Wednesday, 29 November 2023

తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేశారు:రాజా సింగ్

 తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేశారు

                                 




: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోలింగ్‌ను సజావుగా కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఓటర్లు అధికారాన్ని ఎవరికి కట్టబెట్టారనేది తేలిది అప్పుడే. వారికేనా?.. మాకు డబ్బులివ్వరా?: మిర్యాలగూడలో మహిళా ఓటర్ల ఆందోళన ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ (Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టతను ఇచ్చారు. ఈ మధ్యాహ్నం ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున తన సొంత నియోజకవర్గం గోషామహల్ నుంచి పోటీలో ఉన్న విషయం తెలిసిందే.  ఈ ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లు వస్తాయని రాజా సింగ్ అంచనా వేశారు. మరో 50 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వనున్నామని వివరించారు. 45 రోజులుగా తాను గోషామహల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటినీ పలకరించానని, అందరి మదిలోనూ బీజేపీ ఉందని స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లు ఎప్పుడో తీర్మానించుకున్నారని వ్యాఖ్యానించారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు తనను ఎలా ఆదరించారో.. ఈ ఎన్నికల్లో కూడా అదే తరహాలో ఆదరిస్తారని, గోషామహల్.. బీజేపీకి కంచుకోటగా మారిందని రాజా సింగ్ ధీమా అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఇక్కడ కమలం మాత్రమే వికసిస్తుందని, మరే ఇతర పార్టీకీ అవకాశమే లేదని స్పష్టం చేశారు. 

తెలంగాణ..పోలింగ్‌కు సర్వం సిద్ధం..!

 తెలంగాణ..పోలింగ్‌కు సర్వం సిద్ధం..! 


                 :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ముఖ్యంగా మూడు పార్టీల మధ్యే కనిపిస్తోంది. అధికారిక బీఆర్ఎస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీల మధ్యే పోటీ ఉంది. ఇక మంగళవారంతో ప్రచారం ముగిసింది. ప్రచార సమయంలో నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేశారు. చివరి రోజైతే మాటల యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరింది. ప్రతిపక్షాలు అధికార పార్టీ వైఫల్యాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా... అధికార పార్టీ తాము సాధించిన విజయాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. ఇక 119 అసెంబ్లీ స్థానాల్లో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. చివరి నిమిషంలో క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

పోలింగ్ వేళ.. తెలంగాణ ఓటర్లకు గవర్నర్ తమిళిసై విజ్ఞప్తి


 పోలింగ్ వేళ.. తెలంగాణ ఓటర్లకు గవర్నర్ తమిళిసై విజ్ఞప్తి

             తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోలింగ్‌ను సజావుగా కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఓటర్లు అధికారాన్ని ఎవరికి కట్టబెట్టారనేది తేలిది అప్పుడే. ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రానికి తెరపడింది. చివరి రోజున అన్ని ప్రధాన పార్టీల నాయకులు సుడిగాలి పర్యటనలను నిర్వహించారు. తెలంగాణలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. China virus: కర్ణాటక హైఅలర్ట్: కీలక నిర్ణయం రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 3.26 లక్షలమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35, 655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ నేపథ్యంలో.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) తెరమీదికి వచ్చారు. ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం దేశంలో ఎన్నికల ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

Sunday, 26 November 2023

బీఆర్ఎస్ ఓటమి భయం...‼️*


ఎస్.ఎం.ఎం.అలీ✍️)
*

      *_తెలంగాణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ప్రచారం గడువు కూడా మరో నాలుగురోజులలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.  అభ్యర్థుల మాటల పదును ఎప్పుడో పెరిగింది.. విమర్శల వేడీ పెరిగింది.  రంగంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుంది._*

        *ఒకపక్క ఎవరు గెలుస్తారనే సర్వే సంస్థల* అంచనాలు ఉత్కంఠ పెంచుతుంటే.. మరో  ఏ పార్టీకి ఆ పార్టీ  విజయం మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నది. బీఆర్ఎస్ హ్యాట్రిక్‌ విజయంపై ధీమాతో ఉండగా.. కేసీఆర్ ను గద్దె దించుతామన్న ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. అయితే  ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల ఫలితాలు, సభలకు జనసమీకరణ,  మౌత్ టాక్, ప్రచారంలో పద్దతులను చూస్తే కాంగ్రెస్ ఒకింత ముందంజలో ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  సాక్షాత్తు బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ కు అనుకూలం అనే టాక్ నిజమే అని ఒప్పుకుంటూనే  అయితే అది కాంగ్రెస్ పార్టీ  స్ప్రెడ్ చేస్తున్న  టాక్ అంటూ కొట్టిపారేశారు.

         *మరి అసలు* కనీసం పోటీకి అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే అనుకున్న పార్టీ ఇప్పుడు ఈ స్థాయిలో ఇలా పుంజుకోవడం ఎలా సాధ్యమైంది? ఆరు నెలల ముందు కూడా  పోటీ  బీఆర్ఎస్, బీజేపీల మధ్యే అంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు. కానీ ఇంతలోనే పరిస్థితి ఎలా మారిపోయింది. ఇప్పుడు బీజేపీని పక్కకి నెట్టేసి అధికారం దక్కించుకునే స్థాయికి కాంగ్రెస్ ఎలా ఎదిగింది? ఇది బీఆర్ఎస్ తప్పిదమా.. కాంగ్రెస్ నేతల ఛరిస్మానా?  లేక వ్యూహకర్తల ప్రణాళికలా?. పనిగట్టుకొని దెబ్బతీసినా మళ్ళీ ఈ స్థాయికి కాంగ్రెస్ ఎలా చేరుకోగలిగింది? తొమ్మిదేళ్లు అధికారాన్ని అనుభవించి సకల వనరులను కూడగట్టుకున్న కేసీఆర్ ను.. చితికిపోయింది, ఇక పుంజుకోవడం కష్టం అనే పరిస్థితికి పడిపోయిన కాంగ్రెస్ పడి లేచిన కెరటంలో మారి ఇలా   ఎలా ఢీ కొడుతోంది?  గత ఎన్నికలలో 46 శాతం ఓటింగ్ దక్కించుకున్న బీఆర్ఎస్ ను, 28 శాతం ఓటింగ్ మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎలా టెన్షన్ పెడుతోంది?  కనీసం సీఎం ఎవరో కూడా చెప్పలేని కాంగ్రెస్.. బీఆర్ఎస్ కు ఓటమి భయం ఎలా పరిచయం చేసింది?  ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఎక్కడ విన్నా ఇదే చర్చ జరుగుతోంది.

