Saturday, 22 February 2025

నల్గొండ జిల్లా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు లిస్ట్ చెల్లదు - జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లగొండ అశోక్


 నల్గొండ జిల్లా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు లిస్ట్ చెల్లదు - జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లగొండ అశోక్


నల్గొండ: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుని ఎన్నికల కు విడుదల చేసిన స్టేట్ కౌన్సిల్ మెంబర్ల లిస్టులో నల్లగొండ జిల్లా సంబంధించి స్టేట్ కౌన్సిల్ లిస్టు చెల్లదని దీనిపైన ఎన్నికల అధికారికి మరియు రిజిస్టర్ సొసైటీస్ కు ఫిర్యాదు చేయనున్నట్లు  జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లగొండ అశోక్ తెలిపారు. నల్లగొండ జిల్లా కు అధ్యక్షుడు గా ఎన్నికైన తెలుకుంట్ల చంద్రశేఖర్ నల్లగొండ జిల్లా లిస్ట్ మండల, పట్టణ సంఘా అధ్యక్షుల సిఫారసు తో రూపొందించి పంపాలి. కానీ అలా కాకుండా ఏకపక్షంగా కొంతమంది రాష్ట్ర, జిల్లా నాయకులు వారి ఇళ్లలో కూర్చొని వారికి నచ్చిన పేర్లు వారి బంధువుల పేర్లు వారి ఫ్యామిలీ ల పేర్లు కొన్ని రాసుకొని బైలాని తుంగలో తక్కినట్లు అయన ఆరోపించారు. దీనిపైన రిజిస్టర్  ఆఫ్ సొసైటీ లకు మరియు ఎన్నికల అధికారికి మరియు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఆ లిస్టును రద్దుపరిచి ప్రజాస్వామ్య బద్దంగా బైలా లో పేర్కొన్న ప్రకారంగా ఇప్పుడున్న అధ్యక్షుడు మండల పట్టణ అధ్యక్షులు సిఫారసుతో కొత్త లిస్టు అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ  కౌన్సిల్ మెంబెర్స్ తో నే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు జరగాలని ఆన్నారు.

 అవసరమైతే ఈ విషయాలు కోర్టుకు కూడా విన్నవించుకుంటామని ఇప్పుడు దాఖలైన కేసుల లో లో ఇంప్లీడ్ అయి  ఈ చెల్లని లిస్టుపై పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. 

ఈ విషయం పై జిల్లా అధ్యక్షుడు తెలుకుంట్ల చంద్రశేఖర్ మా ప్రతినిధి వివరణ కోరగా మేము పంపలేదని, 2024 సంవత్సరం లో గత అధ్యక్షులు పంపినారని, కొత్త కార్యవర్గం అడిగితే ఇంతకు ముందు పంపిన లిస్ట్ వర్తిస్తుంది అని చెప్పారని నేను లిస్టు పంపిస్తా అంటే అవసరం లేదుని పాతది పనికి వస్తుందని, రాష్ట్ర జిల్లా నాయకులు అన్నారని, నాకు కుడా లిస్ట్ పంపలేదు ముందు నామినేషన్ లు వేసినక పంపుతామ్ అన్నారని అయన తెలిపారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home