పోలింగ్ వేళ.. తెలంగాణ ఓటర్లకు గవర్నర్ తమిళిసై విజ్ఞప్తి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోలింగ్‌ను సజావుగా కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఓటర్లు అధికారాన్ని ఎవరికి కట్టబెట్టారనేది తేలిది అప్పుడే. ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రానికి తెరపడింది. చివరి రోజున అన్ని ప్రధాన పార్టీల నాయకులు సుడిగాలి పర్యటనలను నిర్వహించారు. తెలంగాణలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. China virus: కర్ణాటక హైఅలర్ట్: కీలక నిర్ణయం రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 3.26 లక్షలమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35, 655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ నేపథ్యంలో.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) తెరమీదికి వచ్చారు. ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం దేశంలో ఎన్నికల ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
No comments:
Post a Comment