Thursday, 20 February 2025

సీఎంఆర్ చెల్లించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ హెచ్చరించారు.


      సీఎంఆర్ చెల్లించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని  అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ హెచ్చరించారు.






      గురువారం అయన తన ఛాంబర్ లో సీఎంఆర్ ,బ్యాంకు గ్యారంటీ తదితర విషయాలపై పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లుల సంఘం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.


     2023- 24 రబికి సంబంధించి ఇంకా కొంతమంది రైస్ మిల్లర్లు  9000 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ ను చెల్లించాల్సి ఉందని, మార్చి 10 లోగా ఎట్టి పరిస్థితులలో సీఎంఆర్ ను చెల్లించాలని ,లేదంటే  కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పలుమార్లు సీఎంఆర్ విషయంలో హెచ్చరించినప్పటికి సీఎంఆర్ చెల్లించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు నిర్దేశించిన సమయంలో సీఎంఆర్ చెల్లించేలా పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దారులు సంబంధించిన రైస్ మిల్లులోనే ఉండి  సిఎంఆర్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

    బ్యాంకు  గ్యారంటీల పై  సమీక్షిస్తూ రైస్ మిల్లుల సంఘం ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు బ్యాంకు గ్యారంటీని వెంటనే సమర్పించాలని అన్నారు.

  ఈ సమావేశంలో రానున్న సీజన్ సిఎంఆర్ కు సంసిద్ధం  కావాలని ఆయన తెలిపారు.

     జిల్లా పౌర సరఫరాల  అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ,డిసిఓ పత్యా నాయక్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.

________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home