ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు.
నవంబర్ 3 వ తేదీ నుండి మరింత నిఘా పెంపు
హైదరాబాద్ నవంబర్2:- నవంబర్ ,3 వ తేదీ నుండి నియోజక వర్గంలో మరింత నిఘా బృందాలు పనిచేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ తెలిపారు.
ఇప్పటికే జిల్లాలో అక్రమంగా విపరీతంగా నగదు, బంగారం ఇతర అభరణాలు, ప్రవాహాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ లు, ఒక వైపుమరోకవైపు పోలీస్ శాఖ తనిఖీలు, ఇంకొక వైపు ఇతర ప్రాంతాలనుండి వచ్చే ఆ క్రమంగా నగదు, వివిధ రకాల ఆభరణాలు, నిరోధించెందకు 18 చెక్ పోస్ట్ ల ఏర్పాటుచేశారు.
మనీ మేనేజ్మెంట్ సంస్థల ను కూడా నగదు ప్రవాహం తనిఖీ చేసేందుకు వాహనాలకు జి పి యస్ సిస్టమ్ అమర్చి ఎప్పటి కప్పుడు పరిశీలన, మద్యం షాపులు వద్ద కూడా అక్రమ రవాణా తగ్గించేందుకు సి సి కెమెరా అమర్చి జి హెచ్ ఏం సి కార్యాలయం నుండి కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటి కప్పుడు పరిశీలన చేస్తున్నారు అంతేకాకుండా.ఫ్లయింగ్ స్క్వాడ్, చెక్ పోస్ట్, వద్దకుడ సి సి కెమెరా లను పేట్టి జి హెచ్ ఏం సి కార్యాలయం నుండి పరిశీలన. జేసీ అక్కడ తప్పులను సరిదిద్ది సక్రమంగా చేసేందుకు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి జిల్లా ఎన్నికల అధికారి తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నగదు ఆభరణాలు, మద్యం, మరక ద్రవ్యాలు, పట్టుకొని సీజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 45 కోట్ల 89 లక్షల రూపాయల విలువ గల సొత్తును పట్టుకున్నారు
మీ
ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా లోని 15 నియోజక వర్గంలో నవంబర్ 3 వ తేదీ నుండి. నామినేషన్ లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆ రోజు నుండి స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ టీమ్ ల ను నియోజక వర్గం వారీగా ఏఒక్కొక్క నియోజక వర్గం లో 9 టీమ్ లను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పని చేసే విధంగా సిబ్బందిని నియిచడం జరిగింది ప్రతి నియోజక వర్గం లో వేర్వేరు ప్రదేశాలలో స్టాటిస్టిక్స్ సర్వే లెస్ టీమ్ లను పని చేస్తూ అక్రమంగా ప్రవహిస్తున్న నగదు, ఆభరణాలు, మద్యం మత్తు పదార్థాల లైనా, గంజాయి, డ్రగ్స్ పట్టుకునేందుకు ఈ టీమ్ ల నిఘా చేస్తుంది.
ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేని నగదు, ఆభరణాలు, సీజ్ చేసిన వాటిని ప్రజలకు ఇబ్బంది కలగ కుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా పిర్యాదు ల కమిటీ ఏర్పాటు చేసి తద్వారా వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటారు.
హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూధన్ అధ్యక్షతన ప్రతి రోజు కమిటీ నిర్ణయం మేరకు విడుదల చేస్తారు. ఇప్పటి వరకు ఈ కమిటీ ద్వారా 177 కేసులకు గాను 154 కేసుల పరిశీలన జరిపి మొత్తం5. 42కోట్ల రూపాయలను విడుదల చేశారు.
17కేసులు 10 లక్షంలు దాటిన ఐటి శాఖ కు పరిశీలన కోసం పంపించారు.
ఇప్పటివరకు పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఈ రోజు 53లక్షల 23 వేల 960 రూపాయలను సీజ్ చేశారు.మరియు పోలీస్ శాఖ
485 మంది పై కేసులు నమోదు చేశారు. 4541 ఆయుధాలను సేకరించడం జరిగినది. 2093 మందిని బైండోవర్ చేశారు 1229 నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. మొత్తానికి హైదరాబాద్ నగరం లో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఎన్నికల నియమావళి నీ పకడ్బందీగా అమలుకు ప్రతిష్టమైన చర్యలు గైకొన్నారు...
No comments:
Post a Comment