Wednesday, 12 February 2025

నల్గొండ జిల్లాలో కొత్త ఉద్యాన పంటలను ప్రోత్సహించే విధంగా ఉద్యాన శాఖ అధికారులు పరిశోధన కార్యక్రమాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.


 నల్గొండ జిల్లాలో కొత్త ఉద్యాన పంటలను ప్రోత్సహించే విధంగా ఉద్యాన శాఖ అధికారులు  పరిశోధన కార్యక్రమాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

     బుధవారం ఆమె నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి లో ఉన్న ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు.


    పరిశోధన కేంద్రం ద్వారా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ బత్తాయి, నిమ్మ పంటలపై పరిశోధనలతో పాటు మేలైన మొక్కలను తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు. జిల్లాలో 43000 ఎకరాలలో బత్తాయి, తొమ్మిది వేల ఎకరాలలో  నిమ్మ తోటలు పంటలు పండిస్తుండగా, వీటి ద్వారా ఇంకా మెరుగైన దిగుబడులు వచ్చేలా రైతులకు మంచి మొక్కలను తయారు చేసే విధంగా పరిశోధన కొనసాగించాలని అన్నారు.రాళ్లు, రప్పలు ఉన్న భూములలో కుంకుడు పంటను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అంతేగాక నల్గొండ జిల్లాలో కొత్త ఉద్యాన పంటలు పండించేందుకు కొత్త పంటలపై అధ్యయనం చేయాలని సూచించారు.  ఇందుకు కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం సహకారం తీసుకోవాలని చెప్పారు . జిల్లాలో తాటి, ఈత చెట్లను పెంచే విధంగా చూడాలని అన్నారు. అలాగే కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని మరింత తీర్చిదిద్దాలని సూచించారు. కాగా పరిశోధన కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, నీటి కొరత ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఉద్యాన పరిశోధన కేంద్రంలో ఉద్యాన నర్సరీ పెంచేందుకుగాను 25 లక్షల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇన్పుట్ డీలర్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి వారితో మాట్లాడారు.


     జిల్లా ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు సాయిబాబా, సీనియర్ సైంటిస్టు రాజు గౌడ్, ట్రైనింగ్ కోఆర్డినేటర్ లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

____________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home