ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికకు కోర్టు బ్రేక్!
ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికకు కోర్టు బ్రేక్!
రిటర్నింగ్ అధికారికి హై కోర్టు నోటీసులు!
ఎన్నికల్లో అవకతవకలపై కోర్టుల మొట్టికాయలు
ఫిబ్రవరి 8నాటి ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను తాత్కాలిక నిలిపివేత
మార్చి 4 వరకు స్టేటస్ కో
ఈ పిటిషన్లపై మార్చి 21న విచారణ
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. అధ్యక్ష ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలపై కొందరు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో న్యాయస్థానాలు వెంటనే స్పందించి తదళగుణంగా తీర్పుల నిచ్చాయి. ఏ వెంకటేశం అనే వ్యక్తి హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయగా అదనపు చీఫ్ జడ్జి – 2 మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియపై స్టేటస్కో విధిస్తూ యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. మహాసభ ఎన్నికల కోసం ఈనెల 8వ తేదీన విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు. మార్చి 4వ తేదీ వరకు స్టేటస్కు కొనసాగుతుందని ఆదేశించారు. మహాసభ అధ్యక్ష ఎన్నిక కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించాలన్న అభ్యర్థులతో పాటు తదుపరి విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ ఈసీ సభ్యుడు గట్టు మహేష్ బాబు హైకోర్టులో వేసిన రిప్ పిటిషన్ పై కోర్టు స్పందించి మహాసభ ఎన్నికల నిర్వహణ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఐవిఎఫ్, వ్యామ్ పదవుల్లో ఉన్నవారు మహాసభ అధ్యక్ష పోటీకి అనర్హులని సూచిస్తున్న క్లాజ్ నెంబర్ 3 ను గట్టు మహేష్ బాబు సవాల్ చేయగా, ఆయా పదవుల్లో ఉన్నవారు పోటీకి అర్హులని, తదలగుణంగా వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ హైకోర్టు మహాసభ ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ రెండు కోర్టుల ఆదేశాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది.



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home