెట్టారు. విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు.


 *అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా... అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు హాస్పిటల్స్ వాళ్ళు దోచుకున్నారు*


 అది కేవలం విటమిన్ C వల్ల వచ్చిన రోగం.

*క్యాన్సర్_కూడా_ఇలాంటిదే...అంటే విటమిన్ లోపమే క్యాన్సర్_అని_అర్ధం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీ లోనే ఉంటాయని చాల మంది డాక్టర్స్ కూడా చెపుతారు.* అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది? 


*మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన.*


మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్ లో బ్రతుకుతున్న జీవితాల వల్ల, క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి... దాన్ని బిజినెస్ చేసారు కొంతమంది డాక్టర్స్.

*మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని కొన్ని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఇప్పటిది కాదు... వరల్డ్ వార్ 2 తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా_చూసుకోవడమట, నివారణట.* అసలు రాకుండా చెయ్యడం కాదు, అలా చేస్తే హాస్పిటల్స్ కి డబ్బులు రావు కదా.


   మీకు గాని.. మీకు తెలిసిన వాళ్లకు గాని క్యాన్సర్ అని లోపం

*ఉంటె_కంగారు_పడాల్సిన_అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే...*


   ఈ రోజుల్లో ఎవరైనా స్కర్వీ (scurvy) వ్యాధితో చనిపోతున్నారా? లేదు.... ఎందుకంటే దానికి కారణం విటమిన్ C లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిద్దికోవడం వల్ల.

   మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం.  *ఆ_లోపాన్ని_కూడా_B17_తో_పోగొట్టుకోవచ్చు.*


#క్యాన్సర్_రాకుండా_చేసుకోవడం_చాలసులువు!!


★15 నుండి 20 నేరెడు కాయలు..

★ క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్.

★ ఎండు ద్రాక్ష.

★ బాదాం పప్పు.

★ బ్లాక్ మల్బెర్రి, బ్లూ మల్బెర్రి, కోరిందకాయ స్ట్రాబెర్రి.

★ నువ్వులు, అవిసె గింజలు. 

★ ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు.

★ బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ ★ (పియర్ ఆపిల్)

★ నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి, 

★ జీడీపప్పు,పిస్తా.......      పైన చెప్పినవన్నీ 


*అధిక_శాతంలో_విటమిన్_B17_కలిగిఉన్నవి.*


ఈ లోపాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి.


*గోధుమ_మొలకలు (Wheat Sprouts )* 


ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు.


*రోజూ_ఒక_తులసి_ఆకు_తింటే_జీవితంలో ఎలాంటి క్యాన్సర్ లు దరిచేరవు..*


Wheat Sprouts bud is a Rich Source of Liquid Oxygen and the strongest anti-cancer matter in the name of "laetrile", and this matter is present in the fruit stone of ఆపిల్ (ఆపిల్ గింజలు). Laetrile is the extract form of vitamin B17 (Amygdalin)


అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా, నిషేధించబడిన -  *LAETRILE- ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లీమెంట్ చేస్తుంది (ఈ మందుని మెక్సికో లో తయారుచేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు)*

Dr. హారొల్ద్ W.మన్నెర్ తన -డెత్ అఫ్ క్యాన్సర్- బుక్ లో క్యాన్సర్ ని -laetrile- ట్రీట్మెంట్ తో 90 శాతం వరకు నయం చేసారని వివరించారు.


*క్యాన్సర్_రావడానికి_ముఖ్యకారణం_ఏంటో తెలిస్తే అవాక్కవుతారు* అవేంటంటే

1) #వాష్_చెయ్యడానికి_వాడే_రసాయనాలు.

2) వాషబేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు.

3) టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే 

రసాయనాలు పీలచడం.


మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు. కానీ మీరు పీలుస్తున్నారంటే అది ఒకరకంగా తినడం లాంటిదే. మీరు మీ ప్లేట్స్ ని లిక్విడ్స్ తోనే వాష్ చేస్తున్నారు కదా? అలా ఎంత క్లీన్ చేసిన సరే.. ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్ లో అలానే ఉంటాయి. ఆ ప్లేట్ లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి. (పూర్వ కాలంలో ఆకులలో తినేది అందుకే కదా)


*దీనికి_విరుగుడు_ఏంటో_తెలుసా ???*

మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు.


*మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి.*


దయచేసి ఈ పోస్టుని అందరితో షేర్ చేయండి..!! 

ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా 

మీ శత్రువులతో కూడా షేర్ చేయండి...! 


*క్యాన్సర్_బారిన_పడకుండా_అందరిని_కాపాడండి.

ACB వలలో TGSPDCL AE

 ACB వలలో TGSPDCL  AE



హైదరాబాద్, 11 KV లైన్ షిఫ్ట్ చేయడానికి మరియు కేబుల్ వేయడానికి వర్క్ ఎస్టిమేషన్ అందించడానికి అధికారిక అనుకూలంగా చూపినందుకు ఫిర్యాదుదారుని నుండి 30,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు
TGSPDCL, జీడిమెట్ల డివిజన్,A.E., S. సురేందర్ రెడ్డి, తెలంగాణ ACB అధికారులకు పట్టుబడ్డారు.

