ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది* *- నారా చంద్రబాబు నాయుడు*
*ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది* నారా చంద్రబాబు నాయుడు*
*- వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారపూర్వకంగా నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖులు*
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు నారా లోకేష్ గారిని ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మానిఫెస్టో లో పెట్టాలని కోరగా ఆ నాడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని
అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మానిఫెస్టో లో ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. మానిఫెస్టో లో పెట్టడంతోపాటు ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 'మాఘ శుద్ధ విదియ ' తిథి నాడు నిర్వహించాలని జీవో నెంబర్ 181 ని విడుదల చేసింది ఎన్డీయే ప్రభుత్వం. ఆర్యవైశ్య ఇలవేల్పు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.
ఆర్యవైశ్యులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తెలిపారు. నాడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో వివిధ ఆర్యవైశ్య సంఘాల నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు,వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారు, అవోప మహిళా విభాగం అధ్యక్షురాలు ఆరవీటి నిర్మల గారు,ఆర్యవైశ్య మహాసభ జనరల్ సెక్రటరీ సేగు షణ్ముఘం గారు, విబిజి గ్రూప్ ఫౌండర్ ఎం.రాజు గారు, ఆర్యవైశ్య సత్ర సముదాయం సెక్రటరీ గురు బ్రహ్మం గారు మరికొందరు ఆర్యవైశ్య నాయకులు నంద్యాల నాగేందర్, పత్తి హిమబిందు, పల్లపోతు వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది. ఈనెల 31 వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ గారు పిలుపునిచ్చారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home