Friday, 17 November 2023

నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాలకు ర్యాండ మైజేషన్ ద్వారా అధనపు బ్యాలెట్ యూనిట్ల కేటాయింపు# :జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

 నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాలకు ర్యాండ మైజేషన్ ద్వారా 

 అధనపు బ్యాలెట్ యూనిట్ల కేటాయింపు#
:జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా  కలెక్టర్ ఆర్.వి. కర్ణన్




శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల
సమక్షంలో నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ నియోజక వర్గాలకు  అదనపు బ్యాలెట్ యూనిట్ ల కేటాయింపు ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించినట్లు  జిల్లా ఎన్నికల అధికారి ,జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ తెలిపారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ద్వారా బ్యాలెట్ యూనిట్లు నల్లగొండ 355, నకిరేకల్ 381, దేవరకొండ 385, మునుగోడు 383, నాగార్జున సాగర్ 373, మిర్యాలగూడ 328 యూనిట్ల చోప్పున పంపిణి చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

నవంబర్ 15న జరిగిన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాలలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారని,జిల్లా కేంద్రం ఈ .వి.యం గోదాం లో ఎఫ్.ఎల్.సి.పూర్తి చేసి రిజర్వ్ లో ఉన్న బి.యు.లను  ర్యాండమైజేషన్ ను నిర్వహించి నకిరేకల్ నియోజక వర్గానికి
382, మిర్యాలగూడ నియోజక వర్గానికి,
 330, నల్లగొండ నియోజకవర్గానికి
355 
బ్యాలెట్ యూనిట్ లను అదనంగా కేటాయించడం జరిగిందని తెలిపారు.  ర్యాండమైజేషన్ అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవియం గోడౌన్ లో స్కాన్ చేసి  ర్యాండమైజేషన్  క్రమ సంఖ్య అధారంగా వేరు చేసి  నియోజక వర్గాల పంపిణి కి అర్. ఓ.లకు అప్పగించినట్లు తెలిపారు.
  
ఈనెల 18వ తేదీన మునుగోడు నియోజకవర్గం మినహా మిగతా (5) నియోజకవర్గాల లో అబ్జర్వర్లు, పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రెండవ దశ ర్యాoడమైజేషన్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధిలు పిచ్చయ్య (బిఆర్ఎస్), లింగస్వామి (బిజెపి), నర్సిరెడ్డి (సిపిఎం), అశోక్ (కాంగ్రెస్), యాదగిరి (బీఎస్పీ), షేక్ మొయిన్ (ఎంఐఎం) కలెక్టరేట్ ఏవో మోతిలాల్, ఎలక్షన్ డిటీ విజయ్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
 
 

No comments:

Post a Comment