టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు...ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు...
* గుట్ట పవిత్రత కాపాడేలా చర్యలు...
* భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పన
* ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరహాలోనే యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు కు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సీఎం సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మాదిరే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రత కు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్పులు సూచించారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home