గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు...... మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు...... మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్,
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, నగర ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, "ఉగాది అంటే కొత్త ఏడాదికి ఆశాజనకమైన ఆరంభమని, ఇది మన సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించే పర్వదినమన్నారు. ఉగాది పచ్చడి మనిషి జీవితం అనేక రుచుల సమ్మేళనం అనే సందేశాన్ని అందిస్తుందని అన్నారు. ఈ ఉగాది అందరి జీవితంలోనూ ఆనందం, అభివృద్ధి, ఆరోగ్యం, శాంతి, సంపదలు చేకూర్చాలని ఆమె ఆకాంక్షించారు.
హైదరాబాద్ నగరం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లేందుకు GHMC నిరంతరం కృషి చేస్తోందని, నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రజల సహకారంతో నగరాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషి కొనసాగిస్తామన్నారు.
ఈ సందర్భంగా నగర ప్రజలంతా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, శుభ్రమైన, ఆరోగ్యకరమైన హైదరాబాద్ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ, మరోసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home