      *అయితే* కాంగ్రెస్ తెలంగాణలో ఈ స్థాయికి రావడం వెనక అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటూ దూసుకొచ్చింది. కర్ణాటక గెలుపు ఇచ్చిన జోష్ తో తెలంగాణలో రాజకీయం మొదలు పెట్టిన కాంగ్రెస్ ముందుగా బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది.  అధికారం కాంగ్రెస్‌దే అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయింది. చెల్లాచెదురైన పాత నేతలను మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో కాంగ్రెస్ నేతలు ఎలాంటి భేషజాలకు పోకుండా  మెట్టు ఎదిగారు. అలాగే ముందు నుండి వ్యూహాత్మకంగా కేసీఆర్‌కు గెలుపుపైన ధీమా ఉంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేందరికీ సీట్లు ఇవ్వాలని ఛాలెంజ్‌ చేసి.. బీఆర్ఎస్ లో ఎక్కువ శాతం సిట్టింగులకే సీట్లు దక్కలే చేశారు. ఆ తర్వాత సిట్టింగులపై ప్రజలలో అసంతృప్తిని రెచ్చగొట్టారు. అన్నిటికీ మించి ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కాంగ్రెస్ మార్క్ పాత ముతక ప్రచారాన్ని పక్కనపెట్టి కొత్త కొత్త పద్దతులతో, ప్రజలను ఆకట్టుకొనేలా ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలుగా కనిపిస్తున్నది.

       *ఇక కాంగ్రెస్ ఈ స్థాయికి రావడం వెనక...* కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ కృషి పట్టుదలా కూడా ఒక కారణం. అలాగే బీఆర్ఎస్ తప్పిదాలు కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. సరిగ్గా అభ్యర్థుల జాబితా విడుదల చేసే సమయానికి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. కీలకమైన ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు వరకూ కూడా కేసీఆర్‌ అందబాటులో లేరు. దీంతో పార్టీలో చాలా వెలితి కనిపించింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ రాష్ట్ర మూలమూలాలకి వెళ్లి ప్రణాళికలు అమలు చేసింది. తీరా కేసీఆర్ వచ్చేసరికి కాంగ్రెస్ పై పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇక ఎన్నికలు వస్తున్నాయని తెలిసినా ఉద్యోగుల డీఏ, రైతుబంధు బ్యాలెన్స్ వంటివి బీఆర్ఎస్ విడుదల చేయలేదు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ నుండి సెప్టెంబర్ లో విద్యార్థిని ఆత్మహత్య వరకూ వివిధ సందర్భాలలో బీఆర్ ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి. ఈ విషయం  ప్రజలలోకి  బలంగా వెళ్లింది. చివరిగా చెప్పుకుంటున్నా ప్రధాన కారణం మాత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ కేసీఆర్ మౌనం,   కేటీఆర్  వ్యాఖ్యలు కూడా సీమాంధ్ర ఓటర్లలో బీఆర్ఎస్ పై పూర్తి స్థాయిలో వ్యతిరేకతను పెంచాయి. ఒక్క సీమాంధ్రులలో అనే కాదు.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలూ కూడా  కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుప్టాయి. అటువంటి వారందరినీ కాంగ్రెస్ కు చేరువ చేశాయి. కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎన్నికల ప్రచారం చేయాల్సిన దుస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ఏ స్థాయిలో బీఆర్ఎస్ ను  డిఫెన్స్ లోకి నెట్టేసిందో అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

బీజేపీ మ్యానిఫెస్టో*

 *బీజేపీ మ్యానిఫెస్టో*


1 వరి గిట్టు బాటు ధర rs3100       

2. ప్రతినెలా 1 న జీతాలు, ఫెన్షన్లు  

3. నిరుద్యోగులకు 6నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండరు      

4. ఉచిత పంట భీమా                      

5. పేదలందరికి ఉచిత ఇల్లు, ఇంటి స్థలాలు                                          6.విద్యార్థులకు రీఎంబర్స్ మెంట్ పెంపు, సకాలమున అందజేత      

7. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు                                    

8. రైతులకు ఏటా విత్తనా  సహాయం rs 2500                     9. పేదలకు 4సిలిండర్లు ఉచితం      

10 ఉచిత విద్య వైద్యం

Saturday, 25 November 2023

కేసీఆర్‌ సర్కార్‌కు చుక్కలు చూపించింది శిరీష:బర్రెలక్:

 నేను మీ బర్రెలక్కను


అంటూ నిత్యం సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లను, తన ఫాలోవర్లను పలకరిస్తుంది శిరీష. కేవలం ఒక్క వీడియోతో కేసీఆర్‌ సర్కార్‌కు చుక్కలు చూపించింది శిరీష.


ఎంత చదివినా సర్టిఫికెట్లు మాత్రమే వస్తాయి.. నోటిఫికేషన్లు రావు.. అందుకే నేను మా అమ్మను అడిగి నాలుగు బర్రెలు కొనుక్కున్న.. రోజుకు రూ300 సంపాదన గ్యారెంటీ.. బంగారు తెలంగాణలో చదువుకోవడం కన్నా బర్రెలు కాసుకోవడం నయం అంటూ చేసిన వీడియో సంచలనంగా మారింది. బర్రెలక్కగా ఫేమస్‌ అయిన ఈ శిరీష టాక్‌ ఆఫ్‌ తెలంగాణ ఎలక్షన్స్‌గా మారింది.


పోలీసులు సుమోటో కేసు..


ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన శిరీష దళిత బిడ్డ. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శిరీష చేసిన వీడియో సోషల్‌ మీడియాను ఒక ఊపు ఊపింది. అటూ ఇటూ తిరిగి ఈ వీడియో తెలంగాణ సర్కార్‌ కంట పడింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయించుకునేందుకు శిరీష కోర్టుల చుట్టూ తిరుగుతోంది. కానీ ఎంత ప్రయత్నించినా కేసులు కొట్టుడు పోలేదు.


ఎన్నికల్లో నామినేషన్‌..


కేసు కొట్టివేయించుకునేందుకు శిరీష చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో విసిగిపోయిన శిరీష తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసింది. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో శిరీష మరింత ఫేమస్‌ అయింది. ఆడపిల్ల, దళిత బిడ్డ అయి ఉండి కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తీరును సోషల్‌ మీడియాలో నిరుద్యోగులు, వివిధ పార్టీలన నేతలు వైరల్‌ చేస్తున్నారు.


ఇంటర్వ్యూకు క్యూ కడుతున్న మీడియా..