Wednesday, 26 March 2025

ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!!

 ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!!



భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు,

పులి గోళ్లతో “అఫ్జల్ ఖాన్” గుండెను చీల్చిన మహారాష్ట్ర పెద్దపులి,

ఆడవాళ్లను గౌరవించడం నేర్పిన అసలైన మగాడు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆఖరి శ్వాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్దారకుడు,

కేవలం రాజ్యాలను పాలించే రాజుగా మిగిలి పోకుండా ప్రజలను ప్రేమించి “ఛత్రపతి” గా ఎదిగిన జిజియా బాయి ముద్దు బిడ్డ…!!


నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది. అతడే మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ 💪🚩🚩


కానీ ఈ వ్యాసం ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి కాదు ఆ శివాజీ మహరాజ్ ప్రాణాలనే కాపాడిన ఒక యోదుడి గురించి.


రాజు కోసం, దేశం కోసం, ధర్మ కోసం – చావును సైతం దిక్కరించి, దేహమంత రక్తంతో తడిసి ముద్ద అయినా కూడా, రాజు ఛత్రపతి శివాజీ సురక్షితుడు అయ్యాడు అన్న వార్త తెలిశాకే ప్రాణాలను వదులతానని మొండి పట్టుతో యుద్ధం చేసిన వీరుడి గురించి. మన చరిత్ర మనం తెలుసుకోవడం ఈ గడ్డపై పుట్టిన మన అందరి బాధ్యత…!!


అది 1660 వ సంవత్సరం.

బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్లుగా పాలిస్తున్న “ఆదిల్షాయులు” ఎన్నో సార్లు శివాజీ మీదకు యుద్ధానికి వెళ్లి చావు దెబ్బ తిని ఓడిపోయేవారు. అందుకే ఈ సారి ఆధీల్షాయులు “మొగల్ చక్రవర్తి ఔరంగజేబు” సహాయం తీసుకొని మరీ పన్హాలా కోటలో 600 మంది సైన్యంతో ఉన్న శివాజీని, శివాజీ కుడి భుజం, సర్వ సైన్యాధిపతి అయిన “బాజీ ప్రభు థేస్పాండే” ని 10000 వేల సైన్యం తో కోటని చుట్టుముట్టి బంధీలను చేశారు. సరైన సమయం చూసి ఛత్రపతిని చంపేయాలని “ఆధీల్షాయులు” ఎదురు చూస్తున్నారు.


కేవలం 600 మంది సైన్యం. ఆ 600 మంది సైన్యం, 10000 మందితో పోరాడి యుద్ధం గెలవడం అసాధ్యం అని శివాజీకి తెలుసు కాబట్టి అక్కడి నుండి తప్పించుకోవడం ఒక్కటే శివాజీకి ఉన్న మార్గం. కానీ 10000 మంది నుండి తప్పించుకోవడం కూడా అంత సులువైన పని కాదు, పన్హాలా కోటలో ఉన్న ధాన్య శాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ ఐతే ఆధీల్షాయులలోని సైన్యం కొంతభాగం ఆహారం సేకరించుటకు వెళ్తుంది. అప్పుడు తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ ఆదేశించారు. కొన్ని నెలలు గడిచాయి పన్హాల కోటలోని ఆహారం దాన్యగారం లోని ధాన్యం అన్నీ ఖాళీ అయిపోయాయి.


ఇప్పడు 10000 మందికి ఆహారం కావాలి కాబట్టి ఆధీల్షాయుల సైన్యం లోని కొంతభాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు. ఛత్రపతి శివాజీ తప్పించుకొనే సమయం అస్సన్నమైనది. పన్హలా కోట నుండి “రంగీ నారాయణ్” అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న “విశాల్ఘట్ కోటకు” వెళ్ళాలి అని శివాజీ నిర్ణయించుకున్నాడు.


13 జులై 1660 వర్షాకాలం. అమవాస్యకి దగ్గరలో వెన్నెల కాంతి బాగా తక్కువ ఉన్న ఒక రాత్రి, ఛత్రపతి శివాజీ – బాజీ ప్రభువులతో పాటు 600 మంది సైనికులు “విశాల్ఘట్” కు అడవి మార్గం గుండా ప్రయాణించటానికి సిద్ధంగా ఉన్నారు.


సైన్యం లో శివాజీ మహారాజు పోలికలతో ఉండే “శివకాశీ” అనే ఒక సైనికుడిని శివాజీ ధరించే దుస్తులు నగలు తొడిగి అచ్చుగుద్దినటట్లుగా శివాజీ మహారాజు లాగా తయారు చేసి ఆధీల్షాయి సైన్యానికి కనపడే విధంగా 10 మంది సైనికులతో పంపించారు.


