Thursday, 20 February 2025

అసంపూర్తిగా ఉన్న చందంపేట గ్రంథాలయ భవనాన్ని పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల మంజూరు

  అసంపూర్తిగా ఉన్న చందంపేట గ్రంథాలయ భవనాన్ని పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సంచాలకులకు ప్రతిపాదనలు పంపించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య


సమావేశం తీర్మానించింది.


     గురువారం అదనపు కలెక్టర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రత్యేక అధికారి జె. శ్రీనివాస్ అధ్యక్షతన తన చాంబర్లో నిర్వహించిన నల్గొండ జిల్లా గ్రంధాలయ సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు .


    2024 -25 సంవత్సరంలో గ్రంథాలయ సంస్థ ద్వారా చేసిన ఖర్చు, వచ్చిన రాబడులు, లైబ్రరీ సెస్, తదితర  అంశాలపై చర్చించారు. వార్తాపత్రికలకు సంబంధించి రిజిస్టర్, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ,అలాగే ఆడిటింగ్  చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా లైబ్రరీలో వాచ్ మెన్ నియామకానికి సంచాలకుల అనుమతి కోసం సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.


     జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బాలమణి ,జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, వయోజన విద్యాశాఖ పిఓ మమత, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

____________

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home