ఇక నామినేషన్ల ఉప సంహరణ పూర్తి కావడం, కొల్హాపూర్‌ బరిలో బర్రెలక్క నామినేషన్‌ ఉప సంహరించుకోకపోవడంతో ఇప్పుడు మీడియా దృష్టి అంతా ఆమెపై పడింది. శిరీష ఇంటర్వ్యూ కోసం యూట్యూబ్‌ చానెళ్లతోపాటు మెయిన్‌ స్ట్రీం మీడియా కూడా శిరీష ఇంటికి క్యూ కడుతోంది. ఇంటర్వ్యూలతోపాటు తన ఇన్‌స్ట్రాగ్రాం ఖాతాలో కూడా శిరీష ఒకటే విషయం చెబుతున్నారు. తాను

ఎన్నికల్లో ప్రచారం చేసుకోలేనని, ప్రధాన పార్టీల అభ్యర్థులకు తగినట్లుగా ప్రచారం చేసేంత డబ్బు తనవద్ద లేదని చెబుతోంది. నిరుద్యోగులు, యువకులు ఆలోచించి ఓటు వేయాలని కోరుతోంది. దీంతో కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీ.. ఇప్పుడు బర్రెలక్కకు వస్తోంది.


తాజాగా పాట..


ఇక బర్రెలక్క ఇనస్ప్రెషన్‌తో ఓ పాటను కూడా రాసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఈ పాట కూడా దుమ్ము రేపుతోంది. బర్రెలక్క ధైర్యం చూడరా.. పాలకులకు బుద్ధి చెప్పరా అంటూ సాగిన పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. మరోవైపు కొల్హాపూర్‌ అభ్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఫ్రీ పబ్లిసిటీతోపాటు, యువత ఆలోచనలో పడడంతో ఓటర్లు ఎన్నికల నాటికి ఏం చేస్తారో అని ఆందోళన చెందుతున్నారు. శిరీష కొల్హాపూర్‌ అభ్యర్థుల గెలుపు ఓటములను మార్చుడం ఖయం అని విశ్లేషకులు కూడా అంటున్నారు.

చిన్న హోటలతో పోషిస్తున్న తల్లి..

ఇక శీరిష తండ్రి చిన్నప్పుడే వదిలేసి పోయాడు. దీంతో తల్లి తన ముగ్గురు ఆడపిల్లలను పోషిస్తోంది. చిన్న హోటల్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి శిరీష చిన్న వీడియో పెట్టినందుకు పోలీసులు కేసు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న విజిల్‌ గుర్తు..


ఇదిలా ఉంటే.. కొల్హాపూర్‌ బరిలో ఉన్న శిరీషకు ఎన్నికల సంఘం విజిల్‌ గుర్తు కేటాయించింది. ఇప్పుడు ఈ విజిల్‌ సౌండ్‌ అక్కడి నుంచి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీటల అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులు లక్షల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తుంటే.. బర్రెలక్కకు మాత్రం ఫ్రీగా పబ్లిసిటీ వస్తోంది. సోషల్‌ మీడియాలో శిరీష పోస్టు చేస్తున్నవీడియోలకు నిత్యం వేల వ్యూస్‌ వస్తున్నాయి. అభ్యర్థుల సోషల్‌ మీడియా

ఖాతాల్లో వారిని పలకరించిన వారే లేరు. వీరికి వెయ్యి వ్యూస్‌ కూడా రావడం లేదు.


ఓటు లేదని బాధపడుతున్న నెటిజన్లు..


ఇక శిరీష పాపులారిటీ ఏ రేంజ్‌కు చేరిందటే.. ఆమె సోషల్‌ మీడియా ఫాలోవర్లు మిలియన్లకు చేరాయి. నిత్యం ఆమె పోస్టు చేస్తున్న వీడియోలపై వేల మంది స్పందిస్తున్నారు. తమకు ఓటు కొల్హాపూర్‌లే లేదని చాలా మంది బాధపడుతున్నారు. శిరీష గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. కొల్హాపూర్‌ ఓటర్లంతా శిరీషను గెలిపించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఫాలోవర్లంతా ఓటర్లు కాకపోవడంతో బాధపడుతున్నారు.


బర్రెలక్క లాంటి చైతన్యవంతులు చదువుకున్న విద్యావంతులు నేటి సమాజానికి చాలా అవసరం

Friday, 24 November 2023

OC లు BJP కి ఎందుకెయ్యాలి...!!??

 సూటిగా...సుత్తి లేకుండా..


OC లు BJP కి ఎందుకెయ్యాలి...!!??....EWS రిజర్వేషన్లు తెచ్చింది కాబట్టి...


BC లు BJP కి ఎందుకెయ్యాలి...!!??....మొట్ట మొదటి BC ముఖ్యమంత్రిని చేస్తా అని మాటిస్తున్నది కాబట్టి...


SC లు BJP కి ఎందుకెయ్యాలి...!!??....SC వర్గీకరణ చేస్తా అని మాటిచ్చింది కాబట్టి....


హిందువులు  BJP కి ఎందుకెయ్యాలి...!!??....దశాబ్దాల కల అయిన రామాలయం నిర్మించింది,మత ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లు తీసేస్తా అని అంటుంది కాబట్టి....


రైతులు  BJP కి ఎందుకెయ్యాలి...!!??....వరి కి మద్దతు ధర పెంచుతా అని అంటున్నది... పసుపు బోర్డ్ ఇచ్చింది కాబట్టి...


బీదలు BJP కి ఎందుకెయ్యాలి...!!??....ఉచిత రేషన్ ఇస్తున్నది,దాని గడువు పెంచింది కాబట్టి....


మతాలకు అతీతంగా  BJP కి ఎందుకెయ్యాలి...!!??...గత పదేండ్లలో దేశంలో పెద్దగా అల్లర్లు,బాంబ్ దాడులు లేకుండా శాంతి భద్రతలను కాపాడుతున్నది కాబట్టి....


జై హింద్..జై భారత్.....!!

Friday, 17 November 2023

నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాలకు ర్యాండ మైజేషన్ ద్వారా అధనపు బ్యాలెట్ యూనిట్ల కేటాయింపు# :జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

 నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాలకు ర్యాండ మైజేషన్ ద్వారా 

 అధనపు బ్యాలెట్ యూనిట్ల కేటాయింపు#
:జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా  కలెక్టర్ ఆర్.వి. కర్ణన్




శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల
సమక్షంలో నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ నియోజక వర్గాలకు  అదనపు బ్యాలెట్ యూనిట్ ల కేటాయింపు ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించినట్లు  జిల్లా ఎన్నికల అధికారి ,జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ తెలిపారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ద్వారా బ్యాలెట్ యూనిట్లు నల్లగొండ 355, నకిరేకల్ 381, దేవరకొండ 385, మునుగోడు 383, నాగార్జున సాగర్ 373, మిర్యాలగూడ 328 యూనిట్ల చోప్పున పంపిణి చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

నవంబర్ 15న జరిగిన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాలలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారని,జిల్లా కేంద్రం ఈ .వి.యం గోదాం లో ఎఫ్.ఎల్.సి.పూర్తి చేసి రిజర్వ్ లో ఉన్న బి.యు.లను  ర్యాండమైజేషన్ ను నిర్వహించి నకిరేకల్ నియోజక వర్గానికి
382, మిర్యాలగూడ నియోజక వర్గానికి,
 330, నల్లగొండ నియోజకవర్గానికి
355 
బ్యాలెట్ యూనిట్ లను అదనంగా కేటాయించడం జరిగిందని తెలిపారు.  ర్యాండమైజేషన్ అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవియం గోడౌన్ లో స్కాన్ చేసి  ర్యాండమైజేషన్  క్రమ సంఖ్య అధారంగా వేరు చేసి  నియోజక వర్గాల పంపిణి కి అర్. ఓ.లకు అప్పగించినట్లు తెలిపారు.
  