ఛత్రపతి శివాజీ వేషంలో ఉన్న శివకాశీ ని చూసి శివాజీ నే తప్పించుకుంటున్నాడు అనుకుని ఆదిల్షాయిల సైన్యాధిపతి తన సైన్యం అంతటినీ పిలిపించాడు. ఇదే అదును చూసి ఆదిల్షాయిల సైన్యం మొత్తం శివకాశీ దగ్గరకు వెళ్లినప్పుడు, విశాల్ఘట్ వైపుకు అడవి మార్గం గుండా అతి వేగంగా బయలు దేరారు శివాజీ అతని సైనికులు.


వర్షాల తాకిడికి అడవిగుండా ముళ్లకంపలు చెత్తా చెదారం కొట్టుకొచ్చాయి, నడిచే మార్గం అంతా బురద ముళ్ల పొదలతో భయంకరంగా ఉంది.

కానీ అక్కడ ఉన్న 600 మందికీ ఒక్కటే లక్ష్యం ఛత్రపతి శివాజీని విశాల్ఘట్ కు చేర్చటం. ఆ 600 కి ఉన్న ధైర్యం కూడా ఒక్కడే అతడే బాజీ ప్రభు దేశ్పాండే….!!


బాజీ ఉన్నంత వరకు తమను ఎవరూ ఏమి చేయలేరు అనే నమ్మకం తో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆదిల్షాయిల సైన్యాధిపతి పట్టుకున్నది శివాజీ మహారాజు ను కాదని మారువేషంలో ఉన్న శివకాశీ అని తెలుసుకోటానికి ఎక్కువ సమయం పట్టలేదు.


శివకాశీ ని అక్కడికక్కడే నరికి చంపి 8000 మంది సైన్యాన్ని శివాజీ వెనుక తరముకుంటు వెళ్లి శివాజీ ని బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు. తెల్లవారే సమయానికి “గోడ్కింగ్” అనే ఇరుకైన పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకొంటున్న శివాజీ సైన్యం, ఆదిల్షాయుల సైన్యం సమీపిస్తుందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఆదిల్షాయిల సైన్యానికి చిక్కకుండా వేగంగా విశాల్ఘట్ కి చేరటం అసాధ్యం …


ఎందుకంటే ఆ సమయం లో ఛత్రపతి శివాజీ సైన్యం వద్ద ఒక్క గుఱ్ఱం కూడా లేదు, కానీ సగం ఆదిల్షాయిల సైన్యం వద్ద గుఱ్ఱలు ఉన్నాయి. అక్కడే యుద్ధం చేసి ఆదిల్షాయిల సైన్యాన్ని ఓడించటం జరగని పని.


8000 మంది సైన్యం తో 600 మంది ఎంత భయంకరంగా పోరాడినా గెలవడం మాత్రం అసాధ్యం. ఇప్పుడు ఛత్రపతి సైన్యానికి ఉన్న ఒకే ఒక్క దారిని బాజీ ప్రభువు రాజుతో వివరించాడు.


గోడ్కింగ్ చాలా ఇరుకైన ప్రాంతం ఈ దారిగుండా సైన్యం ఒకేసారి ఎక్కువ మందితో దాటలేదు.

సైన్యం లో సగం మందిని అంటే సరిగ్గా 300 మందితో నేను గోడ్కింగ్ కు అడ్డుగా నిలబడి ఆదిల్షాయిల సైన్యం తో పోరాడుతాను. ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఈ దారిగుండా రాలేరు కాబట్టి తక్కువులో తక్కువ రెండు మూడు గంటల వరకు నేను ఆదిల్షాయిలను ఆపగలను. ఈ సమయం లో మిగిలిన 300 మంది సైన్యం తమ ప్రాణాలతో ఛత్రపతిని కాపాడుకుంటూ “విశాల్ఘట్” కు చేర్చండి. శివాజీ మహారాజు సురక్షితంగా విశాల్ఘట్ కు చేరుకోగానే అక్కడ ఉన్న ఫిరంగులను 5 సార్లు పేల్చండి.

ఫిరంగులు శబ్దం మహారాజు సురక్షితంగా విశాల్ఘట్ కు చేరారు అని నాకు సంకేతం…అని పథకాన్ని వివరించాడు. మరో దారి లేక అందరూ ఈ పథకాన్నే ఒప్పుకున్నారు.


300 మంది సైన్యం తో శివాజీ మహారాజు విశాల్ఘట్ కు బయలు దేరాడు. మిగిలిన 300 మంది సైన్యం తో బాజీ ప్రభువు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఆదిల్షాయిల సైన్యం గోడ్కింగ్ కు చేరుకుంది. యుద్ధం మొదలు అయ్యింది. అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదిల్షాయిలను నరికేస్తున్నారు బాజీప్రభు అతని సైన్యం. ఇరుకైన కొండ ప్రాంతం అవ్వటం తో శివాజీ మహారాజుకు తప్పించుకోడానికి ఎక్కువ సమయం దొరికినా అవతలి వైపు ఉన్నది 8000 మంది సైన్యం 300 మంది బాజీ ప్రభు సైన్యం ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పటం ఆపటం లేదు. సమయం గడిచేకొద్దీ బాజీ ప్రభు సైన్యం తరిగిపోతుంది , కానీ బాజీ ప్రభువు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిల్షాయిల వైపు 20 నుండి 30 మంది చనిపోతున్నారు . సుమారు 4 గంటలు గడిచే సరికి 8000 మంది ఆదిల్షాయిల సైన్యం లో 5000 మంది మరణించారు. కానీ బాజీ ప్రభు సైన్యం లో దాదాపు అందరు మరణించారు.


