ట్రంప్ సెగ, భారత్‌కు వలసదారులతో బయలుదేరిన విమానం!
ట్రంప్ సెగ, భారత్‌కు వలసదారులతో బయలుదేరిన విమానం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేశారు. ఇదివరకే బైడెన్ ప్రభుత్వం జీవోలను రద్దు చేసిన ట్రంప్.. విదేశీ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల బహిష్కరణకు శ్రీకారం చుట్టారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వారి దేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌కు సైతం ట్రంప్ షాకిచ్చారు. మన దేశానికి చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం అమెరికా నుంచి ఢిల్లీకి బయలుదేరింది.
సీ17 ఎయిర్‌క్రాఫ్ట్‌లో అమెరికా నుంచి అక్రమవలసదారులను భారత్‌కు తిరిగి పంపిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. బయలుదేరిన 24 గంటల్లో ఈ విమానం భారత్‌కు చేరుకోనుంది. అయితే ఎంత మందిని అందులో తరలించారనేది తెలియాల్సి ఉంది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ నినదించారు. విదేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వారి కంటే అమెరికా పౌరులకే తన ప్రాధాన్యమని నడుచుకున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అక్రమవలసదారులపై ఉక్కుపాదం మోపారు.
ఇదివరకే 538 మందిని అక్రమ వలసదారులను వారి దేశాలకు తరలించారు. తాజాగా టెక్సాస్, శాన్ డియాగో, ఎల్ పాసో, కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న మరో 5,000 మంది అక్రమ వలసదారులను గుర్తించిన అమెరికా అధికారులు వారిని స్వదేశాలకు పంపేందుకు చర్యలు చేపట్టింది. ఇదివరకే 6 విమానాలలో అక్రమ వలసదారులను లాటిన్ అమెరికాకు తరలించారు. సీ17 కార్గో విమానాలలో అక్రమ వలసదారులను వారి దేశాలను తిరిగి పంపిచేస్తున్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home