నేను మీ బర్రెలక్కను
అంటూ నిత్యం సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను, తన ఫాలోవర్లను పలకరిస్తుంది శిరీష. కేవలం ఒక్క వీడియోతో కేసీఆర్ సర్కార్‌కు చుక్కలు చూపించింది శిరీష.
ఎంత చదివినా సర్టిఫికెట్లు మాత్రమే వస్తాయి.. నోటిఫికేషన్లు రావు.. అందుకే నేను మా అమ్మను అడిగి నాలుగు బర్రెలు కొనుక్కున్న.. రోజుకు రూ300 సంపాదన గ్యారెంటీ.. బంగారు తెలంగాణలో చదువుకోవడం కన్నా బర్రెలు కాసుకోవడం నయం అంటూ చేసిన వీడియో సంచలనంగా మారింది. బర్రెలక్కగా ఫేమస్ అయిన ఈ శిరీష టాక్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్‌గా మారింది.
పోలీసులు సుమోటో కేసు..
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన శిరీష దళిత బిడ్డ. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శిరీష చేసిన వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. అటూ ఇటూ తిరిగి ఈ వీడియో తెలంగాణ సర్కార్ కంట పడింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయించుకునేందుకు శిరీష కోర్టుల చుట్టూ తిరుగుతోంది. కానీ ఎంత ప్రయత్నించినా కేసులు కొట్టుడు పోలేదు.
ఎన్నికల్లో నామినేషన్..
కేసు కొట్టివేయించుకునేందుకు శిరీష చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో విసిగిపోయిన శిరీష తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో శిరీష మరింత ఫేమస్ అయింది. ఆడపిల్ల, దళిత బిడ్డ అయి ఉండి కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తీరును సోషల్ మీడియాలో నిరుద్యోగులు, వివిధ పార్టీలన నేతలు వైరల్ చేస్తున్నారు.
ఇంటర్వ్యూకు క్యూ కడుతున్న మీడియా..
ఇక నామినేషన్ల ఉప సంహరణ పూర్తి కావడం, కొల్హాపూర్ బరిలో బర్రెలక్క నామినేషన్ ఉప సంహరించుకోకపోవడంతో ఇప్పుడు మీడియా దృష్టి అంతా ఆమెపై పడింది. శిరీష ఇంటర్వ్యూ కోసం యూట్యూబ్ చానెళ్లతోపాటు మెయిన్ స్ట్రీం మీడియా కూడా శిరీష ఇంటికి క్యూ కడుతోంది. ఇంటర్వ్యూలతోపాటు తన ఇన్‌స్ట్రాగ్రాం ఖాతాలో కూడా శిరీష ఒకటే విషయం చెబుతున్నారు. తాను
ఎన్నికల్లో ప్రచారం చేసుకోలేనని, ప్రధాన పార్టీల అభ్యర్థులకు తగినట్లుగా ప్రచారం చేసేంత డబ్బు తనవద్ద లేదని చెబుతోంది. నిరుద్యోగులు, యువకులు ఆలోచించి ఓటు వేయాలని కోరుతోంది. దీంతో కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీ.. ఇప్పుడు బర్రెలక్కకు వస్తోంది.
తాజాగా పాట..
ఇక బర్రెలక్క ఇనస్ప్రెషన్‌తో ఓ పాటను కూడా రాసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ పాట కూడా దుమ్ము రేపుతోంది. బర్రెలక్క ధైర్యం చూడరా.. పాలకులకు బుద్ధి చెప్పరా అంటూ సాగిన పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరోవైపు కొల్హాపూర్ అభ్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఫ్రీ పబ్లిసిటీతోపాటు, యువత ఆలోచనలో పడడంతో ఓటర్లు ఎన్నికల నాటికి ఏం చేస్తారో అని ఆందోళన చెందుతున్నారు. శిరీష కొల్హాపూర్ అభ్యర్థుల గెలుపు ఓటములను మార్చుడం ఖయం అని విశ్లేషకులు కూడా అంటున్నారు.
చిన్న హోటలతో పోషిస్తున్న తల్లి..
ఇక శీరిష తండ్రి చిన్నప్పుడే వదిలేసి పోయాడు. దీంతో తల్లి తన ముగ్గురు ఆడపిల్లలను పోషిస్తోంది. చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి శిరీష చిన్న వీడియో పెట్టినందుకు పోలీసులు కేసు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న విజిల్ గుర్తు..
ఇదిలా ఉంటే.. కొల్హాపూర్ బరిలో ఉన్న శిరీషకు ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించింది. ఇప్పుడు ఈ విజిల్ సౌండ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీటల అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులు లక్షల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తుంటే.. బర్రెలక్కకు మాత్రం ఫ్రీగా పబ్లిసిటీ వస్తోంది. సోషల్ మీడియాలో శిరీష పోస్టు చేస్తున్నవీడియోలకు నిత్యం వేల వ్యూస్ వస్తున్నాయి. అభ్యర్థుల సోషల్ మీడియా
ఖాతాల్లో వారిని పలకరించిన వారే లేరు. వీరికి వెయ్యి వ్యూస్ కూడా రావడం లేదు.
ఓటు లేదని బాధపడుతున్న నెటిజన్లు..
ఇక శిరీష పాపులారిటీ ఏ రేంజ్‌కు చేరిందటే.. ఆమె సోషల్ మీడియా ఫాలోవర్లు మిలియన్లకు చేరాయి. నిత్యం ఆమె పోస్టు చేస్తున్న వీడియోలపై వేల మంది స్పందిస్తున్నారు. తమకు ఓటు కొల్హాపూర్‌లే లేదని చాలా మంది బాధపడుతున్నారు. శిరీష గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. కొల్హాపూర్ ఓటర్లంతా శిరీషను గెలిపించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఫాలోవర్లంతా ఓటర్లు కాకపోవడంతో బాధపడుతున్నారు.
బర్రెలక్క లాంటి చైతన్యవంతులు చదువుకున్న విద్యావంతులు నేటి సమాజానికి చాలా అవసరం
No comments:
Post a Comment