బాజీ ప్రభు తో పాటు ఆతికొద్ది మంది మాత్రమే మిగిలారు. కేవలం 300 మంది సైన్యం తో 5000 మందిని చంపటం చరిత్రలో అదే మొట్టమొదటి సారి ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కత్తి వేట్లతో దేహం అంతా గాయాలతో…రక్తంతో… తడిసి ముద్ద అయ్యి ఎర్రగా మండుతున్న అగ్నిగోళంలా ఉన్న బాజీ ప్రభువును చూసి “మనీషా – రాక్షసుడా” అని భయపడ్డారు ఆదిల్షాయిలు. నిజానికి బాజీ ప్రభువు కి తగిలిన గాయాలు కత్తి పోట్లలో పావు వంతు తగిలినా ఒక మనిషి మరణిస్తాడు , కానీ అగ్ని పర్వతం నుండి లావా ఉబికినట్టు బాజీ ప్రభువుల అవయువాల నుండి రక్తం ప్రవహిస్తున్నా…. అతని చేయి మాత్రం ఇంకా కత్తి తిప్పుతూనే ఉంది.


తనరాజు “ఛత్రపతి శివాజీ మహరాజ్” విశాల్ఘట్ కు చేరే వరకు తన ప్రాణాలు వదిలే సమస్యే లేదని ఒక చేతితో మృత్యువుని ఆపుతూ….. మరో చేతితో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు దేశ్పాండే. చావుని పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోగు చేసుకొని యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభువు చెవులు యుద్ధం మొదలైన నాలుగు గంటల తరువాత ఫిరంగి పేలుడు శబ్దాలు విన్నాయి.


“నా రాజుని కాపాడుకున్నాను అనే చిరునవ్వు పెదవుల పైకి వచ్చేలోపు – దేశ ప్రజలను రక్షించాను అనే గర్వం కళ్ళలోకి చేరే లోపు అతని చెయ్యి కత్తిని వదిలేసింది”.


కాళ్లు నేలకు ఒరిగాయి. కళ్ళు ఆకాశాన్ని చూస్తూ…. ప్రాణం శరీరాన్ని వదిలింది. చరిత్ర “కనీ వినీ” ఎరగని యుద్ధం చేసి, కేవలం 300 మందితో 8000 మందిని అడ్డుకొని మృత్యువునే వాయిదా వేసిన బాజీ ప్రభువు త్యాగానికి ఛత్రపతి శివాజీ మహారాజు కన్నీటి నివాళి అర్పించి “గోడ్కింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్” అంటే పవిత్రమైమ ప్రదేశం అని ప్రకటించాడు. ఆ తరువాత బాజీ ప్రభువుల పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ…..!!


ఈ రోజు ఈ దేశం లో హిందుత్వం ఇంకా బతికి ఉంది అంటే కారణం ఇటువంటి మహా వీరులు మనకోసం తమ ప్రాణాలను అర్పించటమే ….


జై భవానీ…!

జై శివాజీ…!

జై హింద్…!!

Monday, 24 March 2025

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.

   ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి కోరారు.






    ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.


     ఈ సోమవారం సుమారు 100  మంది  సమస్యల పరిష్కారం నిమిత్తం  దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులలో ఏప్పటిలాగే వ్యక్తిగత సమస్యలు ,భూ సమస్యలు, పెన్షన్ మంజూరి, ఉద్యోగ ,ఉపాధి అవకాశాలపై వచ్చాయి .


     దరఖాస్తుల స్వీకరణ  అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.


     ప్రజావాణి దరఖాస్తులు అన్ని స్థాయిలలో జాప్యం లేకుండా పరిష్కరించాలని అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కానట్లయితే స్పష్టంగా ఫిర్యాదు దారుకి తెలియజేయాలని చెప్పారు.

    “దర్తీ ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్” పథకం కింద తిరుమలగిరి సాగర్ మండలం, రంగుండ్ల తండాలో మౌలిక వసతుల కల్పనకై గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా ఇదివరకే ఆదేశించడం జరిగిందని అన్నారు.  ముఖ్యంగా రంగుండ్ల తాండలో జల్ జీవన్ కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 10 మీటర్ల లోతున వాన నీటి కట్టడాలను చేపట్టాలని, గ్రామంలో అన్ని ప్రభుత్వ సంస్థల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, 10 హెచ్ పి సోలార్ పంప్ ఏర్పాటు చేయాలని, పబ్లిక్ టాప్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ,  ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ నిర్మాణం, లైబ్రరీ, స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఎం ఎస్ ఎం ఈ కింద  ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని, చేపలు పట్టుకునేందుకు ఒక ఎకరం స్థలంలో డేమాన్స్ట్రేషన్ బ్లాక్ ఏర్పాటు చేయాలని, ఉద్యాన పంటల కింద సబ్సిడీపై  డ్రిప్ ఇరిగేషన్ వంటివి ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగుండ్ల లో చేపట్టే పనులు ఇతర గిరిజన  గ్రామాలలో చేపట్టే విధంగా మోడల్ గా నిలవాలని చెప్పారు.  52  గిరిజన గ్రామాలలో ఈ పథకాన్ని  అమలు చేసేందుకు అవకాశం ఉందని ఆమె తెలిపారు.


     అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఇన్చార్జి డిఆర్ఓ వై .అశోక్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఇతర అధికారులు ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు .

____________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

పార్లమెంట్ లో అరకు కాఫీ ఘుమఘమలు- మోడీకి చంద్రబాబు థ్యాంక్స్..!


 పార్లమెంట్ లో అరకు కాఫీ ఘుమఘమలు- మోడీకి చంద్రబాబు థ్యాంక్స్..! 

        ఏపీ బ్రాండ్ అరకు కాఫీ ఘుమఘుమలు ఇకపై పార్లమెంట్ లోనూ ఎంపీలకు ఆహ్లాదాన్ని పంచబోతున్నాయి. అరకు లోయలో పండే కాఫీ రుచిని పార్లమెంట్ లో ఎంపీలకు పరిచయం చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న ఏపీ ఎంపీల వినతిని లోక్ సభ స్పీకర్ తాజాగా అనుమతించారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో ఇవాళ రెండు స్టాల్స్ ను ప్రారంభించారు. కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్ తో పాటు ఏపీకి చెందిన ఎంపీలు, రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్‌లో ఇవాళ రెండు అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. అలాగే రాజ్యసభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్ ను వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. అరకు లోయలో కాఫీ సువాసన పార్లమెంట్ లో గుబాళించబోతోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 

 మన గిరిజన సంపద అరకు కాఫీని ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కాఫీ స్టాళ్లను గర్వంగా ప్రారంభించారని, ఇప్పుడు, మన పార్లమెంటేరియన్లు మన స్థానిక ప్రజల సాధికారత, స్థిరమైన వ్యవసాయాన్ని సూచించే ఈ స్థానిక పానీయం రుచి చూడవచ్చని ఆయన తెలిపారు. ఇది బ్రాండ్ భారత్‌కు పెద్ద ప్రోత్సాహం అన్నారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. 

             "ఏపీలో వితంతు మహిళలకు కూటమి సర్కారు తీపికబురు.. " పార్లమెంట్‌లో కాఫీ ప్రియులకు శుభవార్త! మీరు ఇప్పుడు ఆవరణలోనే తాజాగా తయారుచేసిన అరకు కాఫీ కప్పును ఆస్వాదించవచ్చని చంద్రబాబు తెలిపారు. 'మన్ కీ బాత్'లో అరకు కాఫీని ప్రోత్సహించినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, ఈ స్టాల్‌ను ఏర్పాటు చేయడానికి దయతో అనుమతి ఇచ్చినందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మైలురాయిని నిజం చేసిన ప్రతి ఒక్కరికీ, అంకితభావంతో ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇది మనందరికీ, ముఖ్యంగా మన గిరిజన రైతులకు గర్వకారణం, వారి అంకితభావం మరియు కృషి అరకు కాఫీని జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయికి తీసుకువచ్చింది. మనం ప్రతి కప్పును ఆస్వాదిస్తున్నప్పుడు, వారి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కూడా గుర్తుంచుకుందాం అన్నారు.

హైదరాబాద్‌లో బాలీవుడ్‌ నటిపై దాడి.. కాళ్లు, చేతులు కట్టేసి.. వ్యభిచారం చేయాలని..

 హైదరాబాద్‌లో బాలీవుడ్‌ నటిపై దాడి.. కాళ్లు, చేతులు కట్టేసి.. వ్యభిచారం చేయాలని..


 హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన బాలీవుడ్ నటిపై కొందరు దుండగులు దాడికి పాల్పాడ్డారు. ఆమె బస చేసిన హోటల్ లోకి ప్రవేశించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఏం జరిగింది..? బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటి హైదరాబాద్ లోని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఈనెల 18న ముఖ్య అతిథిగా వచ్చారు. ఆమె మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో బస చేశారు. అయితే ఈనెల 21న రాత్రి 9 గంటల సమయంలో ఆమె హోటల్ లో నిద్రిస్తున్న వేళ ఇద్దరు అమ్మాయిలు రూమ్ లోకి వచ్చారు. తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఆమెను బలవంతం చేశారు. 

మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఇద్దరు అబ్బాయిలు ఆమె గదిలోకి చొరబడ్డారు. వాళ్లిద్దరూ ఆమెను రేప్ చేసేందుకు యత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కాళ్లు,చేతులు కట్టేసి హింసించారు. అనంతరం ఆమె బ్యాగులోని రూ. 50,000 నగదు, కొంత బంగారంతో అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో సంఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వార్ ఫిక్స్ చేసిన రేవంత్... నేడు అసెంబ్లీలో తీర్మానం!

 డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వార్ ఫిక్స్ చేసిన రేవంత్... నేడు అసెంబ్లీలో తీర్మానం!


 దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది .డీలిమిటేషన్ కమిషన్ నిర్వహించే లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి బిజెపియేతర పార్టీల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాల పైన తీవ్రంగా పడుతుందని దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందని పలువురు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ రగడ .. ప్రతిపక్షాలా డిమాండ్ తాజాగా తమిళనాడు రాష్ట్రంలో డీలిమిటేషన్ కు సంబంధించి జరిగిన జేఏసీ మీటింగ్లో తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు పాల్గొని డీలిమిటేషన్ పైన తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల పాటు దీనిని మార్చడానికి వీలు లేదంటూ ప్రధానంగా తమ డిమాండ్ ను వినిపించారు. డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి స్టాండ్ ఇదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డిలిమిటేషన్ పైన తమ నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ద్వారా లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కోల్పోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ప్రస్తుతం ఉన్న 24 శాతం నుండి 33% కి పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో అసమానతలను సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నం గా దీనిని ఆయన అభివర్ణించారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తీర్మానం అన్యాయమైన సరిహద్దుల విభజనను అమలు చేయకుండా బీజేపీని ఆపాలని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో మరో మారు హైదరాబాద్ వేదికగా జేఏసీ సమావేశాన్ని నిర్వహించడానికి రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా డీలిమిటేషన్ కు సంబంధించి రేవంత్ రెడ్డి శరవేగంగా దూకుడునిర్ణయాన్ని తీసుకున్నారు.చెన్నైలో జరిగిన భేటీ తర్వాత సీఎం రేవంత్ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. Also Read బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల శాసనసభలో డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ తీర్మానం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టి దీనిపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దీనిని కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్న వేళ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాదికి నష్టం చేసి ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువగా మారిన వేళ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి డీలిమిటేషన్ పైన తమ బలమైన స్టాండ్ ను కేంద్రానికి తెలియజేయనున్నారు. 

తెలంగాణలో కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్... ఆ నేతలకు బెర్త్‌లు ఖాయ‌మైన‌ట్టేనా?

 తెలంగాణలో కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్... ఆ నేతలకు బెర్త్‌లు ఖాయ‌మైన‌ట్టేనా?


తెలంగాణ కేబినెట్ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 15 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2023 డిసెంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా... అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్‌లోమరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ... ఆ దిశగా ఇప్పటికీ వరకు అడుగులు పడలేదు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ కేబినెట్ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 15 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2023 డిసెంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా... అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ కేబినెట్‌లో గరిష్టంగా 18 మందికి చోటు కల్పించేందుకు వీలు ఉంది. అంటే మరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఇప్పటికీ వరకు అడుగులు పడలేదు. గతంలో పలు సందర్భాల్లో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపించిన ఆ దిశలో అడుగులు పడలేదు.

అయితే తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి‌లు ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో వీరు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు.

దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో... మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్‌ పదవులను భర్తీ చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలతో చర్చించింది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే, ఎస్సీ వర్గీకరణ బిల్లు, ఇతర అభివృద్ది ప్రాజెక్టుల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది.

అయితే ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై జరిగిన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించేందుకు అవకాశం ఉండగా... దాదాపు 30 మంది వరకు రేసులో ఉన్నారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకాటి శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి, విజయశాంతి, బాలు నాయక్, మల్‌రెడ్డి రంగారెడ్డి, షబ్బీర్ అలీ, అమేర్ అలీ ఖాన్, ఫహీమ్ ఖురేషి, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ప్రేమ్ సాగర్‌రావు... తదితరులు మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో చాలా మంది నెలల తరబడి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూ పార్టీ నాయకులకు తమ వాదనను వినిపిస్తున్నారు.

అయితే సోమవారం ఇందిరా భవన్‌లో జరిగిన సమావేశంలో సామాజిక సమీకరణాలు, గతంలో పార్టీలో నేతలకు ఇచ్చిన హామీలు... తదితర అంశాలు చర్చకు వచ్చాయి. మక్తల్‌ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్‌, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌లకు గతంలో ఇచ్చిన హామీల మేరకు... వారికి మంత్రివర్గంలో చోటు దాదాపు ఖరారైనట్టుగా జోరుగా ప్రచారం సాగుతుంది. అంతేకాకుండా.. . మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురి పేర్లపైనా కూడా ఈ సమావేశంలో చర్చ సాగింది. అయితే త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుందని... ఉగాదికి అటు ఇటుగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొత్తం ఆరు స్థానాలను ఇప్పుడే భర్తీ చేస్తారా?... ఒకటి రెండు స్థానాలను ఖాళీగా ఉంచుతారా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.

అయితే మంత్రివర్గంలో అవకాశం దక్కని నేతలకు ప్రత్యామ్నాయంగా ఏ పదవులు ఇవ్వాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలిసింది. అలాంటి వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్పారంటే...

