ఇసుక పై పూర్తి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఇసుక పై పూర్తి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్ లనుండి సరఫరా చేసే ఇసుక పై పూర్తి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మైనింగ్ ,తదితర శాఖల అధికారులతో కలిసి శాలిగౌరారం మండలం, వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్ ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలను తనిఖీ చేశారు.
కాగా వంగమర్తి ,ఇటుకలపహాడ్ రీచ్ ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలలో ఇదివరకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వే బ్రిడ్జి, ఇసుకను లోడ్ చేసే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాత్రి సమయాల్లో కూడా స్పష్టంగా కనిపించే సామర్థ్యం కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు వంగమర్తి ఇసుక రీచ్ నుండి తీసిన ఇసుక పరిమాణం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు .కాగా ఈ సంవత్సరం వంగమర్తి ఇసుక రీచ్ నుండి లక్ష 16 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసినట్లు అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, ఇసుక సరఫరాను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు .ఎట్టి పరిస్థితులలో పరిమితికి మించి లోడును తీసుకువెళ్లకూడదని, అన్ని అంశాలకు రికార్డులు, రిజిస్టర్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇటీవల ఎస్పీ ఆదేశాల మేరకు వంగమర్తి ఇసుక రీచ్ వద్ద 24 గంటలు తనిఖీ చేసే విధంగా పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాలన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేస్తున్నది, లేనిధి పరిశీలించే నిమిత్తం జిల్లా కలెక్టర్, ఎస్పీ ,మైనింగ్ అధికారులు సందర్శించారు.
కాగా జిల్లాలో వంగమర్తి తో పాటు, ఇంకా 24 ఇసుక రీచ్ లు ఉన్న విషయం తెలిసిందే .వీటి ద్వారా ప్రభుత్వ పనులకు ముఖ్యంగా ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, తదితర శాఖలకు ఎంత ఇసుక అవసరం ఉందో దానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన విషయమై గురువారం సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ వంగమర్తి ఇసుక రీచ్ నుండి ఇసుక అక్రమంగా రవాణా కాకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు, తదితర విషయాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు.
భూగర్భ జల వనరుల శాఖ సహాయ సంచాలకులు జాకబ్,ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు .
________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home