ప్రైవేటు ఆసుపత్రులకు చట్టాలపై అవగాహన సదస్సు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి : జే.వెంకట్
ఆసుపత్రులకు చట్టాలపై అవగాహన సదస్సు:జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి :జే.వెంకట్
తేది 18.02.2025 రోజున మధ్యాహ్నం 1.00
గంటలకు హరిహర భవన్ లో సమావేశం
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి :
జే.వెంకట్
హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు క్లినిక్ లు,అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు విధిగా చట్టాలపై అవగాహన కలిగి సేవలు అందించాలని,తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ జిల్లా లోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు తగిన వసతులు, సదుపాయాలు, అర్హత కలిగిన డాక్టర్లు సిబ్బందిచే నాణ్యమైన సేవలు రోగులకు అందించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు అయన తెలియజేసినారు.
అన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు, డాక్టర్లకు, రేడియోలజిస్టులకు తేదీ 18.02 2025న మధ్యాహ్నము 1.00 గంటలకు హరిహర కళాభవన్ , సికింద్రాబాదులో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు, లింగ నిర్ధారణ నిషేధ చట్టము, గర్భస్రావ నిషేధ చట్టము మరియు సరోగసి చట్టముపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపినారు. ఈ అవగాహన సదస్సుకు విధిగా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు, మెడికల్ డైరెక్టర్లు, రేడియోలజిస్టులు గైనకాలజిస్టులు విధిగా హాజరు కావలసిందిగా అయన విజ్ఞప్తి చేసినారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home