ఈ సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించడం జరిగిందని చెప్పారు. అలాగే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్‌ పదవుల భర్తీపై చర్చ జరిగినట్లు తెలిపారు. కుల గనణ సర్వే, ఎస్సీ వర్గీకరణ బిల్లు, అభివృద్ధి ప్రాజెక్టులు, రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ల వంటి కీలక అంశాలపై కూడా కాంగ్రెస్ పెద్దలు చర్చించారని అన్నారు.

Gold Rate Today: మార్చి 25, మంగళవారం భారీగా తగ్గిన బంగారం ధర...తులం పసిడి ఏకంగా రూ. 3 వేలు తగ్గింది...పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులు..

 Gold Rate Today: మార్చి 25, మంగళవారం భారీగా తగ్గిన బంగారం ధర...తులం పసిడి ఏకంగా రూ. 3 వేలు తగ్గింది...పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులు..


మార్చి 25వ తేదీ మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో పసిడి నగలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది కొరకంగా అదృష్టం అని చెప్పవచ్చు. బంగారం ధర భారీగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి, తగ్గిన ధరలు ఒక అవకాశం అని చెప్పవచ్చు. మీరు కనుక బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లయితే ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే మంచిది... . ఇలా తెలుసుకోవడం ద్వారా మీరు మీ బడ్జెట్ అంచనా వేసుకోవచ్చు.

మార్చి 25వ తేదీ మంగళవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు తగ్గింది. ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,290 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,150 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 99,915 పలికింది. బంగారం ధర గడచిన మూడు సెషన్లుగా తగ్గుతూ వస్తోంది. ఆల్ టైం రికార్డ్ స్థాయి 92000 చూస్తే బంగారం ధర దాదాపు 3 వేల రూపాయలు తగ్గింది. ఇదే ట్రెండు కొనసాగినట్లయితే బంగారం ధర మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. కాగా బంగారం ధరలు ఇప్పటికి ఆల్ టైం రికార్డుకు సమీపంలోనే ఉన్నాయి. బంగారం ధర పెరగడం లేదా తగ్గడం అనేది అంతర్జాతీయ మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా స్టాక్ మార్కెట్లో పతనం అయినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. అదే సమయంలో స్టాక్ మార్కెట్ లాభపడితే బంగారం విలువ తగ్గుతుంది. దీనికి తోడు ప్రస్తుతం అమెరికా డాలర్ విలువ పుంజుకుంటోంది. ఈ కారణంగా కూడా బంగారం విలువ తగ్గుతుంది.

ఎప్పుడైతే డాలర్ విలువ పెరుగుతుందో అప్పుడు బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా విడుదల చేసే ట్రెజరీ బాండ్ల పైన పెట్టుబడి పెడుతుంటాయి. డాలర్ బలపడ్డప్పుడల్లా స్థిరమైన ఆదాయం అందించే అమెరికా ట్రెజరీ బాండ్ల పైన ఇన్వెస్టర్లు ఎక్కువగా డబ్బు పెడుతుంటారు. ఇందుకోసం బంగారంలో పెట్టిన పెట్టుబడిలో ఉన్న సైతం వెనక్కు తీసుకుంటారు. దీని కారణంగా బంగారం ధర తగ్గుతుంది. అటు బంగారం ధర పెరగడం లేదా తగ్గడం అనేది అంతర్జాతీయంగా తీసుకునే పరిణామాల వల్లనే నిర్ణయం జరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర స్వల్పంగా తగ్గిన నేపథ్యంలో పసిడి ప్రియులకు కాస్త ఊడట కలిగింది అని చెప్పవచ్చు ఎందుకంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేస్తే వారికి డబ్బు ఆదా అవుతుంది. ఇదిలా ఉంటే బంగారు ఆభరణాలు ప్రస్తుతం కొనుగోలు చేసే వారికి పెరిగిన ధరలు ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ కారణంగా రిటైల్ మార్కెట్లో కూడా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర కూడా భారీగా పెరిగింది ఆభరణాల మార్కెట్లో పసిడి నగలు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గింది. అయితే రిటైల్ మార్కెట్లో డిమాండ్ తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లకు మాత్రం బంగారానికి డిమాండ్ భారీగా ఉంది. దీంతో ధర పెరగడానికి దోహదపడుతోంది

Sunday, 23 March 2025

అమరవీరుల దినోత్సవం భగత్ సింగ్ - సుఖ్‌దేవ్ - రాజ్‌గురు


 *మార్చి 23 - అమరవీరుల దినోత్సవం* 


 *భగత్ సింగ్ - సుఖ్‌దేవ్ - రాజ్‌గురు* 


విప్లవకారుడు భగత్ సింగ్ సెప్టెంబర్ 28, 1907న పంజాబ్‌లోని లాయల్‌పూర్ జిల్లా బంగా గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టడానికి కొంతకాలం ముందు, ఆయన తండ్రి కిషన్ సింగ్ మరియు మామ అజిత్ సింగ్ స్వాతంత్య్ర ఉద్యమం లో పాల్గొని జైలు నుండి విడుదలయ్యారు. ఇంట్లో ఎప్పుడూ స్వాతంత్ర్య ఉద్యమం గురించి చర్చ జరుగుతుండేది. ఇది భగత్ సింగ్ మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 


ఏప్రిల్ 13, 1919న, అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో క్రూరమైన పోలీసు అధికారి డయ్యర్ వేలాది మంది పౌరులను కాల్చి చంపాడు. ఇది విన్న బాలుడు భగత్ సింగ్ అక్కడికి వెళ్లి


రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలో తెచ్చాడు. అతను ప్రతిరోజూ దానిని పూజించి తన నుదిటిపై తాకేవాడు. 


