*బైండోవర్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తికి లక్ష రూపాయల జరిమానా*
*రౌడీ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు*
*జిల్లా యస్.పి కె.అపూర్వ రావు
IPS*
తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణం లో ప్రజలు ఓటు హక్కు వినియోగంచుకునటకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తూ శాంతి భద్రతల విఘాతం కలిగించే వారి పట్ల ఎప్పడికప్పుడు నిఘా పెడుతూ జిల్లాలో పాత నేరస్థులు, రౌడీ షీటర్లు,గత ఎన్నికల్లో శాంతి భద్రతల విఘాతం కల్గించి పలు కేసులలో ఉన్న వారిని ఇప్పటికే బైండోవర్ చేసినప్పటికీ మిర్యాలగూడ ఒకటవ పట్టణ పరిధిలో గల గాంధీ నగర్ కి చెందిన రౌడీ షీటర్ ఇంజమూరి కొండల్ అనే వ్యక్తిని ఎన్నికల నిబంధనల ప్రకారం బైండవర్ చేసిన మరుసటి రోజే నిబంధనలను అతిక్రమించి అదే కాలనీకి చెందిన సాయి అనే వ్యక్తి పై దాడి చేయగా బాధితుడి పిర్యాదు మేరకు నిందితుడు కొండల్ పైన మిర్యాలగూడ ఒకటవ పట్టణ సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి బైండవర్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను రెండవ సారి మిర్యాలగూడ తహాసిల్దర్ హరిబాబు గారి ముందు హాజరు పరచగా నిందితునికి ఒక లక్ష రూపాయల జరిమానా విధించడం జరిగిందని యస్.పి గారు తెలిపారు.
*నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు జిల్లా యస్.పి*
ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణం ప్రజలు ఓటు హక్కు వినియోగంచుకునుటకు జిల్లా పోలీస్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎవరైనా ఎన్నికల నిబంధనలను అతిక్రమించి శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బైండోవర్ నిబంధనలు అతిక్రమిస్తే లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు జరినమా గానీ ఒక సంవత్సరంపాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని అన్నారు.ఎవరైన రౌడీ కార్యకలపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే డైయల్ 100 గానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగలరు తెలిపారు.
No comments:
Post a Comment