Sunday, 17 December 2023

IAS 11 మంది ఐఏఎస్ ల బదిలీ..!!


 సీఎం రేవంత్ అధికార ప్రక్షాళన - 11 మంది ఐఏఎస్ ల బదిలీ..!! 

 తెలంగాణలో సీఎం రేవంత్ అధికార ప్రక్షాళన ప్రారంభించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి..నిఘా చీఫ్ గా శివధర్ రెడ్డిని రేవంత్ నియమించారు. ఆ తరువాత పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లకు పోస్టింగ్స్ ఇచ్చారు. హెచ్ఎండీఏ జాయింట్ సెక్రటరీగా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగిస్తూనే..కీలకమైన ఇంధన శాఖలో ఐఏఎస్ లను నియమించారు. ఇప్పుడు మరో 11 మంది అధికారుల బాధ్యతల్లో మార్పులు చేసారు. ఐఏఎస్ ల బదిలీలు : ముఖ్యమంత్రి రేవంత్ పాలన పరమైన నిర్ణయాలను వేగవంతం చేసారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో పురపాలక ముఖ కార్యదర్శిగా దాన కిశోర్‌ను నియమించింది. అలాగే ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యలు అప్పగించింది. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమించిన ప్రభుత్వం.. ఆయనకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. మెంటార్ సచిన్ టెండుల్కర్‌పైనా వేటు వేసిన ముంబై ఇండియన్స్‌: క్లారిటీ ఏంటీ? ఎవరికి ఏ బాధ్యత : అటవీశాఖ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్‌ బదిలీ చేయగా.. ఆమెకు ఈపీటీఆర్‌ఐ డెరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజును నియమించింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాకు బదిలీ చేయగా.. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషన్‌ర్‌గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేసింది. నల్గొండ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ నియమించింది. నియామకాలపై కసరత్తు : కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఐఏఎస్ అర్వింద్‌ కుమార్‌ పైన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆయనకు విపత్తు నిర్వహణ శాఖ అప్పగించింది. కీలకమైన పురపాలక శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉంది. ఆ శాఖ బాధ్యలను దాన కిషోర్ కు అప్పగించారు. ఇక...ఈ నియామకాల్లోనూ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ పోస్టింగ్ పైన స్పష్టత రాలేదు. మరి కొందరు ఐఏఎస్..ఐపీఎస్ ల బదిలీలు- పోస్టింగ్స్ కు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఇతర నియామకాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

No comments:

Post a Comment