ఈనెల 18వ తేదీన మునుగోడు నియోజకవర్గం మినహా మిగతా (5) నియోజకవర్గాల లో అబ్జర్వర్లు, పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రెండవ దశ ర్యాoడమైజేషన్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధిలు పిచ్చయ్య (బిఆర్ఎస్), లింగస్వామి (బిజెపి), నర్సిరెడ్డి (సిపిఎం), అశోక్ (కాంగ్రెస్), యాదగిరి (బీఎస్పీ), షేక్ మొయిన్ (ఎంఐఎం) కలెక్టరేట్ ఏవో మోతిలాల్, ఎలక్షన్ డిటీ విజయ్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
 
 

Thursday, 16 November 2023

నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణి సబిత వెంకట్ రెడ్డి

                                     ......నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి సబిత వెంకట్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు నల్లగొండ పట్టణంలోని 10వ వార్డు నీలగిరి కాలనీలో ప్రచారం చేస్తున్నారు.                                .   ....... నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణి సబిత వెంకట్ రెడ్డి





ఈరోజు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Tuesday, 14 November 2023

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి సబిత వెంకట్ రెడ్డి, కూతురు శ్రీనిధి పట్టణంలోని 32 వ వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం

నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి సబిత వెంకట్ రెడ్డి, కూతురు శ్రీనిధి పట్టణంలోని 32 వ వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం









నిర్వహిస్తున్నారు. న్యూ తిరుమలగిరి కాలనీ అనంతరం మీర్ బాగ్ కాలనీలో ప్రచారం కొనసాగుతుంది.

నవంబర్ 30 న పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అర్.వి.కర్ణన్*

 నవంబర్ 30 న  పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు:

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అర్.వి.కర్ణన్*

------------------------
 
 రాష్ట్ర శాసన సభ కు జరుగనున్న సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 
నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ  కార్యాలయాలు, విద్యా సంస్థలకు  నవంబర్ 30 న పోలింగ్ రోజున
నెగోషియే బుల్ ఇన్స్ట్రు మెంట్ ఆక్ట్ 1881(సెంట్రల్ ఆక్ట్ xxvl 1881) కింద్ర 
 వేతనంతో కూడిన ప్రభుత్వ సెలవును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అర్.వి.కర్ణన్   ఉత్తర్వులు జారీ చేశారు.
పోలింగ్ కు ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు చేసేందుకు గాను
పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కళాశాలలకు నవంబర్ 29 న కూడా వేతనం తో కూడిన సెలవు ప్రకటించారు.

Monday, 13 November 2023

విద్యార్హతపై మంత్రి మల్లారెడ్డి తడబాటు


 : మంత్రి మల్లారెడ్డి తన నామినేషన్ అఫిడవిట్‌లో ఇంటర్ విద్యాభ్యాసం వివరాలను తప్పుగా చూపించిన తీరు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో 1973లో ప్యాట్నీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివినట్లుగా మల్లారెడ్డి పేర్కోన్నారు. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో వెస్లీ కాలేజీలో ఇంటర్ చదివినట్లుగా చూపారు. తాజాగా 2023ఎన్నికల్లో రాఘవ లక్ష్మిదేవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివినట్లుగా పేర్కోన్నారు. మూడు ఎన్నికలలో సమర్పించిన అఫిడవిట్‌లలో వేర్వేరు కళాశాలల్లో ఇంటర్ చదివినట్లుగా మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లుగా దాయారాకు చెందిన అంజిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశా.

Sunday, 12 November 2023

కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు స్థానిక అరబీ మదర్సా బైతుల్ ఉలూమ్ నిర్వాహకులు మౌలానా అథర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు.

 కాంగ్రెస్ పార్టీ  సూర్యాపేట  అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు   స్థానిక  అరబీ  మదర్సా  బైతుల్ ఉలూమ్  నిర్వాహకులు మౌలానా అథర్   గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు.


Friday, 10 November 2023

ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను ఎందుకు కడతారో తెలుసా?

 ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను ఎందుకు కడతారో తెలుసా?

ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా? మామిడి ఆకులతో పాటు, బంతి పువ్వులు కాంతి, ప్రకాశాన్ని సూచిస్తూ సూర్య భగవానుడికి చిహ్నాలుగా భావిస్తారు

                    హిందూవుల ఇంట్లో పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మామిడి తోరణాలు కడుతుంటారు. ఇలా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం పూర్వం కాలం నుంచి వస్తోన్న ఆచారం. కేవలం ఇంటి గుమ్మానికే కాకుండా పండగ వాతావరణంలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు, గుళ్లు, ఆలయాల దగ్గర మామిడి తోరణాలు కడుతుంటారు.

            మామిడి ఆకులు, బంతి పువ్వులు, 'తోరణం' లేదా అలంకరణను రూపొందించడానికి ఉపయోగించినప్పుడు, స్వచ్ఛత, పవిత్రతను సూచిస్తాయి. పూజా ఆచారాల తర్వాత ఇంట్లో ప్రధాన ద్వారం, ఇతర గుమ్మంపై మామిడి ఆకులను కడతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులను బయటకు పంపి సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. ఆ ఇంటికి ఆనందం, శ్రేయస్సు , సామరస్యాన్ని తీసుకువస్తుంది.

