ఆర్.ఎస్.బ్రదర్స్ టీటీడీకి భారీ విరాళాలు
ఆర్.ఎస్.బ్రదర్స్ టీటీడీకి భారీ విరాళాలు
హైదరాబాద్ కు చెందిన ఆర్.ఎస్.బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2,92,91,840 (రూ.2.93 కోట్లు) ను విరాళంగా అందించింది.
అదేవిధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థల ఎండీలు శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు, శ్రీ సీర్న రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు, శ్రీమతి పొట్టి మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు విరాళం డీడీలను అందజేశారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home