లంచావతారులు! రైతునూ వదల్లేదు
లంచావతారులు! రైతునూ వదల్లేదు
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ACB)కు ఇద్దరు లంచావతారులు చిక్కారు. ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొప్పూరి ఆనంద్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గుత్తేదారుకు బిల్లు చెల్లించేందుకు ఆనంద్ కుమార్ రూ. 1.33 లక్షలు డిమాండ్ చేశారు. కాగా, వివిధ నిర్మాణ పనులు చేసినందుకు గుత్తేదారుకు రూ. 33,32,350లు మంజూరయ్యాయి. అయితే, ఆ బిల్లు చెల్లించడానికి ఆనంద్ కుమార్ రూ. 1.33 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గుత్తేదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ. లక్ష లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆనంద్ కుమార్ ను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. దీంతో కోర్టు రిమాండ్ విధించడంతో అతడ్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రైతు వద్ద లంచం డిమాండ్ చేసిన అధికారి
ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ మరో అధికారి అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతును లంచం కోసం వేధించిన సదరు అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి డి శాంతన్ కుమార్.. పత్తి పంటను విక్రయించడానికి అవసరమైన కూపన్ల జారీ కోసం ఓ రైతు నుంచి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు. ప్రభుత్వ అధికారిగా తను చేయాల్సిన బాధ్యతను మరిచి రైతు నుంచి లంచం డిమాండ్ చేయడంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ డబ్బు తీసుకుంటుండగా.. అధికారి శాంతన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే.. 1064కు డయల్ చేయండి అని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home