                                మామిడి ఆకులకు హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆరాధన,  పౌరాణిక విశ్వాసాలలో లోతుగా పాతుకుపోయింది. వేడుకలతో సంబంధం లేకుండా వైదిక ఆచారాలలో ముఖ్యమైన భాగంగా మారాయి. మామిడి చెట్టును కల్ప వృక్షంగా భావిస్తారు. ఇది దైవిక సారాన్ని కలిగి ఉందని నమ్ముతారు. కలశాన్ని తయారు చేయడంలో మామిడి ఆకులు ముఖ్యభూమిక పోషిస్తాయి. ఇలా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానించడంతోపాటు ఆ ఇంట్లో సుఖ సంతోషాలను ప్రోత్సహిస్తుంది. శాస్త్రీయ దృక్కోణంలో, మామిడి ఆకులు పర్యావరణ శుద్దీకరణకు దోహదం చేస్తాయి.  కార్బన్ డయాక్సైడ్ను సమర్థవంతంగా గ్రహిస్తాయి.


అదేవిధంగా మామిడి ఆకుల వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే పూర్వకాలంలో బావిలోకి దిగి బావిని శుభ్రం చేసే ముందు ఒక పెద్ద మామిడి కొమ్మను ఆ బావిలో వేసి చుట్టూ కాసేపు తిప్పి ఆ తర్వాత ఆ బావిలోకి దిగి శుభ్రం చేసేవారట. ఎందుకంటే అలా తిప్పడం వల్ల ఆ బావిలో ఉన్న విషవాయువులు అన్నీ తొలగిపోతాయని నమ్మే వారు. అలాగే పచ్చి మామిడి తోరణాలను ఇంటికి అలంకరించడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవితోపాటు సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. అంతేకాదు ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని చాలా మంది భావిస్తుంటారు. 

                            ఇక బంతి పువ్వులు సూర్య భగవానుడికి చిహ్నాలుగా భావిస్తారు. ఈ పువ్వులు  కాంతి, ప్రకాశాన్ని కలిగి ఉంటాయి. సంస్కృతంలో, వాటిని 'స్థలపుష్ప' అని పిలుస్తారు.  వివిధ దేవతల ఆరాధనలో అంతర్భాగం. బృహస్పతి గ్రహంతో బంతి పువ్వుల అనుబంధం ఇంటిని సానుకూల శక్తితో నింపుతుందని, ఆనందం, శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని నమ్ముతుంటారు. వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు మించి, బంతి పువ్వులు శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.  వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. వాటి సువాసన ద్వారా శాంతిని ప్రోత్సహిస్తాయి. క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. పరిశుభ్రమైన,  ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదం చేస్తాయి.

: టీ పదేపదే వేడి చేసి తాగుతున్నారా? అది చాలా డేంజర్

            


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు. 82 ఏళ్ల వయసు ఉన్న ఆయన హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు.

 


తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు. 82 ఏళ్ల వయసు ఉన్న ఆయన హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు.

గుండెపోటుతో నటుడు చంద్రమోహన్ కన్నుమూత.. అంత్యక్రియలు ఎప్పుడంటే?
గుండెపోటుతో నటుడు చంద్రమోహన్ కన్నుమూత.. అంత్యక్రియలు ఎప్పుడంటే?

Actor Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు చికిత్స పొందుతూ కన్ను మూశారు. అపోలో ఆస్పత్రిలో చంద్రమోహన్ గుండెపోటు కారణంగా చేరినట్లు తెలుస్తోంది. ఆయనకు వయసు 82 ఏళ్లు కాగా భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి.

Thursday, 9 November 2023

నల్లగొండ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేశారు

 నల్లగొండ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేశారు


.

ఈ సందర్భంగా పట్టణ నాయకులు జయప్రకాష్, మిర్యాల మహేష్ ,కొప్పు చేతన్ గౌడ్ , వారిని కలిసి తమ మద్దతును తెలియజేశారు.

Tuesday, 7 November 2023

బైండోవర్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తికి లక్ష రూపాయల జరిమానా* :జిల్లా యస్.పి కె.అపూర్వ రావు

*బైండోవర్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తికి లక్ష రూపాయల జరిమానా* 

 *రౌడీ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు* 

 *జిల్లా యస్.పి కె.అపూర్వ రావు


IPS* 


తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణం లో ప్రజలు ఓటు హక్కు వినియోగంచుకునటకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తూ శాంతి భద్రతల విఘాతం కలిగించే వారి పట్ల ఎప్పడికప్పుడు నిఘా పెడుతూ జిల్లాలో పాత నేరస్థులు, రౌడీ షీటర్లు,గత ఎన్నికల్లో శాంతి భద్రతల విఘాతం కల్గించి పలు కేసులలో ఉన్న  వారిని ఇప్పటికే బైండోవర్    చేసినప్పటికీ మిర్యాలగూడ ఒకటవ పట్టణ పరిధిలో గల గాంధీ నగర్ కి చెందిన రౌడీ షీటర్ ఇంజమూరి కొండల్ అనే వ్యక్తిని ఎన్నికల నిబంధనల ప్రకారం  బైండవర్ చేసిన మరుసటి రోజే నిబంధనలను అతిక్రమించి అదే కాలనీకి చెందిన సాయి అనే వ్యక్తి పై  దాడి చేయగా బాధితుడి పిర్యాదు మేరకు నిందితుడు కొండల్ పైన మిర్యాలగూడ ఒకటవ పట్టణ సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి బైండవర్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను రెండవ సారి మిర్యాలగూడ తహాసిల్దర్ హరిబాబు గారి ముందు హాజరు పరచగా నిందితునికి  ఒక లక్ష రూపాయల జరిమానా విధించడం జరిగిందని యస్.పి గారు తెలిపారు.

  *నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు  జిల్లా యస్.పి*

  ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణం ప్రజలు ఓటు హక్కు వినియోగంచుకునుటకు జిల్లా పోలీస్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎవరైనా ఎన్నికల నిబంధనలను అతిక్రమించి శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  బైండోవర్ నిబంధనలు అతిక్రమిస్తే లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు జరినమా గానీ ఒక సంవత్సరంపాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని అన్నారు.ఎవరైన రౌడీ కార్యకలపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే డైయల్ 100 గానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగలరు తెలిపారు.

Friday, 3 November 2023

తొలి రోజు వంద నామినేషన్లు దాఖలు

 తొలి రోజు  వంద నామినేషన్లు దాఖలు





10వ తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉండవు*



*10వ తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉండవు*


ఇకపై కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 36 ఏళ్ల తర్వాత కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తోంది.


కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త విధానం ప్రకారం కొత్త విద్యా విధానం 2023కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త విద్యా విధానంలోని అతి ముఖ్యమైన ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి:


5 సంవత్సరాల ప్రాథమిక విద్య


1. నర్సరీ @ 4 సంవత్సరాలు


2. Jr KG @ 5 సంవత్సరాలు


3. Sr KG @ 6 సంవత్సరాలు


4. 1వ స్టడీ @ 7 సంవత్సరాలు


5. 2వ స్టడీ @ 8 సంవత్సరాలు


మూడు సంవత్సరాల ప్రిపరేటరీ


6. 3వ తరగతి @ 9 సంవత్సరాలు


7. 4వ తరగతి @10 సంవత్సరాలు


8. 5వ తరగతి @11 సంవత్సరాలు


మూడు సంవత్సరాలు మిడిల్


9. 6వ తరగతి @ 12 సంవత్సరాలు


10. 7వ తరగతి @ 13 సంవత్సరాలు


11. 8వ తరగతి @ 14 సంవత్సరాలు


నాలుగేళ్ల సెకండరీ


12. 9వ తరగతి @ 15 సంవత్సరాలు


13. స్టడీ SSC @ 16 సంవత్సరాలు


14. స్టడీ FYJC @17ఇయర్స్


15. స్టడీ SYJC @18ఇయర్స్


10వ తరగతికి బోర్డు పరీక్షలు లేవు. 5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష, స్థానిక భాష, జాతీయ భాషలలో మాత్రమే బోధన ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులు, ఇంగ్లీష్ అయినా సబ్జెక్టుగా బోధిస్తారు. ఇంతకుముందు 10వ బోర్డ్ పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి, అది ఇప్పుడు రద్దు అయ్యింది.


9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సెమిస్టర్ వారీగా పరీక్ష జరుగుతుంది. పాఠశాల విద్యను 5+3+3+4 ఫార్ములా కింద బోధిస్తారు. కళాశాల డిగ్రీ 3, 4 సంవత్సరాలు ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో సర్టిఫికేట్, రెండవ సంవత్సరంలో డిప్లొమా, మూడవ సంవత్సరంలో డిగ్రీ ఉంటుంది.


ఉన్నత విద్యను అభ్యసించకూడదనుకునే విద్యార్థులకు 3 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు 4 సంవత్సరాల డిగ్రీ కోర్సును అభ్యసించవలసి ఉంటుంది. 4 సంవత్సరాల డిగ్రీ చదివిన విద్యార్థులు ఒక సంవత్సరంలో MA చేయగలుగుతారు. MA విద్యార్థులు ఇప్పుడు నేరుగా PhD చేయగలుగుతారు.


విద్యార్థులు మధ్యలో ఇతర కోర్సులు చేయగలుగుతారు. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2035 నాటికి 50 శాతం ఉంటుంది. మరోవైపు, కొత్త విద్యా విధానం ప్రకారం, ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరో కోర్సు చేయాలనుకుంటే, అతను/ఆమె ఒక కోర్సు తీసుకున్న తర్వాత రెండో కోర్సు చేయవచ్చు. పరిమిత సమయం వరకు మొదటి కోర్సు నుంచి విరామం పొందవచ్చు.


ఉన్నత విద్యలో అనేక ఇతర సంస్కరణలు కూడా ప్రతిపాదించారు. సంస్కరణల్లో గ్రేడెడ్ అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ అటానమీ మొదలైనవి ఉన్నాయి. ఇది కాకుండా, ప్రాంతీయ భాషలలో ఇ-కోర్సులు ప్రారంభిస్తారు. వర్చువల్ ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తారు.


నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఫోరమ్ (NETF)ని ప్రారంభిస్తారు. దేశంలో ఇప్పటి వరకు 45 వేల కాలేజీలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ సంస్థలకు ఏకరూప నియమాలు ఉంటాయి..

     ఇది ప్రభుత్వ నిర్ణయం

    ....ఉచిత విద్య వైద్య సాధన సమితి

Thursday, 2 November 2023

ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు.

 


ఎన్నికల ప్రవర్తన నియమావళి  పకడ్బందీగా అమలు.

నవంబర్ 3 వ తేదీ నుండి మరింత నిఘా పెంపు 

హైదరాబాద్ నవంబర్2:- నవంబర్ ,3 వ తేదీ నుండి నియోజక వర్గంలో మరింత నిఘా బృందాలు పనిచేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ తెలిపారు.

ఇప్పటికే జిల్లాలో అక్రమంగా విపరీతంగా   నగదు, బంగారం ఇతర అభరణాలు, ప్రవాహాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ లు,   ఒక వైపుమరోకవైపు పోలీస్ శాఖ తనిఖీలు, ఇంకొక వైపు ఇతర  ప్రాంతాలనుండి వచ్చే ఆ క్రమంగా నగదు, వివిధ రకాల ఆభరణాలు,   నిరోధించెందకు   18 చెక్ పోస్ట్ ల ఏర్పాటుచేశారు.

మనీ మేనేజ్మెంట్ సంస్థల ను కూడా నగదు ప్రవాహం  తనిఖీ చేసేందుకు  వాహనాలకు    జి పి యస్ సిస్టమ్ అమర్చి ఎప్పటి కప్పుడు పరిశీలన,      మద్యం షాపులు వద్ద కూడా   అక్రమ రవాణా తగ్గించేందుకు  సి సి కెమెరా అమర్చి జి హెచ్ ఏం సి కార్యాలయం నుండి   కమాండ్ కంట్రోల్ రూం ద్వారా  ఎప్పటి కప్పుడు పరిశీలన చేస్తున్నారు అంతేకాకుండా.ఫ్లయింగ్ స్క్వాడ్,     చెక్ పోస్ట్,  వద్దకుడ సి సి కెమెరా  లను పేట్టి జి హెచ్ ఏం సి కార్యాలయం నుండి    పరిశీలన. జేసీ అక్కడ తప్పులను  సరిదిద్ది సక్రమంగా చేసేందుకు ఎప్పటికప్పుడు  పరిశీలన  చేసి జిల్లా ఎన్నికల అధికారి తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నారు  ఈ  నేపథ్యంలో  నగదు ఆభరణాలు, మద్యం, మరక ద్రవ్యాలు,  పట్టుకొని సీజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో  45 కోట్ల 89 లక్షల రూపాయల విలువ గల  సొత్తును పట్టుకున్నారు 

మీ

ఈ నేపథ్యంలో  హైదరాబాద్ జిల్లా లోని 15 నియోజక వర్గంలో  నవంబర్ 3 వ తేదీ నుండి.      నామినేషన్ లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో  ఆ రోజు నుండి స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ టీమ్ ల ను  నియోజక వర్గం వారీగా ఏఒక్కొక్క నియోజక వర్గం లో 9 టీమ్ లను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పని చేసే విధంగా సిబ్బందిని నియిచడం జరిగింది ప్రతి నియోజక వర్గం లో  వేర్వేరు ప్రదేశాలలో స్టాటిస్టిక్స్ సర్వే లెస్ టీమ్ లను పని చేస్తూ అక్రమంగా ప్రవహిస్తున్న నగదు, ఆభరణాలు, మద్యం మత్తు పదార్థాల లైనా, గంజాయి,  డ్రగ్స్ పట్టుకునేందుకు ఈ టీమ్ ల నిఘా చేస్తుంది.

