ఉక్కు మనిషి’కి ప్రతిరూపమే అమిత్ షా
ఉక్కు మనిషి’కి ప్రతిరూపమే అమిత్ షా
హోంశాఖ మంత్రి అమిత్ షాను భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ప్రతిరూపంగా చూస్తున్నామంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్ అభివర్ణించారు. అలాగే.. తమిళనాడు ఉక్కు మనిషి ఎడప్పాడి పళనిస్వామి కలుసుకున్న వ్యవహారంలో పలు వార్తలు వెలువడుతున్నాయనన్నారు.
చెన్నై: భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ప్రతిరూపమే హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Sha)ను చూస్తున్నారని అన్నాడీఎంకే మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్(RB Uday Kumar) అభివర్ణించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సుమారు 2 గంటలకు పైగా సమావేశమయ్యారు.
బీజేపీతో కూటమి ఏర్పాటుపై చర్యల సాగినట్లు వచ్చిన వార్తలను పళనిస్వామి ఖండించారు. ఈ నేపథ్యంలో, అమిత్‌షాతో పళనిస్వామి సమావేశం కావడంతో ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ ఆర్బీ ఉదయకుమార్ వీడియో విడుదల చేశారు. అందులో... భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ప్రతిరూపమైన హోంశాఖ మంత్రి అమిత్ షాను,
తమిళనాడు ఉక్కు మనిషి ఎడప్పాడి పళనిస్వామి కలుసుకున్న వ్యవహారంలో పలు వార్తలు వెలువడుతున్నాయని, రాష్ట్ర ప్రజల సమస్యలు తెలిపేందుకు పళనిస్వామి ఢిల్లీ వెళ్లారని తెలిపారు. పళనిస్వామి-అమిత్ షా(Palaniswami-Amit Sha) సమావేశంలో ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా అన్నాడీఎంకే కార్యకర్తలు విస్తృత ప్రచారం చేపట్టాలని ఉదయకుమార్ పిలుపునిచ్చారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home