 బ్రిటిష్ వారు కేవలం అహింసా ఉద్యమం ద్వారా స్వాతంత్య్రం ఇవ్వరని భగత్ సింగ్ అనేవాడు. అందుకే, ఆయన ఐర్లాండ్, ఇటలీ, రష్యా మొదలైన దేశాల విప్లవాత్మక ఉద్యమాలను లోతుగా అధ్యయనం చేశాడు. భారతదేశంలో కూడా ఇలాంటి సంస్థను స్థాపించాలని ఆలోచన చేసాడు. ఇంట్లో వారు పెళ్లి చేసుకోమని ఒత్తిడి కారణంగా, అతను ఇల్లు వదిలి వెళ్లి కాన్పూర్‌లోని స్వాతంత్ర్య సమరయోధుడు గణేష్ శంకర్ విద్యార్థి వార్తాపత్రిక 'ప్రతాప్'లో పనిచేయడం ప్రారంభించాడు. 


కొంత కాలం తర్వాత ఆయన లాహోర్ చేరుకుని 'నౌజ్వాన్ భారత్ సభ'ను స్థాపించారు. భగత్ సింగ్ అనేక ప్రదేశాలకు ప్రయాణించాడు. ఇందులో ఆయన చంద్రశేఖర్ ఆజాద్ వంటి స్నేహితులను కలిశారు. కోల్‌కతా వెళ్లి బాంబులు తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు. 


1928లో, స్వాతంత్ర్య పరిస్థితిని అధ్యయనం చేయడానికి బ్రిటన్ నుండి లార్డ్ సైమన్ నేతృత్వంలోని బృందం భారతదేశానికి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా లాహోర్‌లో లాలా లజపతి రాయ్ నాయకత్వంలో పెద్ద ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన కారుల మీద పోలీసు అధికారులు స్కాట్ మరియు సాండర్స్ లాఠీ ఛార్జ్ కు ఆదేశించారు. దీని కారణంగా, వృద్ధ వయసు లో ఉన్న లాలా లజపత్ రాయ్ తలకు తీవ్ర గాయం అయి కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించారు.


ఈ సంఘటన విప్లవకారులకు కోపం తెప్పించింది. కొన్ని రోజుల తర్వాత, వారు పోలీసు కార్యాలయం ముందు సాండర్స్‌ను కాల్చి చంపారు. పోలీసులు నిండుతులను పట్టుకోడానికి చాలా ప్రయత్నాలు చేశారు; కానీ విప్లవకారులందరూ తమ వేషాలను మార్చుకుని లాహోర్ వదిలి వెళ్లిపోయారు. కొంత సమయం తరువాత, కేంద్ర శాసనసభ సమావేశం ఢిల్లీలో జరగాల్సి ఉంది. విప్లవకారులు అక్కడ కూడా బాంబులు వేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ లను ఎంపిక చేశారు. 


నిర్ణయించిన రోజున వారిద్దరూ బాంబులు, కరపత్రాలను తీసుకుని గ్యాలరీకి చేరుకున్నారు. భారత వ్యతిరేక ప్రతిపాదనలపై చర్చ ప్రారంభమైన వెంటనే, వారిద్దరూ లేచి నిలబడి సభలో బాంబు విసిరారు. వారు 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదాలు చేస్తూ, విప్లవ ఉద్యమ లక్ష్యం రాసిన కరపత్రాలను విసిరారు.


పోలీసులు వారిద్దరినీ పట్టుకున్నారు. భగత్ సింగ్ కోర్టులో ఇచ్చిన ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా అతనికి ప్రశంసలు తెచ్చిపెట్టాయి. సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ సంఘటనలో అనేక మంది ఇతర విప్లవకారులు కూడా పాల్గొన్నారు; వీరిలో సుఖ్‌దేవ్ మరియు రాజ్‌గురులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముగ్గురిని ఉరి తీయాలని కోర్ట్ ఆదేశం మార్చి 24, 1931న జారీ చేయబడింది.


భగత్ సింగ్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు చెలరేగాయి. దీనికి భయపడి, మోసపూరిత బ్రిటిష్ వారు మార్చి 23 సాయంత్రం వారిని ఉరితీసి, వారి కుటుంబ సభ్యులు లేనప్పుడు వారి మృతదేహాలను దహనం చేశారు; కానీ ఈ త్యాగం దేశంలో విప్లవ జ్వాలలకు మరింత ఆజ్యం పోసింది. ఆయన నినాదం 'ఇంక్విలాబ్ జిందాబాద్' నేటికీ సమావేశాలకు శక్తినిస్తుంది.