ఈ నేపథ్యంలో   రాజకీయ పార్టీలకు సంబంధం లేని నగదు, ఆభరణాలు,    సీజ్ చేసిన వాటిని ప్రజలకు ఇబ్బంది కలగ  కుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా పిర్యాదు ల కమిటీ ఏర్పాటు చేసి తద్వారా   వెంటనే  విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటారు.

 హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూధన్ అధ్యక్షతన  ప్రతి రోజు కమిటీ నిర్ణయం మేరకు విడుదల చేస్తారు. ఇప్పటి వరకు ఈ కమిటీ ద్వారా  177 కేసులకు గాను 154 కేసుల పరిశీలన జరిపి మొత్తం5. 42కోట్ల రూపాయలను విడుదల చేశారు.

17కేసులు 10 లక్షంలు దాటిన  ఐటి శాఖ కు పరిశీలన కోసం పంపించారు.

ఇప్పటివరకు పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా    ఈ రోజు 53లక్షల 23 వేల 960 రూపాయలను సీజ్ చేశారు.మరియు పోలీస్ శాఖ 

485 మంది పై  కేసులు నమోదు చేశారు. 4541 ఆయుధాలను సేకరించడం జరిగినది. 2093 మందిని బైండోవర్ చేశారు 1229  నాన్ బెయిలబుల్ వారంట్  జారీ చేశారు. మొత్తానికి  హైదరాబాద్ నగరం లో జిల్లా ఎన్నికల అధికారి   రోనాల్డ్ రాస్     ఎన్నికల నియమావళి నీ పకడ్బందీగా అమలుకు ప్రతిష్టమైన చర్యలు గైకొన్నారు...

వైన్ షాపుల నుండి కొనుగోలు చేసిన మద్యం సరైనదా, కాదా తెలుసుకొనుటకు VERIT మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేసి తెలుసుకోవచ్చు.బి. సంతోష్ హిబిషన్ & ఎక్సైజ్ అధికారి, నల్గొండ.

 ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా, సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ-2023 సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయుటకు ఎక్సైజ్ శాఖ చాలా జాగరూకత తో పనిచేస్తుంది.  ఇట్టి విషయమై ప్రజలను మరింత అప్రమత్తం చేయుటకు, మరియు కల్తీ మద్యం / అక్రమ మద్యం సరఫరా, నిల్వల గురించి ప్రజల నుండి పిర్యాదులు / సమాచారం తీసుకొనుటకు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ *1800 425 2523* కు, మరియు నల్గొండ జిల్లా పరిది లో పిర్యాదులు / సమాచారం తీసుకొనుటకు జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి కార్యాలయం, నల్గొండ నందు గల  కంట్రోల్ రూం నంబర్ *08682-224271*  కు కాల్ చేసి తెలుపవలసినదిగా కోరనైనది. 

అదేవిధంగా వినియోగదారులు, ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా, సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ-2023 సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయుటకు ఎక్సైజ్ శాఖ చాలా జాగరూకత తో పనిచేస్తుంది.  ఇట్టి విషయమై ప్రజలను మరింత అప్రమత్తం చేయుటకు, మరియు కల్తీ మద్యం / అక్రమ మద్యం సరఫరా, నిల్వల గురించి ప్రజల నుండి పిర్యాదులు / సమాచారం తీసుకొనుటకు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ *1800 425 2523* కు, మరియు నల్గొండ జిల్లా పరిది లో పిర్యాదులు / సమాచారం తీసుకొనుటకు జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి కార్యాలయం, నల్గొండ నందు గల  కంట్రోల్ రూం నంబర్ *08682-224271*  కు కాల్ చేసి తెలుపవలసినదిగా కోరనైనది. 
అదేవిధంగా వినియోగదారులు, వైన్ షాపుల నుండి కొనుగోలు చేసిన మద్యం సరైనదా, కాదా తెలుసుకొనుటకు VERIT మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. ఇట్టి యాప్ ద్వారా మద్యం బాటిల్ మూత పై గల హోలోగ్రాం ను స్కాన్ చేయగానే, అట్టి బాటిల్ బ్రాండ్, పరిమాణం, MRP, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, అట్టి బాటిల్ జారీ చేయబడిన డిపో మరియు వైన్ షాప్ పేరు డిస్ ప్లే అవుతుంది. ఒక వేళ అట్టి మద్యం నకిలీ/ అక్రమ మద్యం అయితే ఈ వివరాలేవీ కనిపించవు. ఈ VERIT మొబైల్ యాప్ ను అందరూ Google Play Store ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావున ప్రజలందరికీ ఇట్టి విషయాలను తెలియబరుస్తూ ఏవైనా పిర్యాదులు, అక్రమ మద్యం గురించి సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ *1800 425 2523* కు లేదా నల్గొండ ఎక్సైజ్ కంట్రోల్ రూం నంబర్ *08682-224271*  కు తెలియపరచి, ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహింప బడుటకు సహకరించవలసినదిగా ప్రజలందరినీ కోరనైనది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.

ఇట్లు

*బి. సంతోష్*


 *బి. సంతోష్*ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, నల్గొండ.* . ఇట్టి యాప్ ద్వారా మద్యం బాటిల్ మూత పై గల హోలోగ్రాం ను స్కాన్ చేయగానే, అట్టి బాటిల్ బ్రాండ్, పరిమాణం, MRP, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, అట్టి బాటిల్ జారీ చేయబడిన డిపో మరియు వైన్ షాప్ పేరు డిస్ ప్లే అవుతుంది. ఒక వేళ అట్టి మద్యం నకిలీ/ అక్రమ మద్యం అయితే ఈ వివరాలేవీ కనిపించవు. ఈ VERIT మొబైల్ యాప్ ను అందరూ Google Play Store ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావున ప్రజలందరికీ ఇట్టి విషయాలను తెలియబరుస్తూ ఏవైనా పిర్యాదులు, అక్రమ మద్యం గురించి సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ *1800 425 2523* కు లేదా నల్గొండ ఎక్సైజ్ కంట్రోల్ రూం నంబర్ *08682-224271*  కు తెలియపరచి, ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహింప బడుటకు సహకరించవలసినదిగా ప్రజలందరినీ కోరనైనది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.

ఇట్లు

*బి. సంతోష్*

 *జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, నల్గొండ.* 

జిల్లాలో ఆరు శాసన సభ నియోజక వర్గాలకు జరుగనున్న సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

 


జిల్లాలో ఆరు శాసన సభ  నియోజక వర్గాలకు జరుగనున్న సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు  జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.


గురువారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అపూర్వ రావు తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  జిల్లాలోని ఆరు నియోజకవర్గాల కేంద్రాలైన దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి దేవరకొండ అర్.డి. ఓ  కార్యాలయం లో,నాగార్జున సాగర్ నియోజవర్గం పరిధి లో నిడమ నూర్  తహశీల్దార్ కార్యాలయం లో , నల్లగొండ నియోజక వర్గం పరిధి లో నల్గొండ అర్.డి. ఓ కార్యాలయం లో, మునుగోడు నియోజకవర్గం పరిధి లో చం డర్ తహశీల్దార్ కార్యాలయం లో, నకిరేకల్  లో నకిరేకల్ తహశీల్దార్ కార్యాలయం లో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా నియోజకవర్గ కేంద్రాలలోని రిటర్నింగ్ ఆఫీసులలో ఆర్. ఓ .లు , ఏ.అర్. ఓ లు స్వీకరిస్తారని, తెలిపారు.  అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను నవంబర్ 3 నుండి నవంబర్ 10 వరకు దాఖలు చేయవచ్చని అన్నారు. నామినేషన్లు ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్వోలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయ ప్రాంగణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు తమ వాహనాలను 100 మీటర్ల దూరంలోనే పార్కింగ్ చేయవలసి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఆర్ఓ ఆఫీసుకు నామినేషన్ వేసే అభ్యర్థి  వెంట నలుగురు వ్యక్తులను  మాత్రమే అనుమతిస్తామన్నారు.మూడు వాహనాలు అనుమతించడం జరుగుతుందని  తెలిపారు. ఈనెల 13వ తేదీన నామినేషన్ వేసిన అభ్యర్థుల యొక్క ఫారాలను స్క్రుటిని చేస్తామని తెలిపారు. 15వ తేదీన అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోవాలనుకుంటే చివరి తేదీగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 30వ తేదీన ఉదయము 7 గంటల నుండి సాయంత్రము 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3 తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని అన్నారు. డిసెంబర్ 5వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగిస్తామన్నారు. జిల్లాలో నవంబర్ 1 నాటికి మొత్తం 14,45,855 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1766 పోలింగ్ స్టేషన్లో ఉండగా, పట్టణ ప్రాంతాలలో 356, గ్రామీణ ప్రాంతాలలో 1410 ఉన్నట్లు తెలిపారు. అంతేగాక ప్రతి నియోజకవర్గనికి 5 పోలింగ్ కేంద్రాలు చొప్పున  మొత్తం 30  పోలింగ్ కేంద్రాలు అరు నియోజక వర్గాలలో
మహిళలు నిర్వహిస్తారని , నియోజవర్గం కు 5 చొప్పున మోడల్  పోలింగ్ కేంద్రాలు,నియోజకవర్గం కు  ఒకటి చొప్పున అరు నియోజకవర్గాల్లో అరు పోలింగ్ కేంద్రాలు PWD సిబ్బంది నిర్వహిస్తారని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున  మొత్తం అరు నియోజక వర్గాల్లో 5 పోలింగ్ కేంద్రాల యువత నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ లేదా సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు.  ఇప్పటివరకు మొత్తం జిల్లాలో జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా 206 కేసులకు సంబంధించి  33 కోట్ల 52 లక్షల 11 వేల 930 విలువ గల నగదు లేదా వస్తురూపమైన బంగారం, వెండి, డైమండ్స్ స్వాదీనం 
  కేసులను పరిశీలించి
 అందులో భాగంగా 196 కేసులను పరిశీలించి  6 కోట్ల 35 లక్షల 14 వేల 860 రూ.లు కమిటీ రిలీజ్ చేసినట్లు తెలిపారు
 10 లక్షలకు పైన ఉన్న పది కేసులను మాత్రం ఐటి డిపార్ట్మెంట్కు రిఫర్ చేసినట్లు ఆయన వివరించారు.  ఎన్నికల విధులలో భాగంగా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్, ఎంసీఏంసి కమిటీ, డిస్టిక్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ, పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరు నియోజకవర్గ కేంద్రాలలో ఇప్పటికే మొదటి దశ లో ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రెండవ ట్రైనింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఫామ్ 12 డి ద్వారా 80 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు, కోవిడ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుండి ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఎన్నికల లో భాగంగా ముగ్గురు ఎక్స్పెండిచర్ అబ్జర్వ్ ర్లను జిల్లాకు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు రోహిత్ కుమార్ (ఐఆర్ఎస్), దేవరకొండ, మునుగోడు నియోజక వర్గాలకు సతీష్ గురుమూర్తి (ఐఆర్ఎస్), నాగార్జునసాగర్,మిర్యాలగూడ నియోజకవర్గాలకు డి.ఎం. నిమ్జే (ఐఆర్ఎస్) లను ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లుగా నియమించారు. ఎన్నికలలో ఓటు వేయడానికి ఎపిక్ కార్డు లేదా ఆధార్‌కార్డు, ఉపాధి జాబ్‌కార్డు, పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌ జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌బుక్‌, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్టు, ఫొటోతో కూడిన పింఛన్‌ మంజూరు డాక్యుమెంట్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్డు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, దివ్యాంగుల ఐడెంటిటీ కార్డు, ఏదైనా ఒక గుర్తింపు కార్డులను తీసుకొని పోలింగ్‌ కేంద్రంలో చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ, జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలలో ఆర్వో ఆఫీసుల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు చర్యలను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆమె వివరించారు. నియోజకవర్గ ఆర్ వో ఆఫీస్ లో వద్ద 100 మీటర్ల దూరంలో ఇప్పటికే భారీ గేట్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి డిఎస్పి సాయి అధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ తరపున ఫ్లైయింగ్ స్క్యాడ్ లు, చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీస్ బందోబస్తుకు సెంట్రల్ ఫోర్స్ తో కలిసి పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. అదే విధంగా జిల్లాలో డబ్బు, మద్యం, విలువైన వస్తువుల రవాణాను ఎప్పటికప్పుడు చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు చేసి నిరోధిస్తామన్నారు.ఇప్పటి వరకు జిల్లాలో తనిఖీ బృందాల ద్వారా నగదు,మద్యం,డ్రగ్స్,వస్తువులు,ఆభరణాలు 41 కోట్ల 22 లక్షల 31 వేల 431 రూ.ల విలువ గలని  సీజ్ చేసినట్లు తెలిపారు . లా అండ్ ఆర్డర్ కచ్చితంగా అమలు చేసి ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 ఈ సమావేశంలో DPRO శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, ఎంసీఎంసీ నోడల్ ఆఫీసర్ హరి సింగ్, కలెక్టరేట్ ఏవో మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.